బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– లౌడ్ థింకింగ్


    ఈ రోజుల్లో మన యువతరం, మాలాగ ఒకే ఉద్యోగానికి వేళ్ళాడరుగా. ,ఎక్కడ బాగా జీతం వస్తే అక్కడికి మారిపోతూంటారు. దానికి నేను తప్పు పట్టడం లేదు. ఏదైనా ఉద్యొగం చేసినప్పుడు దానిలో Job satisfaction అనేది ఉండాలి. నాకు ఒక విషయం అర్ధం అవదు–ఈ, Job satisfaction అంటే ఏమిటీ–నిజంగా ఇదే కారణం అయితే, మనం చేసే job ఏదైనా అందులో కూడా ఆనందం పొందవచ్చు. చెప్పేదేమిటో క్లియర్ గా ” డబ్బు” కోసమే మేము జాబ్ లు మారుతామూ అని ఒప్పుకుంటే, ఇంకా నిజాయితీ గా ఉంటుంది.

    ఇదివరకటి రోజుల్లో ఎలా ఉండేదీ– మాస్టారి అబ్బాయి మాస్టారే అయ్యేవాడు, బి.ఇ.డీ లేక సెకండరి గ్రేడ్డో. తాలుకాఫీసులో పనిచేసేవారి కొడుకు అందులోనే చేరేవాడు. డాక్టర్ గారి పిల్లలు డాక్టర్లే, ప్లీడర్ గారి పిల్లలు ప్లీడర్లే– ఎదో అక్కడక్కడ వీటిలో కొంచెం మార్పుండేది.70 ల దశకం ప్రారంభం అయిన తరువాత వచ్చిన జనరేషన్ కి ఇదేమీ నచ్చలేదు.ఇంకా పాతచింతకాయ పచ్చడిలా, ఉంటే ఎలాగా అని ఆలోచించారు. అవకాశాలు కూడా అలాగే వచ్చేవి. జీవితం అంతా పరుగులు పెట్టడం ప్రారంభం అయింది. డబ్బే ప్రధానమయ్యింది జీవితానికి, అది సంపాదించాలంటే ఎన్నెన్నో openings కనిపించాయి. మరీ డబ్బుకోసం ఉద్యోగం మారుస్తున్నామనుకోవడానికి మొహమ్మాటం వేసి ఈ job satisfaction అనే కొత్త పదానికి శ్రీకారం చుట్టారు.కొంతమందైతే  Job Profile  బాగోలేదంటారు..
ఇప్పటివారు చెప్పే ఈ కొత్త పదానికి పాత వారు ఎలా అర్ధం చెప్తారు? వాళ్ళు చేసేది ఏ పనైనా పూర్తి sincerity తో చేస్తే అందులోనే ఆనందం కనిపిస్తుంది.ప్రభుత్వ ఉద్యోగాలేమీ  bed of roses  కాదు, ఎంత సిన్సియర్ గా పనిచేసినా, రావాల్సిన ప్రమోషన్ మరొకడికి వస్తుంది,వాడెంత జూనియర్ అయినా, ప్రభుత్వాలు గత 73 ఏళ్ళుగా కొనసాగిస్తూన్న కొన్ని ప్రత్యేకతలవలన..అలాగని ఉద్యోగాలు మార్చలేదే?    వాళ్ళే
 ఇప్పటివాళ్ళలాగ, రోజుకో ఉద్యోగం మార్చి ఉంటే, వీళ్ళు ఇలా పెద్ద పెద్ద చదువులు చదివేవారా, ఉద్యోగం స్థిరంగా లేకపోతే డబ్బెక్కడినుండి వస్తుందీ, చదువులూ, పెళ్ళిళ్ళూ ఎలా చేసేవారు? ఏమైనా అంటే ఇప్పటివారు చెప్పే explanation ఒక్కటే–అప్పటి వారు జీవితం తో reconcile అయిపోయారు అని. ఒప్పుకున్నామండి.దానివల్ల లాభం ఎవరికి వచ్చిందీ?

ఇంకా ఏమైనా అంటే అప్పటికీ, ఇప్పటికీ సహస్రాలు తేడా ఉందీ, ప్రపంచం అంతా స్పీడ్ గా వెళ్తోందీ, మీలాంటివారు ఇంకా పాత జ్ఞాపకాలలోనే బ్రతుకుతున్నారూ అంటారు. ఒక్కటి చెప్పండి-ఇప్పటి వారికేమైనా మాలాంటివారి కొచ్చే Feel good జ్ఞాపకాలు ( ఉద్యోగాలకి సంబంధించినంత వరకూ) ఉన్నాయా? ఉండడానికి ఒకే ఉద్యోగంలో ఉన్నవాళ్ళెంతమంది? నాకు ఒక విషయం అర్ధం అవదు. మనం రోజూ తినే తిండితో బోర్ అవుతామా? రోజూ చూసే పిల్లలతో బోర్ అవుతామా? లేనప్పుడు రోజూ చేసే పనితో బోర్ ఎలా అవుతాము?,

    మనింటికి ప్రతీ రోజూ పని మనిషి వస్తుంది, చాకలి బట్టలు తీసుకుని వెళ్తాడు, పాల వాడు పాలు తీసికొస్తాడు, ఒక్కసారి ఊహించుకోండి వీళ్ళంతా వారి వారి పనులతో బోర్ అయిపోయి,
So called job satisfaction అనే వంక తో పని మానేస్తే ఎలా ఉంటుందో?
 నేను చెప్పేదేమిటంటే ఏదో ఒక ఉద్యోగంలోనైనా కొన్ని సంవత్సరాలు పని చేసి, ఆ పనిలొ నిమగ్నమై
జీవితంలో కొంత సమయమైనా ఈ Feel good అంటే ఏమిటో తెలిసికోవడానికి ప్రయత్నించమని.ఇదంతా పాత రాతి యుగం ఖబుర్లలాగా ఉన్నాయంటారు కదూ?
నేను వ్రాసినదంతా ప్రతీ ఏడాదీ ఉద్యోగాలు మార్చేవారి గురించి మాత్రమె.
 మనం చేసే ప్రతీ పనిలోనూ ఏదో ఒక ఆనందం ఉంటుంది. దానిని గుర్తించి, దానిని enjoy చేయడంలోనే ఉంది.

గత నెల రోజులుగా మారిన జాతీయ, అంతర్జాతీయ పరిస్థితుల రీత్యా, ఉద్యోగస్థుల దృష్టికోణం లో కూడా మార్పులు చూడొచ్చేమో… ఈ  Lock Down  పూర్తయేటప్పటికి, అసలు ఎంతమందికి ఉద్యోగాలుంటాయో తెలుస్తుంది.. అలాగని ఉద్యోగాలు ఊడిపోతాయనీ కాదు.. ఏమో what the future holds for us  అన్నదానికి గారెంటీ లేదుగా.. అయినా అంతా మంచే జరగాలని ఆశిద్దాం..

7 Responses

 1. మా పెన్షన్ సగమే ఇచ్చారు. Salariesకూడా అంతే. మంచి రోజుల కోసం ఎదురు చూద్దాం.

  Liked by 1 person

 2. Job Satisfaction గురించి భలే విశ్లేషణ చేసారండి ఫణిబాబు గారు.

  ప్రభుత్వోద్యోగాలకు, ప్రైవేట్ రంగ (అందునా ముఖ్యంగా కార్పొరేట్ రంగ) ఉద్యోగాలకూ ఉన్న వ్యత్యాసం, జాబ్ సెక్యూరిటీ తక్కువైన పరిస్ధితి ఇటువంటి కప్పగంతులకు దారి తీస్తోందేమోనని నా అభిప్రాయం. మీరన్నట్లుగా ఒక ఉద్యోగిని ఎక్కువ కాలం అదే కంపెనీలో బతకనివ్వని over-action చేసే మేనేజర్లు కూడా కార్పొరేట్ రంగంలో మన దేశంలో ఉంటారని విన్నాను.

  తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి ఉద్యోగాలు కాబట్టి ఉన్నంతలో సంపాదించేసుకుందాం, ఎవడు ఓ రూపాయి ఎక్కువిస్తానంటే వాడి వైపు వెళ్ళిపోదాం అనే ధోరణి ప్రబలినట్లుంది. Loyalty అరుదైన లక్షణమై పోయిందా అనిపిస్తోంది. ఉద్యోగస్తులలో loyalty ఏర్పడడానికి కావలసిన అనుకూలత పెంపొందించడం లేదు వాళ్ళ పై వాళ్లే అనుకోవాలా? ఇదంతా పైకి చెప్పుకోలేరు కాబట్టి job satisfaction అనే సాకును ఉపయోగించుకుంటున్నారేమో ఆధునిక యువత?

  Liked by 1 person

  • నరసింహరావుగారూ
   ఈ ప్రైవేట్ ఉద్యోగాలు కొత్తగా వచ్చినవేమీ కాదు కదా ..నా ఉద్దేశ్యం ఈ జాడ్యం IT Sector లోనే ఎక్కువ. Core Industry లో మరీ ఇంత అన్యాయం కాదు. అయినా వచ్చే రెండుమూడేళ్ళలోనూ మారొచ్చేమో.

   Like

 3. Main reason could be especially in IT industry, jobs are projects oriented , when project is over your skill sets are of no more further of value, and you jump on to another place where it has a value and the wheel moves on.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: