బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– శ్రేయోభిలాషులు …


ప్రపంచంలో కొందరు ” శుభ చింతక్ ” లు ఉంటూంటారు.  Very noble  ప్రాణులు.. వారినే శ్రేయోభిలాషులు అని కూడా పిలుస్తూంటాం. ఎవరికి కష్టమొచ్చినా, ముందుగా వీరే స్పందిస్తూంటారు.. చెప్పడం వరకే కాబట్టి ధారాళంగా సలహాలిచ్చేస్తూంటారు.. వాళ్ళది పోయేదేముందీ.. పోతే ఆ సలహా బాధితుడే పోతాడు. చెప్పడం మన విధాయకం అనే టైపు… ఆ సలహా అవతలివాడికి లాభమా, నష్టమా అని కూడా పట్టించుకోరు.

ఉదాహరణకి ఎవరికైనా పిప్పిపన్ను సలుపు పుట్టిందనో, మోకాలు నొప్పనో తెలిసీతెలియడమేమిటి, వాళ్ళింటికి వెళ్ళి  ముందుగా పరామర్శ చేయడం.ఈ పరోపకారి పాపన్నల గురించి ముందే తెలుసు ఆయనకి.. ఏం కొంపముంచుతాడో అనుకుంటాడు… “అయ్యో పిప్పిపన్నా ఏమిటీ…. దవడ ఎలా వాచిపోయిందో…” అసలే నొప్పిభరించలేక రాత్రంతా నిద్ర పట్టలేదు.. రాత్రి అదేదో మాత్ర వేసుకున్నాలే.. అని వదిలించుకోవాలని ఓ వ్యర్ధ ప్రయత్నం చేస్తాడు… ఇలా కాదని ఆ వచ్చినాయన, వంటింట్లోకి వినిపించేటట్టుగా.. ” చెల్లెమ్మా.. బావగారు ఇంత బాధపడుతూంటే కబురైనా పెట్టలేదేమిటీ  “, ఆవిడ ఐసైపోయి.. చాయో కాఫీయో ఇస్తుంది… అవునన్నయ్యా చెప్తే వింటారా.. ఎప్పుడూ నోట్లో వక్కముక్కలే.. పళ్ళు పుచ్చిపోకేమవుతాయీ..మీకేమైనా చిట్కాలేమైనా తెలుస్తే చెప్పు, ఆయన బాధ చూడలేకపోతున్నానూ.. ” అంటుంది.. అసలు బాధపడేది వీళ్ళిద్దరూ కాదూ, ఆ దవడ వాచిపోయిన పెద్ద మనిషి. పడేవాడికేగా తెలిసేదీ బాధా…ఓ రెండు లవంగమొగ్గలు నవలమను అదే తగ్గుతుంది. ఆ లవంగాల ఘాటు భరించేదే? 

అలాగే మోకాలు నొప్పులకి, మిరియాలపొడీ, మెంతిపొడీ చెరో చెంచా గోరువెచ్చని నీళ్ళతో తాగాలిట, ఇవి అయ్యే పనులే?  తనకి వస్తే మోకాలునొప్పంటే ఏమిటో తెలుస్తుంది అని సణుక్కుంటాడు.  చెప్పొచ్చేదేమిటంటే ఈ శ్రేయోభిలాషులు ,అవతలి వారికి కలగబోయే  tangible/ intangible losses  గురించి ధ్యాసుండదు..

మొన్న ఓ టపా రాశానుకదూ — ” అప్పుల చిఠ్ఠా ” అని.. ఏదో స్వతహాగా సహృదయుడిని కాబట్టి, ఏమీ దాచకుండా రాశాను.   Most impractical  సలహాలు.. ఒకరేమో ”  అసలన్నేళ్ల ఉత్తరాలు దాచినందుకు బహుమతిగా ఆ హామీలు తీర్చేయొచ్చు మీరు.. ” ఇంకోరేమో  ”  మరి ?! తీర్చండి అప్పులన్నీ….” 

మరొకరేమో  ..” తిరిగి తిరిగి పిన్నిగారి దగ్గరకి తీసుకొస్తే తప్ప తోచదేం??? “.. అక్కడికేదో నేనేదో ” గృహహింస”  పెడుతున్నట్టు…అన్నీ మొదలెట్టాను ఎప్పుడో.. శులభ వాయిదా పధ్ధతుల్లో తిర్చడం.  ఆ మధ్యన  De Mo  ధర్మమా అని, తన ఖజానా అంతా బయటపెట్టాల్సొచ్చింది..తన దగ్గర ” నిత్య గంగ” లా డబ్బులెప్పుడూ ఉంటాయే.. . అయినా  sincere  గా ఓ విషయం ఒప్పుకోవాలి– అవసరార్ధం తనే డబ్బులు సద్ది నన్ను అత్యవసర పరిస్థితుల్లో  bail out  చేస్తూంటుంది.. నా బుజ్జి  ATM తను. మాటిమాటికీ గుర్తుచేస్తూంటుంది–ఆరోజున ఇంతిచ్చానూ, ఫలానా రోజున అంతిచ్చానూ అని.. పద్దు రాసుకో అంటూంటాను..అక్కడే వస్తుంది అసలు గొడవంతా,  Round off  చేయడంలో మంచి దిట్టలెండి.. ఏ 1656 ని 2000 చేసేస్తూంటుంది. ఏదో 1700 చేసుకోవచ్చు కానీ, మరీ 2000 కొంచం ఎక్కువే కదూ… ఇలాటివి ఈ శుభచింతక్ లకి ఏమర్ధమవుతుందీ?

మరొక సహృదయుడు… ”  చిఠ్ఠాలకి ,కాలదోషం పట్టేసిందని తప్పించేసుకోండి.. ” అని సలహా ఇచ్చారు. ఆ ముచ్చటా తీరింది మాస్టారూ… ఓసారి ధైర్యం చేసి.. “అప్పూ లేదూ సప్పూలేదూ.. తీర్చను, నీ దిక్కున్నచోట చెప్పుకో… ” అని కళ్ళు మూసుకుని చెప్పేశాను. ఓ పదిపదిహేను రోజులు  strategic retreat  చేసి ఓ కొత్త పథకం అమలు పరిచింది. వివరాలు  ఇక్కడ,  ఇక్కడా  చదవండి.. సామదానబేధోపాయాలన్నీ ప్రయత్నించి, ఇలా స్థిరపడిపోయాను. Beyond economic repairs…

 

12 Responses

 1. చెప్పొచ్చేదేమిటంటే ఈ శ్రేయోభిలాషులు ,అవతలి వారికి కలగబోయే tangible/ intangible losses గురించి ధ్యాసుండదు..

  Most impractical సలహాలు.. ఒకరేమో ” అసలన్నేళ్ల ఉత్తరాలు దాచినందుకు బహుమతిగా ఆ హామీలు తీర్చేయొచ్చు మీరు.. ”

  కుదిరిన టైంలో ఏదైనా పోస్ట్ చదవగానే – చదివి వచ్చేయకుండా – acknowledge చేస్తూ comment రాయాలి అని అనుకునే నేను – మీ బ్లాగ్ పోస్ట్ చదివి సరదాగా రాసిన వ్యాఖ్యే తప్ప మీకు ఉచిత సలహాలు ఇవ్వాలని తీసుకున్న చొరవ కానే కాదు. అలా అని మీకనిపించి వుంటే – మన్నించండి.
  పెట్టిన comment తీసేయకూడదు అన్న నియమమూ నాకుంది కాబట్టి – I’m leaving my comment on your previous post.
  Please feel free to remove it if you feel that it sounds like an intrusive comment.

  Like

  • లలిత గారూ,

   మీరు నా పాత టపాలు చదివుంటే తెలిసేది… నేను రాసేవన్నీ చాలా లైట్ గా ఉంటాయి. అదేమిటీ మీరు అంత సీరియస్సయిపోయారు?
   I loved your comment. Please take my post lightly…. నేనేదో సరదాగా రాశానండీ…మీకు బాధ కలిగించినందుకు క్షంతవ్యుడిని…
   మీరన్నట్టు నేను రాసేవన్నీ సీరియస్సుగా తీసికుంటే, మా ఇంటావిడ నన్నెప్పుడో ” వదిలేసేది…!!! తను రాసే కౌంటర్ లు కూడా చదవండి… bsuryalakshmiblogspot.com ( ఇదీ సంగతి ).

   Like

 2. లలిత గారూ,

  One more thing.. ఇప్పటిదాకా నన్ను కానీ, నా టపాలను కానీ సీరియస్సుగా తీసికున్నవాళ్ళు లేరు. అందుకేగా అలా అలవాటయిపోయిందీ?

  Like

  • నా తప్పేమీ లేకపోయినా – ఎంత జాగ్రత్తగా వున్నా – వేరే వారు నా బ్లాగులో మాటలు ఉపయోగించి పెట్టిన కామెంట్ల వల్ల నాక్కొన్ని ఇబ్బందులు వచ్చాయి 😔 అప్పటినుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటున్నాను . అంతకన్నా ఏమీ లేదు. నేనెప్పటిలాగే మీ బ్లాగ్ చదువుతాను – కామెంట్ పెడతాను . పెద్దవారు – నొప్పించినందుకు – నాకేం మంచిగా అనిపించట్లేదు 😔

   Liked by 1 person

 3. లలిత గారు

  భమిడి పాటి వారిని అట్టే వదిలి పెట్టమా కండీ !

  హన్నా అంత అనేసారా !

  హవ్వ హవ్వ 🙂

  ఎక్కడండీ సూర్యలక్ష్మి గారు ; యిలా రండి ఒక కంప్లయింట్ ఇవ్వాలి 🙂

  జిలేబి

  Liked by 1 person

 4. <"మరొక సహృదయుడు… ” (పైన చివరి పేరా).
  కాంప్లిమెంటేగా మాస్టారూ?

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: