బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– कानून का हाथ लंबे होते है…


 ఈ టపాకి పెట్టిన శీర్షిక  ఏదో సినిమాల్లో నూ, పుస్తకాల్లోనూ చూసినట్టు జ్ఞాపకం. ” చట్టం తన పని తను చేసికుంటుందీ..  blah..blah.. ”  అని అధికారపక్షం వారి ప్రకటనలూ వింటూంటాం.   చట్టంకూడా పాపం పలుకుబడి ఉన్నవారి జోలికి పోదు…  ఈరోజుల్లో ఏ న్యాయస్థానం విషయం తీసికున్నా, లక్షలాది కేసులు,  ఉలుకూ పలుకూ లేకుండా పడున్నాయి. కిందకోర్టువారు ఏదైనా తీర్పు ఇచ్చినా, ఆ పైకోర్టుకి ఎపీల్, సుప్రీంకోర్టు లో ఏక న్యాయాధిపతి తీర్పిస్తే, మళీ దానికి ఓ  Constitutional Bench  అడగడమూ.. ఎప్పుడో ఏ రాజకీయనాయకుడో, తింగరి వేషాలు ( అధికార పక్షానికి వ్యతిరేకంగా ) వేస్తే, వాడి పాత నేరాల చిఠ్ఠా విప్పుతారు ఏలినవారు… ఏతా వేతా చెప్పేదేమిటంటే ఈ ”   कानून का हाथ बहुत लंबे ”  అన్నది ఈ కారణాలవలనే వాడుకలోకి వచ్చిందేమో అని.

మనదేశంలో చాలా చట్టాలున్నాయి, కానీ వాటిని   implement  చేయడంలోనే అసలు గొడవంతా.. ఎప్పుడో ప్రభుత్వం ఇరుకులో పడ్డప్పుడు, ఆ రాజ్యాంగం ఏదో ఓసారి చూసి, అవేవో సెక్షన్ల కింద ఓ కేసు రిజిస్టర్ చేస్తారు.. అదికూడా, ఆ నేరం చేసినవాడు అధికారపక్షం వాడా, ప్రతిపక్షం వాడా అన్నది చూసుకుని మరీనూ…ఇదంతా ఏదో విమర్శించడానికి కాదు, జరుగుతున్న కథే. పైగా ఏదో కేసులాటిది file  చేయగానే, అదేం చిత్రమో మొదట వాడికి గుండెనొప్పో ఏదో వచ్చి ఆసుపత్రిలో చేరతాడు. ఆ తరవాతెప్పుడో కోర్టులో హాజరు పరచడమేమిటి, క్షణాల్లో  Bail  మీద బయటకొచ్చేస్తాడు… ఈ సౌలభ్యాలన్నీ రాజకీయనాయకులకీ, పలుకుబడున్నవారికీనూ.. అసలు దేశం విడిచి పారిపోయే సదుపాయాలుకూడా ఉన్నాయి. అదేం కర్మమో ఆ నేరస్థులు హాయిగా ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వాలు నెలకోసారి, కేసు నడుస్తోందీ, త్వరలో వాణ్ణి దేశానికి తెప్పించి శిక్ష వేసేస్తామూ.. అని ప్రకటనలు చేస్తూనే ఉంటారు. వాడు రానూ రాడూ, శిక్షా పడదూ…

 అలాగని పోలీసు వ్యవస్థ పనిచేయడంలేదా అనుకోకూడదు. పని చేస్తోంది– వారి  limits  వారివీ.. సినిమాల్లో చూడ్డం లేదూ ? వీళ్ళకి తేరగా దొరికేది మాత్రం సాధారణ జనాలు…ఈమధ్యన  Traffic Signals  తో పాటు అవేవో   CC Cameras  కూడా పెట్టేసారు, పెద్దపెద్దనగరాల్లో..ఏదైనా పెద్ద పెద్ద నేరాలు జరిగినప్పుడు ఈ  C C Footage  ద్వారానే నేరస్థుడిని పట్టుకుంటూంటారు.. అలాగే  Signal ని  Jump  చేసినప్పుడల్లా, వాడి అదృష్టం బాగోక, ఆ కెమేరాలో, వాడూ, వాడి బండీ పడ్డాయా, వెంటనే వాడి ఫోను కి ఓ  S M S  వెళ్ళిపోతుంది.. నువ్వు ఫలానా చోట సిగ్నల్ అతిక్రమించావూ, నీకు జుర్మానా వేసాము అవటా అని…ఆ  sms  అందుకున్నవాడు ఏ  Law abiding citizen  అయితే, వెంటనే పోలీసు స్టేషన్ కి వెళ్ళి కట్టేస్తాడు. కానీ అందరూ అలా ఉండరుగా.. ” చల్తా హై యార్.. ” అని ఆ విషయం వదిలేస్తారు. కానీ ఆ పోలీసు రికార్డులో, వీడూ, వీడి ప్రవరా అన్నీ ఉంటాయి. ఇలాటప్పుడే ”  कानून का हाथ बहुत लंबे है ”  అన్నది రంగంలోకి వస్తుంది. మన అదృష్టం బాగోకపోయినా, లేచినవేళ బాగోకపోయినా, మనకి సంబంధం లేకపోయినా, మనమూ అందులో భాగస్వాములవుతూంటాము.

Exactly  నిన్న సాయంత్రం మాకు ఇలాటి అనుభవమే జరిగింది.. ఎవరో స్నేహితుడింటికి వెళ్ళాలని ఓ  U B E R  ని పిలిచాం.. కొంతదూరం వరకూ బాగానే వెళ్ళాం… ఇంతలో రోడ్డుకడ్డంగా పోలీసులూ,  Traffic Barriers  పెట్టి వచ్చేపోయే గాడీల నెంబర్లు చూడ్డమూ, ఏదో గాడీ చూసి, ఆపి, పక్కనే ఉండే ఖాళీ స్థలంలోకి పంపడమూ. అప్పటికే అక్కడ ఓ పదిపదిహేను  Cab  లు ఉన్నాయి… మమ్మల్ని కారులోవదిలేసి, డ్రైవరు కిందికి దిగి వెళ్ళాడు. పావుగంటైనా రాడే.. గొడవేమిటో తెలియదు, ఇంతలో మరికొన్ని స్వంతవాహనాలు కూడా చేరాయి.. అందులో కొంతమంది స్కూటర్లూ, బైక్కులూ ఆడా, మగా.. ఓ తీర్థంలా తయారయింది. పైగా వాళ్ళు .. ” మావి టాక్సీలు కాదే, ఈ  harassment  ఏమిటీ.. ” అని దబాయించడం, అక్కడికేదో స్వంతవాహనాలవారు నేరాలంటే అస్సలు తెలియదన్నట్టు పోజెట్టి… విషయమేమిటో తెలిసికుందామని, మా ఇంటావిడ వద్దంటున్నా, నేనూ కిందికి దిగాను. ఆ పోలీసులతో నేనేం గొడవ పెట్టుకుంటానో అని తన భయమాయె.. ఇంతలో మా  Driver  వచ్చి ”  सार.. आप्के पास ATM Card   है क्या ..”   అన్నాడు.. అదేదో దారిదోపిడీల్లో, ఏకాంత ప్రదేశానికి తీసికెళ్ళి, బలవంతంగా మన  ATM   Card Swipe  చేయించి ఉన్న డబ్బేదో లాగేస్తాడేమో అన్నంత భయమైతే వేసింది… ఇంతమంది పోలీసులుండగా మరీ అంత అఘాయిత్యం చేస్తాడా అనుకుని, ” నా  Debit Card  తో నీకేం పనీ.. ” అన్నాను.  సార్  Fine 200  రూపాయలు కట్టాలీ, కానీ నా దగ్గర Card  లేదూ, మీకు  Cash 200  ఇచ్చేస్తానూ వెంటనే, అని ఆశ్వాసన్ ఇవ్వడంతో, ఆ పనేదో కానివ్వడమూ, వీడు నాకు ఓ రెండువందల నోటు ఇవ్వడమూ.. కథ కంచికీ, మేము ముందుకీ పయనం చేసి వెళ్ళాల్సిన చోటుకి క్షేమంగా చేరాము…

 దారిలో అడిగాను– ఆ డ్రైవర్ ని ” ఏమిటి నాన్నా విసేషమూ.. ” అని. వాడెప్పుడో అయిదారునెలల క్రితం   Traffic Signal break  చేసాడుట– ఆవిషయం వీడి ఫోనుకి  SMS  కూడా వచ్చిందిట.. చూద్దాంలెద్దూ అని వదిలేసాడుట. ఆ నేరం  online  లో రిజిస్టరవడం వలన ఆ ఫైనేదో కట్టేదాకా వీడిని వదలరు, ఆ ఫైను కూడా  Cash  రూపాన కాకుండా,  Card  ద్వారానే.. అప్పుడు తెలిసింది– ఈ కానూనూ, లంబే హాథ్ కీ అర్ధం… ఇటుపైన ఏ  Cab  ఐనా  book  చేసినప్పుడు వాడిని ముందుగానే అడగాలేమో … ” నీకు నేర చరిత్ర ఏమైనా ఉందా.. ” అని.  ఈ లోపులో మనకి  allot  చెసిన  Driver  గారి  reputation  మాత్రం  U B E R  వాడు మనకి పంపిస్తూనే ఉంటాడు…

శుభం…

Advertisements

13 Responses

 1. వందో రెండొందలో జరిమానా పడితే దాన్ని ఎగ్గొట్టటం కుదరదండీ. మనదేశంలో అస్సలు కుదరదు. అదీ మీరు సామాన్యులైతే కుదరనే కుదరదంతే. మీక్కొంచెం కన్నా ఎక్కువే పలుకబడి ఉంటే మాత్రం అప్పుడు మీరో రెండువేలకోట్లో ఇరవైముఫైవేలకోట్లో చులాగ్గా ఎగ్గొట్టవచ్చును. అది మనదేశంలో అలాంటివాళ్ళకి ఇంచక్కా కుదురుతుంది. మరి మీరు సామాన్యులైతే మాట్లాడకుండా రెండొందలఫైన్లు కట్టేస్తూ మనవాళ్ళెంత స్ట్రిక్టో అనుకుని మురుస్తూ ఉండటం అలాగని వ్యాసాలు వ్రాసేస్తూ ఉండటమూ ను అన్నమాట,

  Like

 2. మీ ఏటీయెమ్ కార్డుతో స్వైప్ చేసేరా ! అయిపోయినట్టే యిక.

  ఆ ఊబర్ అబ్బీ ఇక యే జుల్మానా చెల్లించాలన్నా ఇంతకు మునుపు కార్డ్ డీటైల్స్ ఉన్నాయి కదా పోలీసు భాయ్ అందులో‌ డెబిట్ చేస్కో పో అనబోతాడు ఇక మీదట వాడి ఫైనులు మీ కార్డు బుట్టలోంచి పైసల్ !

  గోవిందా గోవిందా

  జిలేబి

  Like

  • జిలేబీ,
   అంతేనంటారా ఇటుపైనా? మరీ అంత భయపెట్టేస్తే ఎలా? అసలు దాంట్లో డబ్బులుంచితే కదా….

   Like

   • అంతే కాదండోయ్

    మీ బ్యాంకు అకొంటు కూడా ఇక మీదట మానిటరింగు చేస్తుంటారు లావాదేవీలేమి జరుగుతా వుండాయి ; అబ్బోడేడేడ యేమేమి ఖర్చు జేస్తుండె గట్రా గట్రా !

    బైదివే మా కష్టే ఫలే దీక్షితులు గారు కుశలమేనా ?
    తెలియ చేయగలరు

    జిలేబి

    Like

 3. కానూన్ కా హాథ్ లంబే, మగర్ selective హోతే హై!

  Like

 4. ఊబరు వాడి కొరకు నా
  జేబు డెబిటు కార్డు స్వయిపు జేసా నయ్యా
  కాబూలీవాలా వలె
  నా బలజము దొక్కునో మన ప్రభుత్వమికన్ !

  జిలేబి

  Like

  • జిలేబీ,

   Digital India పేరుచెప్పి, ప్రజల లావాదేవీల monitoring ఎప్పుడో మొదలెట్టేసారు. ఇంకా చేయడానికి ఏం మిగిలిందీ ?
   శర్మగారికి ఈ మధ్యన ఫోను చేయలేదు. రేపటెల్లుండిలలో ఫోను చేసి మాట్టాశతాను.

   Like

 5. మీకు చెప్పదగిన వాడిని కాదు. అందునా హిందీ విరివిగా చలామణీ అయ్యే ప్రాంతంలో దశాబ్దాలుగా నివసిస్తున్న మీకు తెలియనిదేముంది హిందీ భాష గురించి.

  పైన మీరు చెప్పిన “కానూన్ కే హాధ్ బహుత్ లంబే హోతే హైఁ” అనే హిందీ సినిమా డైలాగ్ లోని భావం – నేరస్థుడు ఎంత దూరం పారిపోయినా, ఏ మూల దాక్కున్నా, ఎంత పెద్దవాడైనా, ఎంత మంది ఉన్నా, వారిని అందుకోగలిగినంత పొడుగు చెయ్యి చట్టానిది, ఎవరూ తప్పించుకోలేరు – అని నా అభిప్రాయం.

  ఏమైనప్పటికీ పైన మీరూ, ఇతర మిత్రులూ చెప్పినవన్నీ అక్షరసత్యాలే … నేటి భారతంలో.

  Like

  • నరసింహారావుగారూ,,

   మీరు వివరించిన గుణగణాలన్నీ, ప్రస్తుత కేసులోకూడా ఉన్నట్టున్నాయి…!! ఈ Driver కి ఆ SMS వచ్చి అయిదారు నెలలయింది.. కట్టకుండా తప్పించుకుందామనే కదా ఇన్నాళ్ళూ పట్టనట్టూరుకున్నాడూ? మీరుచెప్పిన వ్యత్పత్తర్ధం కాదనడంలేదు.

   ” నేరస్థుడు ఎంత దూరం పారిపోయినా, ఏ మూల దాక్కున్నా, ఎంత పెద్దవాడైనా, ఎంత మంది ఉన్నా, వారిని అందుకోగలిగినంత పొడుగు చెయ్యి చట్టానిది, ఎవరూ తప్పించుకోలేరు” అన్నారు కదా, మరి రాజకీయనాయకులు ( ఎంతో గొప్పగొప్పవారు ) , కోర్టుల ఆసరా తీసుకుని, సంవత్సరాల తరబడీ ఎలా తప్పించుకుంటున్నారూ? ఆఆ ” లంబే హాథులూ, సింగినాదాలూ ” పుస్తకాల్లో మాత్రమే.

   నా శీర్షిక భావార్ధం మాత్రమే..

   Like

 6. // “బైదివే మా కష్టే ఫలే దీక్షితులు గారు కుశలమేనా ?
  తెలియ చేయగలరు” //

  ఆహా, ఏం అడిగారండి “జిలేబి” గారూ! శర్మ గారి వెనకబడి వారిని బ్లాగుల్లో నుండి తరిమేసి పుణ్యం కట్టుకున్నారుగా …. కొంతమంది. ఆంగ్లంలో hounded out అంటారు చూశారా, అలాగన్నమాట. ఏదో వారు ప్రశాంతంగా కాలక్షేపం చేసుకుంటున్నారు, అలా ఉండనివ్వండి.

  Like

 7. @ vi ko na,
  ఆహా.. ఎవరిని ఎవరు తరిమేసారండీ ? మాలిక నుండి నా బ్లాగ్ ని తొలగించింది ఎవరు ?
  నా శాపం తగిలిఉంటుంది. ఆయన ఎక్కడా ప్రశాంతంగా బ్రతకలేడు.జన్మ నక్షత్రం అలాంటిది మరి !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: