బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు

‘ఆటంకవాది” అంటే ఏదో తుపాకీలు పట్టుకొని అందరినీ టపటపా కాల్చేసేవాడే కానఖ్ఖర్లేదు. మనని ‘హింసించే’ వాడు కూడా నా ఉద్దేశ్యంలో ‘ఆటంకవాది’ క్రిందే వస్తాడు. ఇలాటి వాళ్ళు మనకి సామాన్యంగా పెళ్ళిళ్ళలో తగులుతూంటారు.ఈ పెద్దమనిషి ఎవరివైపు (మగ లేక ఆడ పెళ్ళివారు)వాడైనా కావొచ్చు.ఓ రెండు మూడు రోజులు శలవులాటిది పెట్టి,పూర్తి కుటుంబంతో వస్తాడు.ఎవరివైపైతే వచ్చేడో, వాళ్ళకి ఈ ప్రాణి గురించి పూర్తిగా తెలుసును కాబట్టి, ఎవరూ పేద్దగా పట్టించుకోరు. దీనివలన ఈయనకేమీ నష్టం లేదు.

కొత్తగా వెళ్ళిన వాళ్ళు సామాన్యంగా వీరి ‘షికార్’ అవుతారు.పాత వాళ్ళందరూ ఇతనిని అవాయిడ్ చేస్తారు,సంగతి తెలుసుకాబట్టి.తనంతట తనే పరిచయం చేసికొని, మనని కబుర్లలోకి దింపుతాడు. ప్రపంచంలో అతనికి తెలియని విషయం లేదు.ప్రతీ దానిమీదా వ్యాఖ్యానిస్తాడు. అతని చేతిలో పడ్డవాడికి ‘ముక్తి’ దొరకదు.తను ఆఫీసులో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాడో,రూల్సూ అవీ ఎంతగా పాటిస్తాడో వగైరా వగైరా..ఇవతలివాళ్ళకి మాట్లాడడానికి అవకాశం ఇవ్వకపోవడమే ఇతని లక్ష్యం. దూరంనుండి అందరూ గమనిస్తారు, మనం ‘అతని’చేతిలో పడుతున్న హింస.అయినా సరే ఏదో ఒకవిధంగా మనని ఎంటర్టైన్ చేస్తున్నాడు కదా అని వాళ్ళూ సంతోషిస్తారు.

&nbsp కొసమెరుపేమిటంటే, గంటా గంటన్నరా మనని హింసించిన తరువాత అడుగుతాడు, మనం ఎవరివైపునుండి పెళ్ళికి వచ్చామూ అని

%d bloggers like this: