గత యాభై ఏళ్ళగా, మెడ్రాస్ లో రుచిమరిగిన BRU Instant Coffee కే అలవాటు పడిపోయాము. మిగిలినవి బాగోవని కాదు… ఎవరి taste వారిదీ.. మొదట్లో బయట మార్కెట్ లో కొనేవాడిని, ఆ తరవాత మా CSD Canteen లో దొరికేది, పైగా బయటకంటే చవకలో… ఓసారెప్పుడో, ఓ కొట్టతను అడిగాడు..’ మీకు కావాల్సిన BRU, మీ కాంటీన్ ధరకంటే తక్కువకి ఇస్తానూ… కొంటారా రెగ్యులర్ గానూ..’ అని అడిగాడు. చూపించమంటే చూపించాడు.. HUL వారి దే.. Tripti Blended అని ఏక్ దం బ్రూ కాఫీయే.. సగానికి సగం రేటులో దొరికేది.. విషయమేమిటంటే, 200 gms Packets 5 ఉంటాయి, పేద్ద carton లో, వాటిని విడిగా అమ్మేవాడు.. వాడెలా అమ్మితే మనకేమిటీ..మనక్కావల్సినదేదో దొరుకుతోంది..అదే బ్రాండ్ అదే కాఫీ.. కొద్దిగా పేరు తేడా.. మా రాజమండ్రీ కాపరం లో కూడా, మొదట్లో దొరికేది కాదు..కిరాణా కొట్టువాడితో చెప్తే.. HUL agent ద్వారా తెప్పించి ఇచ్చేవాడు.. ఆ రోజుల్లో Amazon లో 1 కిలో Packet ( Five Sachets of 200 gms) దొరికితే, మా చుట్టాలకి తెప్పించాను కూడా..అదంతా పూర్వ కథ…
ఈ కరోనా ధర్మమా అని, ఇంటి బయటకి 2020 మార్చ్ తరవాత అడుగు బయటకు పెట్టలేదు..ఏదో మొదట్లో, సరుకులు తెప్పించుకోడానికి శ్రమ అనిపించినా, క్రమక్రమంగా ,అలవాటయిపోయింది. ఈ రెండేళ్ళలోనూ అనుభవం తో పాటు జ్ఞానోదయం కూడా అయింది. సాధారణంగా Amazon లో, చాలామట్టుకు సరుకులు దొరుకుతూంటాయి..పైగా మనం ఆర్డర్ చేసిన సరుకు ఏ కారణం చేతైనా ,నచ్చకపోయినా, నప్పకపోయినా, వెంటనే తిరిగి తీసుకునే సౌలభ్యం కూడా ఉండడం తో, నామట్టుకు నేను, చాలా సరుకులు , అక్కణ్ణించే తెప్పించుకునే వాడిని. పైగా free delivery అనడంతో, నిజమే కాబోసు… మనమంటే ఎంత అభిమానమో.. అనుకునేవాడిని.. ఓ ఐటం విషయంలో మాత్రం అది కాదని తేలింది.
ప్రస్తుతానికి వస్తే, 2020 లో కరోనా వచ్చాక బయటకి వెళ్ళకపోవడంతో, Amazon వాడే దిక్కయాడు..200Gms Packet కి 365 చొప్పున వసూలు చేసేవాడు గత రెండేళ్ళగా.. పైగా Free Shipping అనోటీ..మరో option లేక అలాగే కానిచ్చేసేవాడిని. ఈ మధ్య ఓరోజున, నాకు ఇదివరకు అదే Bru ఇచ్చే కొట్టతనికి ఫోన్ చేసి అడిగాను.. ఇంకా ఇదివరకటిలాగ దొరుకుతోందా, రేటెంతా అని..రేటెంతో చెప్పగానే, గత రెండున్నరేళ్ళుగా నేను ఎంత బుధ్ధితక్కువ పని చేసేనో తెలిసింది. Amazon వాడు అమ్మిన 365/- రూపాయల 200 Gms Sachet, అక్షరాలా 150/- రూపాయలన్నాడు.. పోనీ ఏ ఆటోలోనో వెళ్ళి ఓ రెండు మూడు పాకెట్లు కొన్నా, కిట్టుబాటవుతుందీ అనుకుంటే, ఊబర్ ఆటో కి రానూపోనూ 250 దాకా పెడితే, మొత్తం తడిపి మోపెడవుతుంది. పోనీ ఏ DUNZO వాడిని అడిగితే వాడు 150/- Charges for pick up and delivery అన్నాడు. ఇవన్నీ ఆ కొట్టతనికి ఫోన్ చేసి చెప్పాను ( తెలిసినవాడేలెండి)..నా Address తీసుకుని, రెండు పాకెట్లు ( రెండూ కలిపి 300/-) + కొరియర్ ఛార్జెస్ 80. అంతాకలిపి 380 లో రెండు పాకెట్లు దొరికాయి.
అప్పుడు తెలిసింది.. మన e commerce కంపెనీలు, ఎలా దోచేస్తున్నారో?
అలాగే హైదరాబాద్ నుండి ఓ ఐటం తెప్పించడానికి ఓ కొరియర్ కంపెనీ వాడు.. 190/- రూపాయలు ఛార్జ్ చేసాడు.. ప్రొఫెషనల్ కొరియర్స్ వాడు. హైదరాబాదు నుంచి పుణె సరుకు deliver చేయడానికి 10 రోజులు. నడిచొచ్చినా 10 రోజులు పట్టదు.
అదేవిటో, మొదటినుండీ నేను షేవింగ్ చేసుకునేటప్పుడు, Godrej వారి shaving round వాడడమే అలవాటు..ఆ క్రీమ్ములూ వగైరా వాడను. కరోనా పూర్వం బయట కొట్టుకి వెళ్ళి కొనుక్కునేవాడిని..ఖరీదు 22/- రూపాయలు.. ఓ నాలుగైదు నెలలు వస్తుంది. కరోనా టైములో, బయటకి వెళ్ళే అవకాశం లేక, ఈ ఎమజాన్ లో తెప్పించుకుంటే, 44+ Shipping 50/- మొత్తం 94 అయింది. మరోసారి తెప్పించే ఆలోచన వచ్చి, ఓసారి మా కాంప్లెక్స్ లో ఉండే కిరాణా కొట్టులో అడిగితే, రెండు రౌండులు కలిపి 44/- లో దొరికాయి.
చెప్పొచ్చేదేమిటంటే, మన e-commerce వాళ్ళు చెప్పుకునేటంత ఉదారస్వభావులు మాత్రం కారు.. ఈ మధ్యన జొమాటో, స్విగ్గీ వాళ్ళైతే , ఏవేవో ఛార్జీలతో కలిపి, తీసుకునే సరుక్కి మూడింతలు వదులుతోంది..

Filed under: Uncategorized |
ఏ వ్యాపారస్తుడు లాభం లేకుండా ఏ బిజినెస్ చేయడు. మనకి కాలు బయటికి పెట్టక్కరలేకుండా శ్రమ లేని వ్యవహారం. ఉభయతారకం.
LikeLike
రాధారావు గారూ,
మీరన్నది ఒక రకంగా రైటే..అలాగని వస్తువు ఖరీదు మరీ రెండింతలవుతోందని తెలిసాక కూడా, కంటిన్యూ చేయడం మంచి పనంటారా? బహుశా, డబ్బంటే లెక్కలేని యువతరం చేయగలరేమో.. మరో విషయం..ప్రయత్నిస్తే రెండో మార్గం ద్వారా కూడా దొరుకుతోందిగా, అదీ సగం ధరకే…
LikeLike
మీ కేటరాక్ట్ ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని, పూర్తిగా కోలుకున్నారనీ తలుస్తాను. నెలరోజులయినట్లుంది కదా? I wish you speedy and total recovery 👍.
ఆ ఆపరేషన్ చేయించుకున్నవారు కొంతకాలం డిజిటల్ సాధనాల వాడకం తగ్గిస్తే మంచిదంటారు కాబట్టి సావకాశంగానే వ్రాయండి.
LikeLike
Very nice really amazing post thanks for the post keep sharing
Latest Bollywood Gossip in Telugu
తెలుగులో బాలీవుడ్ వార్తలు
LikeLike
భానుమతి గారి అభినయకౌశలం
👆 కనీసం పట్టుకున్న చెట్టుకొమ్మను కూడా వదలకుండా ఉన్నచోటనే నిలబడి అద్భుతంగా అభినయించిన భానుమతి గారిని చూడండి.
నటన / డాన్స్ పేరిట కుప్పిగంతులు వేసే ఈ తరం వారికి పుఠం వేసినా రాదు.
ఇవాళ భానుమతి గారి జయంతి (సెప్టెంబర్ 7) 🙏.
LikeLike
పుట్టిన రోజు శుభాకాంక్షలు ఫణిబాబు గారు. 💐
LikeLike
జన్మదిన శుభాకాంక్షలు, ఫణిబాబు గారు 💐.
LikeLike