బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు … BC / AC Part 1

 చాలా మందికి గుర్తుండే ఉంటుంది… చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో, ప్రపంచ చరిత్రని  రెండు భాగాలుగా చెప్పేవారు.. క్రీస్తు పూర్వం (  B C ),  క్రీస్తు తరువాత (  A D ) అని… అలాగే ఈ సంవత్సరం  అంటే 2020 నుండీ.. కరోనా పూర్వం ( B C ) ,  కరోనా తరువాత (  A C )  అని చెప్పుకోవాలనుకుంటా, భవిష్యత్తు లో…

కలలో కూడా ఊహించుండము.. ఈ మహమ్మారి వైరస్ ప్రపంచాన్ని ఒక్కసారి కుదిపేసి, అతలాకుతలం చేసేస్తుందని.. మన అనుకోడాలతో నిమిత్తం లేకుండా తన పనేదో చేసుకుపోయిందీ.. పోతోందీ ..కూడా.. ఇంకా vaccine  రాకపోయినా,ఈ వైరస్  spread  అవకుండా, అదేదో  Social distancing  పాటిస్తే చాలన్నారు.. ఊరికే బయట తిరిగితే అలాటివి సాధ్యపడవని ఇప్పటికి మూడు సార్లు   Lock Down  చేసేసారు.. నాలుగోది జరుగుతోంది.. జూన్ 1 వ తేదీనుండి, ఏమౌతుందో తెలియదింకా..అదీ ప్రస్తుత పరిస్థితి..

 ఈ  lock down  ధర్మమా అని ఓ విషయం తేలిపోయింది.. ఇన్నిసంవత్సరాలూ ఫలానాది లేకపోతే అసలు బతగ్గలమా అన్నది ఓ “ భ్రమ”..  ఈ రెండు నెలలూ బతకలేదూ ?.. వచ్చిన గొడవల్లా ఏమిటంటే, ఒకానొకప్పుడు అంటే సంపాదన అంతగా లేనప్పుడు, ఏవైతే మనం లగ్జరీలు గా భావించి, వాటి దగ్గరకు కూడా వెళ్ళలేదో,  వాటినే డబ్బులు చేతుల్లో  పుష్కలంగా ఆడేసరికి , అవసరాలుగా మార్చేసి, వాటినే 21 వ శతాబ్దానికి “ అత్యవసరాలు “ గా మార్చేసి, మన పిల్లలని కూడా అదే మార్గంలో పెంచుతున్నాము.. పోనీ, నాలాటి ఏ తలమాసినవాడో , సలహా ఇద్దామని చూసినా, వినేవాడుండకపోగా, నాలాటివాడిని కూడా, అవసరంలేని లగ్జరీలకి  అలవాటు చేసేసారు..  మొత్తానికి ఈ రెండునెలల్లోనూ తెలుసుకున్నదేమిటంటే,  ఈ కొత్తగా తెచ్చుకున్న అలవాట్లు , అందుబాటులో లేకపోయినా , హాయిగా బతికేయొచ్చని..

 మా చిన్నప్పుడు చూసేవాళ్ళం.. బయటనుండి ఎవరైనా ఇంటికి వస్తే,  ఆ కాంపౌండు లోనే ఉండే నూతిలోంచో, తరవాత్తరవాత కుళాయిలకిందో కాళ్ళు కడుక్కుని కానీ, లోపలకు వచ్చేవారు కాదు.. అంతకు పూర్వపురోజుల్లో, ఓ గోలెం నిండా నీళ్ళూ, అందుబాటులో ఓ చెంబూ ఉండేవి.. పసిపిల్లల్ని , ఎత్తుకోవాలంటే, కాళ్ళూ చేతులూ శుభ్రంగా కడుక్కోవడమనేది కంపల్సరీగా ఉండేది..కానీ ఈ ఎపార్ట్మెంట్లు వచ్చాక, గోలాలూ లేవూ, నూతులూ లేవూ.. అదృష్టం బావుంటే, చెప్పులో, బూట్లో విప్పుకుని వస్తారు.. లేదా అలాగే వచ్చేసినా ఆశ్చర్యం లేదు..ఇంట్లో వాడుకోడానికి “ మడి “ చెప్పులైతే ఎప్పుడో వచ్చేసాయి…

 ఈ కరోనాకి పూర్వం, నగరాల్లోనూ, పెద్ద పట్టణాలలోనూ గమనించిందేమిటంటే, చాలా మందికి అంటే కనీసం నూటికి యాభై మందికి , ఇంట్లో రోజూ తినే తిండికంటే, కనీసం వారంలో రెండు మూడుసార్లైనా,జొమాటో, స్విగ్గీ ల ద్వారా బయట నుండి తెప్పించుకోవడమో, కాకపోతే ఏదో హొటల్ కి వెళ్ళి భోజనం చేస్తే కానీ, భోజనం చేసినట్టనిపించేది కాదు..ఈ రెండునెలలూ, నచ్చినా నచ్చకపోయినా, ఇంటి తిండి లో ఉండే ఘనత తెలిసే ఉంటుంది..ఈ  Lock Down  తరవాత హొటళ్ళు ఎప్పుడు తెరుస్తారో తెలియదు, అధవా తెరిచినా, అక్కడ తింటే ఏం ప్రాణం మీదకొస్తుందో అనే భయం.. అలాగే వీకెండ్స్ వచ్చేసరికి, ఔటింగ్ పేరు చెప్పి, ఊళ్ళో ఉండే ఏ పేద్ద  mall  కో వెళ్ళడం, అక్కడ ఉండే  multiplex  లో సినిమా చూసేసి, అక్కడే ఉండే  food court  లో తిండి తినేయడం… అలాగే పెళ్ళికానివారు , అవేవో  pub  లకి వెళ్ళడం… అవన్నీ తప్పనడం లేదు.. ఆధునిక యుగంలో  survive  అవడానికి ఇవన్నీ తప్పవంటారు.. ఏమో..ఇవన్నీ తెరిచేటప్పటికి ఎంత టైము పడుతుందో తెలియదాయె..

మరో విషయం.. పూర్వకాలంలో so called అగ్రకులాలవారు, కొంతమందిని దూరంగా పెట్టేవారనీ, అలాగే మడి ఆచారాల పేరుతో, అస్సలు దగ్గరకే రానిచ్చేవారు కాదనీ.. ఏవేవో చెప్పేవారు.. ఏమో కొన్ని యుగాలక్రితం ఇప్పుడొచ్చిన కరోనా లాటి మహమ్మారి కానీ వచ్చిందేమో, దాని మూలంగానే ఇప్పుడున్న  social distance  లాటిది పాటించారేమో, ఆ concept/practice  నే కొనసాగించారేమో, ఎవరికి తెలుసూ? పైగా ఇలాటివాటివి తెలుసుకుని నిజానిజాలు తెలిస్తే, ఏమో రాజ్యాంగ సవరణలు చేయాలేమో.. అందుకనే  sensitive  విషయాలు తెరమరుగున ఉంటేనే  దేశ నాయకులకి ఆరోగ్యకరమేమో…

సశేషం…

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు — జరుగుబాటు…

  ఈ కరోనా Lock Down  ధర్మమా అని ఒక విషయం తేలిపోయింది..మొన్న మార్చ్ 2020 ముందువరకూ , మన అలవాట్లు, ప్రవర్తన, కోరికలు … అన్నీ కూడా “ జరుగుబాటు “ ధర్మమే. 21 వ శతాబ్దం లో పుట్టినవారి సంగతి పక్కకు పెడితే, అంతకుముందు అంటే 1970 తరవాత 3 దశాబ్దాల్లో పుట్టినవారందరూ, మొదట్లో పాపం లక్షణంగానే ఉండేవారు.. కానీ కాలక్రమేణా , వారి వారి దైనందిక జీవితాల్లో ఎక్కడలేని మార్పులూ వచ్చేసాయి…బహుశా అకస్మాత్తుగా మారిన వారి ఆర్ధిక స్థోమత కూడా ఓ కారణం.. 1970 లో పుట్టి చదువులు పూర్తిచేసి, ఉద్యోగాల్లో చేరే టైముకి, దేశంలో , నరసింహారావుగారి ధర్మమా అని, ఆర్ధిక సంస్కరణలు ప్రారంభమయి అప్పటిదాకా  వేలల్లో ఉండే జీతాలన్నీ లక్షల్లోకి వెళ్ళిపోయాయి..ఆర్ధిక సంస్కరణలతో  , అప్పటిదాకా విదేశాల్లోమాత్రమే దొరికే ప్రతీ వస్తువూ, దేశంలోనే అందుబాటులోకి వచ్చేసాయి.ప్రతీవారిలోనూ, ఒకరకమైన విశ్వాసం మొదలయింది.. కానీ కాలక్రమేణా అదే ఓ  arrogance  లోకి దింపేసింది. పదిరూపాయలు ఖర్చుపెట్టేచోట వందరూపాయలు కూడా ఖర్చుచేసే పరిస్థితి..దానికి సాయం ఓ మైకం లాటిదికూడా కమ్ముకోవడం ప్రారంభమయింది..భార్యాభర్తలిద్దరూ మంచి ఉద్యోగాలు చేయడం మూలాన   EMI s have become a way of life.  పూర్తిగా అందరి  life style  మారిపోయింది.. ఇప్పుడే ఇంతంత జీతాలొస్తూంటే, వచ్చే పదేళ్ళలోనూ ఇంకెత్తుకెదుగుతామో అనే ఓరకమైన overconfidence  వచ్చేసింది.. ఈ విషయం ఒప్పుకోకపోవచ్చు ఈ తరం వారు.. ఒకానొకప్పుడు విదేశాలకి వెళ్ళడమే ఓ కల   గా ఉండేది.. అలాటిది విదేశాలకి సరదాగా షికారుకెళ్ళినట్టు వెళ్తున్నారు..ఒకానొకప్పుడు శలవలొస్తే, దేశంలోని ఏ ప్రదేశానికో వెళ్ళే వారందరూ కూడా ఏదో సంస్థ ద్వారా, ఏ  విదేశీ  Holiday Package  నే  బుక్ చేసేసికోవడం.. ఇంక చదువుల విషయానికొస్తే, ఎలాగోలాగ దేశీవిద్య పూర్తిచేసి, విదేశీపైచదువులూ, ఆ పై విదేశీ కొలువులూ..విద్యావ్యవస్థకూడా పూర్తిగా మారిపోయింది..పైచెప్పినవన్నీ , మేము చేయలేము కనుక ఏదో ఈర్ష్య తో చెప్పాననుకోవచ్చు కూడా..

 అన్నిటిలోకీ ముఖ్యమైన మార్పు “ పోటీ “.. ప్రతీదానికీ పోటీయే.. వెళ్ళే స్కూలునుండి,ఉండే సొసైటీ, తినే తిండి, వేసుకునే బట్ట, వెళ్ళే వాహనాలదాకా ఒకరితో ఒకరికి పోటీ.. పోనీ దానివలన లాభమేమైనా ఉందా అంటే అదొక  feel good  అంటారు ఈనాటి యువత. సరే ఒప్పికుందాం ఆ  feel good.. but at what cost  అన్నది పట్టించుకోలేదు. మొన్నమొన్నటిదాకా, వారంలో కనీసం ఓ రెండు రోజులు బయట ఏ హొటల్లోనో భోజనం చేయడం, ఓ ఫాషన్ గా మారిపోయింది.. అలాటిది గత నెలన్నరనుండీ, నచ్చినా నచ్చకపోయినా, ఇంటి తిండికే అలవాటుపడ్డారు, ఎటువంటి వెర్రి వేషాలూ వేయకుందా..

ఎవరికి వారే  satisfaction  లోంచి   delight ని ధ్యేయంగా మార్చేసుకున్నారు.. Satisfaction  కి కనీసం కొన్ని లిమిట్స్ ఉంటాయి—ఇదివరకటిరోజుల్లో చూడండి, పెళ్ళి చేసుకుని, ఓ ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కని, వారి బాగోగులు చూసి, ఓ ఇల్లు కట్టుకుంటే సంతోషపడేవారు.. అంతకంటే పేద్దగా కోరికలంటూ ఉండేవి కాదు కూడా..

 ఈ మార్పుల ధర్మమా అని, 21 వ శతాబ్దంలో పుట్టినవారికి,  Middle, Lower Middle Class  అంటే అసలు అవగాహనే లేదంటే ఆశ్చర్యం కూడా లేదు..అలాగని వాళ్ళని తప్పు పట్టలేము కూడా.. పరిస్థితులూ, వాతావరణం అలా మారిపోయాయి..ఈ  నవతరం లో చాలామందికి , కొన్ని విషయాలు అస్సలు తెలియదు కూడా..  తల్లితండ్రులు, మహా అయితే గ్రాండ్ పేరెంట్స్ మాత్రమే వీరి ఫామిలీ అనుకుంటారు.. చిత్రం ఏమిటంటే,  they are happy also.. ఒకానొకప్పుడు ఎంతమంది బంధువులుంటే అంత సంతోషంగా ఉండేవారు కూడా ( అంటే ఈ తరం ముందువారు) , అదే దారిలోవెళ్ళడం..

 ఈ  LOCK Down   ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో చెప్పలేము.. అవేవో వాక్సీన్లు వచ్చేదాకా, ఈ  Social Distancing  మాత్రమే  మనల్ని రక్షిస్తుందని తేలిపోయింది.. 40-45 రోజులు  ఇదివరకటి సూకరాలు లేకుండా, బండి లాగించగలిగేమంటే, అవన్నీ జరుగుబాటు రోగాలే అని  తేలిపోయినట్టేకదా…

%d bloggers like this: