బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు–జ్ఞానోదయం….


  ఈమధ్యన రాజమండ్రి, తణుకు ప్రయాణాల్లో, ఒకింత జ్ఞానం వంటబట్టింది.ఎప్పుడో ఏ బంధువో ఆహ్వానిస్తే వెళ్ళడం తప్పదు.  వాటిని సామాజిక బాధ్యత అని ఓ పేరుకూడా పెట్టొచ్చు… ఒక వయసు దాటిన తరువాత ప్రయాణాలు చేయడం కూడా కష్టమౌతోంది.అలాగని చెప్పి ఏదో విధాయకంగా వెళ్ళే ప్రయాణాలకి మరీ  flights  ఎందుకూ, అత్యవసర పరిస్థితుల్లో అయితే ఎలాగూ వెళ్ళాలి.. అంతకంటే, హాయిగా, మన భారతీయ రైల్వేలని పోషిస్తే, పుణ్యమూ, పురుషార్ధమూనూ, అనేది నా policy.   ఉద్యోగం చేస్తున్నప్పుడు వెళ్ళలేదూ? ఇప్పుడుమాత్రం, మనకేమైనా కొమ్ములొచ్చాయా ఏమిటీ?. పైగా కొన్ని రైళ్ళలో  AC First Class  కూడా ఉంటోంది. మన వయసు దృష్ట్యా ఏవో  కన్సెషన్లు కూడా ఉంటున్నాయి.. హాయిగా దాంట్లో ప్రయాణం చేస్తే, సుఖానికి సుఖం, కిట్టుబాటుకి కిట్టుబాటూనూ.. కదూ…అంతే కాకుండా పేద్ద పోజుకూడా పెట్టొచ్చు… జీవితమంతా జనతా జనార్ధన్ క్లాసుల్లో ప్రయాణాలు చేసిన మొహమే నాది…. ఏం చేస్తాం అప్పుడు అంతే తాహతు. ఇప్పుడు బాధ్యతలు తీరిన తరువాత, అప్పుడప్పుడు , మనకోసం కాకపోయినా, జీవిత సహధర్మచారిణి సుఖంకూడా చూడాలిగా, ఆవిడతోపాటే  Also ran  లా మనమూనూ..పైగా నీ  comfort  కోసమే ఈ  ఏసీలూ, ఫస్ట్ క్లాసులూ అని తోసేయొచ్చు…

ఇలాటి ప్రయాణాల్లో  గమనించేదేమిటంటే, మనకి వేలల్లో ఖర్చు ఎలాగూ అవుతోంది.. ఇంకొచం ( మరీ వేలల్లో కాదూ) మనవి కాదనుకుంటే, ప్రయాణంలో ఎటువంటి శ్రమా లేకుండా, హాయిగా ఉంటుంది. ఆ  మాత్రందానికి వెనుకాడకూడదు. ఇన్నేళ్ళకి, ఇన్ని ప్రయాణాలు చేసిన తరువాత కలిగిన జ్ఞానోదయం… అదికూడా స్వతహాగా కాదులెండి… ఇంటావిడ చెప్తే అనిపించింది నిజమే కదూ… అని.

మేము రాజమండ్రి వెళ్ళినప్పుడు, పెద్ద స్టేషనుదాకా కాకుండా, ” గోదావరి ” స్టేషనులో దిగి, హొటల్ కి ఆటోలో వెళ్ళి  check in  అయ్యాము… ఆ వివరాలన్నీ ఇంకో పోస్టులో.. 

కిందటిసారి రాజమండ్రీ నుండి, తణుకు వెళ్ళడానికి ఓ టాక్సీలో వెళ్ళడంలో ఉండే సుఖానికి రుచిమరిగాము.హాయిగా బస్సులోనో, రైల్లోనో వెళ్ళడానికి రోగమా అనొచ్చు, కొందరు.. అలాటప్పుడు ఏసీలూ అవీ ఎందుకూ, హాయిగా 3  Tier Sleeper  లో వెళ్ళొచ్చుఎవడు చోడొచ్చాడూ? ఏదో ప్రాణానికి సుఖంగా ఉంటుందనేగా, ఏసీలూ అవీనూ.. అలాగే ” పల్లెవెలుగు ” బస్సులోనూ వెళ్ళొచ్చు, ఇంక సుఖపడేదెప్పుడండీ? పిల్లలేమీ అడగరాయే, డబ్బులన్నీ అలా వృధా చేస్తున్నారా అని, పైగా బస్సులూ అవీ ఎక్కిప్రయాణాలు చేస్తే, కోప్పడే రోజులు కూడానూ.. పైగా ఈ వయస్సులో అంతంత దూరాలు వెళ్తూ, లేనిపోని హైరాణెందుకూ అంటారు. అలాగని వెళ్ళకుండానూ ఉండలేమాయె.. వయామీడియాగా అన్నమాట ఈ టాక్సీలూ అవీనూ.. Anyway  మొత్తానికి అప్పుడుతీసికెళ్ళిన టాక్సీ అతనికే ఫోను చేసి, మా ప్రోగ్రాం అంటే, రాజమండ్రి to  తణుకు , మధ్యలో నిడదవోలులో, ఓ గంటన్నర, మా ఇంటావిడ స్నేహితురాలితో.. ఎలాగూ ఇంతదూరం వచ్చామూ, ఓసారి మండపాక ఎల్లారమ్మ దర్శనంకూడా చేసుకుంటే, బావుంటుందీ.. ఎంతైనా ఈ సుఖాలన్నీ ఆ అమ్మ దయే గా…. అనుకున్నాము… అంటే ఆ టాక్సీ అబ్బాయి, పన్నెండయిపోయిందీ, గుడితలుపులు మూసేస్తారూ, సాయంత్రం వచ్చి తీసికెళ్తానూ అన్నాడు. అలాగే వచ్చి తీసికెళ్ళాడు… మా తిరుగు ప్రయాణం గురించి అడగ్గా,   తెల్లవారుఝామున  3 గంటలకి అని చెప్పాము.. మేమున్న మా అత్తవారిల్లు, ప్రాంతంలో, పగటిపూట రిక్షాలు దొరకడమే కష్టం.. ఇంక అర్ధరాత్రీ, అపరాత్రీ ఎవడొస్తాడూ?.. ” కంగారు పడకండి, నేనే వచ్చితీసికెళ్తానూ ..” అన్నాడు. టైముకి రాకపోతే .. మళ్ళీ అదో డౌటూ.. సెకండ్  షో సినిమా చూసేసి, మీ ఇంటికెదురుగానే టాక్సీలో పడుక్కుంటానూ, రెండింటికి మీరే లేపండీ అని చెప్పి, స్టేషనుకి రెండున్నరకల్లా చేర్చాడు. మేమూ, మా రెండు సూట్ కేసులూ, ఓ సంచీనూ. తీరా వెళ్ళేసరికి ట్రైన్ ఇంకో ప్లాట్ఫారానికన్నారు. అంతంత దూరాలు సామాన్లు మోయలేమూ, ఎంత  సూట్ కేసులకి చక్రాలున్నా,   Overbridge   ఒకటుందిగా, కూలీలా  ఉండరూ.. చివరకి ఆ టాక్సీ అతనే, రైలొచ్చేదాకా, ఆగి , ఆ రైలా ఆగేది ఒకే నిముషం.. మమ్మల్ని ముందరెక్కమని, సామాన్లు అందించి. క్షేమంగా పంపాడు.అతనితో కుదుర్చుకున్న లెక్కకంటే, నేను ఇచ్చింది మరికొంత చిన్న ఎమౌంటు.. అదీ అతనడగలేదు.. ఈ  AC  ల్లో తీండీ తిప్పలకి చాలా కష్టం.. ఈ బోగీలూ ఆ చివరో, ఈ చివరో ఉంటాయి, మనకా వెళ్ళే ధైర్యం లేదు, రైలు కదిలిపోతే, పరిగెత్తే ఓపిక్కూడా లేదు. ఇలాటప్పుడు ఆ బోగీలో ఉండే  attendant  మన rescue  కి వస్తాడు.. తనకే డబ్బులిచ్చి, ఏ ఫలహారమో, పళ్ళో తెమ్మంటే, పాపం తెచ్చిపెడతాడు– మనం అడిగే పధ్ధతిలో ఉంటుంది… అలాటప్పుడు ఓ టిప్పులాటిది ఇవ్వడంలో తప్పేమీ లేదూ, మన ఆస్థులేమీ కరిగిపోవడం లేదూ..హొటళ్ళలో ఇవ్వడం లేదూ.. ఇదీ అలాగే…

మొత్తానికి పుణె అర్ధరాత్రి ఒంటిగంటకి చేరాము…  Platform No 1  మీదే ఆగడంతో,  overbridge  దాటాల్సిన అవసరంకూడా లేకపోయింది. మామూలుగా  Uber, Ola  లైతే అర్ధరాత్రి ఓ 200   దాకా పడుతుంది… మేము గేటు బయటకి రావడంతోనే, ఓ ఆటో వాడు , ఎక్కడకో చెప్పగానే, 250 అన్నాడు… కాదు 230  అన్నాను, బేరంఆడ్డం జన్మహక్కాయే… సరే అని ఒప్పుకుని,  సామాన్లుకూడా తనే ఎత్తి,  మా సొసైటీకి చేర్చి, లిఫ్ట్ లో సామాన్లుకూడా పెట్టడంతో, నాకే అనిపించింది– ఇరవైరూపాయలకోసం అంత కక్కూర్తి పడాలా అని..  అతనడిగినదానికి ఇంకో పాతిక చేర్చి ఇచ్చాను… మొత్తం ప్రయాణం లో నేను అదనంగా  ఖర్చుచేసింది మహా అయితే నామమాత్రమే.. బస్..ఎక్కడా శ్రమన్నదిలేకుండా హాయిగా కొంపకి చేరాము. ఈ అదనపు ఖర్చుకి  చూసుకుంటే ఏమయ్యేదో చెప్పక్కర్లేదుగా… 

వేలల్లో ఖర్చుపెడుతున్నప్పుడు,  Goodwill  కోసం కొంత ఖర్చుపెట్టడంలో నష్టమేమీ లేదన్నది నా అనుభవం…

10 Responses

 1. Good naration of experience and our pound fool attitudes.

  Like

 2. ఆహా! ఇంత జ్ఞానోదయానికి ఒకే ఒక్క కామింటు

  హతవిధీ తెలుగు పంచదశ లోక మేమాయెన్ !

  జిలేబి

  Liked by 1 person

  • పంచదశలోకం చాలా వరకు పద్యలోకం వైపు మళ్ళిందిగా 🙂. అదన్నమాట సంగతి.

   Liked by 1 person

   • ఇతడు దెసో కాదో గానండి, ఇప్పుడు పరిస్థితులు మాత్రం
    ఏం బాలేవు. ఎవరేమి రాసినా ఇంతకన్నా ఎక్కువగా కామింట్లు మాత్రం ఉండవు.
    స్పందనకు ధన్యవాదాలు.

    జిలేబి
    ఇట్లాంటి వాక్యాలే ఇంకెక్కడో చదివినట్టుందే ?
    ఎక్కడ చెప్మా 🙂

    జిలేబి

    Liked by 1 person

 3. జిలేబీ,

  ఈ మధ్యన చాలామంది, తెలుగుబ్లాగులు వదిలి Facebook వైపు మొగ్గుచూపుతున్నారు ( నాతో సహా ).. ఒకానొకప్పుడు తెలుగు బ్లాగులకి వచ్చిన స్పందన ఈ మధ్యన తగ్గిపోయింది. Facebook లో తెలుగువారి ప్రోత్సాహక వ్యాఖ్యలు చాలా బావుంటున్నాయి.. ఎక్కడైనా రచయితకి కావాల్సింది ఒక వెన్నుతట్టే కదా…

  నరసింహరావుగారూ,

  మీరన్నట్టు ఈమధ్యన పద్యాలూ, కవితల వైపూ మళ్ళారు చాలామంది…

  Like

 4. పేరు ప్రస్తావించను కాని ఒక ప్రముఖ బ్లాగరు కొన్నేళ్ళ క్రిందటనే బ్లాగులనుండి ఫేస్‍బుక్ వైపుకు మళ్ళటమే సరైనదన్న అభిప్రాయం వెలుబుచ్చారు నాతో ఒక ఫోన్ సంభాషణలో. నిజమే కావచ్చును. కారణం అదైనా లేక బ్లాగుల్లో పరస్పరవ్యక్తిత్వహననాలే ముఖ్యంగా నడుస్తున్న దూషణాదికాలు కారణమో లేక ఇతరకారణాలేమిన్నాయో కాని క్రమంగా బ్లాగులు వెలాతెలా పోతున్నాయన్నది వాస్తవం. నేనైతే ఈమధ్య బ్లాగుల వైపు రావటం బాగా తగ్గించాను – నా కారణాలు నాకున్నాయి. ముఖ్యంగా యీమధ్యకాలంలో యేమీ వ్రాయాలనీ చదవాలనీ ఆసక్తి కలగటం లేదు.

  Like

 5. చాలామంది తెలుంగు బ్లాగరులు సోచాయించకన్ ఫేసు బు
  క్లో లాగించిరహో టపాలనకటా క్లోజ్చేసి బ్లాగ్లోకమున్
  మీలా కొందరు పద్యముల్ కవితలన్ మేల్గూర్చ బోవంగనే
  బాలా! డస్సుచు నాంధ్రులెల్ల రకటా బ్లాగ్లోకమే వీడిరే 🙂

  జిలేబి

  Like

 6. ఓహ్, ఫేస్ బుక్ అయస్కాంత మహిమా అయితే? మరి ఆ ‘లోకంలో” పరస్పరదూషణలు ఉండవాండి? నిజంగా తెలియకనే అడుగుతున్నాను, ఎందుకంటే నేను ముఖపుస్తక ఖాతాదారుడ్ని కాను (అయ్యే ఆలోచన కూడా లేదు).

  Like

 7. @ శ్యామలరావుగారూ,

  మీరన్నదీ, ఆ బ్లాగరు మీతో అన్నదీ చాలావరకూ సత్యమే.

  @జిలేబీ,

  చాలామంది బ్లాగులోకం నుండి ఫేస్ బుక్ వైపు మారిపోయారు. ముఖ్యకారణం– బ్లాగులోకంలోకంటే, వీక్షకులు అక్కడే చాలా ఎక్కువ.

  @ నరసింహారావుగారూ,

  పరస్పర దూషణలు ఉండకేమండీ? మోతాదెక్కువ కూడానూ. మనం ఎటువంటి contrevercial issues గురించీ రాయనంతకాలం, అందరూ అభిమానిస్తారు. అందులో సందేహం లేదు.ఒక్కోప్పుడు ఓ విషయంమీద చర్చలుకూడా బావుంటాయి. Rotten eggs are there everywhere.But we have the choice of deleting the person.

  Liked by 1 person

 8. మీ డబ్బు మీరు ఖర్చు పెట్టుకోవడం కరక్టే కదండి. ఈ తరంలో పిల్లలెవరూ తల్లితండ్రులు సంపాదించిపెట్టాలని ఆశించడంలేదు. చదివించి వాళ్ళకో దారి చూపిస్తే చాలు. కొంతమంది తల్లితండ్రులైతే పిల్లలు పంపించే డాలర్లతో జల్సా చేస్తున్నారు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: