బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు-పొల్యూషన్


ఒకానొకప్పుడు వాతావరణం లో మార్పు వచ్చి, ఎండలు ఎక్కువైనప్పుడు, కిటికీలకి వట్టివేళ్ళ తడకలని ఉండేవి, ఆ తడకలు కట్టి వాటిమీద నీళ్ళు చల్లి, ఇంట్లో చల్లగా ఉండేటట్టు చూసుకునేవారు…  కాలక్రమేణా Air Coolers, Air Conditioners  ఆవిష్కరించబడ్డాయి. ఎవరి స్థోమతని బట్టి వారు, ఏదో ఒకటి అమర్చుకుని  ఇళ్ళలోనూ, ఆఫీసుల్లోనూ  వాతావరణం చల్లబరుచుకుంటున్నారు. Global warming  ధర్మమా అని, వాతావరణం  వేడెక్కిపోతోంది…

ఇలాటి వాతావరణ మార్పులకు ముఖ్యకారణం, ఎక్కడా చెట్టూ చేమా ఉండకపోవడమే… రోడ్లు వెడల్పు చేయాలంటే, ఎన్నో సంవత్సరాలపూర్వం నాటిన పెద్దపెద్ద చెట్లు ముందర బలి అయిపోతున్నాయి… అలాగే ఉన్న చెట్లు కొట్టేసి, ఆ స్థానంలో పెద్దపెద్ద ఎపార్టుమెంట్లు వచ్చేస్తున్నాయి.  మట్టిరోడ్లూ, కంకర రోడ్లూ,   concrete  లోకి మారిపోయాయి. వర్షాలకి పడ్డ నీళ్ళు, మట్టిలో ఇంకి, , చెరువుల్లోనూ, నూతుల్లోనూ సంవత్సరమంతా నీళ్ళు పుష్కలంగా ఉండేవి. ఈరోజుల్లో మట్టీలేదూ, నీళ్ళు ఇంకడాలూ లేవు… దానితో భూగర్బజలాలు ఎండిపోయాయి.  దీనితో సొసైటీల్లో తవ్విన బోరుబావుల లో నీళ్ళనేవి కనిపించడంలేదు. అందుకే ఈరోజుల్లో ఎక్కడ చూసినా నీళ్ళ ట్యాంకులద్వారానే  నీళ్ళు. ..

ఇంక ఎండ వేడిని తట్టుకోవడానికి  పెద్దపెద్ద  కార్పొరేట్ ఆఫీసుల్లో, మొత్తం బిల్డింగంతటికీ  ఎయిర్ కండిషనింగూ, అదికూడా  Centrally Airconditioned.  వీటిలో ఉండే ఇబ్బందేమిటంటే, కర్మవశాత్తూ ఆ  AC Duct  లో ఎక్కడో  short circuit  అయి, మంటలు చెలరేగి  మొత్తం బిల్డింగంతా ఆహుతైపోవడమూనూ.. ప్రమాదాలు పొంచిచూస్తూంటాయి. ఏ   బహుళాంతస్థుల బిల్డింగ్ లోనైనా అగ్నిప్రమాదం జరిగినప్పుడు, చెప్పే కారణం ఇదే… పెద్దపెద్ద కార్పొరేట్ Hospitals  లోకూడా ఇలాటివి చూస్తూంటాము..

 ఆరోజుల్లో ఇళ్ళల్లో  అన్నం మిగిలిపోతే, తరవాణి లో ఆ అన్నాన్నుంచి, మర్నాడు పొద్దుటే చద్దన్నంగా తినిపించేవారు. అలాగే కూరగాయలు కూడా ఓ బుట్టలో పోసుకోవడమో, లేక ఇంట్లోనే ఏ పెరట్లోనో ఓ తోటలాటిదుంటే, అందులోనే కూరగాయల మొక్కలు నాటుకుని, ఏరోజుకారోజు కూర కోసుకోవడమే… అయినా ఆరోజుల్లో కూరగాయలు కూడా, ఏ సంతనుండైనా తెచ్చినవైనా సరే, ఓ నాలుగురోజులపాటు పాడవకుండా ఉండేవి… కానీ ఈరోజుల్లోనో,   Fertilizers and Pesticides  ధర్మమా అని, బయటనుండి తెచ్చిన కూరగాయలు, మహా అయితే ఓ రోజు తాజాగా ఉంటాయంతే. అలాగని రోజూ కూరలు తెచ్చుకోవడంకూడా కష్టమే…  Refregirators  ఆవిష్కరించిన తరవాత పరిస్థితి బాగుపడింది. ఈరోజుల్లో ఏ ఇంటిలో చూసినా, ఏదో ఒక సైజుది  Refregirator  లేని ఇల్లులేదంటే ఆశ్చర్యం లేదు.

అలాగే  పొలాలనుండీ, తోటల నుండీ , కూరగాయలూ, పళ్ళూ, పాలూ  టోకున కొనేసి, చిన్నచిన్న వ్యాపారస్థులకి Supply  చేయడం చూస్తూంటాము.. పెద్ద ఎత్తున వాటిని కొనేయడంతో సరిపోదుగా, అవి పాడవకుండా చూడడానికి  మళ్ళీ  Cold Storage  లు  రంగంలోకి వచ్చాయి…  ఈరోజుల్లో, కూరగాయలు కాపాడ్డం దగ్గరనుండి,   Hospitals  లో శవాలు ఉంచేదాకా  ఎక్కడ చూసినా  Cold Storage  లే.

ఇన్నిచోట్ల వేడిని తట్టుకోడానికి, ఇన్నేసి సాధనాలుండగా, ప్రయాణవ్యవస్థ మాటేమిటీ ?  ఇదివరకటి రోజుల్లో ఏ బస్సులోనైనా వెళ్తున్నప్పుడు, కిటికీ తెరిస్తే శుభ్రమైన చల్లగాలికి నిద్ర పట్టేసేది.. కానీ ఈ రోజుల్లోనో దుమ్మూధూళీ తో నిద్రమాటదేవుడెరుగు రోగాలొస్తున్నాయి… దానితో చిన్న చిన్న కారుల దగ్గరనుండి,  దూరప్రయాణాలు చేసే పెద్దపెద్ద బస్సులదాకా అన్నీ ఎయిర్ కండిషండే.. రైళ్ళ సంగతి సరేసరి. ప్రతీ   Train  కీ కనీసం ఓ నాలుగు  AC Coaches  తప్పనిసరైపోయింది… సినిమాహాళ్ళ సంగతైతే అందరికీ తెలిసిందే..

వీటిల్లో కొన్ని కష్టాలుకూడా ఉన్నాయి— ఒకానొకప్పుడు  Ventilation  అనేది ఉండడం వలన, మనిషి ఆరోగ్యకరమైన గాలి పీలుస్తాడనేవారు. కానీ ఈ  AC  లవలన, లోపలవారికి ఊపిరాడదేమోనంత దుస్థితి.. అయినా సుఖాలకి అలవాటు పడితే. వాటితో కష్టాలుకూడా అనుభవించాలిగా..

ఈ కొత్తగా వచ్చిన Lock Down  ధర్మమా అని, కొన్ని మంచి మార్పులు—వాతావరణ కాలుష్యానికి సంబంధించినంతవరకూ – వచ్చాయి.. రోడ్లమీద మోటారు వాహనాలే లేకపోవడంతో.. air pollution  అనేది పూర్తిగా తగ్గిపోయిందిట..అలాగే నదీ కాలుష్యం కూడానూ.. శబ్దకాలుష్యం కూడా అసలు లేదు..దీనర్ధం ఏదైనా మన ప్రాణం మీదకు వస్తే తప్ప, కంట్రొల్ అవదని తేలిపోయింది..ప్రాణభయంతో మొత్తానికి మే మొదటివారం దాకా ఈ Lock out ఉపయోగించడం ఖాయం.. కానీ ఆతరవాత మన ప్రవర్తన ఎలా ఉంటుందీ అన్నదే అసలు ప్రశ్న.. ఎలాగూ అలవాటుపడిపోయారు కదా, ఇదే పధ్ధతిలో కంటిన్యూ అయిపోతారూ అని కొందరూ… అబ్బెబ్బే అలా ఏం కాదూ.. ఈ  restrictions  ఎత్తేసిన తరువాత, అంతా ఇదివరకటిలాగే ఉంటుందీ అని కొందరూ, ఇప్పటికే బెట్టింగ్స్ కూడా వేస్తున్నారు.మన దేశంలో ప్రతీదానికీ బెట్టింగే కదా..

8 Responses

 1. లాక్ డౌన్ వల్ల మనుషుల మధ్య ఆప్యాయత, అభిమానం పెరిగినట్లు అనిపిస్తోంది. ఇంట్లో భార్యల కష్టాలు భర్తకు అర్ధం అవుతున్నాయి. ఆఫీస్ టెన్షన్ లు తగ్గాయి.

  Liked by 1 person

 2. // “…. అంతా ఇదివరకటిలాగే ఉంటుందీ అని కొందరూ, …. “ //

  నేనూ అదే అనుకుంటున్నాను. ఒక్కసారిగా పంజరంలో నుండి బయటపడినట్లుగా మరింత ఎక్కువ మోతాదులో వుంటుందని కూడా నా అనుమానం.

  ప్రస్తుతం క్రికెట్ మ్యాచులు, గుర్రప్పందాలు లేవుగా, అందుకని ఇలాంటి బెట్లు వేసుకుంటున్నారేమో అలవాటు పడిన ప్రాణులు 😁.

  Liked by 1 person

 3. ఈ టపా మాత్రం నిజ్జంగా బాతాఖానీ కబుర్లే 🙂

  జిలేబి

  Liked by 1 person

 4. ఏమైనా చదువులైన ముప్పయ్యేళ్ల తరువాత మళ్ళీ వేసవి సెలవులు అనుభవిస్తున్నాం, కరోనా వల్ల.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: