బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– Cultural pollution…

 అప్పుడెప్పుడో చిన్నప్పుడు విన్నాము– అదేదో  cultural revolution  అని చైనాలో వచ్చిందిట, కానీ ప్రస్థుతం మన దేశంలో చూస్తున్నది, ఆ చైనాలో వచ్చినదానికి తరువాతి దశ అని నా అభిప్రాయం,ఈ cultural pollution (  సాంస్కృతిక కాలుష్యం ) అన్న జాడ్యం ఈరోజుల్ల్లో దేశమంతా పాకిపోయింది. ఏ రంగం తీసుకున్నా ఇదే రంధి. ప్రస్తుత తరానికి ఇవన్నీ వింతగా కనిపించడం మూలానేనేమో,  అవేవో “జన విజ్ఞాన  వేదికలూ ” అవీ మొదలయ్యాయి.. వాళ్ళు చెప్పేవి కొంతమందికి నచ్చకపోవచ్చు.అలాగని వాళ్ళుమాత్రం చెప్పేవి తప్పనలేముగా… నిజమే ఎవరి నమ్మకాలు వారివీ… కాదనడానికి మధ్యలో వీళ్ళెవరూ అనేది కొందరి అభిప్రాయం..  Its an unending debate.

 ఆధ్యాత్మిక రంగం తీసుకుందాం మొదట… చిన్నప్పటినుండీ  దైవభక్తితోనే పెరిగిపెద్దయాము.  ఇంట్లో పెద్దవారు రోజూ చేసే పూజలనండి, సాంప్రదాయాలనండి, వాటిని చూస్తూనో, లేక వారు చెప్పే రామాయణ భారతాల కథలద్వారానో, మొత్తానికి చాలామందిలో, దేవుడిమీద ఒక నమ్మకం ఏర్పడింది. ఏదో వినాయకచవితి తప్పించి, పిల్లల  direct involvement  అంతగా ఉండేది కాదు. అమ్మచెప్పినప్పుడు , ఏదో ఒక దేవాలయానికి వెళ్ళిరావడం, లేక  తల్లితండ్రులతో తీర్థయాత్రలకి వెళ్ళడంతో పనైపోయేది. మహా అయితే, పరీక్షల్లో రోజూ గుడికి వెళ్ళడం, పాస్ అయేటట్టు చూడమని ఓ దండం పెట్టుకోవడం. మరీ మొక్కులూ, దీక్షలూ లాటివుండేవికావు. అవన్నీ పెద్దాళ్ళే చూసుకునేవారు.. వినాయక చవితి పూజ చేయడం, ఆ విగ్రహాన్ని ఏ పొలంలోనో, ” గాదె ” లోనో పెట్టేసేవాళ్ళం.కాలక్రమేణా, ఈ గణపతి నవరాత్రులనండి, దసరానవరాత్రులనండి, ఇంకోటేదో అనండి, అన్నీ  commercial  అయిపోయాయి. అవేవో టన్నుల బరువుండే లడ్డూలూ, వాటికో గిన్నెస్ రికార్డుల్లో స్థానాలూ, ఆ లడ్డూల వేలాలూ… ఆ తొమ్మిదిరోజులూ నానా హడావిడిలూ, చందా వసూళ్ళూ… ఒకటేమిటి ఒకడితో ఒకడికి పోటీ. ఖైరతాబాద్ గణపతి అతి పెద్దదనేటప్పటికి, కాదూ మా విశాఖపట్టణంలోదే పెద్దదీ అనేవాడొకడూ, వాటిమీద చానెళ్ళవాళ్ళు  sms  లూ, చర్చలూనూ.. అసలు దేవుడేమో , నాకు పత్రిచాలు మొర్రో అంటాడు. అభిషేకాలూ అవీ ఇదివరకూ ఉండేవి. ఓ బుల్లివెండిగిన్నెలో పంచామృతాలూ, ఇంకో గిన్నెలో ఆవుపాలతో చేసేవారు. అప్పుడు మాత్రం దేవుడు మన ప్రార్ధనలను ఆలకించలేదా? మరీ బకెట్లలోనూ, ప్లాస్టిక్ పాకెట్లలోనూ పాలూ, తేనె, ఆ శనీశ్వరుడికి నూనె.. గుమ్మరించి, విడియోలుతీస్తేనే , భక్తికి గుర్తింపొస్తుందా? ఏమో నాలాటి అర్భకుడికైతే తెలియదు. ఇలాటివి చూసే ఆ ” జనవిజ్ఞాన వేదిక ” వారు నెత్తికొట్టుకుంటున్నారు మరి… ఎవరూ అభిషేకాలు వద్దనడం లేదు, ఓ నియంత్రణనేది ఉండాలి.

ఇంకో విషయం– ఏ పండగ, పర్వదినం తీసికున్నా,  Controversy  ముందరొచ్చి, మన తెలుగువారు తరవాతొచ్చారు. ప్రతీదీ చర్చనీయాంశమే. ఉగాది ఫలానారోజంటే, కాదూ ఫలానా రోజూ అని ఇంకోడంటాడు. ఇదివరకూ ఉండేవి ఈ పండగలూ, పర్వదినాలూనూ, కానీ ఇంత గొడవ అదీ తేదీలవిషయంలో ఎప్పుడూ వినలేదే…. పంచాంగాలలో మార్పులొచ్చాయా, లేక మనుషుల దృష్టికోణం లో మార్పులొచ్చాయా? లేక పంచాంగకర్తలూ, జ్యోతిష్కులూ ఎక్కువై ఎవరి పరిజ్ఞానం వారు ప్రదర్శించుకోవాలని తపనా? వీటికి సాయం మన తెలుగు చానెళ్ళలో వచ్చే ప్రకటనలోటీ. శాస్త్రాలని నమ్మడంలేదని కాదూ, అయినా ఆ వారఫలాల విషయమే తీసికోండి,  ఒకాయన ఒక చానెల్ లో చెప్పిన రాశిఫలం, ఇంకొకాయన  Exactly opposite గా చెప్తారు. ఎవరిని నమ్మేట్టూ? అసలు వాటిని ఎందుకు చూస్తారూ అనకండి– అదో సరదా. అలాగే, ఏ చానెల్లో చూసినా, అవేవో పూజలూ, వ్రతాలూ, శాంతులూ అంటారొకరు. మీ పేరులో ఓ అక్షరం మార్చుకుంటే, అదృష్టం మారిపోతుందని ఇంకొకరూ. పైగా వీటన్నిటికీ వేలల్లో కన్సల్టేషన్ ఫీజులోటీ.. వీటన్నిటినీ follow  అయిపోతే అసలు మన దేశంలో అందరూ కోటీశ్వరులైపోరూ? 

 ఈ ప్రసారమాధ్యమాల  bombardment  లేనప్పుడే హాయిగా ఉండేది.  ఇన్నేసి గొడవలుండేవి కావు. అయినా మనందరమూ  బతికిబట్టకట్టాముగా. దేశంలోని వివిధదేవాలయాల్లోనూ ఏవేవో నిబంధనలుండేవి.. ఎందుకుండేవీ అని అడగొద్దు. ఆమధ్యన ఆవిడెవరో ఓ ఉద్యమం మొదలెట్టి, స్త్రీలకి అప్పటిదాకా ఉన్న నిషేధాలని తొలగింపచేయకలిగింది.. ఆదిశంకరులు ఏ సదుద్దేశంతో  పీఠాలు స్థాపించారో, ఆ ఆశయం నెరవేరుతోందని గుండెలమీద చెయ్యేసికుని చెప్పగలమా?  స్వాములూ, ప్రవచనకర్తలూ, కోపతాపాలకి అతీతంగా ఉండాలంటారు. ఉన్నారా మరి?

ఇంక సినిమా, రాజకీయరంగాల విషయమైతే,  less said the better.  ఆరంగాల్లో ఉన్నంత   cultural pollution ,  ఇంకేరంగంలోనూ లేదు. మన చట్టసభల్లో ( దేశ, రాష్ట్ర)   ప్రజాప్రతినిధులు చేసే వీరంగాలు ఇక్కడ ప్రస్తావించి, మళ్ళీ  pollution  పెంచదలుచుకోలేదు…మొత్తానికి   Sound, Rivers and Air  లతో పాటు సంస్కృతిని కూడా  pollute  చేయడంలో మనవాళ్ళు ఇంకో మెట్టెక్కారు…

 మేరా భారత్ మహాన్…

%d bloggers like this: