బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– కొన్ని ఒప్పుకోలేని నిజాలు…


    Satisfaction కీ Delight కీ ఉన్న తేడాల వలనే ఈ రోజుల్లో, జనాలమీద చాలా ఒత్తిళ్ళు వస్తున్నాయని నా అభిప్రాయం. ఇదివరకటి రోజుల్లో ప్రతీవాడికీ Satisfaction అనేదొకటుండేది. ఓ పిల్లో పిల్లాడో పుట్టడం, వాళ్ళ చదువూ, సంధ్యా, పెళ్ళీ, పురుళ్ళూ, ఈ మధ్యలో ఓ కొంపోటీ తయారుచేసేసికుంటే చాలు, అమ్మయ్యా మన జీవితానికి ఓ అర్ధం ఉంది. చేయవలసిన పనులన్నీ సంతృప్తికరంగా చేయకలిగానూ అనే ఓ Satisfaction ఉండేది. మరీ అందనివాటికోసం అర్రులు చాచకుండా, ఏదో జీవితం గడిపేసేవారు. Ofcourse అదీ ఓ జీవితమేనా అని అనుకునేవారిని ఈ రోజుల్లో చూస్తున్నాము.Thats a different matter.

1990 దశకంలో reforms వచ్చిన తరువాత పూర్తి నక్షా యే మారిపోయింది. ప్రతీవాడూ, వాళ్ళ వాళ్ళ Satisfaction యొక్క benchmark మార్చేసి Delight లోకి దిగిపోయారు. కారణం కాంపిటీషన్.అవతలివాడికంటే ఎక్కువ గా ఉండాలి, అనే సూత్రమే ఇప్పుడు. ఎక్కడ చూడండి, అవతలివాడికంటే మనం ఓ ఆకు ఎక్కువ చదివామని చూపించేసికోవాలనే తపన ప్రతీ sector లోనూ వచ్చేసింది. దానికి సాయం ఈ Management, Quality గురువులు కూడా ఊదరకొట్టేస్తున్నారు. కస్టమరు ఇదివరకటి రోజుల్లో ఏదో ఒకటుంటే చాలనుకునేవాడు. మరి ఇప్పుడు అలా కాదూ, ప్రతీ కస్టమరుయొక్కా Delight కోసం మనం strive చేయాలీ అంటూ, పనిచేసే ప్రతీవారికీ జ్ఞానబోధ చేయడం మొదలెట్టారు. నిజమే ఎక్కడ గొంగళీ అక్కడే అన్నట్టుంటే ఎలా కుదురుతుందీ? కానీ, అన్ని విషయాలూ పరిగణలోకి తీసికుని మరీ చేయాలి పనులు.అంతేకానీ, ఏదో పుస్తకాల్లో వ్రాశారూ, ఆయనెవరో మేనేజ్మెంటు గురు చెప్పారూ అనుకుంటూ వెళ్తే, కష్టాలొచ్చేస్తూంటాయి.

ఉదాహరణకి మన విజయ్ మాల్యా ని తీసికోండి, అదేదో Customer Delight అంటూ, కింగ్ ఫిషర్ సర్వీసుని ప్రపంచస్థాయికి తీసికెళ్ళడానికి ప్రయత్నమైతే చేశాడు, కానీ చివరకి ఏమయింది? అలాగని రాతియుగంలో లా ఉండమని కాదు. మిగిలినవాళ్ళకి మాత్రం లేదా ఆయనలా చేయాలని? కొద్దిగా తమ తాహతు, స్థోమతా దృష్టిలో పెట్టుకుని, చేశారు. అలాగే బియాని ఫ్యూచర్ గ్రూప్– ఎక్కడ పడితే అక్కడ తెరిచేశారు వాళ్ళ Pantaloon Outlets. చివరకి 7000 కోట్ల అప్పుల్తో దాన్ని అమ్ముకోవాల్సొచ్చింది. ఇవన్నీ పేద్ద పేద్ద Corporate వ్యవహారాలు. ఏది ఏమైనా తట్టుకోనూ కలరు, ప్రభుత్వాలు మారగానే వాళ్ళ వ్యవహారాలు చక్కబెట్టుకోనూగలరు.

వచ్చిన గొడవల్లా మన మామూలు ఉద్యోగస్థులకి. ఏదో పేద్ద కంపెనీ లో ఉద్యోగం వచ్చేసిందీ, లక్షల్లో జీతాలూ, ఇంక మనకేమిటిలే అనుకోడం,ఉండడానికి ఓ పేద్ద ఫ్లాటూ, ఓ కారూ మరీ అలాటిదిలాటిది కాదు, మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ మోడల్.పిల్లలకి ఏడాదికి లక్షల్లో ఫీజులు వసూలు చేసే చోట ఎడ్మిషన్లూ, ప్రతీ ఏడాదీ బయటి దేశాలకి ఓ holiday trip, ఇంట్లో అన్ని రకాల గాడ్జెట్లూ ఒకటేమిటి, డబ్బుతో కొనకలిగినవన్నీ నిమిషాల్లో సమకూర్చుకోడం.డబ్బుకేముందిలెండి, అది లేకపోతే క్రెడిట్ కార్డులెలాగూ ఉన్నాయి. ఇంకా లైఫ్ లో ఫలానా గ్రేడ్ లోనే కదా ఉన్నామూ, ఇప్పుడే ఇంతంత జీతాలొచ్చేస్తుంటే, ముందు ముందు ఇంకా ఎంత ఎదిగిపోతామో అనేసికుని, తన Satisfaction ని Delight లోకి మార్చేసికోవచ్చనుకుంటాడు. ఈ రెండోదుందే చాలా డేంజరస్, ఓ వ్యసనం లాటిది. ఒకసారి బుర్రలోకి వచ్చిందంటే వదలదు.

ఇంట్లో ఒక్క కారుంటే చాలదు, భార్యకోటీ, పిల్లలకోటీ మళ్ళీ అవి ఎలాగుండాలంటే, తన ఫ్రెండు కార్లకంటే ఓ మెట్టు ఎక్కువ ! అవతలివాడు కుళ్ళుకు చావాలి మన దగ్గరున్న కార్లు చూసి. ఏదో ఓ ఇల్లుందికదా అని ఇంకో రో హౌసో ఇంకోటేదో కొన్నాడంటే అర్ధం ఉంది పోనీ investment కోసం అనుకోవచ్చు. ఎప్పుడైనా అవసరం వస్తే, కొంతలోకొంత లాభం రావొచ్చు. మళ్ళీ ఇక్కడా “లాభం” అనే ప్రలోభం లో ఉంటారు. ఇరవై ఏళ్ళకీ మనవాడు కట్టిన EMI లు లెఖ్ఖలోకి వేసికుంటే ఆ ముచ్చటా తీరిపోతుంది. కానీ ఈ పోటీలమీద కార్లేమిటండి బాబూ? ఈ కార్లనేవి functional గా ఉండాలా లేక Delight కోసమా? వాళ్ళదగ్గర డబ్బులున్నాయీ, కొనుక్కుంటున్నారూ, మీకెందుకూ అసలు ఏడుపూ అనొచ్చు. అక్కడికే వస్తున్నాను. ప్రతీ కంపెనీ వాడూ, పెద్ద పెద్ద పొజిషన్లలో ఉన్నవారిని కూడా ఈ మధ్య చెప్పా పెట్టకుండా టుపుక్కున తీసెస్తున్నారుట. ఎక్కడ చూసినా ఇదే గొడవ. అవును ఆ కంపెనీ వాడికి పెద్దపెద్ద జీతాలిచ్చి ఓ మనిషిని పోషించే బదులు, వాణ్ణి తీసేసి ఆ స్థానం లో పదిమందిని కొత్తవాళ్ళని చేర్చుకోడం చవకనుకుంటాడు. దానితో ఎంత సీనియర్ పొజిషన్ లో ఉన్నవాడికైనా సరే ఈ రోజుల్లో ఉద్యోగాల గారెంటీ లేదు. కానీ వీళ్ళు మాత్రం ఆ Delight వ్యసనంలోంచి బయటపడలేకపోతున్నారు…. ఏమో ఇది నా అబ్జర్వేషన్, అందరూ ఒప్పుకోవచ్చు కానీ అదిమాత్రం bitter truth....

3 Responses

  1. ఫణి బాబు గారూ నమస్తే.
    సంతృప్తి ఆహ్లాదము ల మధ్య నలిగిపోతున్న ప్రస్తుత మానవాళి పైన చేదు నిజాలు తెలియచేసారు .స్థానికముగా
    citizen journalist category ప్రచురణల విభాగములో మీ వ్యాఖ్యలు ప్రచురించడానికి ప్రయత్నము చేస్తాను అభ్యంతరము
    లేదు కదా ?

    Like

  2. Dear Phanibabu garu,

    Excellent, Excellent, guruvu garu,

    You give me a clear thought in my mind.

    Thank you verymuch,
    Padmaja

    Like

  3. @శాస్త్రి గారూ,

    ఏదో నాకు తోచింది వ్రాస్తున్నాను. మీకు నచ్చినందుకు చాలా సంతోషం గా ఉంది. మీకు ఎలా వీలుంటే అలా చేయండి. అభ్యంతరంఏమీ లేదు…

    @పద్మజా,

    మీకు ఎంతలా నచ్చేసిందో, మీ వ్యాఖ్య చదివితేనే తెలుస్తోంది… నాకు అనిపించింది వ్రాశాను.అలా వ్రాసినది మీ అభిప్రాయాలకి దగ్గరగా ఉండడం నా అదృష్టం…

    Like

Leave a comment