బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– so called అఛ్ఛే దిన్…


Teacher: How much is 2+2_
_Student: 9.50_
_Teacher: How on the earth is that possible?_
_Student: 2+2 = 4 + Vat + Service tax + Higher Education Cess + Swacch Bharat Cess + Krishi Kalyan cess; it comes to 9.50 Mam!._
_Teacher fainted!!_

పైన పెట్టిన జోక్ ని లైట్ గా తీసికోకండి. ప్రస్థుత పరిస్థితికి అద్దం పడుతోంది కదూ.. ఎన్నికల ముందర ఏవేవో చెప్పేశారు.. భూతలస్వర్గం కళ్ళముందర పెట్టారు.. ఆ ముందర వాళ్ళు అన్నీ తామే తినేసి, మనకేమీ మిగల్చలేదూ, పోనీ ఈ కొత్తాయన ఏమైనా పొడిచేస్తారేమో అనుకుని,  వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నీ గుడ్డిగా నమ్మేశాము.వాళ్ళకీ వీళ్ళకీ ఏమీ తేడాలేదు. పైగా ఏమైనా అంటే, 70 ఏళ్ళగా ఉన్నది రెండేళ్ళలో ఎలా బాగుపడుతుందీ అని ఓ వితండవాదన. ఈ 70 ఏళ్ళలోనూ, వీళ్ళుకూడా అధికారంలోనే ఉన్నట్టున్నారు కదూ. మధ్యమధ్యలో? అడక్కూడదిలాటివి, పైగా ఏమైనా అంటే ” దేశద్రోహులు” అన్నా అనొచ్చు.

Senior Citizens  కి ఏవేవో చేసేశామని పెద్దపెద్ద  ప్రసంగాలు చేశారు. వీళ్ళు చేసింది ఉన్నది ఊడకొట్టడం. ఇదివరకే నయం- 5 ఏళ్ళ FD  కి  8% పైగా వచ్చేది. ఇప్పుడో 10 ఏళ్ళకి 8% లోకి దించేశారు.ఏం ఉధ్ధరించారుట?  Pay Commission  విషయంలోనూ అంతే… ఆ లెఖ్ఖా ఈలెఖ్ఖా చూపించి జీతాలూ/పెన్షన్లూ పెంచేశామని మీడియాలో ఊదరకొట్టేశారు.పెరిగిందెంతా just 2-3 %.   కానీ ప్రసారమాధ్యమాల్లో చేసిన ప్రచారం ధర్మమా అని మార్కెట్ లో ఖరీదులు పెరిగిపోయాయి. పెట్రోలూ, డీసెలు ధరలైతే అడగక్కర్లేదు. LPG  ని కూడా వదల్లేదు.. ఇంక రైల్వే విషయమయితే ఏవేవో పేర్లు చెప్పి , ఎడా పెడా పెంచేశారు. రైళ్ళ్లలో  Senior Citizen concession  ఉందికదా అనొచ్చు… అది పాత ప్రభుత్వ దయాధర్మం. దాన్ని రద్దుచేయకుండా ఉంటే  పదివేలు.

మన ప్రభుత్వం కంటే,  OLA  TAXI  వాడే మెరుగు.   ఇక్కడ పూణె లో  Senior Citizens  కి  10  Trips  మీద  50%  రాయితీ ఇస్తున్నాడు.హాయిగా ఉంది. ఆటో మీద  20 % రాయితీ.మిగిలిన నగరాల్లో కూడా ఉందేమో తెలియదు.. నిన్న పుణె లోని దగుడూ సేఠ్  గణపతి దర్శనానికి వెళ్ళాం. OLa  బుక్ చేసినప్పుడు,  estimated rate  155 /-  వచ్చింది. తరవాత  Billed Amount just 74/-.  కనీసం ఎవడో ఒకడు జ్యేష్ఠ నాగరికుల కష్టాలు గుర్తించాడు.వచ్చిన డ్రైవరు  అసలు మర్చెంట్ నేవీలో పనిచేస్తున్నాడుట.  Land  మీదకు వచ్చిన రెండునెలలూ , part time  గా ఈ OLA వాళ్ళతో contract  ట. ఎంతబాగా మాట్టాడేడో.

మన పాలకులు చేసేదేమైనా ఉందా అంటే, ఎన్నికల ముందు , వాళ్ళాబ్బసొమ్ములా , ఎక్కడలేని వాగ్దానాలూ చేసేస్తారు. వాళ్ళ డబ్బులేమైనా ఏమిటీ ? మీరూ నేనూ కట్టే పన్నుల్లోంచే కదా, ఈ  freebies.వాళ్ళు అప్పనంగా సంపాదించి కూడబెట్టిన దాంట్లోంచి ఇవ్వమనండి తెలుస్తుంది. పార్టీ తో ప్రమేయం లేకుండా అందరూ అంతే.

 

Advertisements

8 Responses

 1. భలే రాస్తారండీ మీరు

  ఎక్కడో మొదలెడతారు ఎక్కడెక్కడో తిరిగి చివరాఖరు లో మొదటి దానికి ముడెట్టేస్తారు

  జిల్రబి

  Like

 2. బాబుగారు, మీరు చెప్పినవన్నీ నిజాలే. అయితే నాయకత్వంలో నిజాయితీ ఉందాలేదా అన్నది ఒక ముఖ్యమైన విషయం. రెండోది బలమైన నాయకత్వం మనకి పాలన అందిస్తోందా అన్నది. ప్రస్తుతపాలకులు గత పాపంలో (గతంలోని తప్పులకు) కొంత భాగస్వాములే. వర్తమానంలో, ఇప్పుడున్న పరిస్థితులలో ఎంతో కొంత మార్పును చూపే పాలకుల పక్షంలో ప్రజలుండటం ఆశ్చర్యం కాదేమో? పెర్ఫెక్ట్గా ఉండే వాళ్ళు కలికాలంలో అసాధ్యమే.

  Like

  • అన్యగామి గారూ,

   Perfect 10 ఎవరూ ఆశించరండీ… కానీ, ఇదివరకటి వారికీ, ఇప్పటివారికీ తేడా ఏమీ కనిపించడం లేదు. జస్ట్ లేబుల్ మార్చారంతే… ” బలమైన నాయకత్వం ” is a matter of opinion and debatable.

   Like

 3. ఐతే 2019 లో యువరాజ పట్టాభిషేకం చేయించేద్దాం, that will so,ve our problems 🙂

  Like

 4. It is nice to know that a private taxi company is giving senior citizen discounts.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: