బాతాఖాని-లక్ష్మిఫణికబుర్లు–బాంకుల మొహం చూడక్కర్లేదుట…


 దేశంలో  అంతర్జాలం వచ్చి చాలాకాలమే అయింది.. ఉద్యోగాల్లో ఉండేటప్పుడు, ప్రెవేట్ రంగం మాటెలా ఉన్నా, ప్రభుత్వ రంగం లో కూడా, కంప్యూటర్ నేర్పడానికి, ఎన్నెన్నో ట్రైనింగులు ఏర్పాటు చేసేవారు.. కొన్ని యుగాలనుండి, ప్రతీదీ మాన్యువల్ గానే చేస్తూన్న కొంతమంది, ఉద్యోగస్థులకి ఇది నచ్చలేదు.. కారణం పెద్ద మరేమీ కాదనుకోండి.. వారి జ్ఞాపకశక్తి మీద వారికి నమ్మకమొకటి,  ఏ పనైనా, మరీ కంప్యూటరంత వేగంగా కాకపోయినా, కొంతలో కొంత తామూ ఫాస్ట్ గానే చేయగలమనే నమ్మకమనండి.. ఏదో.. మొత్తానికి ప్రభుత్వరంగంలో, చాలామంది, కంప్యూటర్ నేర్చుకోడానిక్కూడా ఇష్టపడేవారు కాదు..

భవదీయుడు కూడా ఆ జాతి వాడే…

చెప్పడానికి సిగ్గులేదా అనకండి.. 90 లలో నా  mindset  అలాటిదే మరి.. చిత్రం ఏమిటంటే, మా పిల్లలు కోరగా, వారికోసం 1993 లోనే ఇంట్లోకి కంప్యూటర్ తెచ్చిపెట్టాను.. అయినా ఒక్కమాటూ దానిమీద చెయ్యేస్తే ఒట్టు.. ఒకటి భయం.. అంత ఖరీదు పెట్టి ( ఆరోజుల్లో 20000/-) కొని, మరీ నా చేతుల్లో పాడైపోతుందేమో అన్న భయం..+ పైన చెప్పిన mindset.  నేను ఉద్యోగం చేసిన ఫాక్టరీలో , ఏడాదికి, ఫాక్టరీలో వివిధ శాఖల్లోకీ అవసరమైన కంప్యూటర్లు కొనే బాధ్యత కూడా నాదే..అయినా సరే.. కంప్యూటర్ ని ముట్టుకోలేదు.. ఉద్యోగం ఉన్నంతకాలమూ.. అలాటిది, ఓసారి రిటైరయిపోయిన తరవాత, మనస్థితి ఎలా ఎప్పుడు మారిందో చెప్పలేను కానీ.. ఈరోజున “ అంతర్జాలం “ లేకుండా ఉండలేనంతగా మారిపోయాను.అండుకనే అంటారేమో దేనికైనా టైము రావాలీ అని… అలాగని నేనేదో మీఅందరి లాగా ఏమీ  Tech savvy  అనిమాత్రం అనుకోకండి.. ఓ అంటే ఢం రాదు..ఏది కావాల్సినా గూగులమ్మని అడిగితే చాలని మాత్రం తెలుసు.. అది చాలదూ..?

  రిటైరయే ముందర పెన్షన్ ఎకౌంట్ తెరవడానికి వెళ్ళినప్పుడు.. అదేదో  నెట్ బాంకింగ్  కావాలా అని అడిగితే, ముందర మొహమ్మాటపడ్డాను.. ఏదో నెలకో రెండునెలలకో బాంకులకి వస్తే, పాత స్నేహితులని కలిసే అవకాశమూ ఉంటుందీ, పాస్ బుక్ ని అప్డేట్ చేసుకోవచ్చు కూడానూ అనుకున్నాను.. పెన్షన్ ఎకౌంట్ కి Cheque Book ఇవ్వను పొమ్మన్నారు.. చచ్చినట్టు  ATM  లో డబ్బులు తీసుకోవడం మొత్తానికి అలవాటయింది..లేకపోతే మొదట్లో, బాంక్ కి వెళ్ళడమూ, అక్కడుండే  withdrawl form  ని fill  చేసి రెండువైపులా సంతకం పెడితే, ఓ అరగంట పోయాక కాషియర్ పిలిస్తే, డబ్బులు ముట్టేవి.. అదేం కర్మమో కానీ, నా సంతకం లో ఎప్పుడూ తేడా వచ్చేది.. అందుకనే పోస్టాఫీసులో అసలు లావాదేవీలు పెట్టుకోనేలేదు,, వాళ్ళైతే ఈ సంతకాల విషయంలో బహు strict.. తేడావచ్చిందా అంతే సంగతులు..పాపం ఈ బాంకు వాళ్ళు బుల్లిబుల్లి తేడాలు పట్టించుకునేవారు కారు.. మొహం చూసి కూడా ఇచ్చేసేవారు.. ఏదో మరీ వీధినపడకుండా లాగించేసాను చాలాకాలం.

ఈ Netbanking  వ్యవహారానికొచ్చేసరికి,  కొన్ని బాంకులు, మనం ముందుపెట్టుకున్న  Password  ని . మన క్షేమం కోసమే ప్రతీ రెండుమూడు నెలలకీ మార్చమంటారు.. కానీ మా పెన్షన్ వాళ్ళు మరీ బలవంతపెట్టడం లేదు..ఏదో మొత్తానికి ఈ నెట్ బాంకింగ్ లో ఉండే సదుపాయాలు, ఉపయోగాలూ నేర్చేసుకుని, తెలియనివాటిని గూగులమ్మ ద్వారా తెలుసుకుని, కిందటేడాది వరకూ, బాంక్ కి ఏడాదికొక్కసారైనా  వెళ్ళే అవసరముండి వెళ్ళాల్సొచ్చేది.. తెలుసుగా పెన్షనర్ల “  Thద్దినం “ అంటే, బతికున్నట్టు ఋజువు కోసం. రిటైరయిన 14 సంవత్సరాలవరకూ , ప్రతీ ఏడాదీ, మా పాట్లు మావే..  నవంబర్ నెలొచ్చిందంటే చాలు.. పొలోమంటూ ఎక్కడెక్కడున్నవాళ్ళూ, ఎకౌంటున్న బాంకు  దారి పట్టడం.. అదో పేద్ద మేళా లా ఉండేది.. ఓ ఫారం నింపడం, తరవాత్తరవాత ఆధార్ కార్డ్ వచ్చాక, దానికో OTP,  లింక్ చేసిన మొబైలూ.. వగైరాలతో గత 4-5 ఏళ్ళూ జరుగుతోంది.మధ్యమధ్యలో hiccups  కూడా వచ్చాయనుకోండి, ఏదో లేట్ గా సబ్మిట్ చేసానని ఓసారీ, సిస్టం లో update  చేయడం మర్చిపోయామని ఓసారీ.. పెన్షన్ ఆలశ్యమైన సందర్భాలూ ఉన్నాయి…ఈ ఏడాది కరోనా ధర్మమా అని, బయటకు వెళ్ళే వీలేలేదూ.. పైగా ఎవడిని చూసినా సీనియర్ సిటిజెన్లే..  SBI  వాళ్ళు పైనుంచి, ఎన్నో ఎన్నెన్నో సదుపాయాలున్నాయని ప్రకటనలైతే చేస్తారు.. కానీ చివరకొచ్చేసరికి ఏమీ ఉండవు.. ఏమిటయ్యా విషయమూ.. పేపర్లో చదివానే అనండి.. మాకింకా ఆర్డర్స్ రాలేదనడం.. ఎందుకొచ్చినగొడవా,, ఆ Thద్దినం పెట్టకపోతే , మనకి పెన్షనుండదనే భయంతో , బాంకుకి వెళ్ళేవాడిని..మొత్తానికి ఈ ఏడాది, ఇంట్లోనే కూర్చుని , అదేదో ఆధార్  Biometric proof  ఉంటే చాలూ అన్నారు.. పైగా డిశంబర్ 31 దాకా పెంచారు శుభం. ఆ పనేదో కానిచ్చి, మొత్తానికి ఆ జీవన్ ప్రమాణ్ ఐడి పంపిన, నాలుగు రోజులకి, మొత్తానికి నేను బతికున్నట్టు ఒప్పుకున్నారు..

చెప్పొచ్చేదేమిటంటే.. పై ఏడాదినుండీ, బాంకుల మొహమే చూడక్కర్లేదూ.. ఇప్పుడు నాకొచ్చే రొక్క రూపేణా ఆదాయమైతే లేనేలేదూ.. ఉన్నదేదో హాయిగా online  లోనే చేసేసుకోవచ్చు..ఒకటా రెండా.. 57 సంవత్సరాల అనుబంధం ఈ బాంకులతో, ఏదో కారణం తో వెళ్ళాల్సొచ్చేది.. అలాగే పోస్టాఫీసులూనూ..

4 Responses

 1. వినరా వారూ వింటున్నారా ?

  ఇదేమి‌ చోద్యమండీ ఇంతగా బ్యాంకు వాళ్లు వాచి పోయేరా
  చూడనంటున్నారు భమిడి పాటి వారు ?

  హన్నా!

  జిలేబి

  Liked by 1 person

  • జిలేబీ,

   వినరా గారిని ఉసిగొలపనక్కర్లేదు… ఏడాది కోసారి వెళ్ళే లైఫ్ సర్టిఫికేట్ కూడా online అయిపోయాక, ఇంక అక్కడేం పనీ ?
   అందుకని వెళ్ళాల్సిన అవసరం లేదన్నది…

   Like

 2. మిగతా బ్యాంకులు ఎలా ఉన్నా, ఇప్పటికీ స్టేట్ బ్యాంక్ లో జనాలు బాగానే కనపడుతున్నారండి.

  Liked by 1 person

 3. బోనగిరి గారూ,

  మరీ రాత్రికి రాత్రే దుకాణం కట్టేయరని ఓ నమ్మకం…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: