బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు … BC / AC Part 1


 చాలా మందికి గుర్తుండే ఉంటుంది… చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో, ప్రపంచ చరిత్రని  రెండు భాగాలుగా చెప్పేవారు.. క్రీస్తు పూర్వం (  B C ),  క్రీస్తు తరువాత (  A D ) అని… అలాగే ఈ సంవత్సరం  అంటే 2020 నుండీ.. కరోనా పూర్వం ( B C ) ,  కరోనా తరువాత (  A C )  అని చెప్పుకోవాలనుకుంటా, భవిష్యత్తు లో…

కలలో కూడా ఊహించుండము.. ఈ మహమ్మారి వైరస్ ప్రపంచాన్ని ఒక్కసారి కుదిపేసి, అతలాకుతలం చేసేస్తుందని.. మన అనుకోడాలతో నిమిత్తం లేకుండా తన పనేదో చేసుకుపోయిందీ.. పోతోందీ ..కూడా.. ఇంకా vaccine  రాకపోయినా,ఈ వైరస్  spread  అవకుండా, అదేదో  Social distancing  పాటిస్తే చాలన్నారు.. ఊరికే బయట తిరిగితే అలాటివి సాధ్యపడవని ఇప్పటికి మూడు సార్లు   Lock Down  చేసేసారు.. నాలుగోది జరుగుతోంది.. జూన్ 1 వ తేదీనుండి, ఏమౌతుందో తెలియదింకా..అదీ ప్రస్తుత పరిస్థితి..

 ఈ  lock down  ధర్మమా అని ఓ విషయం తేలిపోయింది.. ఇన్నిసంవత్సరాలూ ఫలానాది లేకపోతే అసలు బతగ్గలమా అన్నది ఓ “ భ్రమ”..  ఈ రెండు నెలలూ బతకలేదూ ?.. వచ్చిన గొడవల్లా ఏమిటంటే, ఒకానొకప్పుడు అంటే సంపాదన అంతగా లేనప్పుడు, ఏవైతే మనం లగ్జరీలు గా భావించి, వాటి దగ్గరకు కూడా వెళ్ళలేదో,  వాటినే డబ్బులు చేతుల్లో  పుష్కలంగా ఆడేసరికి , అవసరాలుగా మార్చేసి, వాటినే 21 వ శతాబ్దానికి “ అత్యవసరాలు “ గా మార్చేసి, మన పిల్లలని కూడా అదే మార్గంలో పెంచుతున్నాము.. పోనీ, నాలాటి ఏ తలమాసినవాడో , సలహా ఇద్దామని చూసినా, వినేవాడుండకపోగా, నాలాటివాడిని కూడా, అవసరంలేని లగ్జరీలకి  అలవాటు చేసేసారు..  మొత్తానికి ఈ రెండునెలల్లోనూ తెలుసుకున్నదేమిటంటే,  ఈ కొత్తగా తెచ్చుకున్న అలవాట్లు , అందుబాటులో లేకపోయినా , హాయిగా బతికేయొచ్చని..

 మా చిన్నప్పుడు చూసేవాళ్ళం.. బయటనుండి ఎవరైనా ఇంటికి వస్తే,  ఆ కాంపౌండు లోనే ఉండే నూతిలోంచో, తరవాత్తరవాత కుళాయిలకిందో కాళ్ళు కడుక్కుని కానీ, లోపలకు వచ్చేవారు కాదు.. అంతకు పూర్వపురోజుల్లో, ఓ గోలెం నిండా నీళ్ళూ, అందుబాటులో ఓ చెంబూ ఉండేవి.. పసిపిల్లల్ని , ఎత్తుకోవాలంటే, కాళ్ళూ చేతులూ శుభ్రంగా కడుక్కోవడమనేది కంపల్సరీగా ఉండేది..కానీ ఈ ఎపార్ట్మెంట్లు వచ్చాక, గోలాలూ లేవూ, నూతులూ లేవూ.. అదృష్టం బావుంటే, చెప్పులో, బూట్లో విప్పుకుని వస్తారు.. లేదా అలాగే వచ్చేసినా ఆశ్చర్యం లేదు..ఇంట్లో వాడుకోడానికి “ మడి “ చెప్పులైతే ఎప్పుడో వచ్చేసాయి…

 ఈ కరోనాకి పూర్వం, నగరాల్లోనూ, పెద్ద పట్టణాలలోనూ గమనించిందేమిటంటే, చాలా మందికి అంటే కనీసం నూటికి యాభై మందికి , ఇంట్లో రోజూ తినే తిండికంటే, కనీసం వారంలో రెండు మూడుసార్లైనా,జొమాటో, స్విగ్గీ ల ద్వారా బయట నుండి తెప్పించుకోవడమో, కాకపోతే ఏదో హొటల్ కి వెళ్ళి భోజనం చేస్తే కానీ, భోజనం చేసినట్టనిపించేది కాదు..ఈ రెండునెలలూ, నచ్చినా నచ్చకపోయినా, ఇంటి తిండి లో ఉండే ఘనత తెలిసే ఉంటుంది..ఈ  Lock Down  తరవాత హొటళ్ళు ఎప్పుడు తెరుస్తారో తెలియదు, అధవా తెరిచినా, అక్కడ తింటే ఏం ప్రాణం మీదకొస్తుందో అనే భయం.. అలాగే వీకెండ్స్ వచ్చేసరికి, ఔటింగ్ పేరు చెప్పి, ఊళ్ళో ఉండే ఏ పేద్ద  mall  కో వెళ్ళడం, అక్కడ ఉండే  multiplex  లో సినిమా చూసేసి, అక్కడే ఉండే  food court  లో తిండి తినేయడం… అలాగే పెళ్ళికానివారు , అవేవో  pub  లకి వెళ్ళడం… అవన్నీ తప్పనడం లేదు.. ఆధునిక యుగంలో  survive  అవడానికి ఇవన్నీ తప్పవంటారు.. ఏమో..ఇవన్నీ తెరిచేటప్పటికి ఎంత టైము పడుతుందో తెలియదాయె..

మరో విషయం.. పూర్వకాలంలో so called అగ్రకులాలవారు, కొంతమందిని దూరంగా పెట్టేవారనీ, అలాగే మడి ఆచారాల పేరుతో, అస్సలు దగ్గరకే రానిచ్చేవారు కాదనీ.. ఏవేవో చెప్పేవారు.. ఏమో కొన్ని యుగాలక్రితం ఇప్పుడొచ్చిన కరోనా లాటి మహమ్మారి కానీ వచ్చిందేమో, దాని మూలంగానే ఇప్పుడున్న  social distance  లాటిది పాటించారేమో, ఆ concept/practice  నే కొనసాగించారేమో, ఎవరికి తెలుసూ? పైగా ఇలాటివాటివి తెలుసుకుని నిజానిజాలు తెలిస్తే, ఏమో రాజ్యాంగ సవరణలు చేయాలేమో.. అందుకనే  sensitive  విషయాలు తెరమరుగున ఉంటేనే  దేశ నాయకులకి ఆరోగ్యకరమేమో…

సశేషం…

13 Responses

 1. ఇదివరకు రోజుల్లో జాయింట్ ఫామిలీలు ఎక్కువ. ఇంటి పెద్ద కే వంటింటి సర్వ హక్కులు. వంటిల్లు భోజనాల గది వేరువేరు గా ఉండేవి.. పొయ్యి వంటలు కదా. పాపం పెద్దావిడ నిత్యం పొగలోమగ్గిపోయేది.. ఊరగాయలు తడి తగిలితే పాడైపోతాయని మడి అనే పదాన్ని సృష్టించారు.ఏ రోజైనా ఒక క్రమ పద్ధతిలో వ్యవహారాల నిర్వహణ జరిగేది. మిగతా స్త్రీ లు పైపనులు చక్కపెట్టేవారు. మగవాళ్ల భోజనాలు అయ్యాకే ఆడవాళ్ల భోజనాలు.
  మరి ఇప్పుడు అందరికీ టైం ఫాక్టర్. ఉరుకులు పరుగులు. ఎవరి తిండి వాళ్లే చూసుకోవాలి. అన్నీ మైక్రో ఫామిలీలు. కానీ నా ఉద్దేశ్యంలో ఇదివరకు వారి సోషల్ డిస్టెన్సింగ్ కులాల వారీగా ఉండి నిరాదరణకు గురైంది.

  Liked by 1 person

  • మాస్టారూ,

   ఏమో మీరన్నట్టు కొన్ని సందర్భాలలో కులాలవారీగా జరగడానికి కూడా ప్రత్యేక కారణాలుండి ఉండొచ్చేమో.. ఏ విషయాలైనా, మనకు brain wash అయింది, కొందరి రాతల ద్వారానేగా..
   మరి ఇటుపైన ఈ social distance ని ఏమంటారో చూద్దాం…
   మీ స్పందనకు ధన్యవాదాలు.

   Liked by 1 person

 2. నా ఉద్దేశ్యంలో ఇదివరకు వారి సోషల్ డిస్టెన్సింగ్ కులాల వారీగా ఉండి నిరాదరణకు గురైంది.

  This is the real truth.

  Liked by 2 people

  • నీహారికా
   “This is the real truth ” అని గారెంటీగా ఎలా చెప్పగలరూ ? ఏమో its debatable అని నా అభిప్రాయం..

   Liked by 1 person

   • మా ఇంటిదగ్గర బ్రాహ్మణులు బ్రాహ్మణులకు మాత్రమే అద్దెకు ఇవ్వబడును అని బోర్డు పెడతారండీ.
    శంకరాభరణం సినిమాలో మంజుభార్గవిని సోమయాజులు గారు వంట చేయమంటారు కానీ వంటావిడ మాత్రం ఒప్పుకోదు. ఒకసారి పొగంటూ రాజుకున్నాక ఆర్పడం అంత సులువేమీ కాదు.

    Liked by 1 person

 3. ఇంట్లో వాడుకోవడానికి “మడి” చెప్పులు …. హ్హ హ్హ హ్హ హ్హ, బాగా చెప్పారు. కానీ ఒక్కోసారి అదాటున బయటకు వెడుతుంటే మరిచిపోయి ఆ చెప్పులతోటే బయట తిరిగిరావడం కూడా జరుగుతుంది కదా 🙂,

  ఆధునిక కాలంలో “మడి” అనే మాటకు ఒక బూతుపదం రంగు పూసి వదిలారు. దానికి కూడా కులం అంటగట్టారు. మడి అనేది పూర్తిగా శుభ్రతకు సంబంధించినదని నా ఇభిప్రాయం. పూజ గాని, వంట గాని చేసేముందు స్నానం చేసి శుభ్రమైన బట్ట కట్టుకుని చెయ్యడం శుభ్రత కోసమే కదా. అలాగే ఆ కార్యక్రమం పూర్తయ్యే వరకు ఇతరులను (కుటుంబ సభ్యులతో సహా) తాకకుండా ఉండడం కూడా శుభ్రత కోసమే. ఈ రకంగా ఎవరైనా సోకాల్డ్ “మడి” పాటించవచ్చు. దీంట్లో కులం ప్రసక్తి ఎందుకు?

  Liked by 1 person

  • ఇలా ప్రతిదానికీ ఆరోగ్యాల లంకెలు పెడితే.. ప్రపంచంలో చెడు అనేదే లేదు.

   Like

  • నీహారికా,
   మీరన్నది కాదనడంలేదు ..నగరాల్లోచూస్తూంటాము , ఏ కులం వారి హాస్టల్స్ లో వారికే ప్రవేశం ..its not limited only to brahmins..polarisation is on everywhere.. నేను ప్రస్తావించింది యుగాలక్రితం మాట..అప్పుడు ఏదైనా social distancing అవసరమయిందో పరిశోధన చేయాలని..

   నరసింహరావుగారూ,
   అదే కదా కులాల ప్రసక్తి హైలైట్ చేసి, ప్రత్యేకంగా ఒకే కులాన్ని విక్టిమైజ్ చేసారేమో అనిపిస్తుంది.

   Like

 4. ప్రస్తుతం పల్లెటూళ్లలోను ఈ కుల ప్రసక్తి చాలా భాగం తగ్గింది. పట్టణాలలో వారికి తెలియదు. కానీ పల్లెటూళ్లలో సోషల్ డిస్టెన్సింగ్ కులాల వారీగా ఉండేది. మనం కాదన్నా అది సత్యం. అగ్రకులాల ఆధిక్యం దూరాన్ని పాటించడం లో ప్రదర్శించే వారు.

  Like

  • మాస్టారు
   మీరన్నది కాదనడంలేదు .. కానీ దాని వెనకుండే ఉద్దేశ్యం ప్రస్తుత social distancing లాటిదేమో తెలుసుకోవడానికి ప్రయత్నించారా అని ..

   Like

   • ఫణిబాబు గారు,
    మీరు టచ్ చేసిన social distancing (s.d) కి ఆద్యం అయ్యుండచ్చేమో అన్న ఆ కారణం (కరోనా లాంటి మహమ్మారి) ఆసక్తికరంగా ఉన్న ఒక ఆలోచన no doubt.

    అదే గనక నిజం అనుకుంటే నాకు తోచిన ఒక ఇబ్బంది ఏమిటంటే … పురాతన కాలంలోనే ఏదో మహమ్మారి వలన s.d. పుట్టి ఉంటే సదరు s.d. అన్ని కులాలకూ సమానంగా వర్తించుండాలి కదా? సరే, సోకాల్డ్ అగ్రకులాలు ఆ కాలంలోనే ఆధిక్యం ప్రదర్శించేవారు అనుకుందాం … వాదన కోసం. మరి తతిమ్మా కులాల మధ్య నయినా s.d. సమానంగా ఉండి ఉండాలి కదా? కానీ తతిమ్మా కులాలల్లోనూ inter se ఆధిక్యభావనలు ఉన్నాయిగా. అంటే అవి తరువాత తరువాత కాలంలో వచ్చి, s.d. కులాలవారీగా దర్శనమిస్తోంది అంటారా? ఏమో మరి 🤔.

    ఏతావాతా నేను చెప్పేది ఏమిటంటే … ఏదో మహమ్మారి వలన అలనాడే s.d. మొదలయింది అని నాకు అనిపించడం లేదు. మరొక కారణం … అటువంటి పరిణామం ఏదైనా జరిగుంటే ఐతిహాసాల్లో దాని ప్రస్తావన ఉండే ఉండాలిగా; కానీ ఎప్పుడూ ఎవరూ అలా అనగా వినలేదు నా పరిమిత అనుభవంలో.

    Like

 5. నరసింహరావుగారూ,
  బహుశా మీరే రైటు కావచ్చు ..ప్రస్తుత SD చూసి నాకు random గా వచ్చిన ఆలోచన ఇది. Lockdown ప్రభావం ☺☺

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: