బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– taking it for granted….


        పూర్వపు రోజుల్లో మనుషులమధ్య సంబంధ భాందవ్యాలు ఎంతో చక్కగా ఉండేవనడంలో సందేహం లేదు. కారణం—వారి మనస్థత్వాలూ, అవతలి వారి క్షేమసమాచారాలు తెలుసుకోవలన్న కోరిక, ఏదైనా అవసరం పడితే సహాయం చేయాలనే తపనా, ఇలా ఎన్నో కారణాలుండేవి. అలాగని ఖాళీగా ఉండేవారా అంటే అదీ కాదూ… ఎవరి వ్యాపకం వారికుండేది. కాలమానపరిస్థితులతో వీటికీ మార్పు వచ్చింది. “ఎవరికి వారే యమునాతీరే “ సిండ్రోమ్ (  Syndrome )  అనే ఓ “ వ్యాధి “ శరీరంలోకి ప్రవేశించేసింది. అది తల్లితండ్రులకీ, పిల్లలకీ మధ్య సంబంధాలవనీయండి, స్నేహితుల మధ్య సంబంధాలవనీయండి. చివరకు ఎక్కడదాకా వచ్చిందంటే  “ ఏ సమాచారమూ లేదంటే అంతా సుఖంగా ఉన్నట్టే ..” అనేదాకా… అంతేకానీ, పోనీ ఓసారి మాట్టాడదామా, ఓసారి చూసొద్దామా అనే తపన ఇరుపక్షాలవారిలోనూ లోపించింది. పైగా ఇదివరకటి రోజులకంటే సమాచార వ్యవస్థలు కూడా సులభతరమయినాయి…  ఇదివరకటిలాగ మొబైళ్ళలో నిమిషానికింతా, సెకనుకింతా , రోమింగ్ కి ఇంతా అనికూడా కాకుండా, అన్ని సర్వీస్ ప్రొవైడర్లూ, (  Service Providers) ఒకరితో ఒకరు పోటీగా, “ ఉచితం “ చేసేశారు. అయినా దగ్గరవారికి ఓ ఫోనుచేసే సావకాశం గానీ, కోరికకానీ ఎవరికీ ఉండడం లేదు. అదీ ప్రస్థుత పరిస్థితి..

 కొంతమందుంటారు… తమ దగ్గర చుట్టాలందరూ ( అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళూ) ఒకే చోట ఉంటే బావుంటుందేమో అనే తపన ఉన్నవాళ్ళన్నమాట.. ఆలోచించుకుని ఒకే నగరానికి చేరుకుంటారు.  ఒకరితో ఒకరు కలవాలనే సదుద్దేశ్యం మొదట్లో ఉన్నంతగా , ఆ తరవాత ఉండదు. ఏదో శుభకార్యానికో, లేదా దురదృష్టవశాత్తూ ఎవరో స్వర్గస్థులయినప్పుడో తప్ప కలవరు. రైటే ఎవరి పనుల్లో వారు బిజీగానే ఉంటారు. ఊళ్ళోనే ఉన్నారుకదా అని ప్రతినిత్యం కలవాలనేమీలేదు. అందరూ నగరానికి తలోమూలా ఉంటారు. హైదరాబాద్, బెంగళూరు లాటి నగరాల్లో అయితే, ఒకచోటనుండి ఇంకో చోటికి ప్రయాణం చేయడంకంటే, సింగపూర్, దుబాయి కి వెళ్ళిరావడం సులభంలా కనిపిస్తుంది.  దూరాలూ, ట్రాఫిక్కు రద్దీలూ వీటికి కారణాలు. ఓ ఫోనుచేసి ఓ అరగంటసేపు కబుర్లు చెప్పుకున్నా పోయేదేమీలేదు. అయినా దానిక్కూడా ఖాళీ ఉండడంలేదు. అవును ఎలా ఉంటుందీ?  ఫేస్ బుక్ (  Facebook)  లో Posts  పెట్టాలి, వాటికి ఎన్ని   Like  లు వచ్చాయో చూసుకోవాలి..   Tweet  చేయాలి, వాటిని ఎంతమంది  Retweet  చేసారో చూడాలి…

 పైన చెప్పినవన్నీ ఉద్యోగంచేసి రిటైరయిన వారి అభిప్రాయాలు. ఇంకొంతమందుంటారు—పాపం వాళ్ళకి స్నేహితులని పాతపరిచయాలరీత్యా ఓసారి కలవాలనే సదుద్దేశ్యమైతే ఉంటుంది.  Intentions are very noble.. కానీ వాటి  implementation  లోనే వస్తుంది గొడవంతానూ..  ఏదో మూడ్ వచ్చిందికదా అని వాళ్ళింటికి వెళ్తే కుదిరే రోజులు కావివి. ఎంతెంతో దూరాలు, తీరా వెళ్తే వాళ్ళుండొచ్చు ఉండకపోవచ్చు. ప్రత్యామ్నాయంగా ఫలానా రోజు ఉంటారా అని ఫోనుచేసి అడగడం ఉత్తమం. కొంతమందైతే వారం రోజులముందే అడుగుతారు. ఇది ఇంకా ఉత్తమం—ఈ లోపులో వీరిద్దరికీ సంబంధించిన  common friends  కి కూడా చెప్పొచ్చు,  “ఫలానా మన స్నేహితుడు ఫలానా రోజు వస్తున్నారూ, వీలుంటే మీరూ రండి, కొంతసేపు కబుర్లు చెప్పుకోవచ్చూ…” అని. ఈ రాబోయే స్నేహితుడికీ, ఎవరింటికి రాబోతున్నారో వారికీ, రాకపోకలు ఎక్కువే.. కనీసం నెలలో ఒకసారైనా కలుస్తూ ఉంటారు, దూరాలెంతైనా. ఫలానా  common friend  ఈనెలలో వస్తున్నారుకదా, అప్పుడే వెళ్ళొచ్చూ అని వాయిదా వేస్తారు… చివరకేమవుతుందంటే వస్తానని ఫోను చేసిన పెద్దమనిషి పత్తా ఉండడు. ఆ వచ్చేఆయనకోసం , వీళ్ళిద్దరూ వాళ్ళ కార్యక్రమాలు  adjust  చేసికుని కూర్చున్నారు.. పోనీ రావడానికి వీలుకుదరడంలేదని పోనీ ఫోను చేసి చెప్పొచ్చుగా… అబ్బే అదీ లేదూ.. అడిగితే “ అదేమిటండీ.. వచ్చేముందర ఫోను చేసొస్తానని చెప్పేనుగా..” అనొచ్చు. నిజమే, కానీ ఓ సంగతి convenient  గా మర్చిపోతారు—ఫలానా వారంలో ఫలానా రోజున వస్తానని ఫోను చేసిందాయనే అని. దీనికి ముఖ్యకారణం —  taking for granted  అనే ఇంకో “  virus “ …   తనకే ఏదో పెద్ద పనున్నట్టూ, అవతలివాళ్ళందరూ రికామీగా ఉన్నట్టూ అనుకోవడం… దీంతో అయేదేమిటంటే, ఆ తరవాతెప్పుడో  గుర్తొచ్చి వస్తానని చెప్పినా వీళ్ళిద్దరూ పట్టించుకోపోవచ్చు.. పోనిద్దురూ ఆయనకలవాటే..  ఇలా ఫోన్లు చేయడం… అని … దీనివలన జరిగేదేమిటంటే  సంబంధబాంధవ్యాలలో కొంత  stress  ఏర్పడుతుంది.

కొంతమందుంటారు—ఫలానా టైముకొస్తామూ అంటే ఠంచనుగా వచ్చేస్తారు—ఎలాఉంటుందంటే వాళ్ళరాకతో  మన గడియారం  set  చేసికునేటంతగా..

చెప్పొచ్చేదేమిటంటే ఎవరినైనా కలుస్తామని ఫోను చేసినప్పుడు, వెళ్ళాలనే లేదు., కానీ కారణాంతరాలవలన వెళ్ళలేకపోతే కనీసం ఓ ఫోనైనా చేసి చెప్తే బావుంటుంది…. వాళ్ళుకూడా పనులు మానుకుని కూర్చోనక్కరలేదు… ఎవరిష్టం వారిదనుకోండి…

 

Advertisements

8 Responses

 1. మొన్నేదో వస్తామన్నారు

  ఇప్పటి దాకా తీరిక కుదర్లేదండి

  రేపు వచ్చేదా ? 🙂

  జిలేబి

  Like

 2. బాగు ! బాగు
  కూనలమ్మ పదాల తేలి పోతున్నామండి 🙂

  కుశలమేనా ?

  నారదా!
  జిలేబి

  Like

 3. అమ్మని చూస్తానికి వెళతానంటే రోజూ ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు కదా వెళ్ళి ఏం చూస్తావు అని అడుగుతారు. అమ్మకి ఇల్లు దులుపి పెట్టడం, బ్యాంక్ పనులు ఇతరత్రా వ్యవహారాలు చేసిపెట్టాలనిపిస్తుంది. మాట్లాడుకునేది వేరు వెళ్ళి చూసుకునేది వేరు కదా ? మా అమ్మ కూడా ఇపుడు సీరియల్స్ లో మునిగిపోయింది. ఒక్క రెండు రోజులే ఉంటాను మాట్లాడమ్మా అని టీ వీ కట్టేసి మరీ మాట్లాడుకోవలసి వస్తోంది.

  Like

  • నీహారికా,

   మీరు ఆ రెండో కోణాన్ని కూడా అద్భుతంగా వివరించారు…మీరన్నట్టు కలవాలనో, పలకరిస్తే బావుంటుందనో ఆసక్తి రెండు వైపులా ఉండాలి కదూ…

   Like

 4. మీరు the most time killing machine “whatsapp” మరచిపోయారు!

  Like

  • పానిపూరీ,

   చిరకాల దర్శనం…. ఎలా ఉన్నారూ? నిజమే మీరన్నట్టు Whatsapp గురించే మర్చిపోయాను సుమీ.. పైగా అందులో కాల్సూ, విడియో చాటింగులూ ఉచితం కూడానూ.. పోనీ అందులో contact ఉంచినా బాగుండును…

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: