ఏడాదైపోతోంది, బ్లాగులవైపు చూసి… అలాగని రాయడం మానేసానా అంటే అదీకాదూ… జస్ట్ బధ్ధకం.. ఈ ఏడాదిలోనూ కొన్ని రాష్ట్రాల్లోనూ, కేంద్రం లోనూ ఎన్నికలు జరిగాయి.. ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.. కేంద్రంలోనూ, తెలంగాణా లోనూ , పాతవారే తిరిగి ప్రభుత్వాలు ఏర్పాటు చేసారు, ఆంధ్రరాష్ట్రంలో, కొత్త ప్రభుత్వం..
పాత పార్టీయే తిరిగి ఎన్నికైనప్పుడు ఓ పేద్ద disadvantage ఉంటుంది, పాతవాళ్ళని తిట్టడానికి వీలుండదు.. ఆ తిట్టడాలూ, తప్పులు పాతవారిమీదకి తోసేయడాలూ, వీళ్ళు వారి మొదటి అయిదేళ్ళలోనూ చేసేసారు. ఇప్పుడు ఏమైనా లోటుపాట్లుంటే, అదంతా గత అయిదేళ్ళలోనూ, వీళ్ళ నిర్వాకమే కదా.. సాధారణంగా కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడు, ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉంటుంది, కారణం, తిరిగి అధికారంలోకి రావడానికి పాతప్రభుత్వం, ఎడాపెడా, సంక్షేమ కార్యక్రమాల పేరిట, డబ్బు ఉదారంగా ఖర్చుపెట్టేస్తారు… ఖజానా ఖాళీగా ఉండడంతో , ఎన్నికలవాగ్దానాలు అమలు చేయడానికి డబ్బులుండవాయే.. దానితో ప్రతీదానిమీదా పన్నుల మోత మొదలూ.. మరో చిత్రం ఏమిటంటే, ఈ సంక్షేమపథకాలకి అర్హులు Only BPL ( Below Poverty Line ).. వీళ్ళకిచ్చేదంతా మధ్యతరగతివారు కట్టే టాక్సుకే.. అందువలన ప్రభుత్వం వడ్డించే టాక్సులవలన ఆ BPL వాళ్ళకి వచ్చేనష్టం ఏమీ ఉండదు. ఎంత చెప్పినా మనది Welfare State కదా.
ఒక విషయం మాత్రం ఒప్పుకోవాలి– ఒకే పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే , కొన్ని లాభాలుకూడా ఉంటాయి. ఉదాహరణకి, మొదటి దఫా పాలనలో ప్రారంభించిన ప్రాజెక్టులకి ముక్తీ మోక్షం ఉంటాయి.. అలా కాకుండా కొత్తవాడొస్తే, as a matter of principle పాతవాటిని ఆపేయడమో, మార్పులు చేయడమో చూస్తూంటాము.
ఎన్నికల ప్రచారాల్లో పాపం ప్రతీ పార్టీ వాళ్ళూ, ఎదురుపార్టీమీద బురదజల్లడంలోనే బిజీ గా ఉంటూంటారు. నోటికొచ్చిందల్లా వాగి వీధినపడిపోతూంటారు.. ఈ ప్రసంగాల మీద పరువునష్టం కేసులూ గట్రా ఉండవు అదేం చిత్రమో… పైగా అవతలివాడేదో వాగేడని కూడా పట్టించుకోరు. అదో కాలక్షెపం..ఒక్క విషయం మాత్రం ఒప్పుకోవాలి … ఏదో public consumption కోసం ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటారు కానీ, పాపం ఎన్నికలయిన తరువాత, ఒకళ్ళ వీపులు మరొకరు గోక్కుంటారు.. అసలు ఓ విషయమైతే ఛస్తే అర్ధం అవదు.. ఓ particular నాయకుడు, ఏవేవో అరాచకాలు చేసేడంటారు, మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలుసు.. అయినా సరే అధికారంలో ఉన్న అయిదేళ్ళూ వీళ్ళకి చీమకుట్టినట్టైనా ఉండదు.. ఏదో ప్రజల్ని ఊరుకోపెట్టడానికి ఏవేవో Special Investigation Teams వేసామంటారు. ఉత్తుత్తిదే…
ప్రపంచంలో మొత్తానికి largest Democracy మనదేనట.ఒకవైపు చూస్తే, కేంద్రం లోనూ, రెండు తెలుగురాష్ట్రాల్లోనూ కూడా ఒకే పార్టీకి ఊహించని మెజారిటీ లభించింది… ప్రతిపక్షం అన్నది నామ మాత్రమే.. ఇదిమాత్రం అంత ఆరోగ్యకరంకాదు.. ఇలాటిది ఒక నిరంకుశపాలనకి దారితీయొచ్చు. రెండు పక్షాల బలాబలాలూ మరీ సగంసగం కాకపోయినా, 60-40 అయినా ఉండుంటే బాగుండేది. మరీ 50-50 అయితే వచ్చేప్రాణం పోయేప్రాణంగా ఉంటుంది. అయినా ప్రతిపక్షాలకి( ఏ పార్టీ అయినా సరే ). 2004- 2014 వీళ్ళుచేసారూ, 2014-24 వాళ్ళు చేస్తారూ అలవాటే కదా.. సెషన్ సజావుగా సాగనిస్తారా ఏమిటీ ?
ఇటుపైనుండి , తిరిగి రెగ్యులర్ గా పోస్టులు పెట్టడం ప్రారంభిస్తానని మనవి… కంగారు పడకండి, మరీ బోరుకొట్టేయను…
Filed under: Uncategorized |
Welcome back.
LikeLiked by 1 person
నరసింహారావు గారూ,
ప్రోత్సాహానికి ధన్యవాదాలు.
LikeLike
తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ!!!
LikeLiked by 1 person
బోనగిరి గారూ,
థాంక్యూ…
LikeLike
గౌతం నవాంగ్ అని ఒక పోలీస్ ఆఫీసర్ ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. జగన్ మాటలు స్పూర్తిదాయకంగా ఉన్నాయీ అని. ఒక స్పూర్తిదాయకమైన వ్యక్తిని ఎందుకు 18 నెలలు జైలులో పెట్టారో అర్ధంకాక ఎవరినడగాలో తెలియక ఇక్కడ అడుగుతున్నాను.మీకేమైనా తెలుసాండీ ?
LikeLiked by 1 person
నీహారిక గారూ,
పోస్ట్ మార్టాల వలన ఉపయోగం ఉంటుందా? జైల్లో ఎందుకుపెట్టారో, ఆ పోలీసాయనకే ఎక్కువ తెలుసునేమో…
ఆరోజుల్లో మీడియా కథనాల ప్రకారం, అప్పుడు కేంద్రప్రభుత్వంలో అధికారంలో ఉన్నవారి చలవ అని విన్నాము…
LikeLike
స్వాగతం. నేను FB పూర్తిగా వదిలేశాను. తమ దర్శనం ఇక్కడ దొరుకుతుందంటే సంతోషం. ………. మహా
LikeLiked by 1 person
గురువు గారూ,
నేను FB వదలలేకపోతున్నాను.. ఆ మాధ్యమం ద్వారానే, నాతో స్కూల్లో చదువుకున్న ఫ్రెండ్స్ ని కూడా కలవగలిగాను– కనీసం ఓ పాతిక మందిని.
gotelugu.com లో వారానికి రెండేసి చొప్పున , బాగానే కాలక్షేపం అవుతోంది… అలాగని పుట్టింటిని మర్చిపోలేము కదా.. అందుకే పునరాగమనం…
ధన్యవాదాలు.
LikeLike
సార్ నమస్కారం,
నేను కూడా ఈ మధ్యనే మళ్ళీ ప్రారంభించాను. ఇక దున్నేద్దాం.
రాము
apmediakaburlu
LikeLiked by 1 person
రామూ,
చాలా సంతోషంగా ఉంది… మీ అందరి అభిమానానికీ… ఓ నాలుగు వర్షాలు పడినతరవాత దున్నడం మొదలెడితే బావుంటుంది… అప్పటికి దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా , True colours లోకి వస్తారు… అప్పటిదాకా ఏదో సంసారపక్షంగా… సరేనా…
LikeLike
కొత్త బ్లాగ్‌కి స్వాగతం. మరిన్ని కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటూ ఆనందిద్దాం.
LikeLiked by 1 person
రాధికా రావు గారూ,
నీ అందరి ప్రోత్సాహం తోనూ, ఇక్కడ కొద్దిగా స్వేఛ్ఛ లాటిది ఉంటుంది కదా…
LikeLike
ఎవరండీ మీరు ? కొత్తగా బ్లాగు మొదలెట్టేరా ? 🙂
జిలేబి
LikeLike
జిలేబీ,
అమ్మయ్యా .. ఇంకా మీదర్శనమూ, చివాట్లూ రాలేదేమిటీ అనుకుంటున్నాను…
LikeLike
🙂 అబ్బే మీరెవరో తెలీదండీ ఆయ్ 🙂
అప్పుడెప్పుడో ముళ్ళపూడి వారి పై కేసు బనాయిస్తానని ఓ పెద్దమనిషి స్వాతి సాక్ష్యంగా చెప్పేరు
మీరేనా వారు ? 🙂
జిలేబి
LikeLiked by 1 person
జిలేబీ,
ఎంత గుర్తో కదా… దట్స్ వాట్ జిలేబీ ఈజ్… థాంక్యూ…
LikeLike
భలే! రాయండి, రాయండి! చదవడానికి నేను రెడీ!
LikeLiked by 1 person
లలిత గారూ,
థాంక్యూ… కానీ తరవాత బోరుకొడుతోందనకూడదేం….
LikeLike