బాతాఖాని-లక్ష్మిఫణికబుర్లు–అప్పుల చిఠ్ఠా…


అప్పుల విషయం వచ్చేసరికి ఠక్కున గుర్తొచ్చేది, ఆ వెంకటేశ్వరస్వామీ, శ్రీ ముళ్ళపూడి వారు సృష్టించిన అప్పారావు పాత్రానూ..ఏ మధ్య తరగతి వాడిని చూసినా, జీవితంలో ఎక్కడో అక్కడ,  ఏదో సందర్భంలో అప్పనేది చేయకుండా ఉండడు.. మొత్తానికేదో నానా తిప్పలూ పడి, కనీసం ఉద్యోగంనుండి రిటైరయ్యే సమయానికి, అప్పనేది లేకుండా జాగ్రత్త పడతాడు. ఏదో పూర్తి జీతం వస్తున్నంత కాలమూ పరవాలేదు కానీ, ఆ తరవాత వచ్చే పెన్షను, బొటాబొటీగా సరిపోవచ్చునేమో కానీ, అప్పులు తీర్చేంతగా సరిపోదు. అయినా రిటైరయిన తరవాత మన మొహం చూసి అప్పిచ్చేదెవడూ? పాత అప్పులన్నీ తీర్చేసికుని నిశ్చింతగా ఉంటే చాలు.

కానీ కొందరి జాతకాల్లో అలాటి అదృష్టం ఉండదు.  కలలోకూడా ఊహించనివైపునుండి   అప్పుల చిఠ్ఠా బయట పడుతుంది…. ఎక్కణ్ణుంచంటారా… కట్టుకున్న పెళ్ళాం దగ్గరనుండి.. పైగా రాత పూర్వకంగా మన స్వదస్తూరీతో…పెద్ద చెప్పొచ్చారులెండి మరీ కట్టుకున్న భార్యకి ప్రామిసరీ నోటు ఎక్కడైనా రాస్తారా మరీనూ.. అనకండి. రోజులు బాగోపోతే అలాగే జరుగుతుంది.

ఏదో ఈవేళ అదేదో Valentines Day  కదా అని , తీరిగ్గా కూర్చుని గత 44 ఏళ్ళ,11 నెలల 15 రోజుల్లో జరిగినవన్నీ మాట్టాడుకుంటున్నాము.  దెబ్బలాడుకున్న సన్నివేశాలతో సహా.. మీదే అసలు తప్పంతా అని తనంటే, కాదు కాదూ నీదే .. అని నేనూ ఏదో కానిచ్చేశాము. మధ్యలో మేమిద్దరమూ దీపావళి నాడు ఆడే పేకాట ప్రసక్తి వచ్చింది. పోనీ ఊరికే stake  లేకుండా ఆడొచ్చుగా, అబ్బే మొదట్లో పాయింటుకి పైస చొప్పున మొదలెట్టి, జీతం పెరిగేకొద్దీ పాయింటు రూపాయికి పెంచేశాను లెండి ,  ఒక్కసారీ నెగ్గిన పాపానపోలేదు. పైగా ఈ పాయింట్లూ అవీ ఓ పుస్తకంలో రాసుంచడం. తేదీ తో సహా.. ఆ పుస్తకం కాస్తా బయటపెట్టింది.. అలా నా గతచరిత్ర బయటకొచ్చింది.

మా ఇంటావిడ నన్ను వదిలి పుట్టింటికి వెళ్ళింది పురిటికి రెండుసార్లూ, ఇంకోసారి ఏదో కారణంతో ఒకసారీ, అంతా కలిపి ఓ ఆరేడు నెలలు.అంటే ఓ 250 రోజులేసుకోండి.. పెళ్ళయిన కొత్తేమో, అసలే ఏమీతోచేది కాదు .. ఆరోజుల్లో ఈ టెలిఫోన్లూ అవీ ఎక్కడ? అంతా భారతీయ తపాలా వారి దయాధర్మాలే… అంటే ఉత్తరాల ద్వారానే.  ఆ రాసేదేదో ఒళ్ళుదగ్గరెట్టుకుని రాయొచ్చుగా, అబ్బే అంత తెలివెక్కడా?  ఏదో స్వీట్ నథింగ్స్  ( ఈరోజుల్లో sms ల్లాగ ) రాసేసుంటే గొడవే ఉండేది కాదూ. ఎక్కడలేని  హామీలూ, ఈరోజుల్లోని  Election manifesto లాగన్నమాట.ఎడా పెడా ఇచ్చేసేవాడిని. ఏదో మాటల్లో అయితే ఫరవాలేదు ఇవన్నీ ఎక్కడగుర్తుంటాయిలే అనుకుని.ఉత్తరాల్లో స్వదస్తూరితో.. అవే ఇప్పుడు నాప్రాణం మీదకొచ్చాయి.

తీరిగ్గా , ఆ ఉత్తరాల బొత్తి కాస్తా బయటకు తీసింది. ఇదేం చిత్రమమ్మా… ఎప్పుడొ రాసిన ఉత్తరాలన్నీ ఇప్పుడు తీసి, నన్ను ఇరుకులో పెట్టడం ఏమైనా బావుందా… మీరే చెప్పండి.. ఏదో ఆ వేడిలో రాశాను కానీ, ఇన్నేళ్ళ తరవాత పీకిలమీద కూర్చుంటే ఎలాగండి బాబూ? ఎన్నో అనుకుంటాం, ఏవేవో   promise  లు చేస్తాం .. అన్నీ చేయాలంటే కుదురుతుందా ఏమిటీ? అర్ధం చేసికోదూ…

 ఆ అప్పులన్నీ తీర్చేదెలాగూ లేదు. పర్యవసానం—  hypothicated for life…

 

6 Responses

 1. రోలు ,మద్దెల సామెత గుర్తుకొచ్చింది మీ అప్పుల చిట్టా బ్లాగ్ చదువుతుంటే !! కాస్త అటు ఇటుగా నా పరిస్థితి ఇంచుమించుగా అంతే ,బహుశా మన సమకాలీకుల పరిస్థితులు అలాగే ఉంటాయి సర్దుకుపోవాలి మాస్టారూ !
  ఓ POW (prisioner of wife) ఆవేదన

  Like

  • శాస్త్రిగారూ,

   ఇలాటి అప్పులు అస్సలు పట్టించుకోకూడదు. ఇవేమైనా తీర్చామా పెట్టామా ఏదో వీధిన పడ్డం తప్పితే.. మీ POW సూపర్ గా ఉంది.

   Like

 2. అసలన్నేళ్ల ఉత్తరాలు దాచినందుకు బహుమతిగా ఆ హామీలు తీర్చేయొచ్చు మీరు 😀

  Like

 3. Limitation Act ప్రకారం ఆ బాకీలకు కాలదోషం పట్టిందని చెప్పడం బయట పడడానికి ఓ మార్గం ఫణిబాబు గారు, మీకు తెలియనిదేముంది 🙂.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: