బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు

    నేను బ్లాగ్గులు వ్రాయడం మొదలుపెట్టిన రొజుల్లో ఒక పాఠకురాలు ఒక బ్లాగ్గుమీద తన అభిప్రాయం వ్రాస్తూ, నా పుట్టిన రోజు ఎప్పుడూ అని అడిగింది. దానికి సమాధానంగా ” నేను చేసికొన్న అదృష్టం ఏమంటే, ప్రఖ్యాత చిత్రకారుడు, శ్రీ బాపూ గారితో, వారి పుట్టిన రోజు పంచుకోవడం’ అని సమాధానం వ్రాశాను.ఆ సంగతి గుర్తుంచుకొని,శ్రీ బాపు గారి పుట్టిన తేదీ, నెట్ లో వెదికి, ఈ వేళ ( డిసెంబర్ 15) కి తను గ్రీటింగ్స్ పంపింది.ఎంత సంతోషంగా ఉందో, యధాలాపంగా,నేను వ్రాసింది గుర్తుంచుకోవడమే కాకుండా,గ్రీటింగ్స్ పంపాలని ఆలోచన వచ్చినందుకు ఆ అమ్మాయికి, ఈ బ్లాగ్గు ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

   భగవంతుడి ఆశీర్వాదంతో 65 సంవత్సరాలు పూర్తిచేసికొన్నాను ఈ వేళ. ఆయన దయ ఉంటే,ఇలాగే మీ అందరి అభిమానంతోనూ,ఏదో నాకు తోచింది వ్రాస్తూ,నా మిగిలిన జీవితం గడపాలని ఆశిస్తున్నాను.

బాతాఖానీ–లక్ష్మిఫణి కబుర్లు–కొంచెం జాగ్రత్త !!

20091214b_003105001

ఏదో క్యూల్లో నుంచోవలసిన శ్రమ పడఖ్ఖర్లేదు కదా అని ఇంటినుండే రైలు టిక్కెట్లు కొనుక్కుంటుంటే ఇప్పుడు ఆ సుఖం కూడా ఉండక పోయేటట్లుంది.

%d bloggers like this: