బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-ఒప్పుకోవలసిన నిజాలు


    ట్రైనులో కలిసిన పెద్దాయనతో చెప్పిన కబుర్లలో,ఎన్నెన్నో విషయాలు ఓ కొత్తకోణంలో అర్ధం చేసికోకలిగాము. ఉదాహరణకి కొడుకూ,కోడళ్ళతో జీవించడం గురించి. ఆయన చెప్పిన వాటిలో అతిశయోక్తి ఏమీ ఉన్నట్లు అనిపించలేదు.ఎంతో అనుభవంతో చెప్పిన నిజాలు అవి. కొంతమందికి నచ్చకపోవచ్చు.కొంతమంది అనుకుంటారు’ ఎంత కరెక్టుగా చెప్పారో’అని. మనం ఆలోచించే దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది.కానీ అవన్నీ పచ్చినిజాలు.ఇప్పటి వాళ్ళనే అనఖ్ఖర్లేదు.మనమూ అలాగే చేశాము.ఇంకోళ్ళెవరో పాయింటౌట్ చేసేటప్పటికి ‘ భుజాలు తడుముకుంటాము’.

    పెళ్ళి అయినప్పటినుండీ ప్రతీ కుర్రాడికీ, ఓ మైకం కమ్మేస్తుంది.ప్రతీదానికీ కళ్ళు మూసేసుకుంటాడు.పెళ్ళి అయిన తరువాత, ‘మంచిమనసులు’ సినిమాలోని పాట ‘ కనులు లేవని కలతపడవలదూ, నా కనులు నీకనులు చేసికొని చూడూ’ శిలలపై శిల్పాలు చెక్కినారూ పాటలో ఓ చరణం ఇది.అక్కడ జానకి కి కళ్ళులేవని, నాగేశ్వర్రావు ఈ పాట పాడాడు, ఇక్కడ పెళ్ళి అయిన తరువాత ప్రతీ భార్యా పాడే పాట ఇది.!

    ఏ విషయం తిసికోండి, భార్య సలహా లేనిదే ఏ పనీ అవదు.ఓ ఇల్లు కట్టుకుందామనుకుంటే, అదేమి చిత్రమో అత్తారి ఊరులోనే స్థలాలు కనిపిస్తాయి.నూటికి 50 మందిదాకా అత్తవారి ఊరులోనే ఇల్లు కట్టడమో, కొనడమో చేస్తారు. తల్లితండ్రులున్న ఊరిలో కొందామంటే, వాళ్ళు ఏమైనా ఆక్రమించేస్తారో అని భయం అనండి,లేకపోతే, ఏ కారణం చేతైనా వాళ్ళీ ఇంట్లోకి వస్తే
అద్దె అడగడం బాగోదనండి, ఇంకేదీ కాకపోతే ఇల్లు కట్టేటప్పుడు మామగారితో సంబంధబాంధవ్యాలు ఇంకా మెరుగౌతాయనో, ఏవేవో కారణాలవల్ల అత్తారి ఊరిలో సెటిల్ అయిపోతాడు.

   ఇంట్లో మనవడో,మనవరాలో ఉందనుకోండి,ఇంక అన్నీ గొడవలే ప్రతీదానికీ,అలాగని ఏదో ప్రాణాంతకమనికాదు. పిల్లలు తినే తిండి దగ్గర– కోడలేమో ఆ పుస్తకాలూ, ఈ పుస్తకాలూ, నెట్లూ
చదివి ఏదో ప్రొటీన్లూ,కార్బోహైడ్రేట్లూ అంటూ ఆకులూ, అలమలూ, బ్రెడ్డూ,బటరూ, కార్న్ ఫ్లేక్సూ, పాలూ,పాపాలూ అంటూ పిల్లల ప్రాణాలు తీసేస్తుంది. అవన్నీ డెఫినెట్ గా ఆరోగ్యకరమైనవే కాదనం, వాళ్ళు అవన్నీ తింటూంటే ఈ పెద్దాళ్ళు కూరలూ,పచ్చళ్ళూ,ఊరగాయలూ వేసికుని తింటే ఎలా? మార్కెట్ కి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని కూరగాయలు అసలు తీసికునే రారు, కూరలే లేకపోతే గొడవే లేదు.ఎప్పుడైనా సరదా పడి ఆ పిల్లలకి ఏదైనా పెట్టామా,ఇంక చూసుకోండి ‘ మావయ్యగారూ, పిల్లలకి లేనిపోని అలవాట్లు చేయకండి, అసలే వాడు వీక్కూ, దానికి సాయం మీతో ఊరగాయా అవీ తింటే వాడికి కండెప్పుడు పడుతుందీ’అంటుంది. ఈయననుకుంటాడూ, ఒక్కరోజు ఊరగాయ తింటే వచ్చిన నష్టం ఏమిటంట? ఏరా అబ్బాయీ, ఇదేనా పధ్ధతీ పెద్దాళ్ళతో మాట్లాడడం అని మీ ఆవిడకోసారి చెప్పు అంటాడీపెద్దాయన.

    స్కూలికి వెళ్ళే పిల్లలుంటే ప్రతీ రోజూ వాళ్ళ దినసరి కార్యక్రమాలు చూసి ఈ పెద్దాళ్ళకి గుండె చెరువైపోతూంటుంది.స్కూలూ, ట్యూషన్లూ, మ్యూజిక్ క్లాసులూ, డ్రాయింగు క్లాసులూ,ఇంకో క్లాసులూ. రోజు రోజంతా ఇవన్నీ అవసరమా అని ఈ పెద్దాయన అన్నాడనుకోండి, ఆ కోడలంటుందీ ‘ ఈ రోజుల్లో ఆల్ రౌండ్ డెవెలప్మెంటుకి ఇవన్నీ కావాలీ, మీ రోజుల్లోలా కాదుగా’అని.
ఇదివరకటి రోజుల్లోలాగ ఏదో మామగారంటే భయం,భక్తీ ఉండాలనడం లెదు, మరీ చిన్న పిల్లలెదురుగుండా క్లాసు తీసికోవలసిన అవసరం లేదుకదా అనుకుంటాడీ పెద్దాయన. ఇంత గొడవౌతున్నా
ఈయనగారి కొడుకు ( భార్య కనులే తన కనులుగా చేసికొని లోకాన్ని చూస్తున్న హీరో), ఏమీ పట్టనట్టుగా హాయిగా తన రూంలోకి వెళ్ళి ఏదో పేద్ద పనున్నట్లు, ల్యాప్టాప్ ఓపెన్ చేసేసికుని
కూర్చుంటాడు.
ప్రాణానికి హాయి. వాళ్ళమానాన్ని వాళ్ళే కొట్టుకుంటారు,ఓపికున్నంతసేపూ అనుకుంటాడు, తనేమైనా ఆర్చేవాడా తీర్చేవాడా?

    ఇంట్లో ఉన్న చిన్నపిల్లల్ని ఏమీ అనకూడదు. వాళ్ళేం చేసినా నోరుమూసుకిని కూర్చోవాల్సిందే. హాల్లో బాల్ తో ఆడితే, ఏ టి.వీ మీద పడుతుందో అని ఈ పెద్దాయనకి భయం, పోనీ వద్దురా అని చెప్తే ఆ పిల్లాడెలాగూ వినడు, పైగా కోడలికి కోపం వస్తుంది.వాయిస్ పెంచితే తప్పు,ఏక్ దం లో డెసిబుల్ లోనే చెప్పాలి, అంత ఓపికెక్కడిదీ ఈయనకి.వీళ్ళిద్దరి బి.పీ పెరిగిపోతుంది.ఈ పిల్లలు మెళుకువగా ఉన్నంతసేపూ, టి.వీ లో పిల్లలకి నచ్చిందితప్ప ఇంకే కార్యక్రమమూ చూడకూడదు. ఇంట్లో ఎన్ని టి.వీ లున్నాసరే ,కారణం ఈ పిల్లలు కూడా తాతయ్యలూ, నానమ్మలూ చూసే టి.వీ దగ్గరకే వచ్చి ఒళ్ళో కూర్చుంటారు! రోజంతా టి.వీ చూస్తూనే ఉంటారుకదా, పోనీ పిల్లలు ఇంటికి వచ్చేక, వాళ్ళకి కావలిసిందేదో చూడనివ్వక ఊరికే గొడవా అని విసుక్కుంటారు.

    ఇవి కాకుండా ఈ మధ్యన ప్రతీవాళ్ళూ తమ పిల్లలకి, ఐపాడ్లూ అవీ విచ్చలవిడిగా ఇచ్చేస్తున్నారు. ఆ పిల్లా/పిల్లాడి వయస్సు ఎంతైనా సరే. దీనితో ఏమౌతోందంటే, ఇవన్నీ రాకముందు పిల్లలు, ఏ పుస్తకమో, బుక్కో చదువుకునే వారు, ఇప్పుడు ఈ ఐపాడ్లు వచ్చినతరువాత, ఆ అలవాట్లు అన్నీ పోయాయి.ఐపాడ్డే లోకమైపోయింది.పొనీ ఇంకో రెండుమూడేళ్ళు పోయిన తరువాత ఇవ్వవలిసిందేమో అని ఈ పెద్దాయన అనగానే, ‘ మావయ్యగారూ, మీకేం తెలియదు, దీని ఫ్రెండ్సందరిదగ్గరా లేటెస్ట్ గాడ్జెట్స్ ఉన్నాయీ, దీనిదగ్గర లేకపోతే చిన్నబుచ్చుకుంటుంది’
ఇంకొన్ని ఇంకోరోజు…
..

7 Responses

  1. Phani Sir,
    Actually I dont totally agree with whatever you said about sons and daughter-in-laws. I really wonder why dont parents think from their kids side. Like you brought up your children as per you wishes, you dint have you parents to interfere during that process. So you dont know how it will be like. And now you are feeling bad for not letting to interfere in your grand-children upbringing. You cant blame your son or daughter-in-law. They have their own wishes. Its always better everyone to have their own space and not to interfere in others even if its sons ,daughters or grand kids.

    -Sneha

    Like

  2. మీకు నాణేనికి ఇంకో వైపు చూపించనా?
    ఒకరి ఇంట్లో టి.వి లేదు వాళ్ళు వాళ్ళ పిల్లలు ఎప్పుడూ ఆడుతూ, పుస్తకాలు, పురాణాలు, భాగవతాలు చదువుతూ కాలక్షేపం చేస్తుంటారు. పిల్లల నాన్నమ్మ, తాతయ్యలకు ఇది నచ్చదు. వాళ్ళకు పిల్లలు కథలు, శ్లోకాలు, భాగవత పద్యాలు చెప్పడం కంటే టి.వి సీరియల్లు చూస్తూ ఆరిందామాటలు మాట్లాడడం నచ్చుతుంది. పిల్లలు బయటికి వెళ్ళి బురదలో, ఇసుకలో ఆడడం నచ్చదు. ఇప్పుడేమటారు. నాణేనికి రేండు వైపులు వుంటాయి ఒకవైపు మాత్రమే చూసి ఎలా నిర్ణయిస్తాము చెప్పండి. పైన స్నేహ నేను కాదు.

    Like

  3. రెండో స్నేహ గారు,
    ఈ పరిస్థితి మీ ఇంట్లోదే అనుకుంటా! మీకెపుడూ నాణానికి రెండోవైపు అంటూ విపరీత ఆలోచనలను జనంలోకి వదలటం అలవాటేగా!

    Like

  4. కొడుకు ఇంట్లో ఉంటూ, కొడుకూ కోడలూ సంపాదిస్తే తింటూ, కొడుకూ కోడళ్ళని ఈసడించుకునేవారు కూడా ఉన్నారండీ! వారికి పెత్తనం కావాలి, కొడుకూ కోడలూ ఏ పని చేసినా నచ్చదు, మీకు అస్సలు ఏమి తెలుసు అని అంటారు. అన్నీ అని, అయినా మాకెందుకులే… మీ ఇల్లూ మీ ఇష్టం అంటారు. సరే – వినీ వినీ విసుగెత్తి, కొడుకైనా, కోడలైనా ఏమైనా మాట్లాడారంటే, ఇక ఆ రోజు యుధ్ధమే. మమ్మల్ని ఇంట్లోంచీ వెళ్ళగొట్టాలని చూస్తున్నారు, మేము ఉండడం ఇష్టం లేకపోతే చెప్పండి, మాదారిన మేము పోతాం (అలా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తే ఎదుటివారు ఏమీ మాట్లాడలేరని వీరి ధీమా) సర్దుకుపోని వారు అత్తమామలైనా కావచ్చు, కొడుకూ కోడళ్ళైనా కావచ్చు. ఇంటింటికో కధ !! పెద్దవారు అయినంత మాత్రాన సరిపోదు. పెద్దరికం పేరు తో పెత్తనం చెలాయించాలని చూసే వారు చాలామందే ఉన్నారండీ. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవడం మానేస్తే ఆ ఇల్లు బాగుంటుంది. నాణానికి ఒకే వైపు మీరు అలోచిస్తే అలాగే అనిపిస్తుంది … లక్షలకి లక్షలు సంపాదిస్తూ కూడా, అత్త మామల చేతిలో బాధలు పడే కోడళ్ళ కధలూ చాలా ఉన్నాయి. ఎవ్వరికైనా సర్దుబాటు ముఖ్యం అనేది మీరు చెపితే బాగుంటుందేమో.

    Like

  5. బాబాయి గారు!
    నేను విరజాజి గారితో ఏకీభవిస్తాను. దానికి ఉదాహరణ మా ఇల్లే. మా మామగారు నన్ను గుప్పెట్లొ పెత్తుకోవాలని ప్రయత్నించి ప్రయత్నించి విఫలమయి మాతొ మాట్లాడ్డం మనేసారు.
    పోనీ ఇంట్లొ పై వాటా లొ ఉండనిస్తురా అంటె అదీ లేదు. యెదిగే చంటివాడు, మేమిద్దరం, (వంట గది కాక ఉన్న మూడు గదుల్లోనూ)ఒక గదిలో మా పెరిగే సామానుతొ సర్దుకుపొవాలిట.
    పిల్లాడికి దగ్గుగా ఉన్నప్పుడే “ఐస్ క్రీం” లెదా “మాజా”, దెబ్బ తగిలితే దెబ్బమీద “బెటడైన్” కాదు “వేసెలిన్” రాస్తారు. వొళ్ళుకాలిపొయే జ్వరం తగిలితె “ఏమీ లెదు నాన్నా, నీకు జ్వరం యెంటి, నువ్వు ‘కింగ్’వి” అని లేని పోనివి చెప్పడం, వాడు తాత చెప్పిందల్లా నిజం అనుకుని, తడిగుడ్డ పెట్టి ఒళ్ళు తుడవనీయకపోవడం…తలుచుకుంటే చిర్రెత్తుకొస్తుంది.
    ఈ శెతాబ్దంలో కూడా, నా లాంటి చదువుకుని, ఉద్యోగం చెస్కుంటూ, ఇంట్లొ పనమ్మాయి కి వేల జీతం పొసే రొజుల్లో ఇంటెడు పనీ చెసే నాలాంటి దాన్ని కూడా సాధిద్దామని చూసే నా మామగారి లాంటి వాళ్ళు కూడా ఉంటారు.
    అన్ని వేళ్ళూ ఒక్కలా ఎలా ఉండవో, అలానే అన్ని కుటుంబ పరిస్థితులూ ఒక్కలా ఉండవు. ఎవరికీ అడ్డు రాకుండా, ఎదురు సమాధానం చెప్పకుండా, నా రొజులు నేను వెళ్ళబుచ్చినా గిట్టదు. అసలు మాతో కలవదు అని చుట్టాలకి, పక్కాలకీ యాగీ. చేసిన చాకిరీ అంతా ఒక్క మాటతొ తీసిపడేస్తారు.
    మరి భర్త విషయానికొస్తే తన త్.వ్ ఉంటే ఇహ క-వి ఐపోతారు…అంటే ఇంకేమి కనబడవు వినబడవు అన్నమాట…:)
    అందుకని చెప్పదేమిటంటే, ఇంటింటికో రామాయణం. ఏదీ generalise చెయ్యలేము.

    Like

  6. Sneha,
    Please go through Part 2 of my Blog. I fully endorse your views. Let me know your viewpoint on the totality of my Blog.

    God Bless you.

    Like

  7. స్నేహా2, విరజాజీ, ఏరిఎన్,

    నేను వ్రాసిన మొదటి భాగం మాత్రమే చదివి, నన్ను అందరూ ఏకేశారు!చేసిన తప్పేమిటంటే మొదటి భాగం అని వ్రాయకపోవడం.ఒక విషయం మీఅందరితోనూ పంచుకోవాలనుకుంటున్నాను.
    మేమూ, మా అమ్మాయి,అబ్బాయీ కూడా పూణే లోనే ఉంటున్నాము( ఎవరి స్పేస్ లో వాళ్ళు.)వారాంతంలో వాళ్ళు మా దగ్గర స్పెండు చేస్తూంటారు. మేము వారిదగ్గర ఎప్పుడు కావలిస్తే అప్పుడు. వాళ్ళకేమైనా అవసరం వచ్చినప్పుడు,మకాం వాళ్ళదగ్గర.లేదూ, మా కాలక్షేపమేదో మాది.
    God has blessed us with Best of both worlds.

    Like

Leave a comment