బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– రామాయణం లో పిడకల వేట….


   క్రిందటి వారం అంతా, మా కోడలు చెన్నై, తరువాత అబ్బాయి హైదరాబాదూ వెళ్ళడంతో, మేము మా ఇంటికి వెళ్ళి, ఆదివారం రాత్రికి, మేముండే ఫ్లాట్ కి వచ్చేశాము. ఛాన్స్ దొరికితే మేముండే ఫ్లాట్ కి వచ్చేయడానికి, మరీ పెద్ద కారణమంటూ లేదు. ప్రొద్దుటే 7.00 దాటిన తరువాత నిద్ర లేవొచ్చు. అక్కడైతే ఆ టైముకే, మా నవ్య స్కూలుకి వెళ్ళడానికి రెడీ అయిపోతుంది, మరీ ఆ తరువాత లేస్తే, చూసేవాళ్ళకి బావుండదుగా.అదన్నమాట విషయం!

   నిన్న మధ్యాన్నం 3.30 కి జెమినీ టి.వీ. లో అదేదో “బంగారుబాబు” అని జగపతిబాబు నటించిన సినిమా వస్తూంటే చూస్తూ కూర్చున్నాము. అందులో థీం ఏమిటంటే, మురళీ మోహన్, జగపతిబాబుకి తండ్రి, అతను, ఎప్పుడో ఒక బలహీన క్షణంలో, ఇంకో ఆవిడతో కాపరం చేసి, ఇద్దరు పిల్లల తండ్రౌతాడు. ఏదో ఒకళ్ళంటే సరిపెట్టుకోవచ్చేమో కానీ, ఇద్దరు పిల్లల తండ్రి అయాడంటే, బలహీన క్షణం ఏమిటీ, నా తలకాయ! తిన్న తిండరక్క చేసే పనులు!Anyway that was the story of the movie.

   సాయంకాలం, మా ఇంటావిడతో వాహ్యాళికి బయలుదేరి, ఈవెనింగ్ వాక్ కి వెళ్ళాను. మధ్యలో వర్షం మొదలయింది. మరీ పరిగెత్తే వయస్సు కాదూ,మోకాళ్ళనొప్పులతో ఇంక పరిగెట్టడం కూడానా. ఛాన్స్ దొరికింది కదా అని ఆ వర్షంలోనే “ప్యార్ హుఆ ఇక్రార్ హుఆ” అంటూ పాటపాడుకుంటూ, ఆ వర్షంలోనే తడిసి కొంపకి చేరాము. 8.30 కి భోజనం చేసేసి, కొంతసేపు నెట్ బ్రౌజింగ్ చేసేసి, అబ్బూరి ఛాయాదేవి గారి కథల పుస్తకం ఒకటి చదువుతూ, పక్కమీదకు వాలాను.

   ఇంతలో ట్రింగ్ ట్రింగు మంటూ సెల్ ఫోనూ. ఇంతరాత్రెవరు చేశారా అనుకుంటూ తీసే లోపలే కట్ అయింది. నెంబరు చూసి, పోనీ నేనే చేద్దామని చూస్తే, ఆ నెంబరు అంత పరిచయమైనదిగా కనిపించలేదు. పైగా 13 digits ఉంది! అయినా ప్రయత్నించేసరికి, Please contact Reliance to get in touch with the number you are trying… అని ఓ సందేశమూ, ఇంగ్లీష్,హిందీ, మరాఠీ భాషల్లో. మళ్ళీ ఇంకోసారి ఫోనూ. Action replay… ఇంతరాత్రివేళ ఈ గొడవెమిటిరా బాబూ అనుకున్నాను. ఓ పదినిమిషాల్లో ఓ ఎస్.ఎం.ఎస్సూ అదే నెంబరు నుండి– ” cal me dad” అని. ఓ కామా లేదు, ఫుల్ స్టాప్ లేదు. నేను ఆ ఫోను చేసిన వాడికి డాడ్ నా, లేక, ఆ మెసేజ్ పంపినవాడు నాకు డాడ్డా? రెండోదయితే ఫరవాలేదనుకుందాం, ఏ గత జన్మలోనో నాకు dad అయి, ఈ జన్మలో గుర్తొచ్చి ఫోను చేశాడనుకోవచ్చు. కానీ, రెండోదే కరెక్టనుకుంటే, కొంపలంటుకుంటాయి! వామ్మోయ్!

   పిల్లలేమైనా ఫోను చేశారేమో కనుక్కుందామని, వాళ్ళకి చేస్తే, మేమేమీ చేయలేదని సమాధానం. మా ఇంటావిడ, ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపూ, తన సీరియళ్ళ హడావిడిలో ఉండి, అంత పట్టించుకోలేదు. సావకాశంగా వచ్చి ” ఏమిటీ, ఇంత రాత్రివేళ పిల్లలని నిద్ర లేపి ఫోన్లు చేస్తున్నారూ…” అంటూ. విషయం చెప్పకపోతే ఇంకా పేద్ద గొడవైపోతే అమ్మో!
నాకొచ్చిన ఫోనూ, ఆ తరువాతొచ్చిన మెసేజీ గొడవంతా చెప్పుకొచ్చాను. మధ్యాన్నం చూసిన ఆ మాయదారి సినిమా నా జీవితంలోకి ఇలా నడిచొచ్చేస్తుందనెవరనుకున్నారూ?

   నాకేమీ తెలియదు మొర్రో అంటే నమ్మదే. నేనేమైనా ఆ సినిమాలో జయసుధ లాటి తల్లిననుకున్నారా ఏమిటీ అంటూ హడావిడి. ఇంక ప్రొద్దుటే, అబ్బాయి ఫోనూ- అసలు మీ మ్యారేజి సర్టిఫికేట్ లేనప్పుడే అనుకున్నాను ( మా పెళ్ళి టైముకి ఈ registrations వగైరా ఉండేవి కాదురా అంటే నమ్మడే) ఇలాటి గొడవేదో ఉండే ఉంటుందీ అని వాడూ. ఇంక అమ్మాయైతే డాడీ ఏమయిందీ రాత్రి గొడవా, నేనే కదా మనింట్లో పెద్దదాన్నీ అంటూ!

   ఇలా అయిపోయిందండి బాబూ నా దయనీయమైన పరిస్థితి! వాడెవడో నాకు ఫోను చేయడం ఎందుకూ, అది చాలదన్నట్లు, ఓ దిక్కుమాలిన మెసేజ్ పెట్టడం ఎందుకూ, హాయిగా వెళ్ళిపోతున్న కాపరాన్ని చెడగొట్టాలని కాకపోతే! ఆ ఫోనూ, మెసేజీ ఇంకా mystery యే !! ఏదో చీకూ చింతా లేకుండా లాగించేస్తున్నాను, మధ్యలో రామాయణం లో పిడకల వేట లాగ, ఇదో గొడవొచ్చి పడింది !!

17 Responses

  1. హహహ…నిజం చెప్పండి, ఆ కాల్ ఎక్కడినుండి వచ్చింది?
    బలే నవ్వించారు! 😀

    Like

  2. హహహ, బలహీన క్షణాలలో ఎవరు మట్టుకు ఇంకేం చేస్తారు లెండి. దహా (దరహాసం)

    Like

  3. call me dad “అంటే నన్ను డాడీ అని పిలు ”
    so congrats for getting a dad

    Like

  4. @అజ్ఞాత,

    ధన్యవాదాలు.

    @సౌమ్యా,

    ఔను అందరికీ నవ్వులాటగానే ఉంటుంది! ఇక్కడేమో నా కాపరం ఏమౌతుందో అని టెన్షనూ !!

    @సుబ్రహ్మణ్యంగారూ,

    మీరు ఆ సినిమా గురించి చెబుతున్నారా లేక నామీదేమైనా “దురభిప్రాయమా” ?

    @మోహన్ గారూ,

    అలా అయితే బాగానే ఉండును! కానీ ఎవరి కన్వీనియెన్స్ ప్రకారం వాళ్ళు ఇంటర్ ప్రెట్ చేసేస్తున్నారు!

    Like

  5. అయ్యో…అదేమిటండి..
    మొత్తానికి ”హతవిధీ” అనేసుకున్నారనమాట….

    Like

  6. ఇది నిజమేనాండి ? హ హ హ

    Like

  7. @ప్రబంధ్,

    రోజులు బాగోలేకపోతే, అలాగే జరుగుతుంది !

    @మాలాకుమార్ గారూ,

    నిఝంగా నిజమే! పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణసంకటం లా ఉంది ! !!

    Like

  8. ఎవరో సరదాకి మిమ్మల్ని ఏడిపించటానికి చేసుంటారు లెండి.

    బలహీన క్షణం — సారీ .. lol అనక తప్పట్లేదు.

    Like

  9. కృష్ణప్రియా,

    అనండమ్మా అనండి. వినేవాడెప్పుడూ లోకువే ఏం చేస్తాం?

    Like

  10. ఇంతకీ ఈ సందేహం తీరిందా?
    మీ మీదే అనుమానాలా? హవ్వ! కలికాలమండీ బాబు
    పైగా అక్కడ పేరడీ టపా పడింది కూడా అప్పుడే చూస్సారా?

    Like

  11. నిజం చెప్పొద్దూ ఆ పారడీ టపా చూసే ఇటు వచ్చాను……
    కానీ మీరు నిజంగా హ హ హ ….నవ్వలేకపొతున్నాండీ..

    Like

  12. హ్వ్హా హ్వా హ్వా .. ఇలాంటిది నాకూ అనుభవమే మాస్టారు. చావుతప్పి కన్ను లొట్ట పోయినంత పనైంది, ఓ రాంగ్‌నంబర్ SMSవల్ల.

    ఏదో భగీరథుడు అడిగాడు కదా అని గంగమ్మకి ఓ స్టాప్ ఇచ్చినందుకు అర్దనారీశ్వరుడైన ఆ శివయ్యకే తప్పలేదు ఇలాంటి నీలాపనిందలు, మామూలు మనుషులం మనమెంత! 🙂

    Like

  13. Very Very Funny !

    Like

  14. nice post and foo funny comments

    Like

  15. @రెహమానూ,
    ఏం చేస్తాను బాబూ?

    @మాడీ,

    నవ్వండి.. మనసారా నవ్వండి….

    @snkr,

    ఏమిటో “రాగ్ నెంబర్” అని తప్పించుకోడం లేదు కదా ?….

    @సుజాతా,

    అందరికీ ఫన్నీగానే ఉంటుంది మరి !!

    @రవితేజా,

    ప్రతీవారూ ఫన్నీ ఫన్నీ అని నా పేరు ఫణిబాబు నుంచి ఫన్నీ బాబుగా మార్చేస్తున్నారు.

    Like

Leave a comment