బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– కోతి పేరంటాళ్ళు…aka పోతు పేరంటాళ్ళు…


మొన్నటినుండి శ్రావణమాసం  ప్రారంభమయిందిగా.. కొత్తగా పెళ్ళైన ఆడపడుచులందరూ, వారివారి వీలుని బట్టి , మంగళగౌరి వ్రతం చేసుకోవడం  ఆనవాయితీ కదా.. మనవైపు ముత్తైదువలకి , ఆ అమ్మవారి దయతో కొరత లేదు… కానీ  బయటి రాష్ట్రాలలో కొంచం  శ్రమ పడాల్సొస్తూంటుంది. ఉండడానికి 5 లక్షల తెలుగువారున్నా, అందరూ తలోమూలానూ..Facebook  ధర్మమా అని ఈ రోజుల్లో , ముత్తైదువల గురించి మరీ    గూగులమ్మని అడగక్కర్లేదు… ఎక్కడో అక్కడ ఓ లింకు దొరికితే, మరీ పుష్కలంగా కాకపోయినా, మొదటి  శ్రావణ మంగళవారానికి, దొరక్కపోరు..అదండీ ఈ టపాకి ఉపోద్ఘాతం..

బెంగళూరు లో ఉండే,  శ్రీమతి వేదుల సుభద్ర ( ” అగ్రహారం కథలు ఫేం ) కీ, మాకూ పరిచయం. ఓ రోజు నాకు మెసేజ్ పెట్టింది.. “బాబయ్యగారూ, పిన్నిగారితో పనుందీ.. ఓసారి మాట్టాడాలీ.. ” అంటే  తన నెంబరిచ్చాను… మనకెందుకూ ఏం మాట్టాడుకుంటారో, మన అవసరం వస్తుందిగా అప్పుడు చెప్తా…. చూద్దాం.. ( All in jest ).. ఆ అర్జెంట్ పనేమిటంటే, పుణే లో ఉన్న తన మేనమామ గారి అమ్మాయి చేత , మంగళగౌరి వ్రతం చేయించడానికి,  సుభద్ర అమ్మగారు పుణే వస్తున్నారట, ఆ వ్రతానికి ఆహ్వానం.. నాలుగు రోజుల ముందునుంచీ..మాకూ, వారికీ ఓ common friend  కూడా ఉన్నారు, శ్రీ కొంపెల్ల వెంకట శాస్త్రి గారు.. మొత్తానికి ఇద్దరు ముత్తైదువులూ  ( మేం కాదు.. మా ఇద్దరి ఇంటి ఇల్లాళ్ళూనూ).. ఆ దంపతులు  On His Majesty’s Service  లో  on duty..  ఏం లేదూ వాళ్ళ మనవల సేవలో…విషయమేమిటంటే, మేం నలుగురమూ, మంగళవారం అక్కడకి వెళ్ళి,  వాయినం, భోజనం చేసి, రావడమన్నమాట.. .. పాపం ఆవిడ  హైదరాబాదు నుంచి , సోమవారం అర్ధరాత్రికి పుణె వచ్చి, , మేనకోడలి చేత వ్రతం చేయించి, మాకు షడ్రసోపేతమైన భోజనం పెట్టాలని, ఆవిడ కార్యక్రమం. మరీ  .అంత దూరం నుండి వస్తూ, మళ్ళీ శ్రమైపోతుందని, భోజనానికి వద్దన్నాము. ఆవిడా ఊరుకునేదీ, ఇద్దరు దంపతులకి భోజనం పెడితే పుణ్యం కూడానూ .. అని ఒప్పించారు. ఎంతైనా ” కోనసీమ ” ఆడపడుచాయే.. ఈ వారఫలాల్లో వాహన యోగం, భోజనయోగం,   నూతన వస్త్రయోగమూ ఉన్నట్టున్నాయి. శాస్త్రిగారి కారులో, వాళ్ళింటికి వెళ్ళి ” కోనసీమ ” రుచులతో విందూ, మా బుచ్చిలక్ష్మిలకి చీరా, తాంబూలం …

శ్రీరమణ గారి   ” మిథునం ” లో అప్పదాసుగారిలా , మా బుచ్చిలక్ష్మి లతో  ” కోతి పేరంటాళ్ళమయాము

IMG-20170726-WA0012

10 Responses

 1. రాజమండ్రిలో శ్రావణమాసం రోజుల్లో దూరం ఇళ్లల్లో పేరంటానికి నాకు కూడా పిలుపు వచ్చేది. భోజనాలు చేసి పేరంటం అయిన తరువాత ఇంటికి ఆవిడని తీసికెళ్లాలి కదా..

  Like

 2. పోన్లెండి మరీ అరుగుమీద కూర్చోపెట్టయ్యకుండా(పేరంటానికి వచ్చిన మగవారికి జరిగే మర్యాద అదేగా) చక్కగాషడ్రసోపెతమైన భోజనం ఆప్యాయంగా వడ్డించారు.అవునూ, వాళ్ళని ‘పోతు’ పేరంటాళ్ళని కదా అంటారు?

  Like

  • శ్రీదేవి గారూ,

   ఇదివరకటి రోజుల్లో అయితే ” అరుగు” లు ఉండేవి కాబట్టి బయటే కూర్చోమనేవారు. అదృష్టవశాత్తూ, ఈ రోజుల్లో ఉన్న ” అగ్గిపెట్టల ” apartments లో ఆ సమస్యే లేదు కదా.
   మా చిన్నప్పుడు ” కోతి పేరంటాలు ” అన్నట్టు గుర్తు. But to be on the safe side, శీర్షికలో ” కోతి” ” పోతు ” కూడా తగిలించానుగా.

   Like

 3. “కోతి” కాదు…..”పోతు” అనుకుంటా బాబుగారూ!

  Like

 4. ఇంతకీ మీ వాటా శనగలు తెచ్చుకున్నారా?

  Like

 5. మంచో చెడో, నా బాల్యం‌ నాకు బాగానే గుర్తుంది. ఆమాటకు వస్తే నా శైశవం కూడా. నా చిన్నప్పుడు మా అమ్మగారితో పాటునేనూ పేరంటాలకు వెళ్ళేవాడిని. కొన్ని సార్లు నాకూ‌ వాయినం ఎందుకివ్వరూ అని పేచీలకు దిగాను కూడా. అందుకని అందరూ నవ్వుకుంటూనే నాక్కూడా వాయినం ఇచ్చేవా రన్నమాట. అందులో మళ్ళీ సెనగలూ అరటిపండూ కొబ్బరిముక్కలూ వగైరా అన్నీ‌ అందరితో సమానంగా ఇచ్చారా లేదా అని నిక్కచ్చిగా ఉండేవాడిని.

  Like

  • శ్యామలరావుగారూ,

   మీ మదుర జ్ఞాపకాలు చాలా బావున్నాయి.. మనలో నూటికి తొంభై మందికి ఇలాటి అనుభవాలు ఉన్నట్టే… అవిగుర్తుకు వచ్చే ఈ టపా… మీస్పందనకు ధన్యవాదాలు మాస్టారూ…

   Liked by 1 person

Leave a Reply to భమిడిపాటి ఫణిబాబు Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: