బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు — జరుగుబాటు…


  ఈ కరోనా Lock Down  ధర్మమా అని ఒక విషయం తేలిపోయింది..మొన్న మార్చ్ 2020 ముందువరకూ , మన అలవాట్లు, ప్రవర్తన, కోరికలు … అన్నీ కూడా “ జరుగుబాటు “ ధర్మమే. 21 వ శతాబ్దం లో పుట్టినవారి సంగతి పక్కకు పెడితే, అంతకుముందు అంటే 1970 తరవాత 3 దశాబ్దాల్లో పుట్టినవారందరూ, మొదట్లో పాపం లక్షణంగానే ఉండేవారు.. కానీ కాలక్రమేణా , వారి వారి దైనందిక జీవితాల్లో ఎక్కడలేని మార్పులూ వచ్చేసాయి…బహుశా అకస్మాత్తుగా మారిన వారి ఆర్ధిక స్థోమత కూడా ఓ కారణం.. 1970 లో పుట్టి చదువులు పూర్తిచేసి, ఉద్యోగాల్లో చేరే టైముకి, దేశంలో , నరసింహారావుగారి ధర్మమా అని, ఆర్ధిక సంస్కరణలు ప్రారంభమయి అప్పటిదాకా  వేలల్లో ఉండే జీతాలన్నీ లక్షల్లోకి వెళ్ళిపోయాయి..ఆర్ధిక సంస్కరణలతో  , అప్పటిదాకా విదేశాల్లోమాత్రమే దొరికే ప్రతీ వస్తువూ, దేశంలోనే అందుబాటులోకి వచ్చేసాయి.ప్రతీవారిలోనూ, ఒకరకమైన విశ్వాసం మొదలయింది.. కానీ కాలక్రమేణా అదే ఓ  arrogance  లోకి దింపేసింది. పదిరూపాయలు ఖర్చుపెట్టేచోట వందరూపాయలు కూడా ఖర్చుచేసే పరిస్థితి..దానికి సాయం ఓ మైకం లాటిదికూడా కమ్ముకోవడం ప్రారంభమయింది..భార్యాభర్తలిద్దరూ మంచి ఉద్యోగాలు చేయడం మూలాన   EMI s have become a way of life.  పూర్తిగా అందరి  life style  మారిపోయింది.. ఇప్పుడే ఇంతంత జీతాలొస్తూంటే, వచ్చే పదేళ్ళలోనూ ఇంకెత్తుకెదుగుతామో అనే ఓరకమైన overconfidence  వచ్చేసింది.. ఈ విషయం ఒప్పుకోకపోవచ్చు ఈ తరం వారు.. ఒకానొకప్పుడు విదేశాలకి వెళ్ళడమే ఓ కల   గా ఉండేది.. అలాటిది విదేశాలకి సరదాగా షికారుకెళ్ళినట్టు వెళ్తున్నారు..ఒకానొకప్పుడు శలవలొస్తే, దేశంలోని ఏ ప్రదేశానికో వెళ్ళే వారందరూ కూడా ఏదో సంస్థ ద్వారా, ఏ  విదేశీ  Holiday Package  నే  బుక్ చేసేసికోవడం.. ఇంక చదువుల విషయానికొస్తే, ఎలాగోలాగ దేశీవిద్య పూర్తిచేసి, విదేశీపైచదువులూ, ఆ పై విదేశీ కొలువులూ..విద్యావ్యవస్థకూడా పూర్తిగా మారిపోయింది..పైచెప్పినవన్నీ , మేము చేయలేము కనుక ఏదో ఈర్ష్య తో చెప్పాననుకోవచ్చు కూడా..

 అన్నిటిలోకీ ముఖ్యమైన మార్పు “ పోటీ “.. ప్రతీదానికీ పోటీయే.. వెళ్ళే స్కూలునుండి,ఉండే సొసైటీ, తినే తిండి, వేసుకునే బట్ట, వెళ్ళే వాహనాలదాకా ఒకరితో ఒకరికి పోటీ.. పోనీ దానివలన లాభమేమైనా ఉందా అంటే అదొక  feel good  అంటారు ఈనాటి యువత. సరే ఒప్పికుందాం ఆ  feel good.. but at what cost  అన్నది పట్టించుకోలేదు. మొన్నమొన్నటిదాకా, వారంలో కనీసం ఓ రెండు రోజులు బయట ఏ హొటల్లోనో భోజనం చేయడం, ఓ ఫాషన్ గా మారిపోయింది.. అలాటిది గత నెలన్నరనుండీ, నచ్చినా నచ్చకపోయినా, ఇంటి తిండికే అలవాటుపడ్డారు, ఎటువంటి వెర్రి వేషాలూ వేయకుందా..

ఎవరికి వారే  satisfaction  లోంచి   delight ని ధ్యేయంగా మార్చేసుకున్నారు.. Satisfaction  కి కనీసం కొన్ని లిమిట్స్ ఉంటాయి—ఇదివరకటిరోజుల్లో చూడండి, పెళ్ళి చేసుకుని, ఓ ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కని, వారి బాగోగులు చూసి, ఓ ఇల్లు కట్టుకుంటే సంతోషపడేవారు.. అంతకంటే పేద్దగా కోరికలంటూ ఉండేవి కాదు కూడా..

 ఈ మార్పుల ధర్మమా అని, 21 వ శతాబ్దంలో పుట్టినవారికి,  Middle, Lower Middle Class  అంటే అసలు అవగాహనే లేదంటే ఆశ్చర్యం కూడా లేదు..అలాగని వాళ్ళని తప్పు పట్టలేము కూడా.. పరిస్థితులూ, వాతావరణం అలా మారిపోయాయి..ఈ  నవతరం లో చాలామందికి , కొన్ని విషయాలు అస్సలు తెలియదు కూడా..  తల్లితండ్రులు, మహా అయితే గ్రాండ్ పేరెంట్స్ మాత్రమే వీరి ఫామిలీ అనుకుంటారు.. చిత్రం ఏమిటంటే,  they are happy also.. ఒకానొకప్పుడు ఎంతమంది బంధువులుంటే అంత సంతోషంగా ఉండేవారు కూడా ( అంటే ఈ తరం ముందువారు) , అదే దారిలోవెళ్ళడం..

 ఈ  LOCK Down   ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో చెప్పలేము.. అవేవో వాక్సీన్లు వచ్చేదాకా, ఈ  Social Distancing  మాత్రమే  మనల్ని రక్షిస్తుందని తేలిపోయింది.. 40-45 రోజులు  ఇదివరకటి సూకరాలు లేకుండా, బండి లాగించగలిగేమంటే, అవన్నీ జరుగుబాటు రోగాలే అని  తేలిపోయినట్టేకదా…

8 Responses

 1. “satisfaction” —> “delight”
  ఆనందం దోసిళ్ళతో జుర్రేసుకుందామని పరుగులు. అలా జుర్రుకుంటేనే జీవితాన్ని అనుభవిస్తున్నట్లు అనే అర్థం వచ్చేట్లుగా ఎగదోసే అడ్వర్టయిజ్మెంట్లు, వాటి వెనకనున్న కార్పొ”రెట్టలు”.

  savings-oriented జీవనవిధానం నుండి spending-oriented (debt / EMI లతో) ధోరణి వైపు జనాల్ని నెట్టిన విచ్చలవిడి వ్యాపారసంస్కృతి.

  ఇప్పుడు అవన్నీ కాస్త తగ్గినా జీవితం గడుస్తోందీ అంటే మీరన్నట్లు ఆ వేషాలన్నీ “జరుగుబాటు రోగాలే”. భారతీయ జీవనసరళిని అతలాకుతలం చేసిందీ సరళీకరణ. .

  Liked by 1 person

  • నరసింహరావుగారూ,
   వాతావరణాన్ని వ్యాపారాత్మకంగా మార్చేయడంతో వచ్చింది అసలు గొడవంతా…
   చూద్దాం , ఈ Lock down ఎత్తేసిన తరవాతైనా జనాలు భూమ్మీదకు దిగితారేమో ?

   Like

   • దిగరు. రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ ఆ “జరుగుబాటు” బాట పడతారు. ఎందుకంటే వ్యాపారులు తమ మాయాజాలాన్ని తిరిగి విసిరే ప్రయత్నం చేస్తారుగా (ఇదంతా నా అభిప్రాయం).

    మీ ఊరు పూణేలో “కరేనా” కాస్త వీరవిహారం చేస్తోందిటగా (టీవీ వార్తల ప్రకారం). జాగ్రత్తండి.

    Liked by 1 person

   • వ్యాపారుల పైన ఇంత కచ్చయేల ?
    వారే కదా దేశాన్ని ముందుకు తీసుకు
    పోతున్నది సేఠు‌ బ్యాంకు వారికి తెలియదా 🙂

    జిలేబి

    Liked by 1 person

 2. ప్రకృతి సంతోషించడం lock down మంచి పరిణామం. మనం ఎలా జీవిస్తే పర్యావరణానికి మంచి జరుగుతుందో నేర్పింది. కుటుంబాల మధ్య ఆప్యాయత లు పెరిగాయి. ముందు ముందు మన జీవన విధానం ఇలాగే ఉంటుందేమో.

  Liked by 1 person

 3. // “ వ్యాపారుల పైన ఇంత కచ్చయేల ?” //

  కార్పొ”రెట్టలు” ప్రవేశించకముందు కూడా భారతదేశంలో వేలసంవత్సరాల నుండీ వ్యాపారాలు జరిగాయండి …… కాస్తో కూస్తో విలువలతో కూడిన వ్యాపారాలు.

  Liked by 1 person

 4. ఏ తరంలోనైనా యువత ఏం చేస్తే అదే కరక్ట్!
  భవిష్యత్తు గురించి వాళ్ళకు తెలిసినట్టు మిగతా వాళ్ళకి తెలియదు.
  ప్రపంచాన్ని ముందుకు తీసుకువెళ్ళేది యువతే!

  Liked by 1 person

 5. నరసింహారావుగారూ,

  పరిస్థితులు ఎలా మారుతాయో చెప్పడం కూడా కష్టం..

  జిలేబీ,

  వ్యాపారులమీద కచ్చ అని కాదూ… కానీ ఈ రెండునెలలూ జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోడానికి , ఇంకా ఎన్నెన్ని మార్గాలు వెదుకుతారో…

  రాధికారావుగారూ,

  ప్రకృతి మాత్రం చాలా సంతోషంగా ఉంది ఈ నలభై అయిదురోజులూ.. అలాగే కంటిన్యూ అయితే మంచిదే.. కా..నీ…..

  బోనగిరి గారూ,

  అలాగంటారా..? ఏమో… మే నెలాఖరుకి చూడాలి…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: