బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఆలోచించాల్సిన విషయమే కదూ…


ఇదివరకటి రోజుల్లో, శుభకార్యాలకీ, ఇంకేదైనా ఆశుభసంఘటనలకీ, బంధుమిత్రులకి సమాచారం అందచేయడానికి , తంతితపాలా శాఖవారే గతి. కార్డుకి నాలుగు కొసల్లోనూ పసుపు రాసి పంపితే, అది శుభవార్తగానూ, నల్లరంగు రాసి పంపితే, ఎవరో స్వర్గస్థులయారనీ తెలిసిపోయేది.మరీ దూరాల్లో ఉన్నవారికి ఓ టెలిగ్రాం ద్వారా తెలిపేవారు.అయినా ఆరోజుల్లో అంతంత దూరాల్లో ఎవరుండేవారూ?  చేసేవాళ్ళు, ఊళ్ళోనే  ఉండే తాలూకాఫీసుల్లోనూ, మహా అయితే ఏ స్కూల్లోనో ఉపాధ్యాయుడిగానూ.. పెద్ద సమస్యుండేది కాదు. కాలక్రమేణా ఫోన్లొచ్చాయి. 

ఈరోజుల్లో ఎలాటివార్తైనా క్షణాల్లో చేరిపోతోంది..  Social Networks  ధర్మమా అని. ఒకలా చూసుకుంటే అదే మంచిది. పెళ్ళివిషయం ఎవరికైనా ఫోను చేస్తే, పెద్దగా ఎవరూ ఏమీ అనుకోరు. తెలిసినా, ” ముందర చెప్తే రిజర్వేషన్లూ అవీ చేసికుంటావని ఫోను చేశానూ..” అంటారు.. అంటే ముందరికాళ్ళకి బంధం అన్నమాట ! నచ్చినా నచ్చకపోయినా చచ్చినట్టు వెళ్ళాలేగా.. సమాచారం అందచేసినట్టూ ఉంటుంది, పెద్దగా గొడవుండదు.  ఎవరైనా, ” అదేవిటీ ఫలానా మీ అన్నయ్యో, అక్కయ్యో, బాబాయో ఇంకోరెవరో రాలేదేమిటీ..” అని అడుగుతూంటారు.వాళ్ళకి ఆ పెద్దాయన ఉన్నాడా, ఊడాడా కంటే, వీళ్ళ సంబంధ్బాంధవ్యాలెలాగున్నాయా అని కూపీలాగడానికీ, ఇంకో పదిమంది దగ్గర టముకేయడానికీ మాత్రమే.  ఎవరైనా అడిగినా అడక్కపోయినా, తనే ఆ  topic  మొదలెట్టడం. ఇలాటివాళ్ళదగ్గర తన  image  కాపాడుకోవడానికే, ” ఆ ముహూర్తాలు పెట్టగానే ఫోనులూ, సింగినాదాలూనూ..” ” ఎప్పుడో ఫోను చేశానండీ, ఎందుకు రాలేకపోయాడో నాకూ తెలియదూ..ఆయన లోటు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది ..” అని ఓ నాలుగు  hypocritical  మాటలతో పనైపోతుంది. ఉభయ తారకం. ఆతరువాత ఎవరైనా అడిగినా, చెప్పొచ్చు.. “రిజర్వేషను చేశానండీ.. ఆఖరి క్షణంలో కొద్దిగా నలత చేయడంతో క్యాన్సిల్ చేయాల్సొచ్చిందీ..” రిజర్వేషన్ దొరకలేదని బుకాయించడానికి ఈ రోజుల్లో అంతగా సదుపాయం/ సావకాశం లేవాయే, ఆ  Tatkal  ధర్మమా అని…వెళ్ళాలనున్నవాడు ఎలాగైనా వీలుచూసుకుని వెళ్తాడు… లేనివాడికే ఈ కుంటిసాకులన్నీనూ…..

ఇంక ఎవరైనా స్వర్గస్థులయితే, బంధుమిత్రులకి సమాచారం అందచేయడంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫోను చేయబడినవాడు ఒకే ఇంటిపేరువాడా, దగ్గర చుట్టరికం ఏదైనా ఉందా .. లేదా తమకుటుంబంలోనే ఏ అప్పచెల్లెళ్ళ ,  పిల్లలా … ఇలా అన్నీ చూసుకుని మరీ ఫోనుచేయాలి. మన తెలుగుసాంప్రదాయాలప్రకారం, మైలలూ, పక్షిణీలూ .. ఏవేవో ఉన్నాయి. ఈమధ్యరోజుల్లో, నగరాల్లో ఉండే బంధువులకి ఇబ్బంది కలక్కుండా, ఓ 15 రోజుల తరువాత ఫోనుచేసి చెప్పేస్తున్నారు. ఓ స్నానం చేస్తే సరిపోతోంది. ఎంతైనా ఈరోజుల్లో ప్రతీదీ ఓ  formality  గానే భావిస్తున్నారుగా. ఇలాకాకుండా కొందరు  overenthusiastic persons, వాళ్ళింట్లో ఎవరైనా స్వర్గస్థులవడం తరవాయి, ఆ పెద్దాయన  Phone Contacts  లో ఉన్నప్రతీవారికీ ఫోనుచేసేసి చెప్పడం. పాపం వాళ్ళకి మాత్రం ఏం తెలుసునూ ఈరోజుల్లో? నగరాల్లో  పుట్టి పెరిగారాయె, చుట్టాలూ పక్కాలూ అసలు తెలియనేతెలియదాయే, ఎవరికి ఫోనుచేస్తే వారికేం ఇబ్బందొస్తుందో అసలే తెలియదాయె– కారణం, వారింట్లో ఏదో శుభకార్యం ఉండొచ్చు, ఏ కూతురికో, కోడలికో విసేషమయుండొచ్చు కాదూకూడదంటే వాళ్ళింట్లోనే ఏ పెద్దాయనో, పెద్దావిడో మంచం పట్టుండొచ్చు… ఇలాటి టైములో ఏ మరణవార్తో తెలిసికోడానిక్కూడా ఇష్టపడకపోవచ్చు… మరెలాగ తెలియచేయడం?

హాయిగా ఏ  Facebook  లోనో పెట్టేయడం. ఈరోజుల్లో  FB account  లేనివాళ్ళని వేళ్ళమీద లెక్కెట్టొచ్చు… తెలిసిఅవాళ్ళు ” అయ్యో పాపం.. ” అనుకుంటారు… తెలియనివాళ్ళుకూడా వ్యాఖ్యలు పెడతారు.. పదిమందికీ తెలుస్తుంది…. ఆ తరవాత ఫోనుచేసి పరామర్శించేవారు ఫోను చేస్తారు, లేదా ఓ వ్యాఖ్యపెట్టేసి ఊరుకుంటారు.  Purpose is served.

మరీ ఇంత  impersonal  గా ఉన్నాయా relations  అనకండి. ఈరోజుల్లో ఎవరి గొడవలు వాళ్ళవీ ఇదివరకటి ఆప్యాయతలూ, ఆత్మీయతలూ దివిటీ పెట్టి వెదికినా కనిపించే రోజులు కావు. ప్రతీదీ commercial  అయిపోయింది. నేనేదైనా చేస్తే నాకొచ్చేలాభం ఏమిటీ అనుకునే రోజులు…Personal relations have gone for a toss.

 ఈగొడవంతా ఎందుకు రాశానంటే, ఇవేళ  పొద్దుటే, మా అక్కయ్య ( దొడ్డమ్మ గారి కూతురు) కందా భాస్కరమ్మగారు  స్వర్గస్థులయారని    Facebook  ద్వారానే తెలిసింది.  . అమలాపురం కాలేజీలో పనిచేసేవారు. ఆవిడ ఆత్మకు శాంతి కలుగుకాక..  తెలిసినవెంటనే ఆ కుటుంబం అందరికీ ఫోను చేసి పలకరించాను.

ఈరోజుల్లో చాలామంది నగరాల్లోనే ఉంటున్నారు.ఇంటికో పెద్దాయనో, పెద్దావిడో అయితే ఉంటున్నారే. ఆరోజుల్లోవారు దీర్ఘాయుష్కులాయె, ఎప్పటికో అప్పటికి పోవడమైతే ఖాయం.మరి పోయినప్పుడు, ఆ ఇంటి కొడుక్కో, కూతురికో ఎవరెవరికి తెలియచేయాలో ఎలా తెలుస్తుందీ?   Facebook  అయితే Option No1.  అలా కాకుండా, మా ఇంటావిడ చెప్పినట్టు, హాయిగా ఏ Wordpad  లోనో, ఈపెద్దాయన విషయం ఎవరెవరికి తెలియచేయాలో, వారి ఫోను నెంబర్లు  Priority wise  ఇచ్చేస్తే సరి. బంధువవొచ్చు, ఆత్మీయ స్నేహితుడవొచ్చు. ఇంకో విషయం.. కర్మకాండలు చేయించే పురోహితుడి నెంబరు కూడా ఇచ్చేస్తే భేషుగ్గా ఉంటుంది.  తెలుగుప్రాంతాల్లో అయితే పరవాలేదు. పరాయిరాష్ట్రాల్లో ఉంటే ఉపయోగిస్తాయేమో కదూ…

సర్వేజనాసుఖినోభవంతూ…

6 Responses

  1. కొన్ని వార్తలు పేపర్ లో శ్రద్ధాంజలి లో చూశాక తెలుస్తాయి.ఫోన్ లో మనం కూడా సంతాపం తెలియజేసి విచారిస్తాం.

    Like

  2. మీ చావెలా చావాలి – నేర్చుకోవాల్సిన కిటుకులు అనే హాండ్ బుక్ రాసి పబ్లిష్ చేస్తే మంచి దంటారా ?

    Like

  3. చావుగురించి ఎవరిని నొప్పించకుండా బాగా వ్రాసారు. మానవ బంధాలు యెంత పల్చనైపోయాయో! మీ రచనల్లో యువతని ఆకర్షించే నేర్పుంది. ఆరహస్యమేంటో చెబుదురూ..

    Like

    • అన్యగామి గారూ,

      అంత రహస్యం ఏముందండీ? నాకొచ్చినంతలో, ఎవరి మనోభావాలూ నొప్పించకుండా రాయడం మూలాన నచ్చుతున్నాయేమో… మీ స్పందనకు ధన్యవాదాలు.

      Like

Leave a comment