బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–పెట్టుబడి బట్టలు


   ప్రపంచం లో ఉన్న ప్రతీ occasion కీ బట్టలు పెట్టడం అనేది, మన ఆంధ్రదేశంలోనే ఎక్కువనుకుంటాను.ఎవరింటికి వెళ్ళినా, ఆడవారికి, వారి పరిచయాన్ని బట్టి ఓ చీరో జాకెట్టు ముక్కో పెట్టేస్తూంటారు.బాగా తెలిసినవాళ్ళైతే, కొంచెం మంచి క్వాలిటీ ది,చుట్టాలైతే ఓ చీర బోనస్సు! అవి అటూ ఇటూ తిరిగి, చివరకు మొదటిచ్చిన వాళ్ళ దగ్గరకే వస్తూంటుంది. అది వేరే విషయమనుకోండి! అసలు ఈ బట్టలుపెట్టడం అనే ఆచారం ఎక్కడినుంచొచ్చిందండి బాబూ? ఎవరైనా పీటలమీద కూర్చుంటే, వాళ్ళకి (దంపతులకి) బట్టలు పెట్టాలిట.ఈ సెంటిమెంటులేమిటో, ఈ గొడవలెంటో నాకు మాత్రం ఎప్పుడూ అర్ధం అవవు.ఒక్క విషయం మాత్రం అర్ధం అవుతూంటుంది- ఇంట్లో ఏ శుభకార్యం అయినా, మా ఇంటావిడవైపు చూస్తాను, ఎవరెవరికి బట్టలు కొనాలో!

పైగా ఎవరైనా పుట్టింటికి వెళ్తే, ఆవిడ అక్కడినుంచి తిరిగివచ్చిన తరువాత, అందరికీ తనకి ఎవరెవరు ఏమేమి బట్టలు పెట్టారో, అందరినీ పిలిచి మరీ చూపిస్తారు.అదంతా తన పుట్టింటి వారి status చూపించుకోడం అన్న మాట! ఏ పరిస్థితుల్లో అయినా, అక్కడినుంచి, బట్టలు రాకపోయినా, కొంచెం చవకబారు బట్టలొచ్చినా, తిరిగి వచ్చేటప్పుడే, కొట్లోకి వెళ్ళి ఖరీదైన బట్ట కొనుక్కోవడమూ, పుట్టింటివారిచ్చేరని చెప్పుకోవడమూనూ.అలా బట్టలు పెట్టిన వాళ్ళెవరైనా, మనింటికి వస్తే, వాళ్ళిచ్చినదానికంటె ఓ మెట్టు పైది పెట్టడం. లేకపోతే మన పరువు పోదూ?

ఇంట్లో బీరువా నిండా, ఓ మోపెడు బ్లౌజు పీసులు దాస్తూంటారు.ఇంటికి మొదటిసారి వస్తే బ్లౌజు పీసివ్వాలిట.పైగా ఆ వచ్చినవాళ్ళుకూడా take it for granted గా, ఆ బ్లౌజుపీసేదో ఇస్తేనేకానీ కదలరు! పైగా ఇస్తున్నప్పుడు ‘ఇప్పుడెందుకండీ ఇవన్నీనూ’ అంటూ ఓ మొహమ్మాటం డయలాగ్గోటీ. వీళ్ళు <b.ఇవ్వకా మానరు, ఆ వచ్చినవాళ్ళు పుచ్చుకోకా మానరు, ఊరికే public consumption కోసం ఈ డయలాగ్గులు! ఇవన్నీ అస్తమానూ ఎందుకూ అంటే, మనం వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టిన చీర తీసికోలేదేమిటీ, తిరిగి పెట్టకపోతే బావుంటుందా అంటూ ఇంటివాడి నోరు నొక్కేస్తూంటారు!అసలు in the first place తీసికోమ్మనదెవడంట? అప్పుడు తీసికోకపోతే ఇప్పుడు ఇచ్చే అవసరం ఉండేది కాదుగా!

ఈ బట్టలవ్యవహారాలు ఈ మధ్యన, ఆడవారివరకే పరిమితం అయ్యాయి.మొగాళ్ళకి, ఓ జేబురుమ్మాలో, ఓ తువ్వాలో పెట్టేస్తున్నారు.మారోజుల్లో, ఏ సన్మానం లాటిది జరిగినా శాలువాలు కప్పేవారు. ఈ మధ్యన ప్రతీ వారికీ, ఓ కండువా భుజంమీదెయ్యడం ( ఏ పార్టీవాళ్ళైతే ఆరంగుది).ఒకప్పుడు ఆ కండువాకి చాలా పెద్ద honour ఉండేది. కండువా వేసికున్నవారిని ఓ ప్రత్యేక గౌరవంతో చూసేవారు. కండువా లేకుండా, వీధిలోకి కూడా వెళ్ళేవారు కాదు. ఇప్పుడో ప్రతీ కోన్కిస్కాగాడికీ ఓ కండువాయే! వాడు history sheeter అవొచ్చు, లేక అప్పుడో, ఆముందురోజో పార్టీ ఫిరాయించిన రాజకియ నాయకుడవచ్చు!

ఒక్కొక్కప్పుడు మగాళ్ళకి పంచలచాపు పెడుతూంటారు. వాటినేం చేసికుంటాం, లుంగీగా కట్టుకోడమో, లేక ఇంకోదానికో మడిబట్టలా కట్టుకోడం.ఇంక ఇలా అవతలివారిచేత పెట్టించబడ్డ బట్టలు ( మగాళ్ళ పాంటు పీసులూ, షర్టు పీసులూ) ఇంట్లో పెట్టినిండా ఉంటాయి. అలా పెట్టినింపుకోడం తప్పించి, మనమేమైనా కుట్టించుకుంటామా, పెడతామా? మళ్ళీ మనింటికి ఎవరైనా చుట్టాలొస్తే, వాటికి ముక్తీ మోక్షం వస్తాయి. మళ్ళీ ఇందులో ఓ జాగ్రత్త తీసికోవాలి, మరీ వాళ్ళిచ్చిందే తిరిగి వాళ్ళకి పెట్టేయడం కూడా బాగోదు! మనవైపు చూశాను- ప్రతీ బట్టల దుకాణంలోనూ, పెట్టుబడి బట్టలని విడిగా ఉంటాయి. వాళ్ళకీ తెలుసు,ఈ బట్టల ఇకనామిక్స్!వాటి క్వాలిటీ కూడా అంతంతమాత్రమే! చివరకి అవన్నీ ఏ గిన్నెలమ్మేవాళ్ళదగ్గరకో చేరతాయ!

ఇలా వ్రాసేనని, మా ఇంటికి పూణె లో రావడం మాత్రం మానేయకండి. మరీ మొగాళ్ళకి ఏమీ పెట్టనుకానీ, ఆడవారికి మాత్రం మా ఇంటావిడ అతిథి సత్కారం గత 38 ఏళ్ళనుంచీ చేస్తూనేఉంది, అందరికీ మరీ చీరలనను కానీ,వయస్సుని బట్టి ఓ డ్రెస్సో, ఓ చీరో ( పెట్టుబడి క్వాలిటీ మాత్రం కాదు!)పెడుతూనేఉంటుంది. మరీ అంత పరిచయం లేనివారికైతే టూ బై టూ బ్లౌజు పీస్సోచ్ !!

Advertisements

17 Responses

 1. బాగా చెప్పారు 🙂 మొన్న మా ఇంట్లో ఏదో ఫంక్షన్ అయ్యాక బోల్డు పెట్టుడు బట్టలు రెడీ గా ఉన్నాయి. ఇంకో ఏడాది పాటూ ఎవరొచ్చినా..దుకాణానికి పరిగెత్తక్కర్లేదు ..

  కృష్ణప్రియ/

  Like

 2. Why not we knock off the “pettubadi baTTalu” habit. You dont give when I come to your house and I shall not give when you come to our house. This is because the cloth pieces so given on events or when somebody comes to the house are normally not worn at all but distributed similar fashion to others and sometimes surprisingly the same piece may come back to us from a third party. Why unnecessary pretentions!!??

  Like

 3. చలా బాగా రాసారు. ఈ విషయం ఆడవారికీకి సంభందిచినది. మగవాళ్ళు నిమిత్తమాత్రులు. ఖర్చు మగవారిది. లాభం ఆడవారికీకి.

  Like

 4. ఈ మధ్య బ్లౌజు పీసులు మానేసి స్టీలు డబ్బాలూ, గట్రా తాంబూలంతో కలిపి ఇచ్చేస్తున్నారు. మా పెదనాన్నగారి షష్ఠి పూర్తి జరుగుతుంటే, ఈ చీరల గొడవ ఎందుకని, వాళ్ళ పిల్లలు చక్కగా, వెండి కుంకుమ భరిణలు ఇచ్చారు. ఖర్చు తగ్గేదేమీ లేదు కానీ, మరీ ఇన్ని బట్టలు కూడా ఏమి చేసుకుంటాము? దాని బదులు వెండిదో, ఇత్తడిదో వస్తువు ఇస్తే – గుర్తుగా ఉంటుంది. మహారాష్ట్ర లో అలాటి సాంప్రదాయం ఎక్కువట కదా – మా ఆడపడచు చెప్పింది. వాళ్ళు మహారాష్ట్ర లో చంద్రపూర్ దగ్గరగా భాలర్ అనే ఊరిలో ఉంటారు. వాళ్ళ ఆయన అక్కడ బొగ్గు గనుల్లో పని చేస్తున్నారు. వాళ్ళుండే టౌన్ షిప్ లో పేరంటాలకనీ, పండగలకనీ అందరూ కలవడం కాస్త ఎక్కువే. తను హైదరాబాదు వచ్చినపుడు కూడా కొన్నిసార్లు అలా వస్తువులు తీసుకెళ్ళింది కూడాను! పిన్ని గారిని కొన్ని వస్తువులు కూడా రెడీ గా ఉంచమని చెప్పండి మరి 🙂

  Like

 5. అవును వీటితో భలే తలనొప్పి! అందుకే ఎవరైనా జాకెట్ పీసులూ వగైరా ఇస్తే “వద్దండీ,బొట్టు పెట్టండి చాలు”అని పండ్లు మాత్రం తీసుకుని వచ్చేస్తాను. విరజాజి గారు చెప్పినట్లు ఈ మధ్య పెళ్ళిళ్లలో పేరంటాల్లో వస్తువులు ఇచ్చేస్తున్నారు. నాకూ అదే హాయిగా ఉంటుంది. ఎలాగూ అవతలి వాళ్ళు పెట్టే బట్టలు మనకు నచ్చి మనం కట్టేది లేదు. ఏ స్టీలు డబ్బాయో అయితే చచ్చినట్లు వాడతాం వంటింట్లో! మా గృహ ప్రవేశం సమయంలో కూడా అలాగే వెండి డాలర్లు ఇచ్చాం.

  ఈ బట్టలకు బోలెడు స్థలం కూడా కావాలి, అదొక సమస్య!

  అది సరే, “పెట్టుబడి బట్టలు”అని బట్టల షాపులవాళ్ళు వాడే మాట కరెక్టేనా? పెట్టుబడి అంటే ఇన్వెస్ట్ మెంట్ కదా!

  Like

 6. నేను వీరందరికి భిన్నంగా చెప్తాను బాబూజీ!….పీటలమీద బట్టలు పెట్టడం అనే సాంప్రదాయం నా ఉద్దేశ్యంలో ఎందుకొచ్చిందంటే ఆ శుభకార్యం చేసుకుంటున్నవారు సౌభాగ్యాలతో ఉండాలని వాంఛిస్తూ పెట్టేవి, as a symbol of our best wishes for their prosperity…

  ఇంటికొచ్చినవారికి సంగతికొస్తే, ముత్తైదువని లక్ష్మీ దేవితో సమానంగా చూస్తారు కాబట్టి, ఇంటికొచ్చిన ఆడపడుచు సంతోషంగా వెళ్తే మనకి మంచి జరుగుతుందని భావన, due to the positive vibrations from the person who receives…

  ఎవరి తాహతును బట్టి వారు ఇస్తారు, కాని ఎవరిచ్చినా అవతలివారి సౌభాగ్యం ఆశిస్తూ ఇవ్వాలేతప్ప తిట్టుకుంటూ ఇస్తే ఇచ్చినా ఫలితం ఉండదు..

  మన సాంప్రదాయాలు కాలక్రమేణా మారుతున్నాయి, మారతాయి, కాని వాటిని పాటించేవారిని నిరుత్సాహపరచకూడదని నా అభిప్రాయం.

  This is just my humble opinion…:)

  Like

 7. కృష్ణప్రియా,

  అదృష్టవంతులు !

  Like

 8. శివరామప్రసాద్ గారూ,

  సలహా/అభిప్రాయం వరకూ బాగానే ఉంది.

  Like

 9. ముద్దులపల్లి చంద్రశేఖర్,

  లాభ నష్టాల మాటెలా ఉన్నా,కొని ఇంట్లో పెట్టాలికదా !!

  Like

 10. విరజాజీ,

  ఉన్నవి చాలక ఈ suggestions కూడానా తల్లీ !!!

  Like

 11. సుజాతా,

  పెట్టుబడి అనే మాటకున్న నానార్ధాల్లో ఇదొకటి.ఇదికూడా ఓ పెట్టుబడే కదా! మనం వెళ్ళినప్పుడు, వాళ్ళూ చేతిలో ఏదో ఒకటి పెడతారు!!!!

  Like

 12. చదువరీ,

  ధన్యవాదాలు.

  Like

 13. ఏరియన్,

  నీవు చెప్పింది అక్షరాలా కరెక్టు. ఊరికే సెంటిమెంట్లు పెట్టుకోకుండా, కాలమాన పరిస్థితులతో పాటు మనమూ ముందుకి వెళ్ళాలికదా! ఇవన్నీ ఊరికే రాయడం వరకే. మాఇంటావిడ,నిన్నటి నా టపా చదివి, వరలక్ష్మీ వ్రతానికి అమ్మాయికీ, కోడలికీ బట్టలు పెట్టాలండోయ్ అని జ్ఞాపకం చేసింది!

  Like

 14. 😀 😀 😀

  Like

 15. I dont know if you will post this comment. You have rejected my last comment. Anyways, I feel that arien has explained the true meaning of these tradition. But the thing is ppl have forgot what is the essence of such activities in this busy life. Now people are suffering with cultural poverty.

  They dont know why certain rituals or traditions are followed. If you dont know the reason for a tradition u find no meaning in it. There are many such feel good traditions in our culture which will enhance the relations among ppl and they are in a grave danger of extinction.

  Iam happy that atleast this tradition and its purpose was advocated in this post and comments.

  Like

 16. Phani,

  I have sent a personal mail to your ID, explaining my position. Your comment must have gone in Spam. I am the last person to reject any comment from my friends.
  All comments are most welcome.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: