బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు–టెన్షన్లు–2

కొంతమందికి టెన్షన్ లేకపోతే టెన్షన్ వస్తుంది.ఎప్పుడైనా ఏ ఊరికైనా ప్రయాణం చేస్తున్నామనుకోండి, సడెన్ గా కొంత దూరం వెళ్ళాక, ‘ అయ్యో గ్యాస్ కట్టేమో లేదో’ అనో,ఇంటికి తాళం వెసేమో లేదో అని టెన్షన్.తనవరకూ అయితే ఫరవా లేదు, ఇంటి పెద్ద ఏ టెన్షనూ లేకుండా సుఖపడిపోతాడేమో అని, ఆయనని కూడా టెన్షన్ లో పెట్టేయడం !!

కొంతమంది పరీక్షలు వ్రాసిన తరువాత, అదేదో ప్రశ్నకి నెంబర్ సరీగ్గా వేయలెదేమో,దానికి మార్కులు కట్ చేస్తారేమో అని ఊరికే ఖంగారు పడిపోయి, ఇవతలి వాళ్ళ ప్రాణాలు తీస్తూంటారు.చెప్పానుగా, ప్రతీ విషయం మీదా ఏదో ఒక సందేహం రాకుండా ఉండలేరు. కొన్ని కొన్ని సందర్భాల్లో వ్యవహారాలు సెటిల్ చేయడానికి, మగవారే వెళ్ళారనుకోండి, ఇంక ఇంట్లో వాళ్ళకి వీళ్ళు తిరిగి వచ్చేదాకా టెన్షనే.సాధారణంగా మొగవాళ్ళు,అన్ని విషయాలూ లైట్ గా తీసికొని,కొంత అటూ ఇటూ గా వ్యవహారం ఫైనలైజ్ చేద్దామనుకుంటారు.ఇంటికి వచ్చిన తరువాత క్రాస్ ఎక్జామినేషన్ ప్రారంభం అవుతుంది. వాళ్ళేం అడిగారూ, మీరేం చెప్పారూ, వగైరా వగైరా… ఈ వెర్రి మనిషి తనేం చేశాడో, పూసగుచ్చినట్లుగా అన్నీ చెప్పుకొస్తాడు,అంతే –‘ పోనీ అలా అనకుండా ఉండవలిసింది,వాళ్ళేం అనుకుంటారో, అయినా మీరెంతో లైట్ గా మాట్లాడేననుకుంటారు, అవతలివాళ్ళు అపార్ధం చేసికుంటారనైనా ఆలోచించరేమండీ’ అని ఓ చిన్న క్లాసుతో, ప్రారంభించి, పాయింట్ బై పాయింట్,మనం చేసివచ్చింది ఎంత తప్పో చెప్తారు.
ఈ టెన్షన్ ల వల్ల అవతలివాళ్ళ క్రియేటివిటీ, థింకింగ్ ప్రాసెస్సూ ఎంతగా పాడైపోతుందో వీళ్ళకి అర్ధం అవదు.అవసరం ఉన్నచోట ఒత్తిడి ఉంటే ఫర్వాలేదు. అయినదానికీ, కానిదానికీ టెన్షన్ పడేవాళ్ళను చూస్తే, వీళ్ళు జీవితంలో అసలు ఎప్పుడైనా ఆనందంగా ఉండగలరా అనిపిస్తూంటుంది.

టెన్షన్ అనేది అనేక రకాలు–ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే, ట్రైన్ లో సీట్లు దొరుకుతాయా లేదా తో మొదలెట్టి, మనం వెళ్ళవలసిన ఊరు చేరేదాకా ప్రతీ విషయం లోనూ ఊరికే హైరాణ పడితే, అదో ఆనందం కొందరికి !ఎవరైనా మన ఇంటికి చిన్న పిల్లలతో వచ్చారనుకోండి, ఆ వచ్చిన పిల్లలు వెళ్ళేదాకా మనకి టెన్షనే.ఏ సరుకు పాడిచేస్తాడో,అని ఆ పిల్లల వెనక్కాలే తిరుగుతూ, ఉన్న సమయం కాస్తా దాంట్లోనే గడిపేస్తాం.

సాధారణంగా,పెళ్ళయిన తరువాత, సంసారం లో టెన్షన్లు లేకుండా ఉండవు. అవి లేకపోతే ‘మజా’ లేదు.కాని అవి మితిమీర కూడదు.దానివలన ఊరికే బ్లడ్ ప్రెషర్ పెంచుకోవడం తప్ప,జరిగేది ఎలాగూ జరక్క మానదు,అలాగని భార్యా భర్తలిద్దరూ ‘బిందాస్’ గా ఉండమనడంలేదు.ఇద్దరిలో ఒక్కళ్ళైనా టెన్షన్ ఫ్రీ గా ఉండాలి. జాగ్రత్త వేరూ, అతి జాగ్రత్త వేరూ. టెన్షన్ అనేది ఈ రెండో దానివలన వస్తుంది.భార్యా భర్తలిద్దరూ అతి జాగ్రత్త కోవకి చెందిన వాళ్ళైతే, ఇంక పిల్లలకి నరకమే.ఎవరితోనూ చెప్పుకోలేరు.వాళ్ళ సమస్యలు వాళ్ళకీ ఉంటాయి.
అందువలన చెప్పేదేమిటంటే ‘టెన్షన్లు’ఒద్దనడం లేదు,ప్రతీ దానికీ, అనవసరంగా లేనిపోనివి ఊహించేసుకొని, జీవితాన్ని నరకం చేసేసుకోకండి
.

బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు–వినియోగదారులూ మేల్కోండి

Consumer grievance

బయటి దేశాల్లోలాగ, మన దేశంలో కూడా వినియోగదారులు, ఇప్పుడిప్పుడే మేల్కొంటున్నారు. అంతా మన మంచికే.

%d bloggers like this: