బాతాఖాని- లక్ష్మి ఫణి కబుర్లు–Over cautious…

 చాలామంది, అవసరం కంటే మరీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూంటారు.  చిన్నప్పుడైతే మరీనూ.. ప్రతీదానికీ ఆంక్షలే…. ఫలానావాడితో స్నేహం చేయొద్దూ, ఫలానాది ఏమైనా తినకూడదూ, సాయంత్రాలు దీపాలు పెట్టేవేళకి  ఇంటికి చేరుకోవాలీ,  పెద్దవారు మాట్టాడుకుంటూంటే , వినకూడదూ, అధవా ఉన్నా, మధ్యలో మాటాడకూడదూ.. సినిమాకి ఒంటరిగా వెళ్ళకూడదూ, ఫలానా పత్రికలూ, పుస్తకాలూ చదవకూడదూ… ఇలా చెప్పుకుంటూ పోతే సవాలక్ష ఉంటాయి… దేనికీ కారణం అడక్కూడదూ.. ” ఇంద్రియ నిగ్రహం ”  at its best..

     శీతాకాలం వచ్చేసరికి, అవసరం ఉన్నా లేకపోయినా ఓ ” మంకీ టోపీ ”  స్వెట్టరూ అయితే  compulsory.  వర్షాకాలం అయితే అడగక్కర్లేదు… వేసవి కాలం , ఎండలో బయట తిరక్కూడదూ ..almost  curfew  యే అనుకోండి… రావణాసురుడు యుధ్ధభూమిలో చావు బతుకుల్లో ఉన్నప్పుడు, మండోదరి తన భర్తని ఆఖరిసారి చూడ్డానికి వచ్చి, అతనితో అందిట.. ”  నీ చావుకి అసలు కారణం రామచంద్రమూర్తి కాదూ, నీ ఇంద్రియాలని నిగ్రహించుకోలేకపోయావూ, శివుడి గురించి తపస్సు చేసుకుంటూ, నీ ఇంద్రియాలని కట్టిపారేశావూ, ” రావణ బ్రహ్మ” గా  పేరు తెచ్చుకున్నావూ, సింహాసనం అధిష్టించిన తరువాత, ఇన్నాళ్ళూ కట్టిపారేసిన ఇంద్రియాలు కట్టువిప్పేసికున్నాయీ, నీ చావు నువ్వే తెచ్చుకున్నావూ,  etc.. etc..   అనిచెప్పినట్టు, శ్రీ చాగంటి వారి ప్రవచనాల్లో చెప్తూంటారు..

సరీగ్గా అదే ” డ్రగ్స్ ” విషయంలో వర్తిస్తుంది. డ్రగ్స్ అనే అనడం ఎందుకు లెండి, స్త్రీలమీద అత్యాచారాలనండి, టెర్రరిజం, అన్నిరకాల  Negative Vibes  అన్నిటికీ మూలకారణం , చిన్నప్పుడు చేయలేనివీ , ఎలాగైనా చేసితీరాలన్న కోరికలు పురివిప్పుకుంటాయి… 18 ఏళ్ళొచ్చేసరికి , అమ్మాయైనా, అబ్బాయైనా పైచదువులకి, చాలా సందర్భాల్లో పొరుగూరికి వెళ్ళాలే కదా.. అక్కడ అడిగేవాడెవడూ ఉండడాయె, ఏ కొద్ది కాంపస్సుల్లో తప్ప…పిల్లలందరూ అలా ఉంటారని కాదు, కనీసం 10% మాత్రం ఆ కోవకే చెందుతారనడంలో సందేహం లేదు. అంతా ఇష్టారాజ్యం.. పిల్లల్నే అనడం ఎందుకులెండి,   రాజకీయ నాయకుల పుణ్యమానీ, వాతావరణం కూడా అలాగే తగలడింది…  వీళ్ళకి సాయం సినిమాల్లో నటించే వాళ్ళొకళ్ళూ..  అందరూ కాకపోయినా,  వాళ్ళల్లో ఓ పదిశాతం  ఇలాటివాళ్ళే. దురదృష్టవశాత్తూ , ఈ పదిశాతం శాల్తీలే మనకి  so called role models..  సిరి అబ్బదు కానీ చీడ మాత్రం ఠంచనుగా  తగులుకుంటుంది.. చిన్నప్పుడు పిల్లల్ని అదుపులో పెట్టొద్దని కాదు.. పెట్టితీరాలే..  no doubt..  కానీ మరీ ” అతి ” గా పెడితే, కంట్రోలు ఉన్నంతకాలమూ ఊరుకుని,  ఆ సంకెళ్ళలోనుండి బయట పడ్డమేమిటి, ” అచ్చోసిన ఆంబోతులుగా తయారవుతారు..

  Over protection  సందర్భం ఇంకోటుంది…సాధారణంగా, ఓ వయసు దాటిన తరువాత చెకప్ కి ఏదో ఓ డాక్టరు దగ్గరకి వెళ్ళాల్సొస్తుంది. నానారకాల పరీక్షలూ చేసి, అప్పటిదాకా మనలో కనిపించని ఏవేవో రోగాలున్నాయంటాడు ఆ డాక్టరుగారు… మరీ ప్రాణాంతకాలు కాకపోయినా, తగు జాగ్రత్తలు తీసుకోమంటాడాయన…  ఎవరుమాత్రం అశ్రధ్ధగా ఉంటారూ? బతుకంటే తీపేగా ఎవరికైనా? అదేదో  American Standards  ప్రకారం,  Sugar levels  అవసరమైన దానికంటే ఎక్కువని తేలుస్తాడు. అప్పటినుండీ మన బతుకు మనచేతులో ఉండదు. ఊరికి ముందర పంచదార వాడకం బంధ్. ఇన్ని సంవత్సరాలూ మధురాతిమధురంలో తేలియాడిన జీవితం, ఇంక చేదుమయం అయిపోతుంది. కాఫీ అవనీండి, చాయ్ అవనీయండి, మందులా తాగడమే. అసలు ఇఛ్ఛ అనేది చచ్చిపోతుంది… ఆ సుగర్ కాకుండా, ఏ గుండె కో వచ్చిందనుకోండి, పరిస్థితి ఇంకా దుర్భరమైపోతుంది.  ఏం చేద్దామన్నా, పక్కనే ఇంటి ఇల్లాలు, ” ఆ పని చేయకండీ.. ఈ పని చేయకండీ.. అసలే అనారోగ్యం కూడానూ.. ” అనడం. పాపం వాళ్ళు మాత్రం, మన ఆరోగ్యం గురించే కదా జాగ్రత్తలు తీసుకుంటూంటా.. అయినా అవసరానికి మించిన జాగ్రత్తేమో అనిపిస్తూంటుంది… నాకు తెలిసిన ఒకటి రెండు కేసుల్లో, వారి భార్యలు తీసుకునే ” అతి జాగ్రత్త ” ల వలనే, అధ్వంతరంగా పోయారనిపిస్తుంది. ఒకాయనకి గుండె కి సంబంధించిన కేసు– ఆపరేషనవడమేమిటి, ఆ ఇల్లాలూ, వారి అక్కగారూ, పథ్యం పేరుచెప్పి ఆయన్ని ఎండపెట్టేసారు. ఇంకో పదేళ్ళు బతకాల్సిన పెద్దమనిషి కాస్తా, మూడేళ్ళకే వెళ్ళిపోయారు.  ఏదైనా అనారోగ్యం ఉందంటే చాలు, ప్రతీవాడూ సలహాలు చెప్పేవాడే. ఫలానాది తినొచ్చూ అని ఒకరంటే, ఇంకోళ్ళు ససేమిరా వద్దూ అంటాడు. ఇవేవీ సరిపోనట్టు అంతర్జాలం లోని గూగులమ్మని అడగడం.. 

 Too many cooks spoil..  అన్నట్టుగా , ఈ అతిజాగ్రత్తలు ఒక్కోప్పుడు  boomerang అయి అసలు ప్రాణానికే ముప్పొస్తుంది.

%d bloggers like this: