బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఎవార్డులూ కమామీషూ


   మా చిన్నప్పుడు, చదువు పూర్తిచేసిన తరువాత, ఉన్న ఊళ్ళోనే ఏదో టిచర్ గానో,ఏ తాలుకాఫీసులోనో, పంచాయితీ ఆఫీసులోనో ఉద్యోగంలో చేరిపోయేవారు. ఏదో ప్రొద్దుటే వెళ్ళి, తన పనేదో చూసుకోడం కానీ, వీళ్ళు చేసే పనులకి ఓ శభాసీ ( కాంప్లిమెంటు) పొందడం వగైరా ఉండేవి కావు. ఏదో జీతం ఇస్తున్నామూ, పని చేస్తున్నాడూ అనే కానీ, ఆ చేసే పనిని గుర్తిస్తే, ఇంకా బాగా పని చేయించగలమేమో అనే ఆలోచనా ఉండేది కాదు. టీచర్లకీ, లెక్చరర్లకీ కొద్దిగా మెరుగే. ఏదో వాళ్ళ దగ్గర చదువుకునే పిల్లలైనా చెప్పుకునేవారు- ఫలానా మాస్టారి క్లాసు బావుంటుందిరా. అసలు ఒక్క క్లాసూ మిస్ అవకూడదూ అని. పాపం ఆ మాస్టారు గారు కూడా, ఆమాత్రం పొగడ్తకే ఉబ్బిపోయేవారు. అల్ప సంతోషి! విద్యార్ధులందరూ అలా చెప్పుకోవడంతో, ఆయన కూడా ఇంకా ఉత్సాహంగా చెప్పేవారు. అందుకే అప్పుడు మనకి పాఠాలు చెప్పిన చాలా మంది గురువుల్ని ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటాము. ఏం చెప్పేరని కాదు, ఎలా చెప్పారని. అది జీవితంలో మొట్టమొదట మన చేత అక్షరాలు దిద్దించినాయనైనా సరే, జీవితాంతం గుర్తుపెట్టుకుంటాము.

   కాలక్రమేణా, ప్రతీదీ commercialise అయినట్లే, చదువులూ వ్యాపారంగా మారిపోయాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా corporate స్కూళ్ళూ,కాలేజీలూనూ.ఈ రొజుల్లో ఏం నేర్చుకుంటున్నారనేది కాదు ప్రశ్న, ఆ ఫలానా కాలేజీ/స్కూలు లో ఫీజెంత అని తల్లితండ్రులూ, మనం నెలకి ఎన్ని గంటలు చెప్పాలీ, గంటకెంతా అని పాఠాలు చెప్పే మాస్టర్లూ, ఎందుకంటే, ఈ మాస్టర్లు, గంటకో క్లాసు చొప్పున, రోజుకీ నాలుగైదు స్కూళ్ళల్లో contract పధ్ధతిన పాఠాలు చెప్తారు.సాయంత్రానికి మళ్ళీ తాము స్వయంగా నిర్వహించే కోచింగ్ క్లాసులూ ! ఎవడికి నచ్చినా నచ్చకపోయినా to hell with them, మాస్టారి సంపాదనకేమీ లోటులేదు. ప్రతీ టీచరూ అలా అని కాదు, చాలా మంది మాత్రం ఆ జాతికి చెందినవారే.

   ప్రభుత్వ స్కూళ్ళలో కొద్ది సంవత్సరాలక్రితంనుంచీ ప్రతీ జిల్లాకి ఓ టీచర్ ని సెలెక్ట్ చేసి, టీచర్స్ డే రోజున అవార్డులు ప్రదానం చేయడం మొదలెట్టారు. కొంతలో కొంత, చదువులు చెప్పే గురువులకీ మొత్తానికి ఓ రికగ్నిషన్ దొరుకుతోంది. ప్రభుత్వం వారు చేసే ప్రతీ పనిలోలాగానే, వీటికీ పైరవీలు మొదలయ్యాయి, అది వేరే సంగతనుకోండి.అలాగని అందరూ అలాటివారని కాదూ, పాతిక మందిలోనూ కనీసం ఇద్దరో ముగ్గురో ఆ బాపతు వారుంటారు.

   అయినా చెప్పాలేమిటీ, ప్రభుత్వం వారిచ్చే ఎటువంటి పురస్కారానికైనా,ఎవరో ఒకరి ” అండదండలు” ఉంటేనే కానీ పనవదని. నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు, ప్రతీ సంవత్సరమూ రిపబ్లిక్ డే కీ, స్వాతంత్ర దినోత్సవానికీ ఫాక్టరీ లో ఉన్న వర్కర్లకీ, స్టాఫ్ కీ cash awards, ఆఫీసర్లకి వాచీలూ అవీ ఇచ్చేవారు. ఆ సెలెక్షన్ కూడా గమ్మత్తుగా ఉండేది. మా హెడ్డాఫీసునుండి, ఫలానా ఎమౌంట్ గ్రాంట్ అయి వచ్చేది. ఓ వారం ముందర, ప్రతీ సెక్షన్ నుండీ, ఓ అరడజను పేర్లు పంపేవారు. ఓ కమెటీ లాటిది ఏర్పాటు చేసి, దాంట్లో ఫైసలా చేసేవారు. ఆ ఎవార్డ్ కి ఏదో criteria అనేమీ ఉండేది కాదు. గ్రాంటనేది ఉందీ, అది మురిగిపోకుండా ఖర్చు పెట్టేయాలి, బస్! మన ఎంపిలాడ్స్ ఫండ్స్ లాగన్నమాట. ఖర్మకాలి ఎవరిదైనా పేరుంటే, ఫాక్టరీ లోని ప్రతీ వాడూ, వాళ్ళని ఆటపట్టించేవారు– క్యా మస్కా లగాయా హై యార్! అని! ఆ ఎవార్డులకంత ఫేమ్మూ, పాప్యులారిటీనూ! అదృష్టం ఏమంటే, నా 42 ఏళ్ళ సర్విసులోనూ, అలాటి దురదృష్టం కలగలేదు. ఒకేఒక్క సారి 1997 లో యూనియన్ లీడర్లూ, ఆఫీసర్లూ పట్టుపట్టడంతో, నాకు ఈయవలసివచ్చింది. దానికి నేనేమీ సిగ్గు పడలెదు కారణం, మా ఫాక్టరీకి ఐ.ఎస్.ఓ. రావడంలో నాది ప్రధాన పాత్ర అని అందరూ నమ్మారు.అప్పటికీ మా టీం వారందరికీ, రెండేళ్ళ ముందరే ఇచ్చారు.అనుకుంటూంటాను, ఆ ఒక్క “మచ్చా” కూడా లేకపోతే, ఎంత బాగుండేదో అని!

   ప్రెవేటు ఉద్యోగాల్లో అయితే, చేసే పనికి ఏదో ఒక రికగ్నిషన్ ఉంటుంది. అది ఓ ఎవార్డవొచ్చు, లేకపోతే ఓ incentive అవొచ్చు. ఇప్పుడు చాలా కంపెనీల్లో, Personnel Management, HRD ల ధర్మమా అని, పనిచేసేవారి ప్రతిభకి కూడా గుర్తింపొస్తోంది. అవడం ఇది ఒక టూల్ అవొచ్చు. కానీ చేసిన పనికి గుర్తింపోటుంటేనే కదా, ఇంకా ఉత్సాహంగా చేస్తారూ? మీరందరూ పనిచేసే కంపెనీల్లో, ఎప్పుడైనా మీరు చేసిన పనికి ఓ గుర్తింపు, ఏ అవార్డ్ రూపంలోనైనా వస్తే, ఇంట్లో ఉండే మీ తల్లితండ్రులతో పంచుకోండి. వాళ్ళెంత సంతొషిస్తారో వాళ్ళ కళ్ళల్లో కనిపించే మెరుపు చూస్తే తెలుస్తుంది.అంతే కానీ, ఈమాత్రందానికి టముకేయాలా అని మాత్రం అనుకోవద్దు. ఇలాటివే టానిక్కుల్లాగ పనిచేస్తాయి

Advertisements

2 Responses

  1. ఉపాధ్యాయులకి అవార్డ్ ఇవ్వడం బానే ఉంది కానీ, దాంట్లో ఉన్న ఇబ్బందేంటంటే: ఆ అవార్డ్‌కి ఆ టీచర్లే Apply చేయాల్సి రావడం. బాగా చెప్పే వారెవరూ, తమకి తాము మేం బాగా చెబుతున్నాం అని చెప్పుకోవడానికి ఇష్టపడరు – అయితే ఎక్కడో, ఓ చోట, చుట్టూ ఉన్నవాళ్ళు బలవంతం చేసి Apply చేయిస్తుంటారు. అందుకే ఎంతో బాగా చెప్పగలిగినా కూడా, ఇలాంటి గుర్తింపు చాలా తక్కువ మందికి వస్తోంది.

    Like

  2. మేధా,

    అదీ నిజమే.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: