బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–పెరటి చెట్టు…


పురాతన గ్రంధాల్లో చదివాము— వైద్య శాస్త్రంలో మన దేశంలో ఎందరో ఘనాపాఠీలుండేవారని… మన పెద్దలు తమ అనుభవంచేతనైతేనేమిటి,  ఆ గ్రంధాలు చదవడం వలన అయితేనేమిటి, తరతరాలుగా వనమూలికలనే ఉపయోగించి వైద్యం చేసేవారు. వీటిని ఎలా వాడాలో, ఏ మొతాదులో వాడాలో కూడా పుస్తకాల్లో వివరంగా ఉండేది… కాలక్రమేణా వంశపారంపర్యంగా సామాన్యులకి కూడా అందుబాటులోకి వచ్చాయి. పైగా ఈ వనమూలికలు చాలా ప్రదేశాల్లో దొరికేవి. ఏ మూలిక దేనికి ఉపయోగిస్తుందో తెలిస్తే చాలు… ఇంట్లోనే  ప్రధమ చికిత్సలాటిది కానిచ్చెసి, అవసరాన్నిబట్టి ఏ  వైద్యుడివద్దకో తీసికెళ్ళేవారు..

 అందుకనేనేమో మన చిన్నప్పుడు, ఏదెబ్బైనా తగిలి రక్తం కారుతూంటే, వెంటనే ఏ పసుపో అద్దేస్తే రక్తం కాస్తా కారడం ఆగిపోయేది. అలాగే ఏ కావిర్లు లాటివో వస్తే, అదేదో చెట్టు ఆకులు తెచ్చి, పసరు  ఓ నాలుగైదురోజులు తాగిస్తే, మామూలు గా అయిపోయేవారు. ఇంక పాము కాటులూ, తేలుకాట్లకీ అయితే , ఏవో మంత్రాలు వేస్తే, ఆ విషం కట్టుబడిపోయేది. “ మంత్రాలకి చింతకాయలు  రాల్తాయా”  అని ఇప్పటివారు హేళన చేయొచ్చు, కానీ రాలేవన్నది మాత్రం నిజం… అలాగే పెరిగిపెద్దయాము కదా.. ఏ పిప్పిపన్ను నొప్పో వస్తే ఓ లవంగం అక్కడ పెట్టుకుంటే, ఆ నొప్పి తగ్గేదిగా.  అవన్నీ ఈనాటివారు  విన్నప్పుడు నవ్వులాటగా కనిపించవచ్చు, కానీ ఈ లవంగాలతోనూ, ఈ పసుపుతోనూ తయారుచేసి, ఏదో బహుళజాతి కంపెనీవాళ్ళో , పెద్దపెద్ద  వ్యాపార ప్రకటనలతో హోరెత్తించేసి, తయారీ ఖర్చుకి నాలుగైదింతలు చేసి అమ్మినా, ఎగబడి కొనుక్కుంటారే కానీ, “ అరే ఇది మన పసుపే, మన లవంగమే కదా.. “ అని ఒక్కడూ ఆలోచించడు. ఒకానొకప్పుడు పళ్ళుతోముకోడానికి, బొగ్గో,  వేపపుల్లో వాడేవారు.. అవన్నీ  exploit  చేస్తూ,  “ మీ Tooth  paste  లో  Coal ఉందా,  Neem  ఉందా “ అని ప్రకటనరావడం తరవాయి, “ అబ్బ ఎంత మంచి పేస్టో.. “ అంటూ ఇంట్లో వాళ్ళందరూ ఆ పేస్టే వాడ్డం… వీటికి సాయం , యోగా లో ప్రసిధ్ధిచెందిన ఆ పతంజలి గారేమో , బహుళజాతి కంపెనీలు తయారుచేసే ప్రతీ వస్తువునీ, మన దేశీయ పేరుపెట్టగానే , వాటి వెనక్కాల పడ్డం ఓ వేలం వెర్రైపోయింది… MNC Brands  అన్నిటికీ ఓ దేశవాళీ పేరు పెట్టి, తన   Business Empire  ని లక్షల  కోట్లలోకి తీసికెళ్ళగలిగారు.

 ఇవన్నీ ఒక ఎత్తైతే, ఆరొగ్యవిషయంలో, విదేశీ శాస్త్రజ్ఞులు చెప్పిందే మన వాళ్ళకి వేదం… పోనీ మనవాళ్ళేదైనా చెప్తే వింటారా, అబ్బే .  అదేదో  విదేశీకంపెనీ ఓ మందుతయారుచేసిందంటే, వాళ్ళ దేశం లో అమ్ముడుబడ్డా లేకపోయినా, మనవాళ్ళు మాత్రం తప్పకుండా కొంటారు… ఎంతైనా ఫారిన్ కంపెనీదికదాండీ.. అంటూ.. అవే మూలాలతో దేశంలో ఎవరో తయారుచేస్తే దానిమొహం చూసేవాడుండడు…  ఆ విదేశీ శాస్త్రజ్ఞులు తక్కువ తిన్నారా ఏమిటీ?   యుగయుగాలనుండీ మన దేశంలో విరివిగా వాడుకలో ఉండే కొన్నిటిని,  ఏదో  research  పేరుతో “ హాఠ్ దాన్ని ఉపయోగిస్తే ఆరోగ్యానికి హానికరం “ అంటాడు. అప్పుడెప్పుడో, మన పసుపు మీద అవాకులూ చవాకులూ మాట్టాడారు.. చివరకి వాళ్ళ విదేశీ కంపెనీలే తెలివితెచ్చుకుని, అదే పసుపు కి బ్రహ్మరధం పడుతున్నారు. ఈమధ్యన ఇంకోడెవడో “ కొబ్బరి నూనె విషంతో సమానం.. “ అన్నాడు. అంటే మనవాళ్ళు యుగయుగాలనుండీ కొన్ని చోట్లైతే వంటకి కూడా, వాడుతున్నది విషమా?  మనవాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యా రాలేదే?కరోనా మహమ్మారి ధర్మమా అని so called technologically developed  దేశాల్లోనే మరణాలు ఎక్కువగా రికార్డవుతున్నాయి.  ఆయనెవరో ఈమధ్యన  రొజూ ఓ మూడు నాలుగు చెంచాల కొబ్బరి నూనె తాగితే, ఎలాటి ఆరోగ్యసమస్యలూ ఉండవన్నారు. ఎవరిని నమ్మేదీ?

అంతదాకా ఎందుకూ… యుగయుగాలనుండీ అలవాటు పడ్డ  Gripewater  ని పక్కకు పెట్టేసారు.. ఈ విదేశీ కంపెనీలు.. నెత్తికి నూని, అన్నంలోకి నెయ్యీ వేసుకోవడం ఓ ఘోరపాపంకిందజమకట్టించేసారు..ప్రతీదానికీ అదేదో కొలస్ట్రాల్ పెరుగుతుందీ అని భయ పెట్టడం.. అసలు ఈరోజుల్లో వచ్చే రోగాలకి ముఖ్య కారణం—బర్గర్లూ, సబ్ వేలూ, వాటితో సాఫ్ట్ డ్రింకులూ అని మాత్రం ఒప్పుకోరు..

ఈ కరోనా  Lockdown  వలనైనా వీటి వాడకం తగ్గితే బావుండును…

గుర్తుండే ఉంటుంది- ఆమధ్యనెప్పుడో , తలనొప్పికి వాడే  SARIDON  మాత్రలు నిషేధించేమని ఓ ప్రకటన వచ్చింది. వాటిని వాడితే అవేవో  side effects  వస్తాయన్నారు. కొంతమందికి వాటిని వేసుకుంటేకానీ తలనొప్పి తగ్గదాయే. పైగా వీటికి డాక్టర్  prescription  కూడా అవసరం లేదు. ఏడాది తిరిగేటప్పటికల్లా సుప్రీం కోర్టు వారు, “ ఏం పరవాలేదూ వాడుకోవచ్చూ.. “ అని తీర్పిచ్చేసారు. అసలు మొదట్లో, ఎందుకు వాడద్దన్నారో మాత్రం తెలియదు. .. ఏమో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఎవరైనా వైద్యుడున్నారేమో….

అసలు గొడవంతా ఎక్కడంటే, మనవాళ్ళు దేశంలో వైద్యవిద్య అభ్యసించి, పై చదువులకి విదేశాలు వెడతారే అక్కడొచ్చింది… పోనీ ఆ పైవిద్యేదో మన దేశంలోనే చదవొచ్చా అంటే, ఇక్కడేమో ప్రవేశానికే వందలకొద్దీ ఆటంకాలు, ఏవేవో అడ్డంకులు.., కాదూ కూడదంటే, ఏ  Private College  లోనో కోట్లు ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి. ఈ గొడవంతా పడలేక, ఆ ఖర్చేదో పెట్టుకుంటే, హాయిగా విదేశీ   degree  దొరుకుతుందికదా అని, అక్కడకే లైను కట్టేస్తున్నారు. పైగా ఆ డాక్టరు  పేరు చివర ఓ విదేశీ degree  తగిలిస్తే, కాసుల వర్షమే కదా…

 “ పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు “ అన్న  లోకోక్తిలోంచి బయటపడితే తప్ప, మనకి బాగుపడే లక్షణాలు కనిపించడం లేదు…

10 Responses

 1. విదేశాల్లో డాక్టరీ చదువుకొని వచ్చేస్తే చాలదండీ. మళ్ళా మన దేశవాళీ పరీక్షలు ఒకటో రెండో ఉంటాయి. వాటిని కూడా పాసవ్వాలండీ ప్రాక్టీసు చేయాలంటే.

  Liked by 1 person

  • MBA కోర్సులో అటువంటి కిటుకులు నేర్పుతారేమోనని నా అనుమానం అండీ. పాసై ఉద్యోగంలో చేరిన తరువాత “కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత” అన్నట్లు తయారవుతారేమో?

   Liked by 1 person

  • శ్యామలరావుగారూ,
   మరి అంతలా జరిగినతరవాతకూడా, మన ప్రాచీన వైద్యం అంటే అంత చిన్న చూపా ..?

   Like

 2. ఇంజక్షన్ చేయకపోతే సరైన డాక్టర్ కాదు అనుకుంటారు చాలామంది. ధనార్జనేె ధ్యేయంగా విపరీతంగా కష్టపడి అనారోగ్యం పాలైన డాక్టర్ లు నాకు తెలుసు. మన పోపుల పెట్టె మెడికల్ కిట్. అలాగని పీకలమీదకి వచ్చేదాకా నిర్లక్ష్యం చేయడం తప్పు.

  Liked by 1 person

 3. ఇప్పుడు చాలామందికి పెరడూ లేదు, చెట్టూ లేదు. చిట్కా వైద్యం చిన్న చిన్న సమస్యలకి పరవాలేదు కాని, అన్నింటికీ వాడితే ప్రమాదమే!
  ఇప్పుడు సమస్య ఏమిటంటే యుట్యూబ్ వచ్చాకా, బోలెడంతమంది ఘరానా వైద్యులు బయలుదేరారు. ఆసక్తికరమైన వ్యాఖ్యలతో ప్రజల బలహీనతతో ఆడుకుంటున్నారు. వీళ్ళంతా మఘలో పుట్టి పుబ్బలో పోయేవాళ్ళే. కాని వీళ్ళు వాక్చాతుర్యంతో విద్యాధికులని కూడ మోసం చేస్తున్నారు. వీళ్ళని ఫాలో అయ్యేవాళ్ళతో వాదిస్తే కోపాలు కూడ వస్తున్నాయి.
  అలోపతీ మీద నమ్మకం లేకపోతే అసలైన ఆయుర్వేదాన్ని నమ్మాలి కాని, ఇలాంటి ఘరానా వైద్యులని నమ్మితే చాలా ప్రమాదమని నా అభిప్రాయం.

  Liked by 1 person

 4. బోనగిరి గారూ,
  మీరన్నది అక్షరసత్యం.. ఈమధ్య ప్రతీవాడూ ఓ విడియో తయారుచేసేసి, జనాలమీదకి వదులుతున్నారు.. ఒకడు చెప్పింది మరొకడు కాదంటాడు.. ఎవరిని నమ్మాలో తెలియదు.. మీరన్నట్టు జనాల బలహీనతలతో ఆడేసుకుంటున్నారు.. ప్రతీదీ commercial అయిపోయింది…

  Like

 5. ఫణిబాబు గారు,
  పైన నా కామెంట్ (MBA ల పైత్యం గురించి) శ్యామలరావు గారి వ్యాఖ్యకు స్పందన లాగా పడింది … నా పొరపాటు వల్ల. నిజానికి ఆ రెండింటికీ సంబంధం లేదు.

  విదేశీ డాక్టరీ చదువు గురించి శ్యామలరావు గారు చెప్పినది నిజం. మీరన్నట్లు డాక్టర్లు తమ వృత్తి మెళకువల గురించి తమ సీనియర్లను చూసి నేర్చుకుంటారేమో బహుశః ?

  నేను చెప్పదలుచుకున్నది మీ టపాలో వచ్చిన MNC ల ప్రస్తావన సందర్భంగా innovation పేరుతో MBA ల అరాచకం గురించి. wrong positioning of my comment అంతే.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: