బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– Cultural pollution…


 అప్పుడెప్పుడో చిన్నప్పుడు విన్నాము– అదేదో  cultural revolution  అని చైనాలో వచ్చిందిట, కానీ ప్రస్థుతం మన దేశంలో చూస్తున్నది, ఆ చైనాలో వచ్చినదానికి తరువాతి దశ అని నా అభిప్రాయం,ఈ cultural pollution (  సాంస్కృతిక కాలుష్యం ) అన్న జాడ్యం ఈరోజుల్ల్లో దేశమంతా పాకిపోయింది. ఏ రంగం తీసుకున్నా ఇదే రంధి. ప్రస్తుత తరానికి ఇవన్నీ వింతగా కనిపించడం మూలానేనేమో,  అవేవో “జన విజ్ఞాన  వేదికలూ ” అవీ మొదలయ్యాయి.. వాళ్ళు చెప్పేవి కొంతమందికి నచ్చకపోవచ్చు.అలాగని వాళ్ళుమాత్రం చెప్పేవి తప్పనలేముగా… నిజమే ఎవరి నమ్మకాలు వారివీ… కాదనడానికి మధ్యలో వీళ్ళెవరూ అనేది కొందరి అభిప్రాయం..  Its an unending debate.

 ఆధ్యాత్మిక రంగం తీసుకుందాం మొదట… చిన్నప్పటినుండీ  దైవభక్తితోనే పెరిగిపెద్దయాము.  ఇంట్లో పెద్దవారు రోజూ చేసే పూజలనండి, సాంప్రదాయాలనండి, వాటిని చూస్తూనో, లేక వారు చెప్పే రామాయణ భారతాల కథలద్వారానో, మొత్తానికి చాలామందిలో, దేవుడిమీద ఒక నమ్మకం ఏర్పడింది. ఏదో వినాయకచవితి తప్పించి, పిల్లల  direct involvement  అంతగా ఉండేది కాదు. అమ్మచెప్పినప్పుడు , ఏదో ఒక దేవాలయానికి వెళ్ళిరావడం, లేక  తల్లితండ్రులతో తీర్థయాత్రలకి వెళ్ళడంతో పనైపోయేది. మహా అయితే, పరీక్షల్లో రోజూ గుడికి వెళ్ళడం, పాస్ అయేటట్టు చూడమని ఓ దండం పెట్టుకోవడం. మరీ మొక్కులూ, దీక్షలూ లాటివుండేవికావు. అవన్నీ పెద్దాళ్ళే చూసుకునేవారు.. వినాయక చవితి పూజ చేయడం, ఆ విగ్రహాన్ని ఏ పొలంలోనో, ” గాదె ” లోనో పెట్టేసేవాళ్ళం.కాలక్రమేణా, ఈ గణపతి నవరాత్రులనండి, దసరానవరాత్రులనండి, ఇంకోటేదో అనండి, అన్నీ  commercial  అయిపోయాయి. అవేవో టన్నుల బరువుండే లడ్డూలూ, వాటికో గిన్నెస్ రికార్డుల్లో స్థానాలూ, ఆ లడ్డూల వేలాలూ… ఆ తొమ్మిదిరోజులూ నానా హడావిడిలూ, చందా వసూళ్ళూ… ఒకటేమిటి ఒకడితో ఒకడికి పోటీ. ఖైరతాబాద్ గణపతి అతి పెద్దదనేటప్పటికి, కాదూ మా విశాఖపట్టణంలోదే పెద్దదీ అనేవాడొకడూ, వాటిమీద చానెళ్ళవాళ్ళు  sms  లూ, చర్చలూనూ.. అసలు దేవుడేమో , నాకు పత్రిచాలు మొర్రో అంటాడు. అభిషేకాలూ అవీ ఇదివరకూ ఉండేవి. ఓ బుల్లివెండిగిన్నెలో పంచామృతాలూ, ఇంకో గిన్నెలో ఆవుపాలతో చేసేవారు. అప్పుడు మాత్రం దేవుడు మన ప్రార్ధనలను ఆలకించలేదా? మరీ బకెట్లలోనూ, ప్లాస్టిక్ పాకెట్లలోనూ పాలూ, తేనె, ఆ శనీశ్వరుడికి నూనె.. గుమ్మరించి, విడియోలుతీస్తేనే , భక్తికి గుర్తింపొస్తుందా? ఏమో నాలాటి అర్భకుడికైతే తెలియదు. ఇలాటివి చూసే ఆ ” జనవిజ్ఞాన వేదిక ” వారు నెత్తికొట్టుకుంటున్నారు మరి… ఎవరూ అభిషేకాలు వద్దనడం లేదు, ఓ నియంత్రణనేది ఉండాలి.

ఇంకో విషయం– ఏ పండగ, పర్వదినం తీసికున్నా,  Controversy  ముందరొచ్చి, మన తెలుగువారు తరవాతొచ్చారు. ప్రతీదీ చర్చనీయాంశమే. ఉగాది ఫలానారోజంటే, కాదూ ఫలానా రోజూ అని ఇంకోడంటాడు. ఇదివరకూ ఉండేవి ఈ పండగలూ, పర్వదినాలూనూ, కానీ ఇంత గొడవ అదీ తేదీలవిషయంలో ఎప్పుడూ వినలేదే…. పంచాంగాలలో మార్పులొచ్చాయా, లేక మనుషుల దృష్టికోణం లో మార్పులొచ్చాయా? లేక పంచాంగకర్తలూ, జ్యోతిష్కులూ ఎక్కువై ఎవరి పరిజ్ఞానం వారు ప్రదర్శించుకోవాలని తపనా? వీటికి సాయం మన తెలుగు చానెళ్ళలో వచ్చే ప్రకటనలోటీ. శాస్త్రాలని నమ్మడంలేదని కాదూ, అయినా ఆ వారఫలాల విషయమే తీసికోండి,  ఒకాయన ఒక చానెల్ లో చెప్పిన రాశిఫలం, ఇంకొకాయన  Exactly opposite గా చెప్తారు. ఎవరిని నమ్మేట్టూ? అసలు వాటిని ఎందుకు చూస్తారూ అనకండి– అదో సరదా. అలాగే, ఏ చానెల్లో చూసినా, అవేవో పూజలూ, వ్రతాలూ, శాంతులూ అంటారొకరు. మీ పేరులో ఓ అక్షరం మార్చుకుంటే, అదృష్టం మారిపోతుందని ఇంకొకరూ. పైగా వీటన్నిటికీ వేలల్లో కన్సల్టేషన్ ఫీజులోటీ.. వీటన్నిటినీ follow  అయిపోతే అసలు మన దేశంలో అందరూ కోటీశ్వరులైపోరూ? 

 ఈ ప్రసారమాధ్యమాల  bombardment  లేనప్పుడే హాయిగా ఉండేది.  ఇన్నేసి గొడవలుండేవి కావు. అయినా మనందరమూ  బతికిబట్టకట్టాముగా. దేశంలోని వివిధదేవాలయాల్లోనూ ఏవేవో నిబంధనలుండేవి.. ఎందుకుండేవీ అని అడగొద్దు. ఆమధ్యన ఆవిడెవరో ఓ ఉద్యమం మొదలెట్టి, స్త్రీలకి అప్పటిదాకా ఉన్న నిషేధాలని తొలగింపచేయకలిగింది.. ఆదిశంకరులు ఏ సదుద్దేశంతో  పీఠాలు స్థాపించారో, ఆ ఆశయం నెరవేరుతోందని గుండెలమీద చెయ్యేసికుని చెప్పగలమా?  స్వాములూ, ప్రవచనకర్తలూ, కోపతాపాలకి అతీతంగా ఉండాలంటారు. ఉన్నారా మరి?

ఇంక సినిమా, రాజకీయరంగాల విషయమైతే,  less said the better.  ఆరంగాల్లో ఉన్నంత   cultural pollution ,  ఇంకేరంగంలోనూ లేదు. మన చట్టసభల్లో ( దేశ, రాష్ట్ర)   ప్రజాప్రతినిధులు చేసే వీరంగాలు ఇక్కడ ప్రస్తావించి, మళ్ళీ  pollution  పెంచదలుచుకోలేదు…మొత్తానికి   Sound, Rivers and Air  లతో పాటు సంస్కృతిని కూడా  pollute  చేయడంలో మనవాళ్ళు ఇంకో మెట్టెక్కారు…

 మేరా భారత్ మహాన్…

26 Responses

 1. ఆధ్యాత్మిక గురువులు రాజకీయ నాయకులని ఆశ్రయించి ఛానల్స్‌ని మోనోపలీ చేస్తున్నారు.కులాల కుళ్లు వాళ్లని శాసిస్తున్నాయి.దిగజారిన మన సంస్కృతి ని ఎవరూ రక్షించలేరనిపిస్తోంది.

  Like

 2. సాంస్కృతిక కాలుష్య భారతం 😊

  Like

 3. కల్చరా !!?? భక్తి ఓ fashion statement అయిపోయింది. దాని మూలాన అంతా వ్యాపారమయం. ఆ మాయాజాలంలో పడిపోయారు జనం.
  ఎవరి మనోభావాలు దెబ్బ తిన్నా కూడా అభిషేకాల గురించి మీరన్నది నిజం. నామటుకు అన్నేసి పాలు – ఆ మాటకొస్తే అన్నన్ని నీళ్ళు కూడా – అభిషేకం పేరుతో అలా గుమ్మరించడం క్రిమినల్ వృధా అనే నా గట్టి అభిప్రాయం. లేని వారికి, అనాధ పిల్లలకు, వృద్ధులకు, రోగులకు పంచిపెట్టినా ప్రయోజనకరమైన పని చేసినట్లవుతుంది. పాలు, నీళ్ళకు తోడు నెయ్యాభిషేకం కూడా కొన్ని చోట్ల – ముఖ్యంగా కేరళ రాష్ట్రంలోని కొన్ని గుళ్ళల్లో. ఒక చుక్క పాల ఉత్పత్తంటేనూ, ఒక చుక్క నెయ్యి / నూనె తయారీయంటేనూ అసలు అవగాహన ఉందా ఇటువంటి అభిషేకాలు చేసేవారికి అనిపిస్తుంది నాకైతే.
  పండగల తేదీల గురించి విభజన ఈ మధ్య కాలంలోనే మొదలైంది – ఓ పెద్దమనిషి గారి వలన అని జ్ఞాపకం. అది గందరగోళంగా తయారై పంచాంగకర్తలకు కూడా తగులుకుంది. నీకంటే ఘనుడను నేను అని చూపించుకోవాలనే దుగ్ధ పెరిగిపోయింది.
  పైన రాధారావుపివి గారన్నట్లు దిగజారిపోయిన సంస్కృతి. పైగా వ్యాపారుల గుప్పిట్లో చిక్కుకుంది కూడానూ. మీరన్న కాలుష్యం ఎక్కువై పోయి కంపు కొడుతోంది.

  Like

  • నరసింహరావు గారూ,

   మీరన్నట్టు, నేను రాసినదానికి కొందరి మనోభావాలు దెబ్బ తినొచ్చు. అలాగని, అందరూ ఎవరిదారిన వారు పట్టించుకోకుండా కూడా ఉండలేముగా. మీ స్పందనకు ధన్యవాదాలు.

   Like

 4. హన్నా ! హన్నా ! హిందూమతం మీద యిన్నేసి కంప్ల యింట్లా

  అదిన్నూ అభిషేకాల మీద యిన్ని విమర్శలా !

  ఉండండి మీ మీద కంప్ల యింటిస్తా 🙂

  దేశంలో దేవుళ్ళు పడ్డారు 🙂

  జిలేబి

  Like

  • జిలేబి గారూ, మీరు నేతిగిన్నె పక్కన బెట్టి అగ్గిపెట్టె తీసుకుని రాకండి 🙂.
   ఇక్కడ చర్చలో మతం మీద కంప్లయింటేమీ లేదు. వెర్రితలలేస్తున్న కొన్ని పోకడల గురించి మాత్రమే మాట్లాడుతున్నాం.

   Like

   • నేతిగిన్నెలూ అగ్గిపెట్టెలూ ఎందుకు ఊదితే చాలదూ 🙂

    Like

   • నరసింహరావు గారూ,

    జిలేబీకి అదో passion . ఏదో ఒక పుల్లపెడితేనేకానీ, అదేమిటో ప్రశాంతంగా ఉండలేరు. Between the lines చదవడంలో ఓ పెద్ద expert…. వదిలేయండి…

    Like

  • జిలేబీ,

   ఉన్నమాటేదో చెప్పడంకూడా తప్పేనా?

   Like

 5. భక్తిమార్గపు మత్తులోనటు భామలెల్లరు తూగిరీ
  ముక్తిగోరుచు ముద్దుగుమ్మలు మోసగాళ్ళను నాడిరీ
  రక్తికోరుచు సాములోళ్లటు రాసలీలల దేలిరీ
  యుక్తిబోవ జిలేబులందరు ఓటికుండల బోలిరీ !

  Like

 6. పండగ రోజుల విషయంలో పంచాంగాల్లో విబేధాలకు కారణం కొందరు ఇంకా పాతవిధానంలోనే పంచాగాలు చేయటం. సూర్యాదిసిధ్ధాంతాలకు వచ్చిన కరణగణితగ్రంథాల్లో ఉన్న విధానాలను అనుసరించి పంచాగాలు చేస్తారు వీళ్ళు – కాని ఆ కరణగ్రంథాలే చెప్పినట్లు బీజసంస్కారాలు చేయరు – ఇంకా మా తాతగారు చేసినదానిలో మార్పులు చేయటమా – తరతరాలనుండి ఇలాగే చేస్తున్నాం అంటూ ఆట్టే సిధ్దాంతపరిజ్ఞానం లేకుండా కేవలం గుడ్డిగా లెక్కవేసి పంచాంగాలు చేసేస్తారు. దృక్సిధ్దాంతం అనేది ఆధునికఖగోళశాస్త్రంతో ఏకీభవించి చేసే విధానం – అది శాస్త్రీయం. కాని పూర్వాచారం అంటూ కొందరు ఇంకా పాతవిధానంలోనే చేస్తూండటం వలన దృగ్గణిత పంచాగాలకూ వీరుచేసే పంచాంగాలకూ తేడా వచ్చి జనానికి గందరగోళం పంచుతోంది. దృగ్భిన్నపంచాంగ గణితాన్ని నిషేధించాలండి. నిజానికి కొందరైతే పాతవిధానంలో తిథులు చేస్తారు కాని గ్రహణాలు తిన్నగా రావటానికి మళ్ళీ ఆ విషయంలో దృగ్గణితఫలితాలని ఆశ్రయించి గ్రహణగణనం చేస్తారు.

  Like

  • శ్యామల రావుగారూ,

   మీ శాస్త్రీయ వివరణకు ధన్యవాదాలు. అయితే ఇప్పుడు ఎవరిని అనుసరించాలీ? మరి పంచాంగ కర్తలలో ఏకాభిప్రాయం వచ్చే అవకాశం ఉందా లేక, ఇలాగే ఉండాలా?

   Like

   • సనాతమైనది ప్రతిది మంచిదని గుడ్డిగా నమ్మడమే పొరపాటు, అలాగే సనాతనమంతా చెత్తనుకోడమూ తప్పు. కాలంతో పాటు మారాలి, మన సనాతనలూ మారేరలా! లేకపోతే మనకీ అభివృద్ధి లేదు. ఇక్కడ దృక్సిద్ధాంతాన్ని అనుసరించాలి. సిద్ధాంతులలో ఏకత్వం రాదు…

    Like

   • -ఒక్క ముక్కా అర్థం కాలే దృక్కేంటో కరణ మేంటో సూర్య యేంటో ఏవీ వివరణ లివ్వకుండా మీకు మీరే ఆయ్ ఇక్కడ దృక్ ఉపయోగించాలి అనడమూ అక్కడ టీవీలో అర్థం కాని ఏంటహే ఏంకర్ల తీరు రెండూ ఒక్క లానే ఉందిస్మీ

    విశదీకరించచలె కష్టేఫలే వారు శ్యామలీయం వారు భమిడిపాటి వారు ( నాకేంటో సందేహం గా ఉంది ఈ మూడో వారు ఇద్దరు దృక్ అనేసారు కాబట్టి మనం కూడా దాన్నే సపోర్ట్ చేస్తే పోతుంది అన్నట్తున్నారు :))

    జిలేబి

    Like

 7. శర్మగారూ,

  మీరూనా…. వామ్మోయ్ జిలేబీ ప్రభావంలో పడిపోయారు… కానీయండి…

  Like

 8. శర్మగారూ,

  మరీ ఇలా మమ్మల్ని గాల్లో వదిలేస్తే ఎలాగా మాస్టారూ…ఏది అనుసరించాలో చెప్పి పుణ్యం చేసికోండి మరి.

  జిలేబీ,

  నా మట్టిబుర్రకి అర్ధం అయిందేదో రాశాను. పై విజ్ఞులిద్దరూ మనల్ని ఇంకా అయోమయం లో పెట్టేశారు కదూ…. ఏమిటో ఎరక్కపోయి వేలెట్టాను…

  Like

  • టూకీగా చెబుతా!
   వత్సరాది అంటే చైత్ర శుద్ధ పాడ్యమి.సూర్యోదయ కాలానికి ఉన్నతిథి నాటి తిథిగా చెబుతారు. ఈ సంవత్సరం పాడ్యమి ఏష్యమైంది, 28వ తేదీన,దృక్సిద్ధాంత ప్రకారం.( దృక్ అంటే ఏమో శ్యామలీయం చెప్పారు,చూడండి.) అంటే రెండు సూర్యోదయాలకి మధ్య గడచిపోయింది, పాడ్యమి 28 న. 29 న పాడ్యమి లేదు. పూర్వ సిద్ధాంతం ప్రకారం గణిస్తే పాడ్యమి 29 న వస్తుంది,29 న కూడా సూర్యోదయానికి పాడ్యమి లేదు ఏష్యమయింది. తిథి గణనలో వచ్చిన తేడా ఇది. ఇలా అప్పుడప్పుడు జరుగుతుంది. ఏ రోజు సూర్యోదయానికి పాడ్యమి ఉంటే ఆ రోజే పండగ, మరలా లేదు ఎలా? ఇదీ ప్రశ్న. ఇలా లేనపుడు ఏరోజు పాడ్యమి ఉంటే ఆ రోజు పండగ చేసుకోవాలి, అంటే 28 న చేసుకోవాలి. మిగులనీ, తగులనీ చాలా ఆచారాలున్నాయి. 28 న మాత్రం పాడ్యమి ఉదయం 8-27 నుండి తె.5-45 వరకు ఉన్నది. ఆ రోజే పండగ. మా అలవాటిలా పూర్వ సిద్ధాంతం అనుసరిస్తామంటే మీ ఇష్టం.
   దృక్ calculations are in conformity with the observatory results

   Like

 9. జిలేబీ,

  ఇక్కడ మహరాష్ట్రలో రేపే ( 28 ) చేసుకుంటున్నారు. Be a Roman while in Rome…

  Like

 10. లలితమ్మ తన “బోలెడన్ని కబుర్లు” బ్లాగులో ఓ సారి “న-ఉగాది” అనే పదప్రయోగం చేసినట్లు గుర్తు (ఆ టపా కోసం ఇందాక తన బ్లాగ్ లో కాసేపు వెతికాను). ఈ 28, 29 గందరగోళం చూస్తుంటే ఆ మాట గుర్తొచ్చింది.
  చివరికి నా అభిప్రాయంలో 28న ఉగాది చేసుకునే వారికి 29వ తేదీ “న-ఉగాది”, 29న చేసుకునే వారికి 28వ తేదీ “న-ఉగాది” అనుకుంటే సరి, ఆల్ హేపీస్ 🙂🙂.
  అందరు బ్లాగర్లకు, బ్లాగ్ పాఠకులకు ఉగాది శుభాకాంక్షలు. 🍃🌱

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: