బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- రాజస్థాన్ యాత్ర-5..


IMG_20171229_123411IMG_20171229_135532 (1)ఓపిగ్గా చదివినందుకు ధన్యవాదాలు.. మిమ్మల్నింకా బోరుకొట్టదలుచుకోలేదు… జైపూర్ వచ్చిన మర్నాడు, పిల్లలు అదేదో  Hot air balloon  లో గగనవిహారం చేయడానికి వెళ్ళారు.. అన్నీ మూసేసిన ఏరోప్లేన్ లోనే భయపడ్డ నాలాటి వాడు,  Open  గా ఉన్న ఆ గుమ్మటంలోనా వెళ్ళడం ? అబ్బే అలాటి ఉద్దేశ్యాలేవీ పెట్టుకోకుండా ఇంట్లోనే ఉండిపొయాము.

2h.jpg2i.jpg22.jpeg

వాళ్ళు నలుగురూ తిరిగి వచ్చిన తరువాత, జైపూర్ హవా మహల్ వైపు  sight seeing  కి వెళ్ళాము.

img_20171230_111658.jpg1A24.jpeg

ఆ మరుసటిరోజు, పుష్కర్ , అజ్మేర్ దర్గా దర్శించుకుందామని బయలుదేరాము.

అజ్మీర్ షరీఫ్  దగ్గరకి వెళ్ళేటప్పుడు,  ఓ రెండుకిలోమీటర్ల దూరంలో, పార్కింగ్ చేసి, ఓ ఆటోలో వెళ్ళాల్సొచ్చింది. సందులూ గొందులూ తిప్పుతూ మొత్తానికి అక్కడకి చేర్చాడు… విపరీతమైన జనసందోహం. అన్ని ధర్మాలవారూ ఈ దర్గాని దర్శించుకోవడం ఇక్కడి ప్రత్యేకత.

అక్కడ ఓ రెండు గంటలు గడిపి ,  పుష్కర్ కి బయలుదేరాము. అక్కడ బ్రహ్మ గుడి, పుష్కర్ సరస్సూ చూసి, తిరిగి జైపూర్ చేరాము.మర్నాడు సాయంత్రం   Flight  లో పుణె తిరిగి వచ్చాము.

మొత్తం ఓ వారంరోజులు పిల్లలతో గడపడం చాలా సంతోషమయింది. ప్రయాణం లో మమ్మల్ని అత్యంత  luxurious  గా తీసికెళ్ళారు పిల్లలు..

ఈ ప్రయాణం ధర్మమా అని నాకైతే, కుక్కలు, విమానాల భయాలైతే చాలామట్టుకి తగ్గినట్టే…img-20171229-wa0000.jpg

Advertisements

2 Responses

 1. // “Open గా ఉన్న ఆ గుమ్మటంలోనా వెళ్ళడం ? అబ్బే ……. “ //

  రెండు రోజుల క్రితమే ఇంగ్లాండ్ లో నివసిస్తున్న నా స్నేహితుడు మెయిల్లో ఫొటోలు పంపించారు నాకు. అక్కడ జరిగిన “వింగ్ వాకింగ్” అని ఒక విన్యాసంట – ఎగురుతున్న విమానం రెక్కల మీద నడవడంట 😳. ఏమిటో వెర్రితలలు వేస్తోంది అనిపిస్తుంది నా మటుకు. అయినా “వింగ్ వాకింగ్” కన్నా గాలిగుమ్మటమే నయమేమో లెండి !?

  Like

  • నరసింహారావుగారూ,

   మామూలుగా భూమ్మీద సరీగ్గా నడవడానికే ప్రాణం మీదకొస్తోంది.. మళ్ళీ ఈ గుమ్మటాలూ, ఏరోప్లేన్ రెక్కలూ ఎందుకు సారూ ..?

   మీస్పందనకు ధన్యవాదాలు…

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: