బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– పెళ్ళాం ఊరికి వెళితే…( aka) freedom at midnight

దేశానికి స్వతంత్రం వచ్చి కొన్ని దశాబ్దాలయినా,  మొగాళ్ళకి మాత్రం, స్వతంత్రం అనేమాట  పెళ్ళైన ఏడాదికల్లా, dictionary  లో కనిపించదు. ఆ మొదటి ఏడాదీ,  transition period  లాటిదన్నమాట. అప్పటిదాకా బ్రహ్మచారి జీవితం గడిపినవాడు కాస్తా… हांजी  ( హాజీ ) లోకి మారాల్సిందే నూటికి 98 పాళ్ళవరకూ. అప్పటిదాకా ఏ ఫ్రెండింటికైనా వెళ్ళి సిగ్గూ, మొహమ్మాటం లేకుండా ఉన్నవాడు కాస్తా, పెళ్ళవగానే, ” ఇవేళ మా ఇంట్లో భోజనం చేయండీ ..” అనగానే, పెళ్ళాం మొహంకేసె చూస్తాడు.పోనీ ఏదో సరదాపడుతున్నాడూ అని , భార్య సరే అంటే.. ఏదో మొక్కుబడిగా టేబిల్ ముందర కూర్చోడమే కానీ, ఇదివరకటిలాగ భోజనం చేయడం, అతిగా తినడం, పదార్ధాలు రుచిగా ఉన్నాయనడం అన్నీ బంధ్.. ఏదో ఆరోగ్యం సరీగ్గా ఉన్నంతవరకే కానీ, దురదృష్టవశాత్తూ , ఏ డాక్టరు దగ్గరకైనా వెళ్ళాల్సొచ్చిందా,  ఆ డాక్టరేమో భార్యలకే చెప్తాడు తీసికోవలసిన జాగ్రత్తలు. ఇంక చూడండి, ఆ డాక్టరు చెప్పినవాటికి మరికొన్ని అదనపు జాగ్రత్తలు జోడించి, భర్తలతో ఆడేసుకుంటారు.

ఈ పెళ్ళాలనే వాళ్ళు, ఏదో పెళ్ళైనకొత్తలో ఏ ఆషాఢ మాసంలోనో, దరిమిలా  ఏ పురిటికో తప్ప, భర్తలని వదిలేసి వెళ్ళరు కదూ.. మధ్యలో ఏ పెళ్ళిళ్ళకైనా వెళ్ళాల్సిన సరే , సకుటుంబసపరివారంతోనే. మొదట్లో ఏదో విరహాలూ గట్రా ఉండేవి, ఎంతైనా అలవాటుపడ్డ ప్రాణాలుకదూ… పిల్లలకి చదువులూ పెళ్ళిళ్ళూ చేసి , మొత్తానికి ఓ రోజుకి వీళ్ళిద్దరూ మిగులుతారు. ఈవెనింగు వాక్కు దగ్గరనుండీ, ఒకళ్ళకొకళ్ళు తోడుగానే ఉంటారు. ఇంక భర్త అనబడే ఈ బక్క ప్రాణికి  వెసులుబాటు దొరికేదెప్పుడూ… అలాగని  on a duty of permanent nature  వెళ్ళిపోవడంకాదండోయ్.. ఏదో ఓ  respite  గా ఉంటే బావుంటుందేమో అని… పైగా ఏ పిల్లపురిటికో విదేశాలకెళ్ళాల్సొచ్చినా , buy one get one   లోలాగ భర్తగారుకూడా తయారాయె. 

ఎప్పుడో అనుకోకుండా ఓ అవకాశం వచ్చేస్తుంది. ఇంక చూడండి ” పండగే పండగ “.. రోడ్డుమీద  traffic signals  పనిచేయనప్పుడు చూస్తూంటాం, వాహనాలవాళ్ళు, ఎవడిదారిన వాడు సందుచూసుకునేవాడే. అప్పటిదాకా, సిగ్నల్ red  అయినప్పుడు ఆగి, green  అయినప్పుడు వెళ్ళేవాళ్ళందరూ కూడా  విచ్చలవిడిగా నడిపించేయడమే. అదో ఆనందం.. అలాగన్నమాట  ఈ పెళ్ళాలు భర్తలని అప్పుడప్పుడు ఒంటరిగా వదిలి వెళ్ళడం. అలాగని అసలు ఎప్పుడూ traffic signals  లేకపోతే, అంతా అయోమయం.

 అలాటి అవకాశమంటూ వచ్చినప్పుడుంటుంది ,  ఎంత స్వతంత్రమో… మాటల్లో  చెప్పలేము.. అంతా మనిష్టం..ఒకే  dress  వారంరోజులూ వేసికున్నా అడిగేవాళ్ళు లేరు. పొద్దుటే నిద్రలేవగానే దుప్పటీ మడతపెట్టకపోయినా మనిష్టం.. తడిచెయ్యి పక్కనే అందుబాటులో ఉండే ఏ  door curtain  తోనో తుడిచేసికున్నా  full freedom.ఫ్రిజ్ లోంచి నీళ్ళసీసా కరిచిపెట్టుకుని తాగినా  चल्ता है  ( చల్తా హై ), చప్పుడు చేస్తూ చాయ్, కాఫీ కూడా జుర్రుకోవచ్చు..   ఉదయం  breakfast  కి  ఏ హొటలుకో వెళ్ళి కావాల్సినవి తినాలన్నా పూర్తి స్వతంత్రం..రాత్రిళ్ళు చాలాసేపు  మెళుకువగా ఉండి , పొద్దుటే ఎప్పుడు లేవండి మనిష్టం.  Whatsapp లో ఎంతసేపు చాటింగుచేసికోండి మీ ఇష్టం.అడక్కండి ..ఇన్నేసి ఆనందక్షణాలు భార్య ఎదురుగా చేయడమే… వామ్మోయ్…  దేనికీ  restrictions  అనేవే ఉండవు. వాళ్ళనడిగితే ” ఇవన్నీ కావాలని చేస్తున్నామా ఏమిటీ.. మీ గురించే కదా.. ” అనడం ఖాయం.కదా పాపం… ఓ వయసొచ్చినతరువాత ఆమాత్రం కట్టుబాట్లుండకపోతే , మనకేకదా నష్టం? తెలుసును మహాప్రభో .. కానీ ప్రతీదానికీ ఓ  pause  అనేదుండాలిగా.. మహా అయితే ఆరారగా ఓ వారంరోజులు. ఓ వారంకంటే survive  అవడంకూడా కష్టమే. ఏదో వెళ్ళేముందర ఓ గిన్నెతో పులుసూ, పప్పూ, ఓ రెండుకూరలూ  చేసి ఫ్రిజ్ లో పెట్టడంమూలాన,  ఓ గ్లాసెడు బియ్యం కుక్కరుమీద పెడితే తిండిమాట చూసుకోనక్కర్లేదు, ఊరగాయెలానూ ఉందాయె. వారం తిరిగాసరికి తెలిసొస్తుంది మాస్టారికి, ఇన్నాళ్ళూ తన సుకరాలన్నీ తీరుస్తూ ,  భార్య ఎలా చూసుకునేదో…

 ఏ రెండుమూడేళ్ళకో సరదాగా just  ఓ వారంరోజులు ,భర్తలని వంటరిగా  వదిలేసి చూడండి.. ఏం కొంపలు మునిగిపోవు..

 

%d bloggers like this: