బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు.. పెద్ద పెద్ద బ్రాండులే అవసరం లేదు…..


  ఉద్యోగంలో ఉన్నప్పుడే, ఓసారెప్పుడో, మా ఇంటావిడ బలవంతం మీద, ఓ మొబైల్ ఫోను, రిలయెన్స్ నెట్ వర్క్ తో కొనుక్కున్నాను.. ఆ తరవాత ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చేంతవరకూ, ఆ  CDMA Technology  ఫోన్లే.. రెండు మూడేళ్ళకోసారి మార్చుకోవడం, ఏదో పనైపోయేది.. ఆ రోజుల్లో, internet  కూడా ఫోన్లలో లభ్యమవుతోందని తెలిసి , ఓసారి ప్రయత్నిస్తే, ఆ నెల బిల్లు తడిపిమోపెడవడం తో బుధ్ధొచ్చి మళ్ళీ ఆ పని చేయలేదు..జస్ట్ మాట్టాడ్డానికి మాత్రమే ఉపయోగించేవాడిని.. ఎప్పుడో ఓసారి, ఫొటోలుకూడా తీయొచ్చని తెలిసి, ఓ  LG Set( Feature phone)  కొనుక్కున్నాను.. ఎప్పుడు ఫోను మార్చుకున్నా, మహా అయితే రెండు, రెండున్నర వేల కంటే బడ్జెట్ దాటనీయలేదు.. కారణం.. మరీ అంతకంటే ఎక్కువ డబ్బు వీటిమీద ఖర్చుపెట్టడానికి ఓపికలేకపోవడమే… ఇష్టం లేకా అని స్టైల్ గా చెప్పి పోజుకొట్టొచ్చనుకోండి.. అయినా ఉన్నమాటేదో చెప్పేయడమే సుఖం కదూ..

ఈరోజుల్లో ఎక్కడ చూసినా గొప్ప గొప్ప బ్రాండులకే పెద్ద పీటాయే..పైగా ఎంత ఖరీదైతే అంత స్టేటస్ .. ఈ బ్రాండుల వాళ్ళు తమ యాడ్ల మీద పెట్టే ఖర్చంతా , మన నెత్తిమీద రుద్దుతారని తెలుసు, దానికి సాయం పన్నుల బాదుడోటీ.. కొన్ని కొన్ని కంపెనీలకి అసలు మీడియాలో visibility అన్నదే ఉండదు.. కారణం వారు యాడ్లమీద అంత ఖర్చుపెట్టరు.. నాకు బాగా గుర్తు… ఓసారెప్పుడో , బస్ కోసం wait చేస్తూంటే, బిస్కట్లు అమ్ముతూ ఒకతను వచ్చాడు.. ఏ కంపెనీవీ అని అడిగితే, అతను చెప్పిన కంపెనీ పేరు ఎప్పుడూ విన్నట్టు లేదు, అదే విషయం అతనితో అన్నప్పుడు.. ” నిజమే సార్.. మాకు ప్రకటనలమీద ఖర్చుపెట్టకుండా, అదేదో ఖరీదు లో తగ్గిస్తామూ.. అయినా ఓసారి రుచి చూస్తేనే కదా తెలిసేదీ ..అన్నాడు.. నిజమే కదా.. ఈ సంఘటన జరిగి ఓ పాతికేళ్ళయింది.. కానీ గుర్తుండిపోయింది..

 Smart phones  వచ్చి, అందరూ ఉపయోగిస్తూన్న రోజుల్లో, మా ఇంటావిడ నాక్కూడా ఒకటి గిఫ్ట్ గా ఇచ్చింది. One Plus  ది, 17000/- పెట్టి.. ఒకలా చూస్తే, ఈ ఫోన్లమీద అంత డబ్బు ఖర్చుపెట్టడం  somehow  నాకు నచ్చదు, కాలక్రమేణా , పెన్షను పెరిగి, చేతిలో డబ్బులాడుతున్నా సరే..అలాగని, మరీ money minded  అనుకోకండి, తనకి విడిగా , ఓ స్మార్ట్ ఫోనూ (  Lenova)  దీ, రెండేళ్ళక్రితం ఓ  ipad Pro Tab  కొనిచ్చాను.. తను చేసే పజిల్స్ పనులకి ఉపయోగిస్తుంది కదా అని.. and she is fully utilizing her gadgets and enjoying too..

  మరి ఇంట్లో ఇన్నేసి గాడ్జెట్లు ( ఓ డెస్క్ టాప్, లాప్ టాప్,  రెండు మూడు ఫోన్లూ, ఓ ఐ పాడ్ )దానికి సరిపడా వైఫై కూడా ఉండొద్దూ? మళ్ళీ వాటికోసం ఓ రెండు జియో డాంగిల్సూ, + నా BSNL Broadband  ఉండనే ఉంది.. ఇల్లంతా  ఏ రూమ్ములోనైనా కనెక్టివిటీ ఉండేట్టుగా..

 ఇదంతా ఇలా ఉండగా, నా జియో ఫోనులో, అదేం కర్మమో, నెట్ పనిచేసేది కాదు.. అలాగని వైఫై పెట్టుకుంటే, ఫోన్లు అందుకునేది కాదు అదేం ఫోన్నో మరి..గత రెండేళ్ళుగా ఇదే తంతు..తెలిసినవారెవరైనా నా నెంబరుకి ఫోను చేస్తే,  out of range  అని మెసేజ్ వచ్చేదిట, ఆతరవాత నాకు మెసేజ్ వచ్చేది  missed calls  అవి చూసి, నేనే తిరిగి వాళ్ళకి, నా  landline  నుంచి ఫోను చేసేవాడిని..మా పిల్లలకి తెలుసు కాబట్టి, వాళ్ళ అమ్మ ఫోనుకే చేసేవారు..గత రెండేళ్ళుగా ఇదే తంతు.. పైగా ఇక్కడ మా సొసైటీలో జియో సిగ్నల్ బాగా వీక్కేమో అనుకుని, వాడిక్కూడా  complaint  చేస్తే, ఆ ప్రబుధ్ధుడు, అవునూ check చేసామూ, మీ సొసైటీలో సిగ్నల్ చాలా వీక్కూ అన్నాడు.. ఇలాకాదనుకుని, ఇంక కనీసం ఉన్న రెండు జియో కనెక్షన్లలోనూ, ముందు ఓదాన్ని మరో  Network  కి మారుద్దామనుకుని, తనకెలాగూ Vodafone  ఉందీ, నాకు ఓ  Jio  ఎలాగూ ఉందీ,అనుకుని,  Airtel  వాడికి ఫోనుచేస్తే, వాడొచ్చి, ఓ కొత్త sim, అదే నెంబరుతో ఇస్తూ అన్నాడూ..  సారూ.. మీ Oneplus  ఫోన్ మరీ పాతదయిపోయిందీ, సమస్య Network  తో కాదూ, మీ ఫోనుతోనూ అని ఓ సలహా ఇచ్చాడు.. అప్పుడనిపించింది నిజమేమో అని.. మరీ 17000 పెట్టి కొన్న ఫోనుని జస్ట్ లైక్ దట్ మార్చడానికి, మధ్యతరగతి మనస్థత్వంలో  జాగా లేదాయే.. మరెలా? పిల్లలతో ఓ మాటంటే, క్షణాల్లో ఓ ఐ ఫోన్ తెప్పించేస్తారు.. మరీ అంతంత ఖర్చుపెట్టించడం కూడా ఇష్టం లేదు ఒకటీ, మరీ వాళ్ళందరిలాగా నాకు రాచకార్యాలేమున్నాయీ? కరోనా ధర్మమా అని ఏడాదవుతోంది, బయటకడుగెట్టి.. ఇప్పుడప్పుడే బయటకు వెళ్ళే ఆలోచనైతే లేనే లేదూ.. మళ్ళీ కొత్త స్మార్ట్ ఫోను అవసరమా?  మాట్టాడ్డమంటే కుదరడం లేదు కానీ, వైఫై ధర్మమా అని, మిగతా  FB, WhatsApp  లూ బాగానే ఉన్నాయిగా..అయినా ఏదో లోటు.. అందరిలా మొబైల్ లో మాట్టాడలేకపోతున్నానే అని..

 ఇలా ఫోన్లూ అవీ ఎవరైనా గిఫ్ట్ చేస్తేనే బావుంటుంది కదూ.. నా దారిన నేను  Amazon  లో వెదుకుతూ, మధ్యలో  loud thinking  ప్రక్రియ జోడించాను.. నేనైతే డిసైడైపోయాను.. ఎటువంటి పరిస్థితుల్లోనూ , 10000  కి మించకూడదు.. బస్… మా ఇంటావిడని అడిగాను.. ఓ పదివేలు సద్దితే, ఓ కొత్త ఫోను కొనుక్కుంటానూ.. అని.. “ మళ్ళీ ఇప్పుడెందుకండీ .. వేస్టూ..” అనకుండా, వెంటనే ఓకే చెప్పేసింది.. ఆవిడ నెట్ బాంకింగ్ వ్యవహారాలన్నీ చూసేది నేనే అయినా, ఓ మాటనేస్తే బావుంటుంది కదూ..

  Amazon లో అన్వేషణ ప్రారంభిస్తే.. అదేవిటో, నాకోసమే వచ్చినట్టు ఓ ఫోను కనిపించింది.. పేరు ఎప్పుడూ వినలేదాయే.. అయినా ఎంతో పేరూ ప్రతిష్టా ఉన్న  బ్రాండులు మాత్రం ఏం ఉధ్ధరించాయీ.. అన్నీ ఒకే తానులో ముక్కలే.. నాకు నచ్చిన విషయం ఖరీదు.. రూపాయి తక్కువ  10000/- లక్షణంగా ఉంది.. ఓ ఏడాదీ ఏణ్ణర్ధం వాడినా పైసావసూల్, పైగా ఓ ఏడాది వారెంటీ/ గ్యారెంటీ కూడానూ.. వేలూ లక్షలూ పోసి కొని, వాటికొచ్చే రిపేరీలకి మళ్ళీ వేలు తగలేయడం కంటే, తక్కువ ధరలో ఓ ఫోను కొనుక్కుని, ప్రతీ ఏడాదీ మార్చేసుకున్నా అడిగేవాడెవడూ లేడూ.. పైగా దీని గుణ గణాలు..  6GB Ram, 64 GB Internal storage.+5 G compatible అన్నిటిలోకీ ముఖ్యం  ఏక్ దం “ స్వదేశీ”.. విదేశీ సరుకులు మానేసి “ ఆత్మనిర్భర్” అంటూన్న ఈ రోజుల్లో, ఇదికూడా ఓ పేద్ద క్వాలిఫికేషనే కదూ..  Brand    LAVA.

  రెండు మూడేళ్ళ తరవాత, మొత్తానికి నేను కూడా, ఏ ఆటంకం లేకుండా మొబైల్ లో మాట్టాడగలుగుతున్నాను…రెండు నెంబర్లతోనూ.. ఇప్పటివరకూ ఏ ఇబ్బందీ లేదూ.. ఉన్నా ఏడాద్దాకా ఫ్రీ సర్వీసింగే..పని చేస్తోందా సరే, లేదా హాయిగా మార్చేసుకోవడమే..

 ఇదంతా ఏదో బ్రాండ్ మార్కెటింగ్ కోసం కాదు..  ఎక్కువగా పేద్దపేద్ద పనులు, మన ఐటి పిల్లల్లాగ చేసుకోడానికి వేలకు వేలు పోసి కొనుక్కోవాలేమో కానీ.. మామూలుగా ఉపయోగించుకోడానిక్కూడా, చవకలో ఫోన్లు దొరుకుతాయి.. వెతకాలే కానీ…

12 Responses

 1. స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ అమోఘం గా ఉంటాయ్.కానీ వాడినా వాడక పోయినా బేటరీ మాత్రం అయిపోతూ ఉంటుంది. ఇల్లు తుడుచుకుంటున్నట్లు అదే చెప్పేస్తూ ఉంటుంది ట్రాష్ పేరుకు పోయిందని. వాటికి కూడా అనేక బ్రాండ్ చీపుళ్లు.

  Liked by 1 person

 2. పనికిమాలినవే బోలెడు apps ఫోన్ నిండా ఉంటాయి. కనీసం వాటలో బేటరీని తినేవి పీకేస్తే మంచిది.

  Liked by 1 person

 3. రాధారావు గారూ,
  ఈమధ్యన మార్కెట్ లోకి వచ్చిన స్మార్ట్ ఫోన్లన్నీ, ఒకటికి మించినవి ఒకటి… ఖరీదుల్లోనే తేడా…

  Like

 4. నాది కూడా సేమ్ పాలసీ అండి, మొబైల్ ఫోను కి 10000 మించి పెట‌్ట‌కూడదని. మొన్న దీపావళి కి రెడ్ మి నోట్ 9 కొన్నాను.

  Liked by 1 person

 5. ఈ మోడల్ ఫోన్ (విడియో చూడండి 🙂👇) ఉత్తమం గదండి. గోలగోలగా ఉండదు (ముఖ్యంగా బస్సుల్లో, రైళ్ళల్లో), పరిసరాలు ప్రశాంతంగా ఉంటాయి 🙂🙂.

  Liked by 1 person

 6. కాలక్రమంలో ఉత్తమమైనవి మాయం అవుతాయండీ. అదంతా మెరుగైన సౌకర్యాలకోసం అనే మిషతో జరగుతుంది. అదే విషాదం. సేంద్రియ దేశవాళీ వ్యవసాయం వదలి రసాయన ఎరువుల కోసం మారాం. చేతిరాత మాని కీబోర్డు మీదకు దూకాం. కూరలూ పండ్లూ మని పిజ్జాలూ బర్గర్లమీద పడ్డాం. నూలు బట్టలను వదలి సింథటిక్ కావాలన్నాం. మంచి కార్యక్రమాల రేడియో వదలి టీవీలకు అతుక్కపోయాం. అవసరానికి ఫోన్ వదలి స్మార్ట్ ఫోనే జీవితం అన్నాం. చిన్నపిల్లలు బొమ్మలతో బదులుగా స్మార్ట్ ఫోన్ చేతబట్టి ఆడుతున్నారు. పెద్దపిల్లలు ఆరుబయట బదులుగా ఫోన్ గేమ్స్ ఆడుకుంటున్నారు. ఇంక చాలు అనుకొని పాత మంచిరోజుల కోసం ఏదో అప్పుడప్పుడు వెంపర్లాడుతున్నాం.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: