బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


 ఏదో ఆరోగ్యం లక్షణంగా ఉన్నన్ని రోజులూ పరవాలేదు కానీ, ఎక్కడో కొద్దిగా తేడా వచ్చిందా,  ఇంట్లో ఉండే పిల్లా, పెద్దా అందరూ ఉచిత సలహాలిచ్చేవారే.  దానికి సాయం , మన కుటుంబ స్నేహితుడెవరైనా ఏ డాక్టరో అయారా,  సుఖశాంతులతో వెళ్తూన్న మన జీవితాలు, రోడ్డున పడ్డట్టే..

అలాగని మరీ hospitalizatio నూ వగైరాలూ కాకపోయినా, ప్రతీదానిమీదా ఆంక్షలు ప్రారంభమైపోతాయి… చాలామంది సలహాలిస్తూనే ఉంటారు– ఏడాదికోసారైనా   General check up  చేయించుకోమనీ.. మనకే బధ్ధకమూ,, పోనిద్దూ ఇప్పుడేమీ ఆరోగ్య సమస్యలు లేవుకదా.. అనే ఓ భావనానూ… చేయించుకుంటే  ఏం నష్టమూ, అని సకుటుంబ సపరివారమంతా పోరగా.. పోరగా మొత్తానికి ఓ ముహూర్తం చూసుకుని, CGHS  Dispensary  కి వెళ్ళడం. ఒంటరిగా వెళ్తే మజా ఏముందీ.. ఆ డాక్టరేం చెప్పారో, ఈయనేం విన్నారో.. వివరాలన్నీ పూర్తిగా తెలుసుకోపోతే నిద్ర పట్టదుగా..ఇంటావిడ సమేతంగా వెళ్ళాను… మొత్తం అందరూ రాలేదు.. బతికిపోయాను.

 ఆ డాక్టరుగారు ఓ పదిరకాల  Tests  రాసిచ్చి, వాటి Test Report  తీసికుని రమ్మన్నారు… ఆ కాగితం పట్టుకుని, దగ్గరలో ఉండే ఓ  Corporate Hospital  కి వెళ్తే, మర్నాడు పొద్దుటే, కడుపులో ఏమీ వేసికోకుండా , (కాఫీకూడా) రమ్మన్నారు… అదృష్టమేమిటంటే, ఈ రక్త పరీక్షలకి తను తోడు రాకపోవడం– ఎలాగూ  Test results  వచ్చినప్పుడు చూడొచ్చులే అనేమో…ఏదో మొత్తానికి వెళ్ళి ఆ రక్తదానమేదో ఇచ్చొచ్చాను. పాపం రక్తం ఇచ్చొచ్చానుకదా అని జాలిపడిపోయి, రోజూకంటే ఎక్కువ breakfast  లభ్యం అయింది.మళ్ళీవెళ్ళి , రెండోసారి కూడా రక్తం ఇచ్చి, , ఆ  Dracula  కి thanks  చెప్పి కొంపకి చేరాను.. ఇదంతా 10 నెలలకింద జరిగింది.

ఆ test reports  దొంతరంతా పట్టుకుని తిరిగి మా  CGHS Dispensary  కి పయనం–ఇంటావిడతో సహా.. ఓ పదినిముషాల వెయిటింగ్ తరవాత, ఆ కాగితాలు చదవడం..  Oh!  అంటూ భ్రుకుటి ముడవడం,, ఓసారి పెదిమలు విరవడం లాటి హావభావాలు పుర్తిచేసి, మళ్ళీ నన్నోసారి టేబుల్ ఎక్కించి, గుండె కొట్టుకుంటుందో లేదో మరోసారి టెస్టు చేసి, సుగర్ లెవెల్  ఎక్కువగా ఉందీ జాగ్రత్తగా ఉండాలీ వగైరాలు చెప్తూంటే , పోనీ ఇంటావిడ ఆగొచ్చుగా, అబ్బే.. ” అయితే రేపణ్ణుంచీ కాఫీలో పంచదార మానేయమంటారా, రోజూ కనీసం  200 గ్రాముల తీపి పదార్ధాలు తింటూంటారు, అవికూడా మానిపించేయనా అంటూ, ఈవిడ  పెట్టబోయే ఆంక్షల చిఠ్ఠా చెప్పేసింది. పోనీ ఆయనేం చెప్తారో వింటే ఏం పోయిందీ ? డాక్టరుగారూ, మా ఇంటావిడా ఓ సంయుక్త ప్రకటన చేసేసి, మొత్తానికి నా సుఖసంతోషాలకి గండి పెట్టేసారు.  వెళ్తూవెళ్తూ, వివిధరకాల మాత్రలు పంచరంగుల్లోవి కూడానూ.. మర్నాటినుండీ ఇంట్లో  Curfew starts.. దీనికి సాయం, పిల్లలకి విషయం చెప్పేయడం– మళ్ళీ అక్కడకి  వెళ్ళి ఏం కక్కూర్తిపడతానో అని..అప్పటిదాకా ఇంట్లో ఉన్న స్వీట్స్ అన్నీ పనిమనిషి  పాలయ్యాయి… మర్నాటినుండీ భోజనంలో మార్పు, పిల్లలు చెప్పిందీ, తననుకున్నదీ, ఆ డాక్టరు చెప్పిందీ, మొత్తం అన్నిటికీ ఓ  mean  తయారుచేసి ప్రారంభం చేసేసారు.. పధ్ధతులు మారేటప్పటికి నాకూ చిరాకూ, కోపం..  ప్రతీ రోజూ పిల్లలదగ్గరనుండి ఫోనులూ.. రోజువిడిచి రోజు  personal counselling  అడక్కండి– తెలుసు నా శ్రేయస్సుకోరే చేస్తున్నారూ అని.. ఈలోపులో  నేనైతే తెలిసినవారందరికీ నా కష్టసుఖాలు చెప్పుకున్నాను.. ఒకడేమో ఫలానావి తినొద్దంటాడు, ఇంకోరేమో ఇది మామూలేనండీ .. కొంచం జాగ్రత్తతీసికుంటే చాలంటారు…. మొత్తానికి ఈ తిండివిషయం లో ఏ ఇద్దరికీ ఏకాభిప్రాయం లేదని… వ్యవహారం ఎక్కడదాకా వెళ్ళిందంటే, ప్రతీ వరలక్ష్మీ వ్రతానికీ చేసే  తొమ్మిది పిండివంటల్లోనూ, ఏడు ప్రసాదాలు తీపిలేనివే.. ఉన్న ఆ రెండింటిలోనూ నామమాత్రంగా బెల్లం… బయటకే హొటల్ కైనా పిల్లలతో వెళ్తే, ఆ బఫేలో, నా పక్కని అబ్బాయో, అమ్మాయో, వెనక్కాలైతే సహధర్మచారిణీ..  Z Category Security  లాగన్నమాట.

మొత్తానికి ఈ పదినెలల నా  నియమనిబధ్ధతా, మా ఇంటావిడ కఠోర management , పిల్లల సహకారంతోనూ, పరిస్థితులు చక్కబడ్డట్టే.. ప్రతీ రెండునెలలకీ ఆ టెస్టులేవో చేసుకుని, మొత్తానికి  మా ఫామిలీ ప్రెండు డాక్టరుగారికి కూడా చెప్పి, ఆయన  approval తో కొంచంకొంచంగా  curfew relax  అయింది.

 నాకు ఈ సందర్భంలో ఒక్క విషయం అర్ధం అవలేదు–  general  గా ఇళ్ళల్లో ఈ sugar levels  చెక్ చేసినప్పుడు, ఓ రక్తపుబొట్టుతో అయిపోయే పనికి, ఈ  Pathological Labs  లోనూ,  Hospitals  లోనూ, మరీ   సిరెంజ్ గుచ్చేసి అంత రక్తం తీసుకుంటారెందుకనీ అని… అదేదో చెప్పి పుణ్యం కట్టుకోరూ….?

14 Responses

  1. KFT test చేయించాడు మా అబ్బాయి నాకు..మంచినీళ్లు గ్లాసులు గ్లాసులు దగ్గరుండి తాగించాడు.చాలురా అంటే వినడు.. లాబ్ కి వెళ్లాక అదేదో బాల్ తో పొత్తికడుపు నొక్కెయ్యడం..అంతా అయ్యాక మీరు బాగానే ఉన్నారు కానీ బాడ్ కొలెస్ట్రాల్ వెరీ బాడ్ అన్నారు.

    Like

    • రాధికారావుగారూ,

      ఏమిటో ..ఈ టెస్టులేమిటో.. అంతా గందరగోళంగా ఉంది.. ఇదివరకటి రోజుల్లో, నాడి పట్టుకుని రోగ నిర్ధారణ చేసేవారు.. అలాటిది ఈరోజుల్లో ఆరోగ్యంగా ఉన్నామని తేల్చడానిక్కూడా ఏమిటేమిటో టెస్టులు…

      Liked by 1 person

      • మన పిల్లలకు శంఖం లో పోస్తే కానీ మన మాట నమ్నరు.ఆరోగ్యం గా ఉన్నామని.

        Like

  2. మిత్రమా నాది దాదాపు ఇదే పరిస్థితి 2012 నుంచి .
    ఇప్పుడు ఇప్పుడే కొంత లో కొంత నిబంధనల సడలింపు వలన స్వేచ్ఛ గా
    తిరగగలుగుతున్నాను

    Like

  3. ఇంట్లో గ్లూకోమీట‌రు చూపే రీడింగులు ఖచ్చితమైనవి కావు ఉజ్జాయింపులు మాత్రమే నండి. అందుకే లాబ్ టెష్టులు తప్పవు.

    Like

    • శ్యామలరావు గారూ,

      అందుకేనన్నమాట– ఓ చుక్కతో అయే పనికి, సోలడు, గిద్దెడు రక్తాన్ని తీసికుంటారూ… ?మరీ అంత తేడా ఉండాలంటారా…

      Like

      • అసలు స్థాయికీ గ్లూకోమీటరు చూపేదానికీ మధ్యన 30 లేదా 40 యూనిట్ల వరకూ కూడా తేడా ఉండవచ్చునండీ. మరీ సోలెడు రక్తం గుంజరండీ 10మి,లీ వరకూ తీసుకుంటా రంతే. బ్లడ్ శాంపిల్ ఇచ్చినపుడే, మీ గ్లోకోమీటరుతో కూడా, ఒక పరీక్ష చేసుకుంటే ఆ మీటరు ఎంత తేడాగా ఉన్నదీ ఒక అవగాహన వస్తుంది. ఇలాంటి క్రాస్ టెష్ట్ ఒకటి రెండు సార్లు చేయండి.

        Like

  4. బుచికోయమ్మబుచికి

    Like

  5. లాబ్ లో పరీక్ష చేస్తున్నప్పుడు టెస్ట్-ట్యూబ్ చెయ్యి జారో / చెయ్యి వణికో కొంత రక్తం నేలపాలైతే ఎలా? రక్తం కోసం మళ్ళా మీ దగ్గరకి వస్తే బాగోదుగా, అందుకని ముందు జాగ్రత్తగా కావలసినదానికన్నా కాస్త ఎక్కువ లాగుతారేమో 😀😀😀. రిజల్ట్ తేడా గురించి శ్యామలరావు గారి సలహా పాటించండి, తెలిసిపోతుంది.

    “మిథునం” సినిమాలో SP బాలసుబ్రహ్మణ్యం ఈ కాలంలో చాలామందికి “శంఖు చక్రాల్లా” షుగరూ బీపీ ఉంటున్నాయి అంటాడు. ఎంత కామన్ అయినా కూడా ఇప్పటివరకూ లేనిది ఇప్పుడు ఈ వయసులో మీకు షుగర్ డిజార్డర్ రావడం ఆశ్చర్యంగా ఉందే!

    డయాబెటీస్ వలన లాబ్ లకు, మందుల కంపెనీలకు life-long కస్టమర్ అవడం ఎలాగూ తప్పదు. దాంతో బాటు వ్యాపారులు డయాబెటీస్ బాధితుల్ని బంగారుగుడ్లు పెట్టే బాతుల్లాంటి వారని భావిస్తున్నట్లున్నారు 😡. డయాబెటీస్ వారి కోసం షుగర్-లెస్ స్వీట్లు అంటాడొకడు (మామూలు స్వీట్ల కన్నా రెట్టింపు రేటుతో) (పంచదార / బెల్లం బదులు మరోరకపు స్వీటెనింగ్ ఏజెంటేదో కలుపుతాడని నా అనుమానం; అది artificial ది గనక అయితే మరింత హానికరం). హోటళ్ళలో షుగర్-లెస్ కాఫీ / టీ సరేసరి – ఎక్కువ ధరతో. ఈ మధ్య దుకాణాల్లో డయాబెటీస్ వారికి ప్రత్యేక గోధుమపిండి అని అమ్మకానికి పెట్టడం మొదలైంది – గోధుమపిండిలో ప్రత్యేకమేమిటో నాకర్థం కాదు 🤔. కాబట్టి తస్మాత్ జాగ్రత్తండి.

    Do’s & Dont’s ఈ పాటికే మీకు చాలామంది చెప్పేసే ఉంటారు 🙂. సరే నా బిట్ కూడా (ఇది కూడా చెప్పే ఉంటారు) – పాదాల సంరక్షణ (foot-care) చాలా ముఖ్యం – Diabetic neuropathy బారిన పడకుండా ఉండడానికి; మేజోళ్ళు వాడండి. అలాగే అప్పుడప్పుడు serum creatinine పరీక్ష కూడా చేయించుకోండి కిడ్నీల- గురించి.

    ఏవిటో “తీపి” కష్టాలు 🙁.

    Like

  6. శ్యామలరావుగారూ,

    గిద్దెడో, సోలడో అని సరదాగా అన్నానండి.. గత నాలుగైదు పర్యాయాలూ Laboratory లోనే టెస్ట్ చేయించుకున్నాను. రెండింటికీ తేడా ఇప్పుడు తెలిసిందిగా… ధన్యవాదాలు.

    బుచుకి గారూ,

    మరీ తిట్టలేదు కదాండీ ? మీ బుచికి భాష అర్ధం అవలేదు…

    నరసింహారావుగారూ,

    మొత్తానికి వచ్చిందని తేల్చి, నానా రకాల తిండి అలవాట్లూ చేసారు. Latest results మాత్రం encouraging గానే ఉన్నాయి.. కొట్లవాళ్ళు ఎంతంత ఖరీదుపెడితేనేమిటి లెండి, తినడం మానేస్తే అసలు గొడవే ఉండదుగా…
    మీ సలహాలకి ధన్యవాదాలు.

    Like

  7. మీకిప్పుడొచ్చాయా శంఖ చక్రాలు! అబ్బో నేను వీటితో గత ముఫ్ఫై ఏళ్ళు పైగా బతికేస్తున్నా! ఆ రోజుకి ఈ రోజుకి మందు డోస్ మారలేదు! చిటకా! వీటి గురించి ఆలోచించకపోవడం, కాస్త కదలడం, ఎలకో,చిలకో పట్టుకుని అదే పనిగా కూచోక!
    Early to raise and early to bed.

    చాలా మంది చెప్పేసుంటారు,చాలా చిటకాలు, మరో ఉబోస

    Like

  8. శర్మ గారూ,

    మీ ” సంఘం ” లోకి కొత్తవాడిని… పెద్దల ఉపదేశం శిరోధార్యం… ఎలా ఉన్నారూ?

    Like

Leave a reply to బుచికి Cancel reply