బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- ” గగనానికీ..ఇలకూ బహుదూరంబని… “


 ఆ త్యాగరాజస్వామి, ఆభేరి రాగంలో నగుమోమూ..గనలేని కీర్తనలో అన్నది, ఆ దేవుడూ, తన గురించీ అన్నదనుకుంటాను. కానీ ఆ వాక్యాలు మాత్రం మన జీవితాల్లో సరీగ్గా సరిపోతాయి.. ఎన్నో సందర్భాల్లో అన్వయించుకోవచ్చు…

ఇదివరకటి రోజుల్లో పిల్లల్ని చదివించేటప్పుడు.. వాళ్ళేదో గొప్పగొప్ప డాక్టరూ, ఇంజనీర్లూ గా తయారవుతారని ఆశించిన తల్లితండ్రులు, చివరకి ఆ పిల్లలు ఇంజనీరింగు బదులు, ఏ డిప్లొమాలోనో చేరి ఏ ఓవర్సీరు గానో,  ఎంబిబిఎస్ బదులుగా , ఏ RMP  డాక్టరుగానో సెటిలయినప్పుడు కలిగే ఓ ఫీలింగు…అయినా వాళ్ళందరినీ ఇంజనీర్లూ, డాక్టర్లూ అని పిలవడం మానేస్తామా? ఎవరిమనోభావాలూ కించపరిచానని మాత్రం భావించకండి. ఉన్నదేదో రాశాను.

మిగిలిన విషయాల్లోకి వస్తే… పూర్వపు రోజుల్లో మన ఆర్ధిక స్థోమతను బట్టి సంసారం లాగించేవారు. కానీ కాలక్రమేణా , ఆర్జనా పెరిగిందీ, దానికి సాయం బ్యాంకుల వాళ్ళు ఇచ్చే ఋణాల అవకాశమూ పెరిగింది. ప్రతీదానికీ అప్పు ఇవ్వడానికి రెడీ. ఓ సంతకం పెట్టేస్తే వారంరోజుల్లో చెక్ వచ్చేస్తుంది. ఇంక పెద్ద పెద్ద వస్తువులు కొనడానికైతే  Instant Finance  ఎల్లవేళలా  రెడీ..  ఆ వస్తువేదో కొనేముందర, ఓసారి భార్యాభర్తా నోటిలెక్కలేసేసికుంటారు, మనం  EMI  కట్టగలమా లేదా అని.. పైగా  ఆటైములో అంతా హరాభరాగానే కనిపిస్తుంది. పైగా ఎప్పుడో చేతిలో డబ్బులొచ్చిన తరువాత ఈ వస్తువు కొంటే, అప్పటికాలశ్యం అయిపోదూ.. లేడికిలేచిందే పరుగన్నట్టు అనుభవించేటైములోనే అనుభవించాలీ అనుకోడం,వెంటనే ఆ ఫైనాన్సువాడిచ్చిన ఫారాలమీద సంతకంపెట్టేయడమూ..

అసలు కష్టాలన్నీ మొదటివాయిదా ఆటోమేటిక్ గా మన ఎకౌంటు నుండి  debit  అయినప్పుడు. అప్పటికే ఇంటిలోనూ, కారు లోనూ, ఏ కొడుకో కూతురో పైచదువులుచదువుతూంటే ఏ ఎడ్యుకేషన్ లోనో… అన్ని కట్లూ పోగా మిగిలేది?

అదేంకర్మమో, ఉద్యోగంలో చేరినప్పుడూ చేతిలో డబ్బులు మిగిలేవీకావూ, కాలక్రమేణా జీతాలు పెరిగినా సరిపోయేవీకావూ.. ఎప్పుడూ defict budgeట్టే.. మన ప్రభుత్వాల వార్షిక బడ్జెట్లలాగ ! ఇంక పెన్షనైతే అడగక్కర్లేదు.  జీవితంలో అప్పనేదిలేదు ఈవేళ అనే రోజెప్పుడైనా చూస్తానా అనుకుంటాను. అందుకే ఆ త్యాగరాజ కీర్తన గుర్తొచ్చింది..  ముఖ్యంగా ” గగనానికీ  ఇలకూ.. ” అన్న వాక్యాలు.మరీ అంత ప్రాణాంతకం కాకపోయినా, ప్రశాంతంగా మాత్రం ఉండదు… ఇలాక్కాదని మా ఇంటావిడదగ్గరే ఆ అప్పేదో చేసేస్తే  గొడవేఉండదుగా…

6 Responses

 1. వడ్డీ లేదా? 😊

  Like

 2. ఇంటావిడ దగ్గిరే అప్పా 🙂

  అప్పు చేసి పప్పు తెచ్చి కూడు జేయ ….

  ఎక్కడో ఎకనమిక్క్స్ దెబ్బ కొడుతోందండీ 🙂

  బ్లాగ్లోకపు అరిపిరాల సత్య ప్రసాద్ గారే దీని గురించి చెప్పాలి :))

  జిలేబి

  Like

 3. ఇంట్లోని అప్పు – ఇష్టమైన అప్పు
  ఇల్లాలి దగ్గర అప్పు – కష్టాలు తేని అప్పు
  అప్పు ఇచ్చినా – పప్పు వండినా
  కమ్మంగ – వుండనొప్పు

  Like

 4. లకిత గారూ,

  లెస్స పలికితిరి…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: