బాతాఖాని-లక్ష్మి ఫణి కబుర్లు– ఈరోజుల్లో పిల్లలు ..they know what they want…

పాతరోజులకీ, ఈతరం వారికీ, మార్పులేమైనా ఉన్నాయా అంటే, చాలానే ఉన్నాయి… ఆరోజుల్లో 60% వస్తే చాలు ఎంతో సంబరపడిపోయే వాళ్ళం… పరీక్షా ఫలితాలు రావడమేమిటి,, ఇంట్లో అమ్మా నాన్నా , ఏం చెపితే , ఆ కాలేజీ లోనో, ఆ కోర్సులోనో చేరిపోయే వాళ్ళం…  for the simple reason that they knew better..అనే అపోహలో….  ఈరోజుల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది….  మార్కులు చూస్తే, 99% అన్నది ఓ benchmark  అయిపోయింది. అలాగని చదివే ప్రతీవారికీ అన్నేసి మార్కులు వస్తాయని కాదూ, కనీసం 20% పిల్లలు ఆ కోవకి చెందినవారే. వీళ్ళేమిటంటే  తాము జీవితంలో ఏం చేయాలనుకున్నారో అది చేయడానికి కావాల్సిన పునాదులు వాళ్ళే వేసికోగల తెలివి తేటలున్నాయి… అందులో సందేహమేమీలేదు… 12 th   class  పరీక్షా ఫలితాలొచ్చేముందర, తల్లితండ్రుల మాట కాదనడమెందుకనే sentiment  అనండి,, పోనీ వాళ్ళు చెప్పిన కోర్సులోనే ఓ డిగ్రీ సంపాదించి, ఆ తరవాతే  మనక్కావలినదేదో చేయొచ్చూ .. అనే కారణం అనండి మొత్తానికి ఏదో సామరస్యం కుదిరేది… అలాగని ఇష్టం లేని కోర్సులో చేరి, అశ్రధ్ధచేశారని కాదు… అందులోనూ శాయశక్తులా చదివి ఉత్తమ శ్రేణిలోనే పాసయారు. ఎంతైనా జీన్స్ కదా….ఓ డిగ్రీ సంపాదించేసి, తమకాళ్ళమీద తాము నిలబడ్డాక , వాళ్ళకి కావాల్సినదేదో చేస్తున్నారు… అలాటప్పుడు  తలతాకట్టు పెట్టి చదివించిన తల్లితండ్రులు , కొద్దిగా బాధపడుతూంటారు— ” ఆమాటేదో ముందరే చెప్పుండొచ్చుగా..” అని. కానీ ఏం చేయాలిరా అని అడక్కపోవడం ఆ తల్లితండ్రులదేబాధ్యతా అని  నా అభిప్రాయం.ఏదో ఏ ఇంజనీరింగులోనో చేర్పించేస్తే వాడిబతుకేదో వాడే బతుకుతాడూ , అనే కానీ, ఎటువంటి ద్వేషభావం చేతా కాదు. తాను చేయలేనిదేదో తన కొడుకు చేస్తే చూసి సంతోషిద్దామనే తప్ప, ఏదో ఇష్టంలేని పని చేయించి హింస పెట్టాలని కాదు. అయినా కానీ, కొంతమంది పిల్లలు జీవితాంతం సాధిస్తూనే ఉంటారు.. మీరు చెప్పడం వలనే ఫలానా కోర్సులో చేరానూ.. అని..అదేదో సరదాగా అన్నానని చెప్తూంటారూ, కానీ ఆ తల్లితండ్రులు  hurt అవడం మాత్రం ఖాయం… thats an occupational hazard…

పోనీ వీటివలన ఆ తల్లితండ్రులకి ఏమైనా గుణపాఠం నేర్చుకున్నారా అంటే అదీ లేదూ.. ఇప్పటికీ సాధారణ మధ్యతరగతి తల్లితండ్రులకి ఒకటే ధ్యేయం.. తన పిల్లో/ పిల్లాడో , ఏ ఇంజనీరో, డాక్టరో అవాలనే. ఇంజనీరింగైతే  IIT  లో మాత్రమే. తల్లితండ్రుల ఈ కోరికలు చూసి, దేశంలో  IIT  ల్లో సీటుసంపాదించడానికి వేలల్లో కోచింగ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా వచ్చేశాయి. ఇదివరకటి రోజుల్లో అయితే 12 వ క్లాసులో వచ్చిన మార్కుల ఆధారం మీద దేశంలో ఎక్కడో అక్కడ సీటు దొరికేసేది. కానీ పోటీ ఎక్కువయేసరికి, వాటికీ  entrance tests  ప్రారంభించేశారు… ఈ తతంగమంతా తేలేసరికి ఓ రెండుమూడు నెలలు పడుతుంది. వీటికీ ఓ తిరకాసుంటుంది. అన్ని విద్యాసంస్థలూ విడివిడిగా ప్రవేశ పరీక్షలెందుకూ, అదో దండగా అని, దేశం మొత్తంమీద నిర్వహించే  JEE  ఫలితాలమీదే  admission  ఇస్తూంటారు.. పోనీ అందరూ ఒకేసారి చేస్తే గొడవే ఉండేది కాదూ, అబ్బే వాళ్ళూ డబ్బులు చేసికోవద్దూ? దేశంలో ఏ పేరుపొందిన సంస్థో, ఫలానారోజున కౌన్సెలింగూ, అని ఓ మెయిల్ పంపెస్తారు…ప్రభుత్వ కళాశాలల్లో , రిజర్వేషన్ కోటా పోగా మిగిలిన సీట్లు చాలా తక్కువ కాబట్టి, అందులో సీటు దొరకడం అంతా దైవాధీనమనే అభిప్రాయంతో, ఈ  so called reputed Institute  లో వాళ్ళడిగిన లక్షల్లో  ఫీజు కట్టేస్తారు, ఏదో ఒకటుంటే చాలూ అనుకుని. మళ్ళీ ఈ చేరడాల్లోకూడా కొన్ని లొసుకులు- ముందర తెలియవవి. ప్రవేశ పరీక్షద్వారా వచ్చిన వారికి సాయం, సంచీనిండా డబ్బులు ఇచ్చినవారికి కూడా ప్రవేశాలుంటాయని.. వీళ్ళపనే హాయి..ఏళ్ళతరబడి కోచింగులక్కర్లేదు,  ఏవో 80 లూ, 90 లూ మార్కులక్కర్లేదు.. అత్తిసరు మార్కులొచ్చినా, డబ్బు ఖర్చుపెట్టే బాబుంటే చాలు…మళ్ళీ ఆ కాలేజీల హాస్టల్లలో   AC  Room లూ వగైరాలుకూడా ఉంటాయి… కోట్లు పెట్టి చేరినవాడూ, మెరిట్ మీద చేరినవాడూ ఒకటే..  no level playing field.  అదృష్టమేమంటే, ఈ గవర్నమెంటు  విద్యా సంస్థలలో ఈ దౌర్భాగ్యం లేకపోవడం. రిజర్వేషనైతే తప్పదనుకోండి.. వీటన్నిటికీ అతీతంగా ఉండే ఓ సంస్థకూడా ఉంది.  BITS Pilani  అనేది. దేశంలో ఒకేఒక సంస్ఠ— రిజర్వేషను కానీ, డబ్బులిచ్చి కొనుక్కునే పధ్ధతి కానీ లేనిసంస్థ. వాళ్ళ ప్రవేశ పరీక్ష వాళ్ళదీ,  

ఇదంతా ఇంజనీరింగుకి సంబంధించినది. ఇంక వైద్యరంగానికి సంబంధించినవి– అదేదో  Neet  పరీక్ష ద్వారా ప్రవేశాలు. ఇంజనీరింగుకంటే ఎక్కువగా మామూళ్ళు వసూలుచేసే కాలేజీలు సందుకోటున్నాయి… అయినా కూడా రక్షణదళాలు నిర్వహించే  AFMC  అనేదొకటుంది… అందులో సీటు సంపాదిస్తే చాలా గొప్ప విషయం. ఉన్నవే పరిమితమైన సీట్లు, దానిక్కూడా విపరీతమైన పోటీ.. అందులో సీటు సంపాదించడమంటే ఘనకార్యం కిందే భావిస్తారు, తల్లితండ్రులేమిటీ, స్నేహితులుకూడానూ… ఆ మధ్య ఫోను చేసి చెప్పారు మా స్నేహితుడొకరు..– తన మనవడికి   AFMC  లో సీటుదొరికిందని. చాలా సంతోషమనిపించింది, కారణం అందులో సీటు సంపాదించడం ఎంత కష్టమో, ఆ సంస్థ ఎంత గొప్పదో  గత 50 ఏళ్ళుగా చూస్తూండడం వలన…కానీ అందులో దొరికిన సీటుని సునాయసంగా వదిలేసికోవచ్చనీ  just like that.. తెలిసింది..

  అలాటిది మొన్న ఫోనుచేసి  చల్లగా చెప్పారు… – మావాడు AFMC  seat  వదులుకుని , హైదరాబాదులోనే ఉండే ఇంకో ప్రెవేట్ మెడికల్ కాలేజీలో చేరాడని… పైగా వాళ్ళమ్మగారితో చెప్పాడట… నా సత్తా ఏమిటో చూపించడానికి మాత్రమే సీటు తెచ్చుకున్నానూ, కానీ నాకిష్టంలేదూ..” అని.  yes.. he is a better judge.. no doubt.. చదవాల్సినది తనూ… మన అభిప్రాయాలూ, కోరికలూ పిల్లలమీద రుద్దకూడదని ఇప్పటికైనా తెలుసుకుంటే ఉభయ తారకం కదూ….  సలహా చెప్పడం చాలా తేలికే అనేవాళ్ళూ ఉంటారు….

 At the end of the day,  చెప్పేదేమిటంటే, ఈరోజుల్లో పిల్లలు  ”  they know what they want “..  తల్లితండ్రులకి నచ్చుతుందా లేదా అన్నది, వేరేవిషయం….  but world has moved.. better to adapt…

 సర్వే జనా సుఖినోభవంతూ…

 

బాతాఖాని- లక్ష్మి ఫణి కబుర్లు–Over cautious…

 చాలామంది, అవసరం కంటే మరీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూంటారు.  చిన్నప్పుడైతే మరీనూ.. ప్రతీదానికీ ఆంక్షలే…. ఫలానావాడితో స్నేహం చేయొద్దూ, ఫలానాది ఏమైనా తినకూడదూ, సాయంత్రాలు దీపాలు పెట్టేవేళకి  ఇంటికి చేరుకోవాలీ,  పెద్దవారు మాట్టాడుకుంటూంటే , వినకూడదూ, అధవా ఉన్నా, మధ్యలో మాటాడకూడదూ.. సినిమాకి ఒంటరిగా వెళ్ళకూడదూ, ఫలానా పత్రికలూ, పుస్తకాలూ చదవకూడదూ… ఇలా చెప్పుకుంటూ పోతే సవాలక్ష ఉంటాయి… దేనికీ కారణం అడక్కూడదూ.. ” ఇంద్రియ నిగ్రహం ”  at its best..

     శీతాకాలం వచ్చేసరికి, అవసరం ఉన్నా లేకపోయినా ఓ ” మంకీ టోపీ ”  స్వెట్టరూ అయితే  compulsory.  వర్షాకాలం అయితే అడగక్కర్లేదు… వేసవి కాలం , ఎండలో బయట తిరక్కూడదూ ..almost  curfew  యే అనుకోండి… రావణాసురుడు యుధ్ధభూమిలో చావు బతుకుల్లో ఉన్నప్పుడు, మండోదరి తన భర్తని ఆఖరిసారి చూడ్డానికి వచ్చి, అతనితో అందిట.. ”  నీ చావుకి అసలు కారణం రామచంద్రమూర్తి కాదూ, నీ ఇంద్రియాలని నిగ్రహించుకోలేకపోయావూ, శివుడి గురించి తపస్సు చేసుకుంటూ, నీ ఇంద్రియాలని కట్టిపారేశావూ, ” రావణ బ్రహ్మ” గా  పేరు తెచ్చుకున్నావూ, సింహాసనం అధిష్టించిన తరువాత, ఇన్నాళ్ళూ కట్టిపారేసిన ఇంద్రియాలు కట్టువిప్పేసికున్నాయీ, నీ చావు నువ్వే తెచ్చుకున్నావూ,  etc.. etc..   అనిచెప్పినట్టు, శ్రీ చాగంటి వారి ప్రవచనాల్లో చెప్తూంటారు..

సరీగ్గా అదే ” డ్రగ్స్ ” విషయంలో వర్తిస్తుంది. డ్రగ్స్ అనే అనడం ఎందుకు లెండి, స్త్రీలమీద అత్యాచారాలనండి, టెర్రరిజం, అన్నిరకాల  Negative Vibes  అన్నిటికీ మూలకారణం , చిన్నప్పుడు చేయలేనివీ , ఎలాగైనా చేసితీరాలన్న కోరికలు పురివిప్పుకుంటాయి… 18 ఏళ్ళొచ్చేసరికి , అమ్మాయైనా, అబ్బాయైనా పైచదువులకి, చాలా సందర్భాల్లో పొరుగూరికి వెళ్ళాలే కదా.. అక్కడ అడిగేవాడెవడూ ఉండడాయె, ఏ కొద్ది కాంపస్సుల్లో తప్ప…పిల్లలందరూ అలా ఉంటారని కాదు, కనీసం 10% మాత్రం ఆ కోవకే చెందుతారనడంలో సందేహం లేదు. అంతా ఇష్టారాజ్యం.. పిల్లల్నే అనడం ఎందుకులెండి,   రాజకీయ నాయకుల పుణ్యమానీ, వాతావరణం కూడా అలాగే తగలడింది…  వీళ్ళకి సాయం సినిమాల్లో నటించే వాళ్ళొకళ్ళూ..  అందరూ కాకపోయినా,  వాళ్ళల్లో ఓ పదిశాతం  ఇలాటివాళ్ళే. దురదృష్టవశాత్తూ , ఈ పదిశాతం శాల్తీలే మనకి  so called role models..  సిరి అబ్బదు కానీ చీడ మాత్రం ఠంచనుగా  తగులుకుంటుంది.. చిన్నప్పుడు పిల్లల్ని అదుపులో పెట్టొద్దని కాదు.. పెట్టితీరాలే..  no doubt..  కానీ మరీ ” అతి ” గా పెడితే, కంట్రోలు ఉన్నంతకాలమూ ఊరుకుని,  ఆ సంకెళ్ళలోనుండి బయట పడ్డమేమిటి, ” అచ్చోసిన ఆంబోతులుగా తయారవుతారు..

  Over protection  సందర్భం ఇంకోటుంది…సాధారణంగా, ఓ వయసు దాటిన తరువాత చెకప్ కి ఏదో ఓ డాక్టరు దగ్గరకి వెళ్ళాల్సొస్తుంది. నానారకాల పరీక్షలూ చేసి, అప్పటిదాకా మనలో కనిపించని ఏవేవో రోగాలున్నాయంటాడు ఆ డాక్టరుగారు… మరీ ప్రాణాంతకాలు కాకపోయినా, తగు జాగ్రత్తలు తీసుకోమంటాడాయన…  ఎవరుమాత్రం అశ్రధ్ధగా ఉంటారూ? బతుకంటే తీపేగా ఎవరికైనా? అదేదో  American Standards  ప్రకారం,  Sugar levels  అవసరమైన దానికంటే ఎక్కువని తేలుస్తాడు. అప్పటినుండీ మన బతుకు మనచేతులో ఉండదు. ఊరికి ముందర పంచదార వాడకం బంధ్. ఇన్ని సంవత్సరాలూ మధురాతిమధురంలో తేలియాడిన జీవితం, ఇంక చేదుమయం అయిపోతుంది. కాఫీ అవనీండి, చాయ్ అవనీయండి, మందులా తాగడమే. అసలు ఇఛ్ఛ అనేది చచ్చిపోతుంది… ఆ సుగర్ కాకుండా, ఏ గుండె కో వచ్చిందనుకోండి, పరిస్థితి ఇంకా దుర్భరమైపోతుంది.  ఏం చేద్దామన్నా, పక్కనే ఇంటి ఇల్లాలు, ” ఆ పని చేయకండీ.. ఈ పని చేయకండీ.. అసలే అనారోగ్యం కూడానూ.. ” అనడం. పాపం వాళ్ళు మాత్రం, మన ఆరోగ్యం గురించే కదా జాగ్రత్తలు తీసుకుంటూంటా.. అయినా అవసరానికి మించిన జాగ్రత్తేమో అనిపిస్తూంటుంది… నాకు తెలిసిన ఒకటి రెండు కేసుల్లో, వారి భార్యలు తీసుకునే ” అతి జాగ్రత్త ” ల వలనే, అధ్వంతరంగా పోయారనిపిస్తుంది. ఒకాయనకి గుండె కి సంబంధించిన కేసు– ఆపరేషనవడమేమిటి, ఆ ఇల్లాలూ, వారి అక్కగారూ, పథ్యం పేరుచెప్పి ఆయన్ని ఎండపెట్టేసారు. ఇంకో పదేళ్ళు బతకాల్సిన పెద్దమనిషి కాస్తా, మూడేళ్ళకే వెళ్ళిపోయారు.  ఏదైనా అనారోగ్యం ఉందంటే చాలు, ప్రతీవాడూ సలహాలు చెప్పేవాడే. ఫలానాది తినొచ్చూ అని ఒకరంటే, ఇంకోళ్ళు ససేమిరా వద్దూ అంటాడు. ఇవేవీ సరిపోనట్టు అంతర్జాలం లోని గూగులమ్మని అడగడం.. 

 Too many cooks spoil..  అన్నట్టుగా , ఈ అతిజాగ్రత్తలు ఒక్కోప్పుడు  boomerang అయి అసలు ప్రాణానికే ముప్పొస్తుంది.

%d bloggers like this: