బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– చల్తాహై.. attitude…


IMG_20170315_104451.jpgIMG_20170315_104444.jpg

 ఎవరైనా అనుకోవచ్చు– ” తప్పులు పట్టడం  చాలా  సులభమూ, చేసేవాళ్ళకే తెలుస్తుందీ… ” అని. కానీ కోట్లలో వ్యాపారాలు చేసేవాళ్ళకి.  Staff  ని ఏర్పరుచుకోవడంలో లోటేమీ లేదు కదా.. పాపం వాళ్ళు నియమిస్తారు. కానీ , వచ్చిన గొడవల్లా, ఎవరి పని వాళ్ళు sincere  గా చేయకపోవడమే. మనదేశంలో పెద్ద జాడ్యం– ” చల్తా హై ” attitude.  . యాజమాన్యానిదీ , పనిచేసేవాళ్ళదీ కూడా.ఇవేళ, మా ఇంటావిడ, గుల్ల శనగపప్పు కావాలంటే, దగ్గరలో ఉన్న రిలయన్స్ మాల్ కి వెళ్ళాను. పైన పెట్టిన ఫొటోలు దానికి సంబధించినవే. ప్యాకెట్ మీద ఒక రేటూ,  display board  మీద ఒకరేటూ,  బిల్లింగ్ దగ్గర సిస్టంలో ఇంకోరేటూ.. ఏమిటిరా అని అడిగితే,  cool  గా ఆ  display board  తీసిఅవతల పారేశాడు. ఫొటో తీయబట్టికానీ, అసలు నేను చెప్పినది ఒప్పుకునేవారేకాదేమో…

అది ఒక్క  Service  రంగమనే కాదు.. ఏ రంగమైనా అంతే.ఉదాహరణకి రచయితలనే తీసుకోండి,  వాళ్ళు రాసిన వాటికి పేరొచ్చి,  ఓ  celebrity status  వచ్చిందంటే చాలు, ఏ చెత్త రాసినా ఫరవాలేదనుకుంటారు. ఆ చెత్తని ఆస్వాదించేవారూ ఉంటారు. అలాగే, గత కొన్నిరోజులుగా  Facebook  లో చాలామంది  తెలుగు చానెల్స్ లో వస్తూన్న కార్యక్రమాల గురించి నీతులు బోధించేవారే,  వాటికి ప్రతీవారూ, వ్యాఖ్యలు పెట్టి స్పందించేవారే. కానీ ఎవ్వరూ మాత్రం ఏమీ చేయరు. చేస్తే కాలక్షేపం ఎలా అవుతుందీ? పోనిద్దూ.. చల్తాహై అనేవారే.

అంతదాకా ఎందుకూ.. ” మీ ఓటు అమూల్యం.. ఓటు మీహక్కు.. ” అంటూ ప్రతీ ఎన్నికలముందూ ఊదరకొట్టేస్తారే.. నిజమే కాబోలనుకుని తమకు నచ్చిన అభ్యర్ధిని ఎన్నుకుంటారు. తీరా ఆ ఎన్నికైన తరువాత, వాడేమో కిట్టుబాటయే పార్టీలోకి జంపైపోతాడు.. అధికారపార్టీ వాళ్ళు మాత్రం తక్కువతిన్నారా.. కావాల్సిన మెజారిటీ రాకపోయినా, అవేవో చర్చలనిపేరుపెట్టి, ఇవ్వాల్సిన ముడుపులు చెల్లించి, మొత్తానికి అధికారంలోకి వస్తారు. పైగా ఇవన్నీ resorts  లలోనే జరుగుతాయి. అప్పుడు తమిళనాటా, ఇప్పుడు గోవా, మణిపూర్ లలోనూ. ఈమాత్రందానికి ఎన్నికలెందుకూ, అంతంత ఖర్చులెందుకూ? ” ఇది మామూలే కదండీ.. ” అనేవారే ఎక్కువ. మళ్ళీ ” చల్తా హై  attitude.” దమ్ముంటే శ్రీ నరసింహారావుగారిలా మైనారిటీ ప్రభుత్వం నడిపించాలి.. అంతేకానీ   అయిదారుగురికి తాయిలాలు పెడితే, హాయిగా వచ్చేస్తారనే  ” చల్తాహై … ఇది మామూలేనండీ .. ” అనడం కాదు. మన చట్టసభల్లో చూడండి, ఏదో ఒక గొడవా, అరుపులూ కేకలూ లేకుండా ఒక్కరోజైనా గడుస్తుందా… ” చల్తాహై… ” అలాగే కొంతమంది బ్యాంకులనుండి అప్పులుతీసికుని, తీర్చకపోవడంకూడా ఈ ” చల్తాహై ” కోవలోదే…

  Helmets Compulsory  అంటారు. ట్రాఫిక్ పోలీసులకే దిక్కులేనప్పుడు, ఇంకోరెవరో పాటించాలని అనుకోవడంలో అర్ధం లేదు.  సుప్రీంకోర్టు అనొకటుంది, ఎవ్వడూ పట్టించుకోడు, అధికారపార్టీ ఏదైనా సరే, అప్పుడెప్పుడో  ” ఆధార్ ” కార్డు compulsory  చేయకూడదూ అని ఒక తీర్పు చెప్పారు. కానీ ప్రభుత్వం ప్రతీదానికీ ఆధారే  ఆధారం అంటున్నారు. ” చల్తా హై…అలాగే దేన్నైనా  unconstitutional  అనడం తరవాయి, ఆఘమేఘాలమీద  ఓ  ORDNANCE  పెట్టేస్తే గొడవొదిలిపోతుంది. చల్తా హై...

మొన్న భద్రాచలం వెళ్ళినప్పుడు బోర్డులు చూశాను.. ” ఆలయప్రాంగణంలో ఫొటోలూ, విడియోలూ తీయడం నిషిధ్ధం ” అని. కల్యాణం చేయించే పురోహితులదగ్గరనుండి, ప్రతీవాడి చేతిలోనూ, ఓ  smart phoనే… హాయిగా తీసుకుంటున్నారు. ఇంక ఆ బోర్డులెందుకుటా? ఏ దేవాస్థానం మనిషైనా చూస్తే మాత్రం, ఆ బోర్డుచూపించి,” మీ ఫోను హుండీలో పడేస్తాము ” అని బెదిరించడానికి మాత్రమే.  తిరుమలతిరుపతిదేవస్థానం లో కనీసం కొన్నైనా ఉన్నాయి… ఉదాహరణకి  dress code, no photography  లాటివి. ఇక్కడ dress code  అనేదే లేదు. ఎవరిష్టమొచ్చిన వేషంలో రావొచ్చు. ” చల్తా హై…

ఇన్ని సౌలభ్యాలున్నా, అదేమిటో కొంతమంది intolerance  అని పేరుపెట్టి వీధినపడుతూంటారు.. అందరిచేతా చివాట్లు తింటూంటారు… ఏమిటో అర్ధం చేసుకోరూ… ( స్వర్ణకమలం భానుప్రియ డయలాగ్ )

మేరా భారత్ మహాన్…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: