బాతాఖానీ–లక్ష్మిఫణి కబుర్లు–పనిమనిషి


& nbsp;   ఈ వేళ ప్రొద్దుటే మా స్నేహితుడి ఇంటికి వెళ్ళాము.12 గంటలకి, వెళ్ళి ఓ గంటన్నర కబుర్లు చెప్పుకున్నాము.సాయంత్రాలు వెళ్దామంటే ఏదో ఒక పనీ, ఆ తరువాత ట్.వీ. సీరియళ్ళూ
ఆ తరువాత భోజనం. అస్సలు కుదరడంలేదు.అప్పుడు మా వయస్సులో ఉండే వారి ‘భవ బంధాలు’ గురించి మాట వచ్చింది.

    అన్నిటిలోకీ ముఖ్యమైన భవ బంధం ఏమిటంటే పనిమనిషి. అది ఎప్పుడు వస్తుందో భగవంతుడుకి కూడా తెలియదు.ఎలాగూ వస్తుంది కదా అని, భోజనాలు అయిన తరువాతి గిన్నెలూ వగైరా ఉంచుతారు.ఇల్లు తను వచ్చి తుడుస్తుంది కదా అని వదిలేస్తారు.తను కనుక రాకపోతే ఉంటుంది గొడవ.ఒక రైలు లేట్ గా వస్తే మిగిలిన రైళ్ళన్నీ లేటైనట్లు, అన్నిపనులూ ( వంట వండడం తో సహా)ఆలశ్యం అయిపోతాయి.

    రాజమండ్రీ లో ఉన్న ఏణ్ణర్ధం లోనూ ఆఖరి 3 నెలలూ మాకు పనిమనిషి లెదు.అలాగని మిగిలిన ఏడాదీ మా ఇంటావిడ ఏమీ సుఖపడిపోలేదు.పనిమనిషిని ప్రొద్దుటే పెందరాళే వచ్చేయమని చెప్పడం తో వచ్చాయి బాధలు.మనవైపు ‘వెలుగు’ తొందరగా వచ్చేస్తుంది కదా, అందువలన ఎప్పుడు మెళుకువ వస్తే మా ఇంటికి వచ్చేసేది.బయట చూస్తే వెలుగొచ్చినట్లుగా కనిపించదు, బెల్లు కొట్టేరు కదా అని తలుపు తీస్తే పనిమనిషి. ఆ చీకట్లోనే ఏదో తుడిచేసి వెళ్ళిపోయేది. మా ఇంటావిడకేమో, ఇల్లు ‘అద్దం’ లా ఉండకపోతే కుదరదు.ఇంకో గొడవ ఏమిటంటే ‘అయ్యగారు
( నేనే అని తరువాత తెలిసింది) పొడుక్కున్నారు కదండీ, అని మా రూం తుడిచేది కాదు. ఓ వారం రోజులు ఊరుకుంది, ఇలా కాదని,తనతో పాటు నన్ను కూడా లేపేసేది.రాత్రి ఏదో చదువుకుంటూనో, బ్లాగ్గులు వ్రాసుకుంటూనో చాలా సేపు మెళుకువగా ఉండే వాడిని, తెల్లారకుండా నన్ను లేపేసేది. చదువుకునే రోజుల్లో కూడా ఎప్పుడూ, తెల్లవారుఝామున లేచిన పాపాన్ని పోలేదు.

    సగం బట్టలు మెషీన్ లోనే ఉతికేది,కొన్నింటిని పనిమనిషికి ఇచ్చేది.వాళ్ళేమిటీ, పౌడర్ ని చాలా ఉదారంగా వాడేస్తారు.అలాగే అన్నినూ. వీటికి సాయం ప్రొద్దుటా, మధ్యాన్నం చాయ్ ఒకటి.అది తాగడానికే మా ఇంటికి అంత ప్రొద్దుటే వచ్చేసేదేమో అని నా నమ్మకం.మా ఇంటావిడ ఓ సారి తణుకు వెళ్ళినప్పుడు, నేను ఒఖ్ఖడినే ఉన్నాను, ఆ నాలుగు రోజులూ రాలెదు. వచ్చిన తరువాత అడిగింది ‘ప్రొద్దుటే వచ్చి పాచి చేసి ముగ్గు ఎందుకు వెయ్యలేదూ’ అని ( నన్ను కాదండి బాబూ, పనిమనిషిని). ‘అయ్యగారు వేసేసుకుంటారేమో అని’ ఓ తలతిక్క సమాధానం చెప్పింది.అంతే, ఆ పనిమనిషిని డిస్మిస్స్.

    ఇంకో సంగతి,దసరా కోసారీ, దీపావళి కోసారీ బక్షీసు ఇవ్వాలి. కనీసం ఓ చీరైనా ఇవ్వాలిట, అదీ కాటన్ ది కాదు. వామ్మోయ్ ఎన్ని కండిషన్ లో!తను ఎప్పుడైనా మానేస్తే దబ్బు కట్ చేయకూడదు,టోటల్ బ్లాక్ మెయిల్ !!

4 Responses

  1. మన పనులు మనం చేసుకోలేనప్పుడు పనిమనుషులు తప్పరు గదండీ. గత 12 సంవత్సరాలుగా మా యింట్లో మాతోపాటే ఇద్దరు పని అమ్మాయిలు ( రాత్రీ పగలు కూడా ) ఉంటూఉంటున్నారు. వారిద్దరిలో పెద్దమ్మాయి 12 సంవత్సరాలనుంచీ మా దగ్గరే ఉంటున్నది. ఆ అమ్మాయికిప్పుడు పెండ్లి సంబంధాలు చూసి పెళ్ళిచేయాల్సి ఉంది. అది మా బాధ్యతే. రెండవ అమ్మాయిలు మటుకు చాలా మంది మారుతుంటారు. వారిద్దరితో పాటుగా 3 కుక్కలు కూడా ఉంటే వానిలో అన్నంటికంటే పెద్దది ఓ వారం రోజులక్రితం ఒక్కరోజు సుస్తీచేసి చనిపోయింది. ఓ బాధనుండి మేమింకా తేరుకోనేలేదు.

    Like

  2. పీత కస్టాలు పీతవి అంటారు.

    Like

  3. నరసింహరావు గారూ,

    మీ ఇంట్లో లాగే మాక్కూడా పూణే లో ఒక అమ్మాయి గత 12 సంవత్సరాలుగా పనిచేస్తోంది. అలాటిది రాజమండ్రీ లో ఏణ్ణర్ధం లో ముగ్గురుని మార్చవలసి వచ్చింది. అది మాలో లోపమా, లేక వాళ్ళలోనా అని తెలిసికునే లోపలే రాజమండ్రీ నుండి వచ్చేశాము.ప్రస్తుతం ‘పనిమనిషి’ విషయంలో అంతా బాగానే ఉంది.

    Like

  4. kvrn,

    ఔనండి !!

    Like

Leave a reply to BPhaniBabu Cancel reply