బాతాఖాని- లక్ష్మి ఫణి కబుర్లు– రైల్వేల నిర్వాకం..


 అప్పుడెప్పుడో దురాంతో లో పూణె నుండి, హజ్రత్ నిజాముద్దీన్ దాకా వెళ్ళాం.. ప్రయాణం గురించి ఓ ఐడియా ఉంది.. భోజనం, చాయ్, స్నాక్స్ లాటివి ఇస్తాడని.. మేము సాధారణంగా పూణె నుంచి సికిందరాబాద్ దాకా శతాబ్ది లోనే వెళ్ళి , మర్నాడో మూడోనాడో శతాబ్దిలోనే తిరిగిరావడం.. మొదట్లో చైర్ కార్ లోనే వెళ్ళినా, ఈమధ్య కన్సెషన్ ఎలాగూ ఉంది కదా అని,  Executive Class  లో మొదలెట్టాము.. ఇక్కడైతే కాళ్ళు జాపుకోడానికి తగినంత జాగా ఒకటీ, తిండిలో కూడా తేడా గమనించాము.. భోజనం ఒక్కటే అయినా, మిగతా గంట గంటకీ ఇచ్చేవాటిలో చాలా తేడా ఉంది..

 మరీ శతాబ్ది లో 7-8 గంటలు కూర్చోడం కష్టంగా అనిపించి, మొన్న వెళ్ళినప్పుడు, తిరుగుప్రయాణానికి శుక్రవారం,  Sec’bad- LTT  దురాంతో ఉంది కదా అని అందులో బుక్ చేసుకున్నాను…

గమనించే ఉంటారు.. IRCTC  లో బుక్ చేసేటప్పుడు, వాడిచ్చిన ఆప్షన్స్ లో ఏ ఒక్కటి టిక్ చేయకపోయినా , అంటే..  Age, Gendre,  Berth preference,   Concession, Meal  వీటిలో  ఏదైనా మర్చిపోతే ఓ  alert  వస్తుంది కదా.. మొత్తానికి అవన్నీ ఫిల్ అప్ చేసి బుక్ చేసాను.. పోనీ పడుక్కుని వెళ్ళొచ్చు కదా అని…

శుక్రవారం రాత్రి 11 గంటలకి ట్రైనూ.. పదింటికల్లా చేరి, మొత్తానికి అదేదో  PF 9  మీద ఉంటే, అవేవో ఎస్కలేటర్లూ అవీ ఎక్కి, ఓ అరఫర్లాంగ్ నడిచి, మొత్తానికి ట్రైన్ ఎక్కాను..

 IRCTC  వాడు వయసూ, బెర్త్ ప్రిఫరెన్సూ అడగడమైతే అడిగాడు కానీ, 75 ఏళ్ళవాడికి  Upper Berth  ఇవ్వడమేమిటీ? అసలు అడగడం ఎందుకో? ఆ అప్పర్ బెర్త్ ఎక్కుతూ, ఏ కాలో చెయ్యో విరిగితే వాడు ఏమైనా కాంపెన్సేట్ చేస్తాడా పెడతాడా? మొత్తానికి, ఓ పెద్ద మనిషిని రిక్వెస్ట్ చేస్తే, పాపం ఒప్పుకున్నాడు, తన మిడిల్ బెర్త్ ఇవ్వడానికి…

ఈ రిక్వెస్ట్ ల సందర్భంలో ఓ చిన్న అనుభవం … అదేం కర్మమో నాకు కన్సెషన్ ప్రారంభం అయినప్పటినుండీ ఇదే తంతు.. వాడు అప్పర్ బెర్త్ ఇవ్వడం, నేనేమో ఎవరో ఒకరి కాళ్ళు పట్టుకోవడం..ఓసారి చిర్రెత్తుకొచ్చి  IRCTC  వాళ్ళకి ఓ  mail  పంపి అడిగితే, వాడిచ్చిన సమాధానం.. ఈ బెర్త్ వ్యవహారాలు అవేవో కంప్యూటర్ లో random  గా జరుగుతాయీ, మేమేమీ చేయలేమూ.. మహా అయితే తోటి పాసెంజర్లని రిక్వెస్టు చేయడమే.. అని జ్ఞానబోధ చేసాడు.. నాయనా బభ్రాజిమానమూ, నేను  చేస్తున్నదదే.. ఏదైనా విమోచనామార్గం తెలపరా అంటే, మళ్ళీ జవాబు లేదు.అదేమిటో రైల్వే వాళ్ళకి అంతులేని ప్రేమ నేనంటే.. చివరకి  AC I, AC2  ల్లోకి మారాము కన్సెషన్ ధర్మమా అని..ఏమైనా నా జాతకం మారిందేమో అని చూస్తే  AC3  లో మళ్ళీ సీన్ రిపీట్..

 ఓ  good Samaritan  నన్ను  oblige  చేసారని చెప్పానుగా, కానీ అప్పటికే మరొకరిని కూడా  oblige  చేసినట్టు,  T C  వచ్చినప్పుడు తెలిసింది. నాకంటే ముందే, ఒ దంపతులకి విడి విడి బోగీల్లో ఇవ్వడంతో, పాపం ఇతను బెర్త్ మారాడు. చెకింగ్ కి వచ్చినప్పుడు టిసీ ఒప్పుకోడే.. అదేదో మరో బోగీ, నాకు తెలియదూ అంటాడు. అప్పటికీ ఈ పెద్దమనిషి, తను ఎవరికోసం మార్చాడో, ఆ  PNR No  స్కాన్ చేసింది చూపించినా కూడా…రాత్రి ఒంటిగంట దాకా ఇదో భాగవతం.

ఇంక మిడిల్ బెర్త్ లోకి ఎక్కడానికీ నానా యోగాసనాలూ  చేస్తే కానీ పట్టం. మిడిల్ బెర్త్ లోకి ఎక్కడమంత మహా యజ్ఞం మరోటి లేదు…

 ఇంక చివరగా, ఆప్షన్స్ లో వెజ్జా  నాన్ వెజ్జా అని అడిగాడూ, రాత్రిపూట ఏమిస్తావని ఎటెండెంట్ ని అడిగితే, 8 దాటిన తరవాత బ్రేక్ ఫాస్టూ అన్నాడు.. మేమేమో పూణె లో , 750 కి దిగిపోతాము కదా, మరి మాకో అని అడిగితే, లేదూ అన్నాడు. అలాటప్పుడు ఆ ఆప్షన్స్ అడగడం ఎందుకూ, టిక్కెట్టులో తీసుకోవడమెందుకూ?

దీక్షా వస్త్రాలు మాత్రం ఇచ్చాడు…

అదండీ రైల్వేల వారి నిర్వాకం.. హాయిగా శతాబ్ది లోనే హాయి..

అఛ్ఛే దిన్ అంటే ఇవేనేమో…

 మేరా భారత్ మహాన్…

23 Responses

 1. ఆమధ్య కొన్నాళ్ళు AC compartments లో పొదుపు పథకం క్రింద side middle కూడా ప్రవేశ పెట్టారు రైల్వే వారు. గరీబ్ రథ్ లో ఇప్పటికీ ఉంది అనుకుంటా.మనకి allot చేసిన బెర్త్ నెంబర్ T.C రాగానే మారి పోయేది. ఇదేమిటని అడిగితే అదింతే అని సమాధానం.

  Liked by 1 person

 2. మాస్టారూ,
  ఈ రైళ్ళలో చేసే వాటిని గురించి అడిగినా దేశద్రోహం కింద అనుకుంటారు ఈ రోజుల్లో.. ఇదివరకు AC ల్లో కూడా Fan లు ఉండేవి.. ఈ Train లో వాటికి కూడా నోచుకోలేదు…

  Like

 3. రైళ్ళది ఈ రకం, ఎయిర్‌లైన్స్ ది మరో రకం కదా, ఫణిబాబు గారూ. ఎయిర్ ట్రావెల్ సేఫ్టీ అనే కారణంతో ప్రతి చిన్న విషయంలోనూ, కేబిన్ స్టాఫ్ అహంకారంతోనూ కూడా నిరంకుశ ధోరణి చూపిస్తుంటాయి ఎయిర్‌లైన్స్. ఈ పోకడ రానురాను ఎక్కువవుతోందని అనిపిస్తుంటుంది నాకు పత్రికల్లో వచ్చే సంబంధిత వార్తలు చదివినప్పుడల్లా. డబ్బులిచ్చి తలొంచుకుని కూర్చునే గతి air travel ప్రయాణీకులది.

  రైలు రిజర్వేషన్ విషయంలో సీనియర్ సిటిజెన్స్ కష్టాలు గురించి మీరన్నది అక్షరసత్యం. కంప్యూటర్ చేస్తుంది అన్నది ఒక సాకు మాత్రమే అని నా అభిప్రాయం. కౌంటర్లోని రైల్వే ఉద్యోగి పబ్లిక్ తో వెటకారంగా మాట్లాడడానికి బాగా పనికొస్తుంది. ఒకవేళ అదే గనక నిజమైతే … ప్రయాణీకుల వయసును (ఆడ సీనియర్ సిటిజెన్లా అన్న అంశం కూడా) పరిగణనలోకి తీసుకోకుండా గుడ్డిగా పడకల అలాట్-మెంట్ చేస్తోందీ అంటే అది చాలా అసమర్థపు / నిర్లక్ష్యపు ప్రోగ్రామింగ్ అంటాను నేను. కానీ కౌంటర్ ఉద్యోగికి స్క్రీన్ మీద బెర్త్ సెలెక్షన్ (ఖాళీ ఉన్న బెర్తుల్లో) వెసులుబాటు ఉంటుందని నా నిశ్చితాభిప్రాయం. ఎందుకంటే ఒకసారి నేను ఇరవై బెర్తులు బుక్ చేయాల్సి వచ్చింది (పెళ్లికి వెళ్ళడానికి). మనం ప్రయత్నిస్తే అవదని …. అన్నీ లోయర్ బెర్తులు కావాలని తెలిసిన ఒక ట్రావెల్ ఏజంట్ ను అడిగాను. అతను వెళ్ళి అలాగే చేయించుకొచ్చాడు మరి. అందువల్లే నాకు పైన చెప్పిన అభిప్రాయం కలిగింది.

  పై బెర్త్ రావడమనేది నాకూ చాలా సార్లు జరిగింది / జరుగుతూనే ఉంటుంది. అటువంటప్పుడు కాసేపాగి మళ్ళీ ఇంకొక రిజర్వేషన్ (online) చేస్తుంటాను … ఈ సారన్నా కింది బెర్త్ దొరకకపోతుందా అనే ఆశతో. దొరికితే మొదటి టికెట్ కేన్సిల్ చేస్తాను. దొరకకపోతే రెండో టికెట్ కేన్సిల్ చేస్తాను 🙂. కేన్సిలేషన్ భారం మరీ ఎక్కువవుతోందనిపించి ఆ తరువాత AC-2 Tier కు మారాను. 3-Tier లో పై బెర్త్ కంటే 2-Tier లో పై బెర్త్ కాస్త ఎక్కబుల్ గా అనిపిస్తుంది (కానీ సైడ్ అప్పర్ బెర్త్ అయితే అదీ నరకమే). ఇప్పుడు చాలా మందికి ఇదే ఆలోచన తడుతున్నట్లుంది ….. AC-2 Tier ముందరే నిండిపోయి వెయిట్ లిస్ట్ లోకి వెళ్ళిపోతోంది. ఈ మధ్య ఒక ప్రయాణం చేశాను … సైడ్ అప్పర్ బెర్త్ వచ్చింది ☹️. బోగీ ఎక్కిన తరువాత టి.టి.యి. గారిని ఏదన్నా లోయర్ బెర్త్ దొరుకుతుందా అని అడిగాను. ఎక్కడ సార్, బోగీ మొత్తం సీనియర్ సిటిజెన్సే అన్నాడు సదరు టి.టి.యి. గారు 🙂 …. అంటే ఎవరితోనూ సర్దుబాటుకు (exchange) కూడా అవకాశం లేదన్నమాట ☹️.

  చాలామందికి లాగానే నాదీ మరొక అనుభవం కూడా . అదృష్టవశాన మనకి లోయర్ బెర్త్ దొరికిందే అనుకోండి. ఆ బెర్త్ మీద పడుకుంటాననే భరోసా ఉండదు. మనం కూర్చోగానే ఎవరో ఒకరు (సాధారణంగా ఆడవాళ్ళు) వచ్చేసి మీరు పై బెర్త్ కు వెడతారాండీ అని అడిగేస్తారు. అలా అడిగేవాళ్ళు ఎక్కువగా చెప్పే కారణం … మోకాళ్ళ నెప్పులు లేదా మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకున్నాను అని 🙂. ఏమీ అనలేక మనం త్యాగం చేసేస్తుంటాం. నా బాధ ఏమిటంటే …. అదేమిటో అలా అడిగేవాళ్ళకు నేను కూడా సీనియర్ సిటిజెన్ లాగా అనిపించనా ఏమిటీ అని 🙄?

  పైన మీరు చెప్పిన బెర్తులు మారడం అన్నది (ముఖ్యంగా వేరే బోగీకు) నేనూ వీలయినంత వరకూ oblige చేస్తుంటాను (నేను ఒకడినే ప్రయణిస్తున్నప్పుడు) … కానీ ఒక ఖచ్చితమైన కండిషన్ మీద … అదేమిటంటే టి.టి.యి. వచ్చి నా టికెట్ చెకింగ్, నన్ను request చేసిన ప్రయాణీకుడి/రాలి టికెట్ చెకింగూ పూర్తయిన తర్వాతనే అని, అంతవరకూ ఆగాలనీ. లేకపోతే టి.టి.యి గారు అర్ధరాత్రి అంకమ్మ శివాలు వేస్తే ఎక్కడ పడగలం?

  రెగ్యులర్ మిడిల్ బెర్త్ ఎక్కడం అంటే మీరన్నట్లు రాందేవ్ బాబా శిష్యులం అయ్యుండాలి. దీన్ని తలదన్నినది పైన రాధారావు గారు చెప్పిన సైడ్ మిడిల్ బెర్త్ … అది మరీ ఒక cruel joke అంటాను. లల్లూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన పైత్యం అని గుర్తు. ఆ బెర్త్ భయం మూలానే నేను “గరీబ్ రథ్” ట్రెయిన్ reservation గురించి ఆలోచన కూడా చెయ్యను 😳.

  Yes, నిజంగానే మీరన్నట్లు “మేరా భారత్ మహాన్” 🙏.

  Liked by 2 people

 4. నరసింహరావు గారూ,

  మీరన్నట్టు ఏజంట్ ద్వారా ఎక్కడైనా సంపాదించొచ్చు.. Sincere గా మనమే ప్రయత్నిస్తే దైవాధీనమే.. నేనూ నా భార్యా శతాబ్దిలో వెళ్ళేటప్పుడుకూడా, ఈ రైల్వేవాడు మమ్మల్నిద్దరినీ విడకొడతాడు.. పాపభీతున్నవాడిని రిక్వెస్ట్ చేసి , ఇద్దరమూ ఒకే చోటకి మార్చుకోవడం..
  నేను Flight లో వెళ్ళను.. అందువలన నాకు ఆ అనుభవాలు లేవు….

  థాంక్యూ…

  Like

  • // “పాపభీతి ….” //

   హ్హ హ్హ హ్హ హ్హ, బాగా చెప్పారు ఫణిబాబు గారూ. బహుశః దాని వల్లనేనేమో మనకి అరుదుగానయినా ఎవరో ఒకరు లోయర్ బెర్త్ ఇస్తారనుకుంటాను 😆.

   Like

   • నరసింహారావు గారూ,

    అదేం చిత్రమో కానీ, నా రిక్వెస్ట్ ని తిరస్కరించినవారు బహు తక్కువ , అనడంకంటే అస్సలు లేరు అని చెప్పవచ్చు.. నా కబుర్లు విని, చుట్టూ ఉన్న పదిమందిలో ఎవరో ఒకరు నా rescue కి వస్తారు.. బహుశా ఈ విషయం ఆ IRCTC వాడు పసికట్టాడేమో…వెళ్ళిపోతోంది బండి…

    Like

 5. ఓ 20సంవత్సరాలు వెయిట్ చెయ్యండి. అప్పుడు హాపీగా బుల్లెట్ ట్రైన్ ఎక్కొచ్చు. అందులో మీరు ఎంచుకునేది కిటికీ దగ్గర సీటా, ఇటు పక్క సీటా లేక నారీ నారీ నడుమ మురారీయా అనే!

  Like

 6. రైళ్ళలో లోయర్ బెర్త్ కోటా ఉంటుంది, తక్కువ సంఖ్యలోనే అనుకోండి. నాకు తెలిసి కౌంటర్లో టికెట్ కొంటేనే బెర్త్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అది కూడ ఆ ఉద్యోగి సహకరిస్తేనే.

  నేనైతే మా నాన్నగారితో ప్రయాణించేటప్పుడు వీలైనంతవరకు పగలే ప్రయాణిస్తాను. శతాబ్దిలోనో, ఇంటర్‌సిటీలోనో పగలు ప్రయాణిస్తే ఈ అప్పర్ బెర్తుల గొడవలు ఉండవు. పెద్దవాళ్ళకి రాత్రిపూట ఏమైనా ఇబ్బంది వస్తుందేమోనన్న భయం కూడా ఉండదు. పగటి ప్రయాణం సరదాగా కూడా ఉంటుంది, చిన్ననాటిలా. నేను కూడ రిటైర్ అయ్యాక, సెలవుల గొడవ ఉండదు కాబట్టి పగలే ప్రయాణిద్దామనుకుంటున్నాను. ఇప్పటికే వీలైనంతవరకు 3 టైర్ ఎక్కడం లేదు.

  Liked by 1 person

  • బోనగిరి గారూ,

   ఈరోజుల్లో దూరప్రయాణాలు చేయడమే బహు తక్కువ.. మహా అయితే పూణె నుండి తణుకు.. LTTT .Vizag లో AC 1 లోనే ప్రయాణం చేస్తూంటాము.. అక్కడకేదో ఒళ్ళు కొవ్వెక్కి కాదు.. కన్సెషన్ లో ఇద్దరికీ ఒక టికెట్ ( almost 50% 40% concession ) తో పనైపోతుందని

   Like

 7. బోనగిరి గారు,
  సీనియర్ సిటిజెన్స్ కొరకు రైళ్ళల్లో కొద్దిపాటి లోయర్ బెర్త్ కోటా ఉంటుంది నిజమే. అయితే అతి శీఘ్రంగా నిండిపోయే కోటా కూడా అదే 😒.

  పగటిపూట ప్రయాణాలంటారా … తక్కువ దూరాలకు బాగానే ఉంటుంది గానీ దూరాభారాలయితే వయసులో పెద్దవాళ్ళకు అంతసేపు కూర్చునుండడం కొంచెం అసౌకర్యమే కదా (AC Chair Car లో కూడా). ఉదాహరణకు హైదరాబాద్ నుండి వైజాగ్ ప్రయాణం అనుకోండి … పగటి రైళ్ళు ఉన్నాయి కానీ దాదాపు 12 – 14 గంటలు పడుతుంది. శతాబ్ది కాస్త comfortable గానే ఉంటుంది లెండి.

  (అమెరికా వెళ్ళడానికి చేసే విమాన ప్రయాణాలూ అలాగే ఉంటాయి కదా. బిజినెస్ క్లాసులో అయితే సీటుని పడకగా మార్చుకోవచ్చు గానీ ఎకానమీ క్లాసులో మాత్రం కూర్చుని చేసే ప్రయాణమేగా … 15 లేదా 16 గంటలు నాన్-స్టాప్ ఫ్లైట్ లో)

  Liked by 1 person

 8. What a pity 🙂 you guys travel in Indian trains ? What a pity what a pity 🙂

  నారదా!
  జిలేబి

  Liked by 2 people

 9. లారీల్లో ప్రయాణాలు గతకాలపు సాహసాలనుకుంటాను లెండి. ఒకప్పుడు తరచుగానే చేసేవారనుకుంటాను – ఉద్యోగం (బ్యాంక్ ఉద్యోగమా ??🤔) చేస్తున్న ఊరినుండి కుటుంబం ఉంటున్న ఊరికి శనివారం మధ్యాహ్నం చెక్కెయ్యడానికి 🙂.

  Like

 10. Guys అని పిలవవలదు బీ
  లేజి జిలేబీలము వినలేమా మాటన్
  రైజింగు ఓల్డు పీపుల్
  గా జర మము పిలువవమ్మ కంబుగ్రీవా!:)

  నారదా!
  జిలేబి

  Liked by 2 people

 11. జిలేబీ,

  మీ కవిహృదయం అర్ధం చేసుకునేటంత బుర్ర లేదు నాకు… ఏదో వచనంలో రాయొచ్చుగా…!!!

  Liked by 1 person

 12. నాకు కవిత్వము రాదో
  యీ కందమ్ములు పిరియపు మీ ఛందమ్ముల్
  పై కొంతయు లేదు సుమా
  నాకవగాహన జిలేబి నన్ను విడువవే 🙂

  Liked by 1 person

 13. ఫణి బాబు గారి బ్లాగ్ ఏప్రియల్ 15,2009 నుంచి
  ఒక సంకలనం మాత్రమె ebook గా Kinegi లో లభ్యం అవుతోంది మరి తరువాత బ్లాగులు కూడా Digital చేసేసి ఓ రెండో మూడో సంకలనాలు వీలయితేప్రచురితమైతే బాగుంటుంది అని సూచన

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: