బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు… అయోమయం..అధ్వాన్నమూ

 మన దేశంలో ఎలా ఉంటుందంటే పరిస్థితీ… “ తాంబూలాలిచ్చేసాం..కొట్టుకు చావండి..” అన్నట్టు.. ఏ విషయం తీసుకున్నా సరే..అవి రాష్త్ర విభజనలనండి, ఎన్నికలనండి, లాక్ డౌన్ నిబంధనలనండి, ప్రెవేటైజేషన్ అనండి.. ఓ ప్రకటన చేసేయడం.. ఎవరైనా పట్టించుకున్నాసరే, పట్టించుకోకపోయినా సరే… మా పని అయిపోయింది.. ఏం చేసినా మీ ఇష్టం..తెలుగురాష్ట్రాల విభజన సమయంలో అదేదో “ ప్రత్యేక హోదా” అన్నారు.. అదేమిటో అసలు ఎవరికీ తెలియదు.. ప్రస్తుత అధికారపార్టీ వారు కుండబద్దలుకొట్టి చెప్పారు.. ప్రత్యేకహోదా లేదూ..సింగినాదమూ లేదూ.. అదేదో స్పెషల్ పాకేజీ ఇస్తాం కావల్సొస్తే తీసుకోండి, లేకపోతే మీ దిక్కున్న చోట చెప్పుకోండీ..అని.. ఆరోజుల్లో,  ముఖ్యమంత్రిగారు ఆ పాకేజికే తలూపారన్నారు..ఆ తరవాత అదేదో మాటామాటా వచ్చి, ఉమ్మడికుటుంబం విడిపోయి, వేరు వేరు కుంపట్లొచ్చేసాయి.. విభజన జరిగింది 2014 లో, అయినా ఇప్పటికీ ప్రతీ ఎన్నికలప్రచారంలోనూ ఈ so called  ప్రత్యేకహోదా ప్రస్తావనమాత్రం ఉంటుంది.. పోనిద్దురూ ఏదో ఓ కాలక్షేపం ఉండాలిగా మన నాయకులకి..ప్రజలకి ఒరిగేదిమాత్రం ఏమీ ఉండదు..

 అవన్నీ ఓ  ఎత్తైతే.. కరోనా వాక్సీన్ గురించి, సాధ్యమైనంత గందరగోళం సృష్టించడం మనవాళ్ళకే చెల్లింది..ప్రపంచం మొత్తానికి ఏవేవో వాక్సీన్లు తయారుచేసారు కరోనా మహమ్మారికి.. ఏవేవో కారణాలు చెప్పి , మొత్తానికి రెండంటే రెండే వాక్సీన్లు …ఒకటి పుణె లో తయారయిందీ  ( Covishield),  రెండోది హైదరాబాదు ది  Covaccine .. శుభం..  March 1  నుండి, 60+ వాళ్ళని  మొదటి డోసు తీసుకోమనీ, రెండో డోసు 28 రోజుల తరవాత తీసుకుంటే చాలన్నారు.. ఏదో మొత్తానికి కొందరు తీసుకునీ, మరికొందరు తీసుకోకుండానూ కానిచ్చేసారు.. ఈ లోపులో మళ్ళీ  Second Wave  వచ్చి, కంగారు పెట్టేస్తోంది.. మొదటి డోసు తీసుకున్నప్పుడు చెప్పారూ.. 28 రోజులకి, వాళ్ళే పిలిచి  మీకు రెండో డోసు ఇచ్చేస్తారన్నారు.. బావుందనుకుని కూర్చున్నారందరూ..జనాలెక్కడ సుఖపడిపోతున్నారో అనుకుని, మధ్యలో మరో వార్త..28 రోజుల తరవాత కాదూ.. 8-12 వారాలైతే మరింత బావుంటుందిటా అన్నారు..పైగా ఈ విషయం  Covishield  కి మాత్రమేనట.. ఆ రెండోదుందే దానికి మాత్రం 28 రోజులకే రెండో డోసుట..పైగా వీటి గురించి..  Seventh Paycommission Pay Matrix  లాగ ఓ  Table  కూడా రిలీజు చేసారు..

ఇదిలా ఉండగా,  తెలుగురాష్ట్రాల్లో , మొదట్లో పుణె వాక్సిన్ అంత  Safe  కాదనుకున్నవారు కూడా, ఏదో కారణాలవలన, ఈ  Covishield  కే సెటిలయారు..మధ్యలో ప్రభుత్వం రిలీజు చేసిన  Table  తమకు వర్తించదనుకున్నారో ఏమో.. మొదటి డోసు  Covieshield  తీసుకున్నవారు కూడా లక్షణంగా రెండో డోసు తీసుకున్నారు..మరి తెలుగురాష్ట్రాల్లో ఆసుపత్రులకీ, డాక్టర్లకీ ఈ విషయం తెలియదనుకోవాలా, లేక ‘పోనిద్దూ ప్రభుత్వాలు ఏవేవో చెప్తాయి.. ప్రతీదీ పట్టించుకుంటూ పోతే ఎలా…” అనుకున్నారా? ఏమో ఆ భగవంతుడికే తెలియాలి.

 పోనీ ఏదో తెలిసిన చాలామంది Covieshield రెండో డోసు తీసేసుకున్నారూ, పోనీ మేము మొదటి డోసు తీసుకుని 28 రోజులయిందికదా అని, ఇవేళ్టికి రెండో డోసు కి  Appointment fix  చేసుకుని,ఓసారి confirm,  చేసుకుందామని, హాస్పిటల్ కి ఫోను చేస్తే..  unequivivocal  గా చెప్పారు.. “ మీరు మొదటి డోసు కోవి షీల్డ్ అయుంటే,  please reschedule your appointment for a slot , after 45 Days or more”..  రావడం అనవసరం, మీకు ఇవ్వరూ కోవిషీల్డ్ రెండో డోసూ 45 రోజులలోపు.. అని స్పష్టంగా చెప్పారు..ఇప్పుడు ఏమనుకోవాలీ.. తెలుగురాష్ట్రాల్లో  ఆసుపత్రులు కరెక్టా, లేక ఇక్కడ పుణె లో ఆసుపత్రులు కరెక్టా?

అందుకే అన్నాను అయోమయం అధ్వాన్నామూ అని..విషయం మరింత గందరగోళం కావాలనేమో.. కోవిషీల్డ్ తయారుచేసే కంపెనీ వాళ్ళు ఏవేవో లెక్కలు చెప్పి, రెండు డోసులమధ్యా రెండు మూడు నెలల , విరామం ఉంటే వ్యాధినిరోధక శక్తి ఎక్కువవుతుందని శలవిచ్చారు.. ఏమిటో .ఎవరిమాట వినాలో తెలియదు…. తీరా రెండోది తీసుకునేదాకా ఉంటామో ఊడుతామో తెలియదు.. ఇదండీ ” మేరా భారత్ మహాన్ “