బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–గుర్తుంచుకోడాలు…


ఈ గుర్తుంచుకోడాలనేవి ఓ అద్భుత ప్రక్రియ. అందరికీ అబ్బదు. దీంట్లో నిష్ణాతులైనవారితో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. విషయం మంచైనా కావొచ్చు, చెడైనా కావొచ్చు, ఓ పుట్టినరోజు కావొచ్చు, ఓ పేరు కావొచ్చు, లేదా ఆ పేరింటివారి ప్రవరవొచ్చు,వాళ్ళని చూడ్డమేమిటి, అన్నీ ఠక్కున గుర్తొచ్చేస్తాయి.ఇదివరకటి తరం వాళ్ళకి బలే గుర్తుండేవి.  ఆ భగవంతుడిచ్చిన  ” మర్చిపోవడం ” అనే వరప్రసాదం ధర్మమా అని, ఈరోజుల్లో  convenient/ selective/ habitual  గా కొన్ని కొన్ని విషయాలు మర్చిపోతూంటాము.

ఇందులో మొదటిది  convenient రకం—ఏదో శత్రుత్వం లాటిది మర్చిపోవడం ,మన రాజకీయనాయకులొక్కరికే అలవాటయింది… చూడండి ఏదో పార్టీగుర్తుమీద నెగ్గడమూ, అధికార పక్షంలోకి జంపైపోవడమూనూ…అది వాళ్ళకే తగును.. సిగ్గూ ఎగ్గూ వదిలేసి , ఆ నెగ్గించిన ప్రజల ని కూడా లెక్కచేయకుండా, పార్టీ ఫిరాయింపు చేసేస్తారు. అడిగేవాళ్ళూ లేరూ.

రెండోది   selective   గుర్తుంచుకోడాలూ/ మర్చిపోవడాలూనూ… వీటిమీద  2010 లో ఒక టపా రాశాను  మర్చిపోతే ఇంకోసారి చదవండి– మీకే మంచిది.

మూడోది habitual రకం. సామాన్యంగా వయసు పెరిగే కొద్దీ వచ్చేది. అదేదో మరీ Alzhemeirs  అని కాదూ, కానీ ఒక్కోప్పుడు వీధిన పడిపోతూంటాం.అచానక్ గా విషయం మర్చిపోతాం, అలాగని కావాల్సి మర్చిపోడమూ కాదూ…  it just happens.  చెప్పేనుగా దీనివలన పరిస్థితి  embarassing  గా తయారవుతూంటుంది.అప్పుడప్పుడు ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు, కాఫీలో పంచదారా, కూరలో ఉప్పూ వేయడం మర్చిపోవచ్చు. మరీ ప్రాణాంతకం కాకపోయినా, కొద్దిగా సిగ్గుపడాల్సొస్తుంది. అవసరానికి ఏ డాక్యుమెంటో ఏదో ఎక్కడపెట్టామో మర్చిపోవచ్చు.

మనం బయటకి వెళ్ళినప్పుడు ఎంతో మందితో పరిచయం అవుతూంటుంది. ఆకబురూ, ఈ కబురూ చెప్పి, ఓ గంట గడిపినా గడపొచ్చు, వెళ్ళేటప్పుడు వారి సెల్ నెంబరు కూడా తీసికునే ఆస్కారం కూడా ఉంటుంది. తిరిగి వాళ్ళూ ఫోను చేయరూ, మనమూ మర్చిపోతాము. మళ్ళీ ఏ నెల్లాళ్ళకో రోడ్డు మీద కనిపించిఅప్పుడు, ఆ పెద్దమనిషే పలకరిస్తాడు, మన మొహం గుర్తుపట్టి. ఎందుకంటే కొందరి మొహాలు కలకాలం గుర్తుంటాయి  అదేమిటో నా మొహం చాలామందికి గుర్తుంటుంది, పోలీసులతో సహా. అలాగని నేనేమీ నేరాలు చేయలేదని మనవి. ఉదాహరణకి  భుసావల్ బస్ స్టాండ్ లో నా బాగ్గు ఎవడో కొట్టేస్తే , అక్కడి  పోలీసు స్టేషన్ కి వెళ్ళాల్సొచ్చింది.. ఎన్నో సంవత్సరాల తరువాత ఓ పోలీసు నన్ను పేరుతోసహా పలకరించాడు. అలాగే హైదరాబాదు ట్రైన్ లో వెళ్ళేటప్పుడు, నా టిక్కెట్టు చెక్ చేసిన టీటీ, ఓ రెండు నెలల తరవాత గుర్తుపట్టాడు.అటువంటిదే , నేను 2005 లో  Passport  కోసం, పోలీసు వెరిఫికేషన్ రాకపోవడం ధర్మమా అని, పూణె లో కమిషనర్ ఆఫీసుకి ఓ అయిదారుసార్లు వెళ్ళాల్సొచ్చింది. మూడోసారి వెళ్ళినప్పుడే, నన్ను గుర్తుపట్టేవారు. కొందరి జాతకాలంతేనేమో…

ప్రస్థుతానికొస్తే, మా ఇంటికెదురుగా ఉండే అమ్మాయిని delivery  కోసం హాస్పిటల్ లో చేర్చారని తెలిసింది. అదికూడా ఎవరిద్వారా? ఆ అమ్మాయి తండ్రి, ఓరోజు బయట కనబడి ” హల్లో,,” అన్నారు.as usual  నేను గుర్తుపట్టలేదు. తనే పాపం, ” మీ ఇంటికెదురుగా ఉంటున్నామూ, అప్పుడెప్పుడో పరిచయం అయింది కదా.. ” అని గుర్తుచేశారు. నేనో వెర్రి నవ్వోటి నవ్వి.. ” yes..yes..  అలాగా, delivery  అవగానే తప్పకుండా చెప్పండీ…  etc..etc..” చెప్పాను. ఇవేళ పొద్దుటే, చెత్త డబ్బా బయట పెడుతూంటే, ఎదురింటి ఓ పెద్దావిడ కనిపించారు. నేనూరుకోవచ్చా.. అబ్బే పెద్ద పోజు పెట్టొద్దూ, ” మీ అమ్మాయిని హాస్పిటల్లో చేర్పించారు కదా ఇప్పుడెలా ఉందీ.. ” అన్నాను.  ” అబ్బే, తను మా అమ్మాయి కాదూ.. మా కోడలూ..నిన్ననే పురుడొచ్చిందీ ..” ఏదో విషయం చెప్పేసి ఊరుకోవచ్చుగా ఆవిడా, కూతురు కాదూ కోడలూ అనడం ఎందుకో?  గుర్తుపట్టలేదనే నా మర్చిపోవడం గుర్తుచేయడం కాపోతే? ఏమిటో అన్నీ నాకే అవుతూంటాయి.. ఆరోజెప్పుడో చెప్పాను కదూ ఆయనతో, పురుడు రాగానే శుభవార్త చెప్పమనీ, ఆ పెద్దమనిషేమో ఇవేళ బయట కనిపించి, స్కూటరు ఆపి, చెప్పారు. నేనూరుకోవచ్చా, ” పొద్దుటే తెలిసిందీ, మీ భార్య చెప్పారూ .. ” అన్నాను. దానికాయన ” మా ఆవిడెక్కడా, హాస్పిటల్ లో తనకి తోడుగా ఉందీ, నువ్వు చూసినావిడ మా వియ్యపురాలూ… ” అన్నారు. మళ్ళీ ఓ వెర్రినవ్వోటి నవ్వేసి  ”  I mean… ”  అంటూ వదిలేశాను. ఈసారెప్పుడో మొత్తం కుటుంబం group photo  చూస్తేనే కానీ తెలియదు….

13 Responses

 1. నా కైతే పేర్లు మొహాలూ కూడా గుర్తుండవు, మొహమాటం లేకుండా చెప్పేస్తుంటా,నాకు గుర్తుండదు,ముసలణ్ణీ అని, మీరంతా యువకులాయె 🙂

  Like

 2. గుర్తులేకపోవటం సమస్యే. అయితే నాబోటిగాళ్లకి సరైన సమయంలో సరియైన ప్రశ్న కూడా స్ఫురించదు. చప్పున ఏదో తలతిక్క ప్రశ్న అడుగుతా, ఆ తర్వాత అవతల వ్యక్తి ముఖం చూడాలి (:-

  Like

 3. ప్రస్తుతానికి వున్న స్మార్ట్ ఫోన్ యూసేజ్ చూస్తుంటే ఇంకొన్నాళ్ళకి ఎవరి పేరు వాళ్లు ఫోన్ చూడందే చెప్పలేరేమో అనిపిస్తోంది – మా ముందు తరాల మీరే నయం – కొంచెం పెద్దయ్యాక మర్చిపోతున్నారు – మా తర్వాతి తరాలకి అసలు గుర్తు పెట్టుకోవడం అన్న కాన్సెప్టే ఉండదేమో !

  Like

  • లలితగారూ,

   ఆలోచించాల్సిన విషయమే మరి. మాక్కూడా ఈ జాడ్యం smart phone ల ధర్మమే. కానీ జీవితంలో సింహభాగం, ఈ గొడవలు లేకుండానే బతికాం మీరన్నట్టు.

   Like

 4. జీవితపు సింహ భాగము
  లో విస్మృతి కిప్పటి వలె లోనవ లేదోయ్ !
  యీ విపరీతము గానన్
  మావే బంగరు సమయము మహిలో లలితా :

  జిలేబి

  Like

 5. నరసింహరావుగారూ,

  కదా ?

  Like

 6. జిలేబీ,

  మరీ ఇంత Tit for Tat… thats Zilebi…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: