బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Obituary.. Ordnance Factories.. R I P…


 ఎంతో కాలం , మనజీవితాలతో ముడేసుకున్న కొన్ని విషయాలు,  కనుమరుగైపోయినప్పుడు కలిగే బాధ మాటల్లో వ్యక్తపరచడం చాలా కష్టం..  ఎవరైనా వ్యక్తి స్వర్గస్థులైతే, “ మనిషన్నవాడికి ఏదో ఓ రోజు మరణించడం తప్పదుగా..” అనే వేదాంతమైనా ఉంది.. కానీ, మన జీవితాలకి ఓ ఆలంబన గా ఉండి, కన్నకలలు సాకారం చేసుకోడానికి దోహదపడ్డ, ఓ సంస్థ కనుమరగైపోవడం చాలా బాధాకరం.. దీన్ని సమర్ధించడానికి ఏ వేదాంతమూ సరిపోదు..

 నేను ప్రస్తావిస్తున్న సంస్థ.. 42 సంవత్సరాల అనుబంధం ఉన్న ,  గర్వంగా చెప్పుకోగలిగిన  “ ఆయుధ నిర్మాణ కర్మాగారాలు” (  Indian Ordnance Factories)..   నేను 1963 లో చేరిన కొత్తలో , దేశం మొత్తం మీద 39 ఉండేవి.. కాలక్రమేణా 41 దాకా పెరిగాయి.240 సంవత్సరాల చరిత్ర కలిగిన సంస్థ. చేయగలిగినదేమీ లేదు… In the name of  “  ఆత్మనిర్భరత.. వీటిని ఓ 7  Corporations  గా తయారు చేసారు..అవి ఎంత బాగా పనిచేస్తాయో.. time only will tell.. ఈ  process  కరెక్టా కాదా అని చెప్పడానికి కాదు ఈ పోస్ట్.. ఆ సంస్థలో పనిచేయడం మూలాన నేను నేర్చుకున్న జీవిత పాఠాల గురించి చెప్పడానికే ఈ పోస్ట్ ల సీరీస్

1963 లో పూనా లోని  High Explosives Factory  లో చేరాను..150/- రూపాయల  మూల వేతనంతో..ఆరోజుల్లో డబ్బుకి ఓ రకమైన విలువ ఉండేది.. 18 సంవత్సరాలు నిండగానే ఉద్యోగంలో చేరాను..1000 కిలోమీటర్ల దూరాన్నుంచి, వచ్చి ఆ వయసులో నెగ్గుకురావడం కూడా ఓ ఎడ్వంచరే మరి..కానీ అందులో నాగొప్పతనం కంటే, ఆనాటి పరిస్థితులూ, స్నేహితులూ పేద్ద పాత్ర వహించారు.  మూతిమీద మీసం కూడా రాని , నా వయసురీత్యా నన్ను, మా కొలీగ్సూ , పై అధికారులూ కూడా ఓ తమ్ముడిలాగే చూసి, తెలియని విషయాలన్నీ నేర్పారు. అవసరం వచ్చినప్పుడు ఓ సారి లాలించి, ఓసారి గారం చేసి, ఒక్కోప్పుడైతే కోప్పడిన రోజులు కూడా ఉన్నాయి.కానీ అక్కున చేర్చుకున్నారు..ఆ విషయంలో సందేహం లేదు.

 18 సంవత్సరాల పాటు, తెలుగు తప్ప మరో భాష వినని, ద్వీపం లాటి మా అమలాపురం ( కోనసీమ) నుండి,ఒక్కసారిగా .. అదేదో ఓ చెట్టుని  Transplant  చేసినట్టయిపోయింది.. భాష రాదూ.. తెలిసున్న హిందీ ఏదో సినిమాల్లో /రేడియోల్లో విన్న భాషాయే.. ఇంక ఇంగ్లీషంటారా  ఎంత చెప్పుకుంటే అంత తక్కువ.. పైగా వీటికి సాయం ఇక్కడి భాషేమో  “మరాఠీ”.. ఏదో నా అదృష్టం కొద్దీ, మన తెలుగు, మరాఠీ భాషలలో , పదాలకి చాలా పోలికలున్నాయి.. ఏదో ఓ ఇంగ్లీషు ముక్క, సగం తెలుగు + ఓ సంజ్ఞ చేసేసి పని కానిచ్చేసేవాడిని..బస్సులో ఎక్కినప్పుడు కండక్టర్ ‘చుఠ్ఠా దేవో’ అనేవాడు.. వీళ్ళందరూ అడిగి మరీ కాలుస్తారేమో ‘ చుట్టలు’ అనుకునేవాడిని, మొదట్లో… చుఠ్ఠ అంటే చిల్లర అని మొత్తానికి అర్ధమయింది.  18 సంవత్సరాల “డొమీనియన్ ప్రతిపత్తి” నుండి “రిపబ్లిక్” లోకి మారిపోయానుగా, హిందీ సినిమాలు చూసేసి, భాష మీద ఓ రకమైన ‘పట్టు’ సాధించేసాను. మా ఫాక్టరీలో   most sensitive Initiatory Explosives  తయారు చేసే సెక్షన్ లో వేసారు.   Safety విషయంలో.. అతి చాధస్థంగా ఉండాల్సొచ్చేది..ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, ప్రాణాలకే ముప్పు అని తెలిసినది అప్పుడే.. అప్పటినుంచే ఈ  Safety Precautions  అన్నవి  by default  ప్రవేశించేసాయి.. భావి జీవితంలో ఎంతో ఉపయోగించాయి. దానికి సాయం 1966 నుండీ , నన్ను  Safety Section  లో వేయడం వలన, అదీ ఓ Chemical Factory  లో..దేన్నీ ‘ take it for granted ‘  గా తీసుకోకూడదని తెలిసింది..ఆ ఫాక్టరీలో  Acids, TNT  కూడా తయారుచేసేవారు.. 24 గంటలూ పనిచేసేది.. మాకు కూడా Shifts  లో వెళ్ళాల్సొచ్చేది..ఓరకంగా చూస్తే జీవితంలో ఓ రకమైన క్రమశిక్షణ అలవాటయింది.. ‘పేద్ద గొప్పే.. కావాలంటే ఎక్కడైనా నేర్చుకోవచ్చు..’  అనుకోవచ్చు.. కానీ నిద్రపోతున్న సింహం బోనులో, రాత్రీ పగలూ ఉండడం కూడా కష్టమే..అక్కడ తయారుచేసే Explosives ఎప్పుడు పేల్తాయో తెలియదు.. దేశసరిహద్దులో పనిచేసే సైనికులకి సర్వీసులో కొంతకాలమైనా  Peace Area  లో పోస్టింగుంటుంది..కానీ, మా  Ammunition & Explosives  తయారుచేసే ఫాక్టరీల్లో అలాటి అవకాశాలుండవు.. రాత్రీ పగలూ వాటితోనే సహజీవనం..కట్టుకున్న మనిషి ‘ తాళి’ గట్టిదైతే ఉన్నట్టూ లేకపోతే గోవిందో గోవిందా..

  నా 42 ఏళ్ళ సర్వీసులోనూ, అన్ని రకాల విభాగాల్లోనూ పనిచేసే అదృష్టం కలిగింది.. ఏ విభాగమైనా సరే, వాటి రూల్సూ , రెగ్యులేషన్సూ అర్ధం చేసుకుంటే చాలు.. రాజ్యం చేయొచ్చు.. సెక్షన్ లో పనిచేసే వారి దగ్గర నేర్చుకోడానికి సిగ్గుపడకూడదు.. మనకి పని మీద పట్టంటూ ఉంటే, ఎవరికీ తలవంచాల్సిన అవసరం ఉండదు..అదే పధ్ధతిలో 42 ఏళ్ళూ, పనిచేసిన ఫాక్టరీ జనరల్ మానేజర్లతో సత్సంబంధాలే ఉండేవి.. అవేమీ ఏదో ‘ కాకా ‘ పట్టి సంపాదించినవికూడా కాదు.. pure hard and sincere work  అని గర్వంగా చెప్పుకోగలను.. I enjoyed every moment of my 42 Years of working life… maintained cordial relations with everybody from the Highest to the lowest, including Union Leaders. నాలా ఫాక్టరీల్లో పనిచేసిన వారికి తెలుస్తుంది ఎంత కష్టమో.. ఓ అశిధారా వ్రతం లాటిది..కానీ భగవంతుడి దయవలన అన్ని సంవత్సరాలూ ఎవరిచేతా మాట పడకుండా, పూర్తిచేయగలిగాను..

ఈ 42 ఏళ్ళ ప్రయాణంలోనూ నాకు కలిగిన అనుభవాలు రాస్తాను… Learnt a lot…

 జీవితంలో అతిముఖ్యమైన ‘ అవయవం’ కనుమరుగైపోతోందంటే బాధే కదా మరి..

 This is my humble tribute to my   Ordnance Factories…

21 Responses

 1. ఎంతో చరిత్ర కలిగి, చక్కగా నడుస్తున్న – పైగా రక్షణకు అవసరమైన సామగ్రిని చయారుచేసే – గర్వకారణమైన సంస్ధలను ఎందుకిలా రూపుమాపుతున్నారో అంతు పట్టడం లేదు.

  ఆర్డినెన్స్ ఫాక్టరీల్లో ఆఫీసర్ గా మా మేనమామ గారు కూడా పని చేశారు. 1958 లో మీరు పని చేసిన పుణే దగ్గరున్న కిర్కీలో (మీరూ అక్కడేగా?) మొదలుపెట్టి, అనేక ఇతర చోట్లకు బదిలీ అయ్యి, చివరకు ఆవడిలో రిటైర్ అయ్యారు. బతికుంటే ఈ పరిణామం చూసి వారు కూడా క్షోభించుండేవారేమో?

  “చుఠ్ఠా దేవో” కు మీరు చెప్పిన భాష్యం బ్రహ్మాండంగా ఉంది 😃😃.

  Like

  • నరసింహారావు గారూ,

   అన్ని సంవత్సరాలు పనిచేసిన ఏ సంస్థ అయినా, మన కళ్ళెదురుగానే మాయమైపోతే , ఎవరికైనా అలాగే ఉంటుంది కదూ… మీ మేనమామ గారు అదృష్టవంతులు ఇవేమీ చూడలేదు…

   Like

  • ఫణి బాబు గారు,
   మీ 50 వ వివాహవార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు 💐💐. మీకు, మీ శ్రీమతి గారికి అభినందనలు.🙏

   Like

 2. ఇప్పుడు ఆత్మ నిర్భరత అంటే,
  ఇవాళ ఉన్న ఆస్తులు అమ్మేసి బతకడం.
  రేపు అవి అయిపోయాక అప్పులు చేసి బతకడం, అంతే!

  Like

 3. ఒకరకంగా ఈప్రవేటీకరణ అనేది భారతవిఛ్చిత్తికార్యక్రమంలా అనిపిస్తోంది. అన్నీ ప్రైవేట్ పరం చేయటం వలన మంచి జరుగుతుందన్న నమ్మకం లేదు. ఐతే ప్రభుత్వం నియంత్రణాధికారం కోల్పోకపోయినా నియంత్రణ అన్నది ఆచరణలో శూన్యం అయ్యే అవకాశాలు ఎక్కువే. దేశభద్రత క్రమంగా ప్రమాదంలో పడవచ్చును.

  Like

  • ఇది నిజమైన ప్రైవేటీకరణ కాదు. పారదర్శకత లేని ఒక రకమైన క్రోనీ కేపిటలిజం. అయిన వాళ్ళకు అప్పనంగా ధారపోయటం ఇక్కడ ప్రధాన ఉద్దేశం.
   ఈ రోజు వార్తల్లో వచ్చింది కదా, అదానీ సంపాదన గత ఏడాది లో రోజుకి 1000 కోట్లు పెరిగిందని.

   Like

  • శ్యామలరావు గారూ,
   దేశభద్రత గురించి ఆలోచించే నాధుడంటూ ఉంటే… ” ఏదో ఆయనే ఉంటే..” అన్న సామెతలా ఉంది.. మాస్టారూ…

   Like

  • శ్యామల రావు గారూ,

   మీరన్నది అక్షరాలా నిజం… గుర్తుండే ఉంటుంది.. ఇదివరకెప్పుడో ముంబై లో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు, మన ప్రసార మాధ్యమాలు, ప్రత్యక్ష ప్రసారాలు చేసి, పాకిస్తాన్ కి పరోక్షంగా సహాయపడ్డారు. ఇటుపైన సరీగ్గా అలాగే అవడానికి అవకాశాలు ఎక్కువ.

   Like

 4. నిజమే.. మనం అన్ని ఏళ్లుగా అనుబంధం పెంచుకున్న సంస్థ పేరు మారుతోంది అంటే బాధాకరంగా ఉంటుంది. బాంక్ లు కూడా అంతే.మార్పు సహజం

  Like

  • రాధికారావు గారూ,

   పేరొకటీ మారడమయితే ఇంత బాధ ఉండేది కాదు… కాలక్రమేణా ప్రెవేటు యాజమాన్యానికి అమ్మే దురుద్దేశ్యంతో కార్పొరేషన్ గా మార్చడం వలనే ఈ బాధంతా.
   BSNL గతే పట్టబోతోంది…

   Like

 5. ఫణి బాబు గారు, పుట్టిన రోజు శుభాకాంక్షలు. 💐

  Liked by 1 person

 6. ఫణి బాబు గారు,
  ఇవాళ మీ 50 వ (milestone) వివాహవార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు 💐💐.

  Many Happy Returns of the Day అంటూ మీకు, మీ శ్రీమతి గారికి అభినందనలు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: