బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– मुखौटा… అర్ధం తెలుసుగా… Mask…


 

     ఎవరి మనోభావాలూ నొప్పించాలని కాదు ఈ టపా…ఉన్నదేదో చెప్పాలని మాత్రమే…         ఫాషన్లు రోజురోజుకీ మారిపోతున్నాయి , ఈరోజుల్లో.  ఎవరిని చూసినా, గెడ్డాలూ, మీసాలూనూ… ఒకానొకప్పుడు ,  ఎవరో సిఖ్ మతస్థులని చూసినప్పుడో, ఏ సాధుపుంగవులో, ఏ హజ్ యాత్ర చేసొచ్చిన మహమ్మదీయులకో పెద్ద పెద్ద గడ్డాలు కనిపించేవి… వీళ్ళే కాకుండా, సినిమాల్లో విలన్ పాత్రధారులైతే , ఓ గెడ్డం తప్పకుండా ఉండేది.  పరిస్థితులు మారి, ఈరోజుల్లో ఉగ్రవాదులకికూడా గెడ్డాలూ, మీసాలూ తప్పనిసరిగా ఉంటాయి.ఒకానొకప్పుడు వారపత్రికల అట్టమీద బొమ్మలకి , మీసాలూ గెడ్డాలూ పెట్టడం ఓ సరదాగా ఉండేది.

చిన్నప్పుడు గుర్తుందా, పసిపిల్లల  ఏడుపు ఆపడానికి ఒకటే తారకమంత్రం—ఏ గెడ్డపువాడినో చూపించి “ ఏడిస్తే ఆ బూచాడు ( గెడ్డంతో ఉన్న ప్రాణి )  ఎత్తుకుపోతాడు.. “ అనడమేమిటి, ఆ పిల్లాడు ఠక్కున ఏడుపాపేసేవాడు…  వీళ్ళే కాకుండా, కొత్తగా పెళ్ళయినవాడిని  గెడ్డంతో చూస్తే, తెలిసిన ఏ పెద్దాయనో పలకరించేవారు.. “ ఏమిటీ విశేషం ? భార్యని పురిటికి పంపావా ఏమిటీ..? “  అని. ఇంత చరిత్ర ఉంది గెడ్డాలకీ , మీసాలకీ…చెప్పొచ్చేదేమిటంటే, గెడ్డానికి ఓ ప్రత్యేక  identity  అనేదుండేది. చూడగానే  ఏ క్యాటిగరీకి చెందినవాడో ఇట్టే గుర్తుపట్టేసేవారు.. నిజస్వరూపం తెలియకుండా ఉండేందుకు  artificial  గెడ్డాలూ, మీసాలూ పెట్టుకునేవారు. బహుశా ఈరోజుల్లో తమ ద్వందప్రవృత్తిని దాచుకోడానికి ఈ గెడ్డాలూ మీసాలూ వచ్చేయేమో…లేకపోతే  శుభ్రంగా ఉన్న ముఖారవిందాన్ని ఉన్నదున్నట్టుగా చూపించుకోడానికి ఏమొచ్చిందిటా?. 

ఎవడైనా చిన్న పిల్లాడు ఆరిందాలా మాట్టాడితే, ” మూతిమీద మీసంకూడా రాలేదూ .. అప్పుడే అంతంత మాటలా.. ” అనేవారు. అంతదాకా ఎందుకూ, నేను ఉద్యోగంలో చేరిన రెండేళ్ళకి కానీ షేవింగు మొదలెట్టలేదు. అలా అంటే  harmonal  లోపమేమో అంటారిప్పుడు. అలా అనుకోడానికీ వీల్లేదూ, ఎందుకంటే మిగిలిన ఏ విషయంలోనూ ఎటువంటి లోటూ లేకుండా ఈ 73 ఏళ్ళూ లాగించేశాను. ఈరోజుల్లో  12 th Class  చదివే పిల్లలకి కూడా గెడ్డాలూ, మీసాలూనూ… ప్రతీదీ  hibriడ్డే  కదా… 

పోనీ ఆ గెడ్డాలైనా లక్షణంగా ఉంటాయా అంటే, మళ్ళీ అందులోకూడా వెరైటీలు… ఒకడేమో మీసంతీసేసి just  గెడ్డం. ఇంకోడేమో అదేదో  ” గోటీ (  goatee) ”  ట.  అదృష్టవశాత్తూ ,  రక్షణ దళాల్లో, ముఖం శుభ్రంగా ఉంచుకోవడమనేది ( సిఖ్ఖు మతస్థులకి తప్ప)  అనివార్యం కాబట్టి ,  బతికిపోయాము. నేను  mysteryshopping  లు చేసేటప్పుడు, అక్కడి sales persons  ల  ముఖారవిందాలు  clean shaven  గా ఉన్నాయో లేదో చూడాల్సొచ్చేది.

గెడ్డాలూ మీసాలూ  పెంచుకోకూడదనడం లేదు, ఎవరిష్టం వాళ్ళదీ… కానీ, ఏదైనా  Team  లో అందరూ, బ్యాండుమేళాల్లాగ  పోటానుపోటీగా, గెడ్డాలూ, మీసాలు పెంచేసికోవడం చిత్రంగా ఉంది. అదేమిటో ఎప్పుడైనా ఏ టెస్టు మాచ్చైనా చూద్దామనుకుంటే, మనవాళ్ళని చూసినప్పుడల్లా,  ” దో ఆంఖే బారా హాథ్ “,  ” షోలే ” లో గబ్బర్ సింగ్ అనుచరులే  గుర్తుకొస్తారు….

పైగా ఊరికే గెడ్డాలూ, మీసాలూ పెంచేసికుని వాటిదారిన వాటిని వదిలేయడంకూడా కుదరదాయే.. వాటిని ఓ పధ్ధతిలో పెంచడానికి ఎంత కథా.. ఎంత కమామీషూ.. ఎప్పుడు చూసినా టైమే లేదనే వారు, వీటికి తమ कीम्ती   समय  ఎలా spare  చేస్తున్నారో కదా…

సర్వేజనా సుఖినోభవంతూ…

6 Responses

  1. Between the lines తెలియటం లేదు ఎవరిగురించబ్బా!!!!!

    Like

  2. ఈ తరం వారి గురించే శర్మగారు (అనుకుంటున్నాను: ఎందుకంటే వాళ్ళే ఇటువంటి ఫాషన్లు అంటూ పరుగులు పెడుతున్నది). ఎవరిష్టం వారిది అనుకోవడానికి కూడా నా మటుకు మనస్కరించడం లేదు. సినిమా నటులు అంతే, సినిమాల్లో పాత్రలు అంతే, టీవీలలో ఏంకర్లు అంతే, మగ మోడల్స్ అంతే, క్రీడాకారులు అంతే, ఆకురౌడీలు అంతే, రాజకీయ నాయకులు అంతే. మొత్తానికి స్వంత ఆలోచన లేని గొఱ్రె దాటు వ్వవహారంలా కనిపిస్తోంది. టీవీలో క్రికెట్ మాచ్ చూస్తున్నప్పుడయితే ఆడుతున్నవాడెవడో తెలియదు, అవుటయినవాడెవడో తెలియదు – గ్రౌండ్ సర్వం బొచ్చే. పెళ్లికొడుకులు కూడా అలాగే పెళ్ళికి కూర్చుంటున్నారు. ఆ మధ్యో పెళ్ళికి వెళ్ళాను. చనువు కొద్దీ పెళ్ళికొడుకుని నిలదీశాను – ఏవయ్యా పెళ్ళినాడు కూడా గడ్డం గీసుకోవా అని. ఓ వెర్రి నవ్వు నవ్వాడే కానీ మన మాటేం పట్టించుకోలేదు.

    Like

  3. ఇప్పుడు గడ్డం పెంచడం లేటెస్ట్ ట్రెండ్.సినీ హీరోలు రోల్ మోడల్స్.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: