బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు — నయనం ప్రధానం


సాధారణంగా, ఏదో రోజుమర్రా జిందగీలో, పగటిపూటా, రాత్రిళ్ళు లైటులోనూ ,  చూసి , వస్తువులనీ, మనుషులనీ గుర్తుపట్టగలిగితే, కంటి చూపు పరవాలేదనుకోచ్చు. ఓ వయసు దాటిన తరువాత, కొంచంకొంచం చూపు మందగిస్తూంటుంది.  అదేమీ ప్రాణాంతకం కాదు.. ఓ కళ్ళజోడు పెట్టుకుంటే పనైపోతుంది.. ఇదివరకటి రోజుల్లో ఆడపిల్లలకి పెళ్ళిముందర , కళ్ళజోడుంటే, పెళ్ళవదని భయపడేవారు.. ఇప్పుడైతే అందరికీ కళ్ళజోడు ఓ ఫాషనైపోయింది… 

నాగురించి చెప్పుకోవాలంటే, అదేం కర్మమో, ఎప్పుడూ  సరీగ్గా కనిపించేదేకాదు.కాలేజీలో బోర్డుమీద రాసింది ఛస్తే కనిపించేది కాదూ, పోనీ మొదటి బెంచీలో కూర్చుందామా, ఏదో కళ్ళు చిట్లించుకునైనా చూడొచ్చూ అనుకుంటే, మాస్టారు ఏవైనా ప్రశ్నలు వేస్తే… వామ్మోయ్, జవాబు చెప్పేటంత  I Q  ఉండేది కాదూ.. మొత్తానికి ఎలా పాసయానో ఆ భగవంతుడికే తెలుసు, ఉద్యోగంలో చేరిపోయాను. పూనా వచ్చిన తరువాత, ఉద్యోగంలో ప్రతీ ఏడాదీ ,  medical examination  అని ఒకటుండేది, ఏదో నాడి పట్టుకుని, గుండె ఆడుతోందో లేదో చూసి,   ఆ ఏడాదికి  fit  చేసేసేవారు.. సినిమాలకి వెళ్తే టైటిల్స్ కనిపించేవి కావూ..బస్సునెంబర్లైతే సరేసరి. అంతదాకా ఎందుకూ, పెళ్ళి సంబంధాల సందర్భంలో, దారిలో తణుకులో దిగాం, మా దొడ్డమ్మగారింట్లో, మేము అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూంటే , ఓ ఇద్దరు ఆడవారొచ్చారు… ఏమో మా దొడ్డమ్మగారి చుట్టాలేమో అనుకున్నాను.  అంత పరీక్షగా చూద్దామనుకున్నా, అసలే  ఆరోజుల్లో ఇళ్ళల్లో , పూర్తిచికటి పడితేనేకానీ, లైట్లు వేసేవారు కాదాయే..  ఏదో నకూర్చున్న నావైపు ఓ  cursory glance   వెసేసి వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోయారు..అమలాపురం వెళ్లినతరువాత, మా అమ్మమ్మగారు, తణుకులో చూసిన పిల్ల ఎలా ఉందిరా అని, అడిగితే ” ఏమో ఇద్దరిని చుసానూ.. బాగానే ఉన్నారూ..” అన్నాను. ఆవిడ, ” వెధవా, వచ్చింది తల్లీకూతుళ్ళు ..” అన్నారు.  ఎదో మర్నాడు, నేను చూసుకోబోయే బుల్లెమ్మ వచ్చింది, నాలుగైదడుగుల దూరంలో చూసానూ, కథ సుఖాంతం. మాకు అమ్మాయి పుట్టిన తరువాత, ఓసారి ఫాక్టరీ  Medical Examination  లో కళ్ళుకూడా టెస్ట్ చేయాలని, ఓ విపరీతబుధ్ధిపుట్టింది డాక్టరుగారికి..  నేనెమో ఆ  TEST BOARDS  మీదున్న ఇంగ్లీషు అక్షరాలు బట్టీపట్టేసి రెడీఅయిపోయాను.. ఆయనచేతులో పట్టుబడిపోయి, , ఉద్యోగం ఊడబోయి, మొత్తానికి కళ్ళకి అద్దాలొచ్చేసాయి.

మా ఇంటావిడకి ఈమధ్యన, అవేవో రోజూ పజిల్స్ తయారుచేస్తోందికదూ, కంటికి జోడున్నా, మసకమసగ్గా ఉంటున్నాయిట, అసలు విషయం అదికాదు,  ఇంట్లో ఎక్కడైనా బూజు పడితే, రాత్రిళ్ళే కనిపించేవి, sudden  గా అవికూడా అలాగే కనిపిస్తున్నాయిట. ఎక్కడైనా బూజుంటే ఈవిడకేమో నెద్ర పట్టదాయే… సరే ఈవిడకి  Software update  చేయిద్దామని, మా  CGHS  ద్వారా, అదేదో  Corporate Hospital కి వెళ్ళి టెస్టు చేయించుకుంటే, అదేదో  Cataract  అన్నారు, పైగా రెండుకళ్ళకీ.. సరేఅని  Surgery  కి ముహూర్తం పెట్టుకుని, ఇక్కడ  National Institute of Opthomology  కి వెళ్ళాము.. నేనూ , మా అమ్మాయీ తోడుగా…. నాకుతెలిసినంతవరకూ, కంటికి ఆపరేషనంటే,  ఏదో కంటికి ఓ పట్టీ, ఆ పట్టీ తిసేటప్పుడు, డాక్టరుగారూ, మెల్లిమెల్లిగా పట్టీతీస్తూ,, ఎవరినో ఎదురుగా నుంచోమని… clear  గా కనిపిస్తోందా అని అడుగుతూ… ఏవేవో అనుకున్నాము. మేము మాట్టాడుకుంటూంటే, తీసికెళ్ళిన పావుగంటలో, కళ్ళకి నల్లద్దాలు పెట్టుకుని, టింగురంగా మని వచ్చేసింది. అలాగే రెండో కంటికి కూడా, ఓ వారంరోజుల్లో  చేయించేసుకుని, రోజుకి మూడుపూటలా, అవేవో  drops  వేయించుకుంటూ, నల్ల కళ్ళద్దాలు అస్సలు తీయకుండా, (కరుణానిధిగారిలా).. , ఈ  రెండునెలలలోనూ, అమ్మాయి, కోడలూ సౌజన్యంతోనూ, మధ్యమధ్యలో  Zomato  ద్వారానూ… అప్పుడప్పుడు తను నిర్దేశించిన పాళ్ళలో నాచేతా,, ఎలాగోలాగ కాలక్షేపం చేసి, ఆ కాటరాక్ట్ యజ్ఞం  పూర్తయింది. ఇంకేముందీ..  ” నిన్న లేని అందాలేవో… ” అన్నట్టుగా ఈవిడకి, దూరంనుంచే, టీవీ,  ఫ్రిజ్ , టేబుల్ మీదా, మరకలే మరకలు కనిపించేస్తున్నాయి.. నేనేమో ఫ్ పాతగుడ్డా,  Colin  పట్టుకుని తుడవడం. 

మళ్ళీ వంటింటి సామ్రాజ్యంలోకి అడుగెట్టేసి, షడ్రసోపేతంగా వంట చేసేస్తోంది. పజిళ్ళూ తయారుచేసేస్తోంది…

 life goes on …

20 Responses

 1. నయనతార ప్రధానం అంటున్నారా ? ఎప్పుడు ఎక్కడండీ ?

  జిలేబి

  Liked by 1 person

 2. ఫణిగారు మీరు బ్లాగ్ పునరారంభించి మంచి పని చేశారు. దృష్టి బాగయింది కాబట్టి మీ శ్రీమతిగారు మళ్ళీ బ్లాగ్ మొదలెడతారా?

  Liked by 1 person

 3. అన్యగామీ,

  తను గత ఏణ్ణర్ధంగా Facebook లో 10000 Telugu Puzzles కోసం పజిల్స్ తయారుచేస్తోంది. ఇప్పటిదాకా 800 పజిల్స్ ( 8 e books ) తయారయాయి. ప్రస్తుతం 9 th in progress. బ్లాగులోకంలోకి ఇప్పుడప్పుడే రాకపోవచ్చు.

  Like

 4. చాలా బాగుంది. మీ రచనా చాతుర్యం మీ వాక్ చాతుర్యం లాగా సూపర్ మాస్టారూ…
  రాము

  Liked by 1 person

  • రామూ,

   అఛ్ఛా … అలాగా… అందుకే నా బ్లాగులకి ” బాతాఖానీ -లక్ష్మిఫణి ” అని పేరెట్టుకుంట. ఒఠ్ఠి సొళ్ళుకబుర్లు… పనీపాట లేదుగా…
   Most unproductive…

   Anyway thanks for the compliment…

   Like

 5. నేత్రానందంగా కనిపించే నయనతార లాంటి సుందరీమణులను చూడాలంటే నయనం ప్రధానం కదా. బహుశః “జిలేబి” గారి కవిహృదయం అదే అయ్యుంటుందండి ఫణిబాబు గారూ 🙂 (వారు ఏదీ సూటిగా చెప్పరు కదా 🙁).

  Liked by 1 person

 6. // “మెల్లిమెల్లిగా పట్టీతీస్తూ,, ఎవరినో ఎదురుగా నుంచోమని… clear గా కనిపిస్తోందా అని …. ” //
  ————-

  హ్హ హ్హ, అలనాటి సినిమాల్లో కంటాపరేషన్ అంటే చూపించే స్టాండర్డ్ సీన్ 😀.

  50 యేళ్ళ క్రితం మా నాన్నగారు కేటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు …. ఆ కాలంలో రాష్ట్రపతి గారి డాక్టర్ గా పేరు గాంచిన డాక్టర్ పి.శివారెడ్డి గారి ఆధ్వర్యంలో అప్పటి ఏపి రాజధానిలోని గవర్నమెంట్ నేత్రచికిత్సాలయంలో జరిగింది (అప్పటికింకా కార్పొరేట్ వైద్యం అనే మహమ్మారి తగులుకోలేదు సమాజానికి). లేజర్లు రాకముందు నాటి సంప్రదాయ విధానంలో జరిగింది. మూడు రోజులో, నాలుగు రోజులో హాస్పిటల్ లోనే ఉంచారు. తల అటూ ఇటూ తిప్పకుండా పడుకునుండాలని డాక్టర్ గారి ఆదేశం, తూచ తప్పకుండా పాటించిన మా నాన్నగారి క్రమశిక్షణ. సరే, టెక్నాలజీ వల్ల వైద్యవిధానాలు మెరుగైనట్లున్నాయి లెండి. అయినా మరీ పావుగంటలోనే ఆపరేషన్ పూర్తయిపోయి (ఇప్పటి కార్పొరేట్ పరిభాషలో “సర్జరీ” అనాలి కాబోలు 🙂) హాస్పిటల్ నుండి పంపించేస్తున్నారా? గణనీయమైన పురోగతి అన్నమాట 👏.

  ఇదేదో బాగానే ఉన్నట్లుందే. నేను కూడా ఒకసారి చూపించుకోవాలండి … చూపు మందగిస్తోందని అప్పుడప్పుడు అనుమానం కలుగుతుంటుంది, పరీక్ష చేయించుకోవడం నయం కదా నయనం ప్రధానం కాబట్టి 🙄.

  Liked by 1 person

  • నరసింహరావుగారూ,

   జిలేబీ కి నన్ను rag చేయడం ఓ hobby…

   అవునండీ, ఈ రొజుల్లో కాటరాక్ట్ సర్జెరీ చేసి , పావుగంటలో వచ్చేస్తారు.. మనం select చెసుకునే లెన్సులనుబట్టి ఖరీదూ… అది అయిన తరువాతి జాగ్రత్తలే ముఖ్యం. అవేవో మూడురకాల చుక్కలు రోజుకి మూడుపూటలా వెసుకోవడం. ఏ కంటికి చెసారో అటువైపు తిరిగి పడుక్కోకపోవడం, నల్ల కళ్ళద్దాలు, నెత్తికి స్నానం చేయకూడదూ, ఆడవారు వంటింటిలోకి వెళ్ళకూడదూ ( stove దగ్గరకు )… TV, Mobile లకు ఆ నెలరోజులూ దూరంగా ఉందడం…

   Like

   • హతవిధీ, ఆ చివరి నిబంధన కడుంగడు కష్టతరం కదా 😪 ?

    Liked by 1 person

 7. నరసింహరావుగారూ,

  అందుకే నేనూ చేయించుకోవడం లేదు….

  Liked by 1 person

 8. ఏలూరులో ఉండేటప్పుడు ఒక కళ్ళ డాక్టరు దగ్గరకు వెళ్లాను అద్దాలు పగిలిన శుభ సందర్భంలో. అప్పుడు ఆయన ఉత్సాహపడిపోయాడు,
  “కేటరాక్ట్ ఇనిషియల్ స్టేజ్ లో ఉంది ఆపరేషన్ చేసేస్తాను” అని.
  “ఇలియానా ఇలియానా లాగానే కనిపిస్తోంది. ఇంకోలా కనిపించినపుడు ఆలోచిద్దాం” అని జవాబు ఇచ్చాను.
  ఆ తరువాత కళ్ళ డాక్టరు దగ్గరికి వెళ్ళలేదు. ……….. మహా

  Liked by 2 people

 9. jజిలేబీ,

  కదా… అనుకున్నాను..

  Like

 10. మీ శ్రీమతిగారు పజిల్స్ తయారు చేస్తున్నారా?! భలే! నాకు ఫేస్‌బుక్ ఎకౌంట్ లేదు. ఆవిడ తయారు చేసే పజిల్స్ వివరాలు వారి బ్లాగ్‌లో ఉంటాయాండి?

  Liked by 1 person

 11. లలిత గారూ,

  FB Account open చేసేసుకోండి.. చాలా రకాల తెలుగు పజిల్స్ ఉన్నాయి. తను 10000Telugu Puzzles కి తయారుచెస్తూమ్ది. ఇప్పటికి 800 తయారుచేసింది.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: