బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– मुखौटा… అర్ధం తెలుసుగా… Mask…

 

     ఎవరి మనోభావాలూ నొప్పించాలని కాదు ఈ టపా…ఉన్నదేదో చెప్పాలని మాత్రమే…         ఫాషన్లు రోజురోజుకీ మారిపోతున్నాయి , ఈరోజుల్లో.  ఎవరిని చూసినా, గెడ్డాలూ, మీసాలూనూ… ఒకానొకప్పుడు ,  ఎవరో సిఖ్ మతస్థులని చూసినప్పుడో, ఏ సాధుపుంగవులో, ఏ హజ్ యాత్ర చేసొచ్చిన మహమ్మదీయులకో పెద్ద పెద్ద గడ్డాలు కనిపించేవి… వీళ్ళే కాకుండా, సినిమాల్లో విలన్ పాత్రధారులైతే , ఓ గెడ్డం తప్పకుండా ఉండేది.  పరిస్థితులు మారి, ఈరోజుల్లో ఉగ్రవాదులకికూడా గెడ్డాలూ, మీసాలూ తప్పనిసరిగా ఉంటాయి.ఒకానొకప్పుడు వారపత్రికల అట్టమీద బొమ్మలకి , మీసాలూ గెడ్డాలూ పెట్టడం ఓ సరదాగా ఉండేది.

చిన్నప్పుడు గుర్తుందా, పసిపిల్లల  ఏడుపు ఆపడానికి ఒకటే తారకమంత్రం—ఏ గెడ్డపువాడినో చూపించి “ ఏడిస్తే ఆ బూచాడు ( గెడ్డంతో ఉన్న ప్రాణి )  ఎత్తుకుపోతాడు.. “ అనడమేమిటి, ఆ పిల్లాడు ఠక్కున ఏడుపాపేసేవాడు…  వీళ్ళే కాకుండా, కొత్తగా పెళ్ళయినవాడిని  గెడ్డంతో చూస్తే, తెలిసిన ఏ పెద్దాయనో పలకరించేవారు.. “ ఏమిటీ విశేషం ? భార్యని పురిటికి పంపావా ఏమిటీ..? “  అని. ఇంత చరిత్ర ఉంది గెడ్డాలకీ , మీసాలకీ…చెప్పొచ్చేదేమిటంటే, గెడ్డానికి ఓ ప్రత్యేక  identity  అనేదుండేది. చూడగానే  ఏ క్యాటిగరీకి చెందినవాడో ఇట్టే గుర్తుపట్టేసేవారు.. నిజస్వరూపం తెలియకుండా ఉండేందుకు  artificial  గెడ్డాలూ, మీసాలూ పెట్టుకునేవారు. బహుశా ఈరోజుల్లో తమ ద్వందప్రవృత్తిని దాచుకోడానికి ఈ గెడ్డాలూ మీసాలూ వచ్చేయేమో…లేకపోతే  శుభ్రంగా ఉన్న ముఖారవిందాన్ని ఉన్నదున్నట్టుగా చూపించుకోడానికి ఏమొచ్చిందిటా?. 

ఎవడైనా చిన్న పిల్లాడు ఆరిందాలా మాట్టాడితే, ” మూతిమీద మీసంకూడా రాలేదూ .. అప్పుడే అంతంత మాటలా.. ” అనేవారు. అంతదాకా ఎందుకూ, నేను ఉద్యోగంలో చేరిన రెండేళ్ళకి కానీ షేవింగు మొదలెట్టలేదు. అలా అంటే  harmonal  లోపమేమో అంటారిప్పుడు. అలా అనుకోడానికీ వీల్లేదూ, ఎందుకంటే మిగిలిన ఏ విషయంలోనూ ఎటువంటి లోటూ లేకుండా ఈ 73 ఏళ్ళూ లాగించేశాను. ఈరోజుల్లో  12 th Class  చదివే పిల్లలకి కూడా గెడ్డాలూ, మీసాలూనూ… ప్రతీదీ  hibriడ్డే  కదా… 

పోనీ ఆ గెడ్డాలైనా లక్షణంగా ఉంటాయా అంటే, మళ్ళీ అందులోకూడా వెరైటీలు… ఒకడేమో మీసంతీసేసి just  గెడ్డం. ఇంకోడేమో అదేదో  ” గోటీ (  goatee) ”  ట.  అదృష్టవశాత్తూ ,  రక్షణ దళాల్లో, ముఖం శుభ్రంగా ఉంచుకోవడమనేది ( సిఖ్ఖు మతస్థులకి తప్ప)  అనివార్యం కాబట్టి ,  బతికిపోయాము. నేను  mysteryshopping  లు చేసేటప్పుడు, అక్కడి sales persons  ల  ముఖారవిందాలు  clean shaven  గా ఉన్నాయో లేదో చూడాల్సొచ్చేది.

గెడ్డాలూ మీసాలూ  పెంచుకోకూడదనడం లేదు, ఎవరిష్టం వాళ్ళదీ… కానీ, ఏదైనా  Team  లో అందరూ, బ్యాండుమేళాల్లాగ  పోటానుపోటీగా, గెడ్డాలూ, మీసాలు పెంచేసికోవడం చిత్రంగా ఉంది. అదేమిటో ఎప్పుడైనా ఏ టెస్టు మాచ్చైనా చూద్దామనుకుంటే, మనవాళ్ళని చూసినప్పుడల్లా,  ” దో ఆంఖే బారా హాథ్ “,  ” షోలే ” లో గబ్బర్ సింగ్ అనుచరులే  గుర్తుకొస్తారు….

పైగా ఊరికే గెడ్డాలూ, మీసాలూ పెంచేసికుని వాటిదారిన వాటిని వదిలేయడంకూడా కుదరదాయే.. వాటిని ఓ పధ్ధతిలో పెంచడానికి ఎంత కథా.. ఎంత కమామీషూ.. ఎప్పుడు చూసినా టైమే లేదనే వారు, వీటికి తమ कीम्ती   समय  ఎలా spare  చేస్తున్నారో కదా…

సర్వేజనా సుఖినోభవంతూ…

%d bloggers like this: