బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– ” అఛ్ఛే దిన్ ” అంటే ఇప్పుడు తెలుస్తోంది…


అప్పుడెప్పుడో నాలుగేళ్ళ క్రితం, అవేవో ” అఛ్ఛేదిన్ ” వచ్చేస్తున్నాయంటే, నిజమే కాబోసనుకున్నాము. .. అవన్నీ మనలాటి సామాన్యులకి కాదనీ, బ్యాంకుల్లో డబ్బులు దోచేసుకుని, దేశాలు వదిలి పారిపోయేవారికే ననీ…పోనిద్దురూ ఎవరో ఒకళ్ళు బాగుపడ్డారు కదా అంటారా? సరే అయితే..

 రాత్రికి రాత్రి ఏదో కోటీశ్వరులైపోతామనేమీ కలలు కనలేదు… కానీ ఉన్న డబ్బులేవో, బ్యాంకుల్లో సవ్యంగా డిపాజిట్టైనా చేసుకోవచ్చనుకున్నాము. అబ్బే అదీ కుదరదుట… వీలైనన్ని తిప్పలు పెట్టడమే ప్రభుత్వ ధ్యేయం కాబోలు..

ఇదివరకటి రోజుల్లో బ్యాంకులలో ఓ సాదాసీదా నెంబరుండేది మన ఎకౌంటుకి.. దాన్ని అదేదో  Core Banking  అని పేరుపెట్టి, కొల్లేరుచాంతాడంత చేసారు.. ఛస్తే గుర్తుండదు. పైగా దీనివలన దేశంలో ఏ బ్రాంచి నుంచైనా, లావాదేవీలు చులాగ్గా చేసుకోవచ్చన్నారు. అవేవో  ATM లు,  Netbanking  లూ వచ్చాయి.  ATM  లలో డబ్బులుండవనుకోండి, అది వేరే విషయం..

 బ్యాంకింగ్ వ్యవస్థ  User friendly  అన్నారు..  thats the Joke of the Century..   ఈరోజుల్లో ఖరీదులు చూస్తే, అసలు డబ్బులే మిగలవనుకోండి.. అధవా మిగిలినా, బ్యాంకులకి వెళ్ళి  Deposit  చేయడానికి, ఎన్ని తిప్పలు పెడతారో తెలిసొచ్చింది… మా ఇంటావిడ  అప్పుడూ ఇప్పుడూ దాచుకున్న డబ్బులు ,  బ్యాంకులోనే వేయమంటూంటుంది.. తను మాత్రం ఏం చేస్తుందీ, ఎప్పుడో రాత్రికి రాత్రి,  ఎవడో.. రేపణ్ణుంచి ఫలానా ఫలానా నోట్లు చెల్లవూ.. అన్నా అనొచ్చు. అఛ్ఛే దిన్ కదా మరి.

నిన్నటి రోజున దగ్గరలోనే ఉందికదా అని  HDFC Bank  కి వెళ్తే, ఇది నీ  Home Branch  కాదూ, 25000  దాటితే, వెయ్యికి 5 రూపాయలు  charges  వసూలు చేస్తామూ… అన్నారు. మళ్ళీ ఆ ఫారాల్లో సరిదిద్ది ,  చేసొచ్చాను. మిగిలిన డబ్బులని, ఛార్గెస్ లేకుండా, మూడు దఫాల్లో deposit  చేసుకోవచ్చన్నారు… ఈ మాత్రం ముచ్చటకి మూడుసార్లెందుకూ దండగా, అనుకుని, ఇవేళ ఇంకో కొంత  amount  అక్కడే, వేసి, ఆ మిగిలినదేదో, ఎదురుగుండా ఉన్న  State Bank  కి వెళ్ళాను. అక్కడి సీను….

 ATM    Debit Card  ఏదీ అంటుంది.. ఇది నీ  Homebranch  కాదుగా, అక్కడకెందుకు వెళ్ళలేదూ?

అంటే అక్కడకి వెళ్ళడానికి ఇంకో వందో రెండువందలో ఖర్చుపెట్టుకోవాలన్న మాట… ఏదో మెహర్బానీ చేస్తున్నట్టు, మొత్తానికి తీసుకుంది ఆవిడ. సరే విషయం తెలుసుకుందామనుకుని,  Home branch  లో ఎంత డబ్బు ఒకేసారి చేయొచ్చూ అని అడిగితే,  ఒకేసారి ఎంతైనా  deposit  చేయొచ్చూ, కానీ  ఖాతాదారు స్వయంగా వెళ్ళాలీ ట.

 మరి అప్పుడు అదేదో  Demonitisation  చేసినప్పుడు, ఖాతాదారులందరూ స్వయంగా వెళ్ళే, తమ  black money  ని white  చేసుకున్నారటా? లేక ఈ తలతిక్క  Rules  అన్నీ మనలాటివాళ్ళకేనా?

ఈ తిప్పలన్నీ పడలేక, అసలు  Banking System  అంటేనే చిరాకొచ్చి, మొత్తం వ్యవస్థని కూలగొట్టే ప్రయత్నమంటారా?  అలాకాదంటే, ఉన్న డబ్బంతా ఇంట్లో నేల మాడిగలు తవ్వి దాచుకోవాలనటా?   ఓవైపు  Black money  control  చేయడానికే  demonetisation  అని ప్రగల్భాలు చెప్పినప్పుడు, ఈ తలతిక్క  rules  ఎందుకూ? 

అదీకాదూ అంటే, ఏ రాత్రికి రాత్రో… ” మిత్రోం.. రేపణ్ణుంచి మీ దగ్గరున్న కరెన్సీ నోట్లు చెల్లవూ.. ” అని ఇంకో దఫా ” అఛ్ఛే దిన్ ” స్లోగన్  చెప్పుకోడానికా?

ఆ భగవంతుడొచ్చినా సామాన్య మానవుడిని బాగుచేసే వాడుండడు..

14 Responses

 1. No alternative Except to sail with the tide.

  Like

 2. నేటి భారతదేశంలో పరువుగా సాదాసీదాగా బతికే పౌరునికి “చెడ్డకాలం మోడి పరిపాలనలో ఈ డీమానిటైజేషన్ చాలా పొరపాటైన నిర్ఞయం.
  ఎంతసేపు సామాణ్య పౌరున్ని బలిచెయ్యటమే. మాచిన్నప్పటి బంగారు బాగా ఉ కధ గుర్తొంస్తంది.

  చాలా స్తబ్దతగా నిఅ్సహాయ స్దితిలొఒ నేటి పౌరుడు ” జీవితం వెళ్ళదీస్తున్బఢు.

  Like

 3. ఈ కష్టాలు ఎన్నిరోజులో ఉఙడవండీ.నిజమైన अच्छे दिन వచ్చే సమయం కనుచూపు మేరలో ఉంది. మనం కొంచెం ఓపిక పట్టాలి అంతే.😊

  Like

 4. ఉందిలే, ఆచ్చే దిన్ ముందు ముందున…. అని పాడుకోవాలండీ.
  లేకపోతే, అరువు రేపు అన్నట్లు, అచ్చే దిన్ రేపు అని బోర్డు మీద వ్రాసుకోవాలి.

  Like

  • బోనగిరి గారూ,

   2016 నవంబరులో.. ఓ 50 రోజులాగండీ అంటే నిజమే కాబోసనుకుని ఆగాము..
   మీరన్నట్టు ” అచ్చేదిన్ రేపు ” అని గోడమీద రాసుకోవాలి కాబోలు…

   Like

 5. ఆయ్

  బాంకు లొల్లి చూస్తా వుంటే మరీ లొల్లి‌ లొల్లి గా వుంది 🙂
  బాంకు కాడికే రావద్దు రావద్దు అంటున్నారు కామోసు 🙂

  ఏటీయెం‌ డిపాజిట్టు పని చేయదు . సో గెట్లా మరి?

  జిలేబి

  Like

 6. “రేపణ్ణుంచి ఫలానా ఫలానా నోట్లు చెల్లవూ.. అన్నా అనొచ్చు. ”

  రేపణ్ణుంచి మీ బ్యాంకు అక్కౌంట్లో సొమ్ములు అచ్చంగా మీవి క్రిందే చెల్లవూ.. అవి బ్యాంకులవీ మరీ మాట్లాడితే గవర్నమెంటువీను అన్నా అనొచ్చు నండి.

  అచ్చేదిన్ అంటే చచ్చేదిన్ అనా అని మనం విస్తుపోవాలంతే!

  Liked by 1 person

 7. చచ్చేదిన్ :)))

  Liked by 1 person

 8. నరసింహ రావు గారూ,

  భరించాలిగా మరి….

  శ్యామల రావుగారూ,

  అంతటితో ఆపినా అదృష్టవంతులమే.. . ఎప్పుడైనా ప్రసంగం మొదలెట్టి ” మిత్రోం .. ” అన్నాడంటే, ఏదో కొంపముంచుతాడనే స్థితికి వచ్చేసాము కదా…

  నీహారికా,

  అదీ పూర్తిగా ” చచ్చే ” కాదు…అవన్నీ తిరిగి 2019 లో కూడా వస్తే….

  Like

 9. Before 2019, we may have to hear the starting words “mithron” and “bhaiyiyon aur behnon” many more times and get ourselves prepared for worst.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: