బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    ఏమిటో అప్పుడే వారం పైన అయిపోయింది టపా వ్రాసి. ఈ వారం రోజులూ ఎన్నో సార్లు ప్రయత్నించాను టపా వ్రాద్దామని, కుదిరితే కదా. ఎప్పుడు మొదలెట్టినా ఏవో జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయి, ”అయ్యో ఇంక తనని కలవలేము కదా..” అనే! ఏమిటో అంతలా ప్రభావితం చేసింది శంకర్ ఇంక మనమధ్య లేడనిపిస్తే. అసలు ఇలాటి అనుబంధాలు ఎందుకు చేస్తాడో ఆ భగవంతుడు అనిపిస్తుంది. పోనీ అలాగని మాకు అతనితో ఏమైనా ముఖపరిచయమా అంటే అదీ లేదు.

    ఇంక ఇదికాదు సంగతీ అనుకుని తను వ్రాశిన టపాలన్నీ చదవడం మొదలెట్టాను. ఏం టపాలండి బాబూ అవి. ఎన్నెన్ని విషయాలు మనతో పంచుకున్నాడో కదూ? తన దగ్గర ఉన్న ఖజానా ని అందరితోనూ పంచుకోడం లోనే ఉంది, అసలు గొప్పతనమంతా. ఏదో తమకి తెలిసినదేదో, తమదగ్గరే ఉంచుకునే మనస్థత్వం కల ఈరోజుల్లో, ఒక వ్యక్తి తన ఆనందాన్నీ, సంతోషాన్నీ అందరితోనూ పంచుకోవాలనుకున్నాడే అదండి అసలు విషయం శంకర్ ఇంతమందికి అభిమానపాత్రుడవడం. ఇలాటి సద్గుణాలే ఓ మనిషి వెళ్ళిపోయిన తరువాత కూడా అందరిలోనూ చిరంజీవి గా మిగిలిపోతాడు.Thats what Shankar was…is and would continue to be... ఇంతకంటే ఏమీ వ్రాయలేను.

    అసలు తనకి, ఎప్పుడూ కలవని మామీద అంత అభిమానం ఎలా పుట్టుకొచ్చిందా అని ఆలోచిస్తే తేలిందేమిటంటే, మా ఇద్దరికీ నచ్చినవి ఒక్కటే. అదేదో wavelenghth అంటారే అది match అయింది. బహుశా అదే మా ఇద్దరినీ అంతగా దగ్గర చేసిందేమో. మొన్నెప్పుడో online లో ఉండగా, హైదరాబాద్ నుండి ఓ మిత్రుడు, ” మీరు వ్రాసిన టపా స్వాతిగారు చదివారండీ, మీకు థాంక్స్ చెప్పమన్నారూ..” అనగానే, గుండె నీరైపోయింది. ఇందులో చేసిందేమిటమ్మా, అసలుబాధంతా పడేది తనే కదా. జీవితభాగస్వామిని పోగొట్టుకుని, తను పడే ఆవేదనని, మనం ఎవరైనా అడ్డుకోగలమా? స్వాతికి ఫోనుచేసి మాట్టాడుదామన్నా ఏం చెప్పాలో తెలియని helplessness. నేను వ్రాసిన టపాకి స్పందిస్తూ సింగపూర్ నుంచి ఒకరూ, బెంగళూరు నుండి ఒకరూ ఫోనులో మాట్టాడి, వారి వారి భావాలు పంచుకున్నారు.

    మొత్తానికి ఎలాగో ఇప్పటికి తేరుకోగలిగాను. ఇంక మళ్ళీ రొటీన్ లో పడాలి, కానీ అదిమాత్రం అనుకున్నంత సులభం కాదనుకోండి, అయినా ప్రయత్న లోపం ఉండకూడదుగా….

%d bloggers like this: