బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు.. టైంపాస్..


  ఒకానొకప్పుడు కిళ్ళీకొట్లలో అద్దెకు తీసుకుని, తెలుగు పుస్తకాలు  ( Pocket Books)  చదివినరోజులు గుర్తున్నాయా? స్కూలుఫైనల్ పూర్తిచేసుకుని, కాలేజీలో చేరగానే, ఏదో “ పెద్ద మనిషి” అయిపోయాననే ఫీలింగోటి వచ్చేది.. అప్పటిదాకా, ఏవో క్లాసుపుస్తకాలకే పరిమితమయిన , మన range కొద్దిగా పెరుగుతుంది.పొరుగూరికి వెళ్ళి హాస్టల్లో ఉండే పిల్లల గురించైతే చెప్పాల్సిన అవసరమే ఉండేది కాదు.. అలాగని మరీ బరితెగించేసారనీ కాదూ…ఇళ్ళల్లోనే ఉండి, కాలేజీ చదువులు వెలగబెట్టిన నాలాటి వారి మీద కొద్దిగా ఆంక్షలలాటివి ఉండేవి.. కిళ్ళీకొట్లలో , మరీ పబ్లీగ్గా వెళ్ళాలంటే, ఏ తెలిసినవారి కళ్ళల్లోపడితే, ఇంట్లో చెప్పేస్తారేమో అనో భయం..ఇంట్లోనే ఉండి చదువుకోవడం మూలాన,  Pocket money  లాటి సదుపాయాలుండేవి కాదు..అలాగని మరీ స్ట్రిక్టూ అనీ కాదూ, ఎప్పుడైనా ఫ్రెండ్స్ తో కలిసి ఏ సినిమాకైనా వెళ్దామనుకుని, డబ్బులు అడిగినప్పుడు, బీరువాలో ఉన్నాయీ తీసుకోరా అనేవారు.. అలాగ స్వతంత్రం ఇచ్చారుకదా అని, మరీ ఎక్కువా తీసుకునే ధైర్యమూ ఉండేది కాదూ.. ఆనాటి కాలమానపరిస్థితులు మరి అలాగే ఉండేవి.. ఆరోజుల్లో వచ్చే Pocket edition  డిటెక్టివ్ పుస్తకాలు… ఒకటా రెండా? కిళ్ళీకొట్లలో, తమాషాగా, ఓ పురుకోసకి కట్టి వేల్లాడతీసేవారు.. పబ్లీగ్గా తీసుకోగలిగిన పుస్తకాలు.. కానీ మరికొన్ని.. అర్ధమయిందిగా.. చదవాలని కోరికా, ఇంట్లో తెలిస్తే కాళ్ళిరగ్గొడతారాయే..అలాటివి, లోపల ఓ బొత్తిగా పెట్టుంచేవారు..  తెలిసున్న కొట్టైతే, కావాల్సినవి తెచ్చుకుని చదివిచ్చేయడమే.. రోజుకి ఎన్నైనా సరే.. కానీ అద్దె ( అణా ఉండేదనుకుంటా) లో మాత్రం ఎటువంటి రాయితీ ఉండేది కాదు.. అదే పొరుగూరికి వెళ్తే, ఆ కొట్టువాడికి మనతో పరిచయం లేదుగా.. అందువలన  పుస్తకం ఖరీదు డిపాజిట్ ( రిటర్నబుల్) గా కట్టి, తీసుకెళ్ళాల్సొచ్చేది.. అయినా పుస్తకం ఖరీదుమాత్రం ఎంతా రెండు..మూడు రూపాయలు… ఆరోజుల్లో అదికూడా ఎక్కువే మరి… కాలక్రమేణా, చదువుసంధ్యలు పూర్తిచేసుకుని, ఉన్నఊరు వదిలి, ఉద్యోగార్ధం పూనా వచ్చాక, ఇంక పట్టేవారెవరూ లేరు.. అంతా మనిష్టం.. ఏ సినిమా చూడాలనుకుంటే, ఆ సినిమా, ఏ పుస్తకం కావాలంటే ఆ పుస్తకం, అడిగేవారెవరూ లేరు.. పూనా వచ్చిన కొత్తలో,  మాకు దగ్గరలో ఓ లైబ్రరీ ఉండేది.. అక్కడ ఆరోజుల్లో వచ్చే.. విదేశీ పత్రికలు  Time, Life, Saturday Review, National Gegraphic,  .. దేశీ పత్రికలు Illustrated Weekly, Blitz, Mother India,Filmfare  లాటివి  అద్దెకు తీసుకోవడం,తెలుగు మాసపత్రికలు జ్యోతి, యువ కొనుక్కోవడం..  రైల్వే స్టేషన్ బుక్ స్టాల్ లో దీపావళి ప్రత్యేక సంచికలొచ్చేవి..అవన్నీ కొనడం.. ఇవేకాకుండా, అన్ని తెలుగు వారపత్రికలూ కూడా కొనడమే.. అదేవిటో కానీ,  ఎవరికీ చదవడానికి ఇంటికిచ్చేవాడిని కాదు.. కావాల్సొస్తే మా రూం లోనే చదువుకోవడం..కొంతమందికి నచ్చేది కాదు.. పోనిద్దురూ..   ఇంటినిండా ఈ పుస్తకాలే.. పెళ్ళయి నా భార్య కాపరానికి వచ్చేటప్పటికి, ఉన్న రెండుగదుల్లోనూ ఎక్కడ చూసినా పుస్తకాలూ, గ్రామఫోన్ రికార్డులూనూ.. కావాల్సినంత కాలక్షేపం..

 1983 లో వరంగాం వెళ్ళేటప్పటికి, సగం లగేజీ ఈ పుస్తకాలే..ఆరోజుల్లో వచ్చే దీపావళి ప్రత్యేక సంచికలైతే.. ఏ 250-300 పేజీలుండేవి.. ఓ పేద్ద భోషాణం నిండా ఉంచేవాళ్ళం.. వీక్లీలలోవైతే, వట్టిల్లోని సీరియళ్ళూ, వంటలూ కాగితాలు చింపి, పైగా వాటికి బైండ్ చేయించడమోటీ.. ఇప్పుడు తను చేస్తూన్న పజిల్స్ ఆరోజుల్లో పత్రికల్లో వచ్చేవి మాత్రం ఎప్పుడూ దాచుంచలేదు.. శుభం..ఎక్కడికక్కడే.. లేకపోతే లగేజీ ఇంకా పెరిగిపోయేదేమో..

 మొత్తానికి, అక్కడనుండి , పుణె తిరిగివచ్చేటప్పుడు, మాస్నేహితుడు, కేంద్రీయవిద్యాలయం లో , ఇంగ్లీషు మాస్టారు.. చదువుకుంటారు కదా అని, నమ్మండి నమ్మకపోండి, రెండు మూడు బియ్యబ్బస్తాలనిండా పుస్తకాలు ఇచ్చేసాము.. ఒకటా రెండా 35 ఏళ్ళ కలెక్షన్ మరి.. ఆ తరవాత పుణె వచ్చాక, దీపావళి సంచికలు మాత్రమే మిగిలాయి.. వీక్లీలు రెండేసి నెలలకి రద్దీలో ఇచ్చేసేవాళ్ళం..చివరకి రిటైరయేనాటికి, ఆ దీపావళి సంచికల ముద్రణా ఆగిపోయిందీ, మా దగ్గరున్నవన్నీ పేద్ద మనసు చేసుకుని ఎవరెవరికో ఇచ్చేసాము..

 ఆ తరవాత కంప్యూటర్ నేర్చుకోవడమూ, ఏదో నాకొచ్చిన టూటీ ఫూటీ తెలుగు/ఇంగ్లీషుల్లో రాయడమూ మొదలెట్టాము..తరవాత్తరవాత మాత్రం , ఎన్నో సందర్భాల్లో అనుకునేవారం… అయ్యో అన్నేసి పుస్తకాలుండేవీ, ఇప్పుడు ఉండుంటే ఎంత కాలక్షేపంగా ఉండేదో కదా అని అనుకోని రోజులేదు..చెప్పొచ్చేదేమిటంటే, ఆ పుస్తకాల విలువ, ఇప్పుడిప్పుడే తెలుస్తూంట.. అవేమీ పేద్ద పేద్ద క్లాసిక్స్ అని కాదు.. కానీ.. ఆనాటి కాలమానపరిస్థితుల్లో అవేకదా మన నేస్తాలూ…వాటి విలువ వాటికెప్పుడూ ఉంటుంది..మన దృష్టికోణం మీద ఆధారపడుంటుంది

ఏదో అంటారు… మనం ఏదైనా సహృదయంతో ఏపనైనా చేస్తే ఎప్పటికో అప్పటికి దాని ఫలితం ఉంటుంది.. ఆ మధ్యన ఎవరో చెప్పగా, వెదికితే, నా 40 సంవత్సరాల  కలెక్షనూ, నేనిచ్చేసిన ప్రతీ పుస్తకమే కాక, చిన్నప్పుడు కిళ్ళీకొట్లలో అద్దెకు తెచ్చి చదివిన పుస్తకాలే కాక, ఇంకా ఎన్నో..ఎన్నెన్నో తెలుగు సాహిత్యం అంతా, అంతర్జాలంలో దొరికేటప్పటికి, నా ఆనందం ఏమని చెప్పనూ?  It was just awesome.. ఓ 2 TB External Hard Disk  లు రెండు తీసుకుని, హాయిగా ఎప్పుడు కావాలంటే అప్పుడే చదువుకోవచ్చు.. ఒకటిమాత్రం నిజం..  Print Book  చదివితే ఉండే ఆనందం ఈ  pdf  లతో ఉండదు.. పోనిద్దురూ మనంకూడా మారాలిగా..టెక్నాలజీ ఉపయోగించుకుని, మనంకూడా ముందుకు కదలాలిగా…

8 Responses

 1. నిధి దొరికినట్లుందా? Very good.
  అలా ఓపిగ్గా అంతర్జాలంలో పెట్టిన పుణ్యాత్ములకు వందనాలు 🙏.

  Liked by 1 person

 2. పాత జ్ఞాపకాలు మన మనసులో ఎప్పుడూ పరిమళిస్తూ ఉంటాయ్. దీపావళి ప్రత్యేక సంచికలలాగ. కునేగా మరికొళందు రాసుకుని ఘుమఘుమలాడే అవి ఎప్పటికీ పదిలమే.రాజమండ్రి లో వేమన లైబ్రరీ ఉండేది. అది చిన్న బడ్డీ కొట్టు. ఐనా అంతులేని పుస్తకాలు. మా వయసు పిల్లలందరికీ పెద్ద ఆకర్షణ. రోజుకి. పది పైసలు.

  Liked by 1 person

 3. Babai Garu link ivvaledemiti?

  Liked by 1 person

 4. జ్యోతి గారూ,

  ఓపిగ్గా నెట్ లో వెతికితే అన్నీ దొరుకుతాయి.. ఫలానా లింక్ అని ప్రత్యేకంగా ఏమీ లేదు.. కానీ దొరకడం మాత్రం దొరుకుతాయి….

  Like

 5. —స్కూలుఫైనల్ పూర్తిచేసుకుని, కాలేజీలో చేరగానే, ఏదో “ పెద్ద మనిషి” అయిపోయాననే ఫీలింగోటి వచ్చేది.. అప్పటిదాకా, ఏవో క్లాసుపుస్తకాలకే పరిమితమయిన , మన range కొద్దిగా పెరుగుతుంది.—

  నేను కొన్న మొదటి పుస్తకం– బెజవాడ రైలు స్టేషన్ హిగిన్ బాధమ్స్ లో —
  The Bachelor of Arts by RK Narayan— అది కొన్నందుకు అక్షింతలు పడ్డాయనుకోండి.

  ఆ తర్వాత ఇండియా వచ్చినప్పుడల్లా తెలుగుపత్రికలు తెచ్చేవాణ్ణి. 50 ఏళ్ళ కలెక్షన్ మొన్ననే వదిలించుకోలేక వదిలించుకొన్నాను.

  Liked by 1 person

 6. రామకృష్ణారావు గారు,
  నావి 60 సంవత్సరాల కలెక్షన్ ..తిరిగి అవన్నీ డిజిటల్ రూపంలో పుట్టింటికి వచ్చే సాయి .

  మీ స్పందనకు ధన్యవాదములు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: