బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– feel good..


మనసుకి ఆహ్లాదకరంగా ఏదైనా జరిగినప్పుడు   feel good  అంటారుట. సరీగ్గా మాకు ఇవేళ అలాగే ఉంది. ఈమధ్యన పుణె లోని దగుడూ సేఠ్ గణపతి, చతుశృంగీ మాత  గుడీ చూసొచ్చాము. పెద్దాయన దర్శనం చేసుకోపోతే మళ్ళీ ఆయనకి కోపంవస్తుందేమో అని, ఆయన దర్శనం కూడా చేసొచ్చాము. పుణే పాషాన్ లో శ్రీ సోమేశ్వరవాడి అని ఓ ప్రాంతం ఉంది. అక్కడ ఓ పురాతన శివమందిరం ఒకటుంది. శివాజీ మహరాజ్ తల్లి జిజియామాత ఈ దేవాలయానికి చాలా సేవలు చేశారట్.

s1

ఆ ప్రశాంత వాతావరణంలో ఓ గంట గడిపి, పక్కనే, మహారాష్ట్ర ప్రభుత్వ గ్రామీణా శాఖ వారు నిర్మించిన ఒక అద్భుత  Enclosure  లోకి మనిషికి 50/- టికెట్ తీసికుని లోపలకి ప్రవేశించాము. ఇదివరకటిరోజుల్లో పెద్ద పెద్ద వృక్షాలతో నిండిన ప్రాంతమది. కొత్తగా చెట్లూ పుట్టలూ పెంచాల్సిన అవసరం లేదు. వాళ్ళు తయారు చేసిన  శిల్పాలకి ముందర ఓ ఫెన్సింగ్ వేసి, లాన్ తయారుచేసేశారు. మన గ్రామీణ వాతావరణంలో ఎలాటి దృశ్యాలు కనిపిస్తాయో, అంటే వీక్లీ మార్కెట్, వీధరుగుమీద ఓ టైలరూ, పశువుల పాకా, గానుగా, ఇలా కనిపించే ప్రతీదానికీ ఓ శిల్పరూపం చేసి ప్రాణం పోశారు ఆ శిల్పాలకి. ఏదో ఫెన్సింగుంది కాబట్టికానీ, లేకపోతే ఓసారి తడిమిచూసేటంత  tempting  గా ఉన్నాయి.  మాట ఒకటీ తక్కువంతే.. హావభావాలు ఎంత చక్కగా చూపించారో. ఇదివరకు హైదరాబాదులో శిల్పారామం చూశాము కానీ, అక్కడి శిల్పాల్లో ఇంత జీవకళ ఉట్టిపడ్డట్టు కనిపించలేదు.. పైగా ఆకాశాన్నంటే చెట్లూ, నిజంగా ఏదో మారుమూల గ్రామానికి వెళ్ళొచ్చినట్టే అనిపించింది.

img20170222105031img_20170222_105648img20170222104204img_20170222_104525img_20170222_103433

 ఇదంతా OLA  వారి సగంరేటు సౌజన్య్ సే… ఈసారి మీరెప్పుడైనా పుణే వస్తేమాత్రం   దర్శనీయస్థలాల్లో  ఇది మాత్రం తప్పకుండా పెట్టండి.  You would love it.. its awesome…

Advertisements

8 Responses

 1. శిల్పారామం చూసినప్పుడు మాకూ అలాగే అనిపించింది.జీవకళ లోపించిందని.

  Like

 2. రెండో చిత్రంలో శిల్పం నిజ్జంగా చాలా అద్భుతంగా చెక్కారండీ ! ఆ యింటి గుమ్మం ముందు లక్ష్మి కళ తో సూపర్బ్ అండీ

  జిలేబి

  Like

 3. జిలేబీ,

  మీ ” అంతరార్ధం ” అర్ధం అయింది…

  Like

 4. టపా, వివరాలు బాగున్నాయి.
  ఏమిటండి, ఈ మధ్య తెగ వ్రాసేస్తున్నారు?

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: