బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు- రెండు సినిమాలు


 ఒకానొకప్పుడు కొత్తగా వచ్చిన సినిమాలు ఏ కారణం చేతైనా మిస్సయితే, వాటిని  TV  లో చూడ్డానికి చాలారోజులు పట్టేది. పైగా ఈమధ్యన  Social media  ధర్మమా అని, కొత్తసినిమాల రివ్యూలూ, అభిప్రాయాలూ ఊదరగొట్టేస్తున్నారు.. ఏదైనా సినిమా వస్తే చాలు Facebook  లో పోస్టులూ, వాటిపై స్పందనలూనూ.. అవన్నీ చదివి అయ్యో మనం చూడలేకపోయామే అనే ఓ రకమైన  disappointment  కలుగుతుంది… సినిమా మాటెలా ఉన్నా, దాన్ని మొదటి వారం లో, ( ofcourse  ఇదివరకటిరోజుల్లోలాగ శతదినోత్సవాలు కాదనుకోండి,) లేదా కనీసం పన్నెండొ రోజుకైనా చూడలేకపోతే, సమాజంలో అందరూ చిన్నచూపు చూస్తారు… వీటన్నిటికీ విరుగుడుగా, కనీసం నెలన్నరలోపులో అయినా చూడ్డానికి కొత్తగా రెండు మాధ్యమాలు ..  Amazon Prime Video, Netflix  రంగంలోకి వచ్చాయి. హాయిగా మనిష్టం వచ్చినప్పుడు, ఎటువంటి చెత్త యాడ్లూ లేకుండా చూడొచ్చు. ఏదో అత్తగారు తిట్టిందనికాదుకానీ, తోటికోడలు నవ్వినందుకన్నట్టు, సమాజంలో ఇంకోరితో చెప్పుకోడానికి చూడాల్సొస్తోంది.. ఎవరో మనకి తెలిసినవారు.. ఫలానా మహానటి చూసారా? మా అమ్మాయి ఫోనుచేసి చెప్పడంతో , వెంటనే వెళ్ళిపోయామూ.. అయ్యో మీరింకా  చూడలేదా… అని .

వీళ్ళెలాగూ చూడలేదుకదా అని, ఒకటికిరెండింతలు చేసేసి, వర్ణించేసి, అక్కడికేదో మనం జీవితంలో ఏదో మహావిలువైనది పోగొట్టూకున్నామన్నంత   guilty feeling  ఆపాదించేస్తారు. అందుకోసం ఊళ్ళోవాళ్ళకోసమైనా సినిమాలు చూస్తూ ఉండడం ఆరోగ్యకరం… ” పొగత్రాగడం, మద్యపానం చేయడం ఆరోగ్యానికి హానికరం ” లాగన్నమాట.

ఈమధ్యన అలాటి  guilty feelings  ఉండకూడదనే సదుద్దేశ్యంతో రెండు సినిమాలు చూసేఅదృష్టం కలిగింది.

మొదటిది ” రంగస్థలం “-RS

ఈ సినిమా పుణెలో వచ్చినట్టుగా కూడా తెలియదు. తెలిసినా బహుశా వెళ్ళుండకపోవచ్చు.  Somehow  రెండో తరం సూపర్ స్టార్ల సినిమాలు  ( ఏ ఒక్కరో ఇద్దరో తప్పించి )  నాకంతగా వంటపట్టలేదు…  may be my mindset/ block.  ఒకరకమైన అనాసక్తి.. అంతే.. ఇప్పటిదాకా ఇతను నటించిన ఏ ఒక్కసినిమా చూడలేదూ, చూడనందుకు  విచారించాలేదు.. కానీ రంగస్థలం  గ్గురించి అద్భుతంగా  రివ్యూలు చదివాను.. పోనిద్దూ వీళ్ళంతా అభిమానసంఘాల వారూ.. అనుకుని వదిలేసా.. .. కానీ నెలన్నరక్రితం   Amazon లో browse  చేస్తూంటే, కనిపించింది.. పోనీ ఒక్కసారి చూద్దామా అనిపించింది.. ఏక బిగిన  pause  లేకుండా కట్టిపడేసింది. చాలా చాలా బావుంది,  especially  క్లైమాక్స్.. పాటలు, నటన excellent.  అంత గ్లామొరస్ హీరో, హీరోయిన్లు , ఎటువంటి భేషజం లేకుండా, పక్కా గ్రామీణ యాసతో డయలాగ్గులూ…  overall  very excellent  అనొచ్చు.

Rating : 4.5 / 5

 

రెండో సినిమా  ” మహానటి “

MN1

ఈ సినిమా మాకు పుణెలో అన్ని మల్టీప్లెక్సుల్లోనూ రిలీజవలేదు. ఎక్కడో దూరంగా ఉన్నవాటిలో అయితే ఉంది… అంతదూరం వెళ్ళి చూసేటంత ఆసక్తైతే లేదు నాకు… somehow  ఈ  biopic  లమీద నాకు అంత సదభిప్రాయం లేదు. ఉన్నదున్నట్టుగా చూపించే ధైర్యం ఉండదు దర్శక నిర్మాతలకు– బతికున్న ఆ మహామహుల ( ఎవరి బయోపిక్కు తీసారో)  దాయాదులకి కోపాలొస్తాయేమో అని.  ఏదైనా సినిమాకి  Biopic  అన్నందుకు, వారిలో ఉన్న  both positive and negative shades  కూడా చూపించాలి. అలాకాకుండా,  cinematic  గా చూపించడం , మోతాదుకి మించి గ్లామరైజు చేయడం fair  కాదు.

సావిత్రిగారు మహానటి అనడంలో ఏమాత్రం సందేహమూ లేదు… ఆవిడ జెమినీ గణేశన్ తో  ఎలా ప్రేమలో పడిందీ, చివరకు ఆవిడ ఏ స్థితికి చేరిందీ అన్న విషయాలు , వివరాలూ, ఎన్నో ఎన్నెన్నో పుస్తకాలలో చదివాము… ఆ చదివినవాటి వెనుక ఉండే విషయాలు తెలుసుకోవాలని చాలామంది ఆశిస్తారు.. అలాగే మిస్సమ్మ చిత్రంలో భానుమతి గారి స్థానంలో సావిత్రి ని ఎలా తీసుకున్నారో అనే విషయం మీద, ఏదో  నామ్ కే వాస్తే గా ప్రస్తావించకుండా, మరిన్ని వివరాలు ఇచ్చుండొచ్చు. సినిమా చాలా భాగం జెమినీ గణేశన్ ని   over dignify  చేయాల్సిన అవసరం లేదు… అలాగే సావిత్రి గారు నటించిన ఎన్నో ఎన్నెన్నో చిత్రాలలో అద్భుతమైన సన్నివేసాలున్నాయి.. వాటన్నిటినీ స్పృసించలేకపోయినా,  మరికొన్నైనా చూపించవలసింది.  విమర్శించడం సుళువే..  ఇదేదో జెమినీగణేశన్   PR  Exercise  లా ఉందే కానీ, మహానటి  టైటిల్ కి న్యాయం చేకూర్చలేదేమోననిపించింది.   నిజమే రెండున్నరగంటల్ల్లో జీవితచరిత్ర తీసి మెప్పించడం కష్టమే.. ఆ దృష్టితో చూస్తే  , సినిమా మరీ అందరూ పొగిడినంత కాకపోయినా ,  just above average  అనిపించింది.

మరో విషయం… ఏదైనా మనసుకి నచ్చిన సినిమా ఒకసారి చూస్తే, మళ్ళీమళ్ళీ చూడాలనిపిస్తుంది. కానీ దురదృష్టవశాత్తూ  ” మహానటి ” మరోసారి చూడొచ్చేమో అని అనిపించలేదు. కానీ ” రంగస్థలం ” అలా కాదు.. మరోసారి చూసే సినిమాయే… Both films are of different genres.. so comparison is not fair. Comparison is only about the overall quality , and of repeat viewing…

Rating :  3 / 5

16 Responses

 1. You are correct Sir. But to remake the heavier scenes of Savithri, the actress should have God given talent and not the family aquaired. Resemblence or initation are not the true copy. Eg. Many similiar voices like Rafi saab, but true match is <10%.

  Liked by 1 person

 2. Added comment is I didnot see both the movies.

  Liked by 1 person

 3. నేను రెండూ చూడలేదు. మహానటి ఎలాగూ ఏదో ఒక ఛానల్ లో ఇవ్వకపోడు.అప్పుడు చూద్దాం లే అనే దురాశ..రంగస్థలం చాలా మంచిటాక్ సంపాదించుకుంది‌. కానీ చిరంజీవి తరవాత తరంలో నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ఒక్కడే కొంచెం నచ్చుతాడు.

  Like

 4. // “కనీసం పన్నెండొ రోజుకైనా …..” //
  అంటే .. రెండోవారం ముగియకముందైనా చూసెయ్యడం .. అనాండి? 1960 ల్లో అమలాపురంలో ఒక హైస్కూల్ మాస్టార్ ఉండేవారు (పేరు గుర్తుకు రావడంలేదు) – కొత్త సినిమా మొదటిరోజ మొదటిఆట చూడడం ఆయన పోలసీ అని చెప్పుకునేవారు. మొదటి టిక్కెట్ ఆయనదేనని కూడా అనేవారు 🙂.

  రాధారావు గారిలాగా, మీలాగా నేనూ టీవీ లో వచ్చినప్పుడు చూద్దామనే వెయిట్ చేస్తాను – ఏ సినిమా అయినా సరే. థియేటర్లకు వెళ్ళడం మానేసి పాతిక సంవత్సరాలు దాటింది – అక్కడ వాతావరణం, దోపిడీ భరించలేక – మల్టీప్లెక్స్ లే కానీండి, సింగిల్ ప్లెక్స్ లే కానీండి. నదీ మిలే సాగర్ మే అన్నట్లు అన్ని సినిమాలూ ఎప్పటికైనా టీవీ లోకి వచ్చేవే అనిపిస్తుంది నాకు, అందువల్ల వెయిట్ చేస్తాను.

  పూణె మనకి పరభాషా ప్రాంతం కదా. వారికి తమ భాషాభిమానం కూడా ఎక్కువేనేమో? మరి ఆ ఊళ్ళో కూడా తెలుగు సినిమాలు థియేటర్లలో వస్తాయాండీ?

  Liked by 2 people

  • నరసింహారావుగారూ,

   ఆంధ్రదేశంలో రిలీజైన రోజే తెలుగు సినిమాలు కొన్నికొన్ని పుణె లో కూడా రిలీజవుతాయండి. ఇక్కడ తెలుగు వారు చాలామందే ( 5 లక్షలు in the last count) ఉన్నారు. నేను కూడా ఏడాదికొకటో రెండో సినిమాలు థియేటరుకి వెళ్ళి చూసేవే. ఈమధ్యన కొత్తగా వచ్చిన Amazon Prime, Netflix ల ధర్మమా అని రీలీజయిన నెలలోపులోనే చూడగలుగుతున్నాము.

   Liked by 1 person

   • Lust stories చూడలేదా Netflixలో.అందరూ రకరకాలుగా చెప్పుకుంటున్నారు ఆ మూవీ గురించి.

    Like

 5. రెండు సినిమాలూ బాగానే ఉన్నాయండి. మహానటిలో కొన్ని అనవసర సన్నివేశాల వలన చిరాకు కలుగుతుంది కాని, కీర్తి సురేష్ చాలా బాగా చేసింది. ఈ సినిమా గురించి నా బ్లాగులో వ్రాసాను.

  Like

 6. @ రాధారావు గారూ,
  ఆ ముచ్చటా తీరింది… ఏదో పేద్ద పేరున్న దర్శకులు తీసిన సినిమా కదా అని ఓపిగ్గా చూసాను… అందులో కొత్తదనమేమీ లేదు..ఇదివరకు ఈ దర్శకులే తీసిన సినిమాలు 100 times better…

  @ బోనగిరిగారూ,

  సినిమా ” మహానటి ” బాగోలేదని నేనెక్కడా అనలేదు. అందరూ పొగిడినంతగా మాత్రం లేదు. అందుకే నా రేటింగ్ 3/5.
  ” రంగస్థలం ” అనుకున్నదానికంటే బావుంది..

  Like

 7. రాధారావు గారు పేర్కొన్న మూవీ చూసిన తరువాత నా వ్యాఖ్య కూడా వ్రాద్దామనుకున్నాను. మొత్తానికి చూశాను. సినిమాలు నిర్మించడం వ్యయప్రయాసలతో కూడుకున్న సృజనాత్మకతా ప్రయత్నమే సందేహంలేదు, కానీ కొన్ని కొన్ని విపరీతపు పోకడలను / స్వయంకృతాపరాధాలను గ్లోరిఫై చేసి చూపించడం వలన ఒరిగేదేమీ ఉండదు. అలాగే కొన్ని సన్నివేశాలు అసలు చూపించడం (ఉదా: ఈ సినిమాలోని రెండో కథ ఆరంభం సీన్) అనవసరమనిపిస్తుంది. కొంతవరకు నాలుగో కథ మినహాయించి మిగిలిన మూడు కథలు ప్రేక్షకుల సానుభూతి పొందగలిగినవి కాదని నాకనిపించింది.
  ఈ కాలపు సోకాల్డ్ లిబరేటెడ్ అర్బన్ ఉమన్ కన్ఫ్యూజన్ తో నిండిపోయినదనిపిస్తుంది. అందువల్లే ఈ రకరకాల ధోరణులు ప్రబలుతున్నాయి. My Choice అనేది ఆభరణంలాగా తగిలించుకుంటున్నారు. అన్నిటినీ మించి వ్యాపారసంస్కృతీ మాయాజాలంలో చిక్కుకుపోయారు. ఆధునిక పోకడలు చాలా మటుకు వ్యాపారులు / కార్పొరేట్లు, ఫాషన్ డిజైనర్లు, మోడలింగ్ లు ఎగదోస్తున్నవే అనిపిస్తుంది. సరే పాశ్చాత్యసంస్కృతి ప్రభావం, వెర్రి తలల ధోరణులు ఎలాగూ చొచ్చుకొచ్చేశాయి.

  సినిమా తియ్యడంలో ప్రయోగాలు ఇదివరకూ జరిగినవే. మీకు గుర్తుండే ఉంటుంది 1960 లలో, 70 లలో ఈ ప్రక్రియ బాగానే నడిచేది. New Wave సినిమా అనేవారు, Parallel Cinema అనేవారు, avant garde అనేవారు. “భువన్ షోమ్”, “రజనీగంధ”, “అంకుర్”, భారతీయ నటీనటులతో తీసిన ఆంగ్లచిత్రం “సిద్ధార్ధ” లాంటి వైవిధ్యమైన సినిమాలు వచ్చాయి. గిరీష్ కర్నాడ్ మొదట్లో తీసిన సినిమాలు కూడా – సంస్కార, వంశవృక్ష వగైరా. హేవిటో, జానే కహా గయే ఓ లోగ్ అనుకోవాలి.

  Liked by 1 person

  • నరసింహారావు గారూ,

   మీ విశ్లేషణ అద్భుతంగా ఉంది.. పూర్తిగా మీతో ఏకీభవిస్తున్నాను… మీరన్నట్టు ఈ నాలుగు సినిమాలలోనూ కొత్తదనం ఏమీ లెదు.. ఇదే genre లో ఇదివరకే సినిమాలు వచ్చాయి.. ఇంతకంటే decent గా చూపించారు. అదేదో liberation పేరుతో ఇప్పుడు ఇంకొంచం ముందుకు వెళ్ళారు..

   Like

 8. . . . . ఇదేదో జెమినీగణేశన్ PR Exercise లా ఉందే కానీ, మహానటి టైటిల్ కి న్యాయం చేకూర్చలేదేమోననిపించింది. . . .

  అంతేనండి ఫణిబాబు గారు. మీరు మహానటి సినిమాకు ఒక అరపాయింటు ఎక్కువగా యిచ్చారని నా అనుమానం.

  Liked by 1 person

  • శ్యామలరావుగారూ,

   ప్రజల మనోభావాలు కించపరచడమెందుకని కానీ, అసలు నిజం చెప్పాలంటే 1.5 కంటే ఎక్కువ అనవసరం. అదికూడా, ఆ హీరోయిన్ కి మాత్రమే.

   Like

   • అవును, మనోభావాలు దెబ్బ తినడం అనేది ప్రస్తుత ఫాషన్ కదా 😀.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: