బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    2014 కి వీడ్కోలు చెప్పి, 2015 లోకి అడుగుపెడుతున్నాము. క్రిందటేడాదంతా బాగానే గడచిపోయిందనే చెప్పుకోవాలి, మరీ రాజకీయనాయకుల్లాగా, పత్రికా విలేఖర్లలా, దేశం మొత్తంలో జరిగిన పరిణామాల గురించి వ్రాసేటంత, తెలివి లేదనుకోండి, కానీ వ్యక్తిగతంగా ఎలా ఉందో చెప్పుకోవచ్చుగా. కొందరు అనుకోవచ్చు, నాలాటి వారివలనే, దేశం బ్రష్టుపడిపోతోందీ అని. పోనిద్దురూ ఎవరి అభిప్రాయం వారిది.

    ఏదో మొహమ్మాటానికి దేశం గురించి మాట్టాడుకుందామా అంటే, ఓ పార్టీ వెళ్ళి ఇంకో పార్టీ, అధికారంలోకి వచ్చింది. దానివల్ల సాధారణ “జీవి” కి ఏమైనా “ఒరిగిందా” అంటే,ఇప్పటివరకూ ఏమీ లేదనే చెప్పొచ్చు. ఒకాయనేమో విజన్ 2020 అంటారు, ఇంకో ఆయనేమో ఈ నాలుగు సంవత్సరాలూ కరెంటు, నీళ్ళూ లేకపోయినా “త్యాగాలు” చేసేయమంటున్నారు. అందువలన, ఆ గొడవెలా ఉన్నా, వ్యక్తిగతంగా మనకు ఏమయిందని analyse చేసికుంటే , ఆరోగ్యకరం.
ఈమధ్యన 15 న నాక్కూడా 70 ఏళ్ళు నిండాయి. దురదృష్టం ఏమిటయ్యా అంటే, గత నాలుగు సంవత్సరాలుగా, ఆరోజు, నేను వారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పగానే, ” Same to you ” అని అభినందించే నా “దేవుడు” శ్రీ బాపూ గారు, మన మధ్య లేకపోవడం.

    జీవితంలో ప్రతీవారికీ 70 వ జన్మదినం ఓ landmark గా భావిస్తారు కాబట్టి, మా పిల్లలు ఓ laptop బహుమతిగా ఇచ్చారు. మాటవరసకి, మా ఇంటావిడ ఓ grand gala offer ఇచ్చింది– smartphone కావాలా, లేక శ్రీవెంకటేశ్వరుని దర్శనం కావాలా అంది. ఆ ఫోను ఎప్పుడైనా కొనుక్కోవచ్చూ, అప్పుడే 10 సంవత్సరాలయిందీ, స్వామివారిని దర్శించీ, ఎప్పుడో షష్టి పూర్తికి కల్యాణం చేయించుకుని, మళ్ళీ ఆయన దర్శనం చేసికోలేదూ, అనుకుని, రెండో ఆఫర్ కే ఒప్పేసికుని, 12 వ తారీకున టకటకా బుకింగులు చేసేశాను. అదృష్టం ఏమిటంటే, అన్నీ confirmed tickets దొరికేశాయి, తిరుపతి- రాజమండ్రి తప్ప.

    తిరుపతిలో ఓ ట్రావెల్స్ వాళ్ళ గురించి, మా మరదలు చెప్పింది. సరే అనుకుని, వాళ్ళకి ఓ 18000 Transfer చేశాను ( డబ్బులు నావికావుగా!!) . ముందర బాగానే ఉంది, తీరా ఓ అరగంటకి సందేశం– మీ డబ్బు అందలేదూ అంటూ.. ఇదేమిటిరాబాబూ.. అనుకుంటూ, టెన్షన్ పడిపోయాను. మా ఇంటావిడేమో, బుకింగ్ చేసేశారుగా అంటూ.. వాళ్ళ చెల్లెలికి కూడా ఫోను చేసేసింది. నేనేమో “తేలు కుట్టిన దొంగ” లా నోరుమూసుకుని కూర్చున్నాను. పోనీ, వాళ్ళకి ఫోనుచేసి కనుక్కుందామా, అంటే , ఇంట్లోంచి చేస్తే, ఆవిడకి నిద్రపట్టదాయె.. ఎంత టెన్షన్ తో గడిపానో “ఆయనకే ” తెలుసు. వాళ్ళకి ఫోను చేస్తే, అదేదో ఎకౌంట్ నెంబరు చెప్పి దానికీ transfer చేయమన్నారు. వాళ్ళకేం, నాదగ్గర డబ్బులుండొద్దూ, ఆ పంపిన డబ్బుల విషయం గాల్లో తేలుతోంది, ఇక్కడేమో బుకింగవలేదు. మొత్తానికి మర్నాటికల్లా నా డబ్బులు ( అదేలెండి, మా ఇంటావిడ ఎకౌంటులోవి) తిరిగొచ్చాయి. అప్పుడు చెప్పాను విషయమంతా.. usual quota కోప్పడడాలు పూర్తిచేసి.. తన ATM Card ఇవ్వగా, ఆ డబ్బులు డ్రా చేసి, ఇంట్టిపక్కనే ఉండే బ్యాంకులో డబ్బులు కట్టేసి, ఊపిరి పీల్చుకున్నాను.

    17 న బయలుదేరి, యాత్ర పూర్తిచేసికుని, డిశంబర్ 26, అర్ధరాత్రికి తిరిగి వచ్చాము. వివరాలన్నీ మా ఇంటావిడ తన టపాలో వ్రాసింది.2014 లో తీర్థయాత్రలకి సంబంధించినంతవరకూ, చాలా బాగానే జరిగినట్టే.

    స్నేహితుల విషయానికొస్తే, Facebook ధర్మమా అని, చాలామంది స్నేహితులే లభించారు. ప్రతీరోజూ, నేను post చేస్తూన్నవి, భరిస్తున్నారు. ఇంకా ఎవరూ కోప్పడలేదు… నా గోతెలుగు వ్యాపకం కూడా బాగానే ఉంది. వారం వారం ఇప్పటిదాకా 80 దాకా వ్యాసాలు పంపాను. గత ఏడాది(2014) బ్లాగులోకానికి కొద్దిగా అశ్రధ్ధ చేశాను. పెద్దగా కారణాలంటూ లేవు..ఉత్తి బధ్ధకం. కానీ, నాకంటూ ఓ గుర్తింపూ, ఎంతో మంది అభిమానులనూ సంపాదించిపెట్టిన తెలుగు బ్లాగులోకాన్ని మర్చిపోతే ఎలా ? ఈ సంవత్సరం( 2015) లో చేసికున్న గట్టి నిర్ణయం ఏమిటయ్యా అంటే, మరీ ఇదివరకటిలాగా కాకపోయినా, కనీసం వారానికి నాలుగు టపాలైనా పెట్టాలని. అదిగో… భయపడిపోతున్నారుకదూ.. ఇన్నాళ్ళూ హాయిగా ఉన్నామూ, మళ్ళీవస్తున్నాడయ్యా బాబూ.. ఈయనగారి ” బోరు” తిరిగి ప్రారంభం అన్నమాట… అనుకుంటున్నారుకదూ…ఎన్నో Topic లు ఉన్నాయి.. నా కడుపుబ్బరం తగ్గొద్దూ మరి?

    HAAAAAAAAAPPPPPPPYYYYYY NEW YEAR TO ALL... See you more regularly….

%d bloggers like this: