బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Quality Control

పెద్దపెద్ద కంపెనీల్లో ఈ  quality Control  కి ప్రత్యేకంగా ఓ విభాగం ఉంటుంది. అది సరుకు నాణ్యత చూడ్డానికైనా అవొచ్చు,  జమాఖర్చులు చూడ్డానికి ఓ ఎకౌంట్ విభాగం అవొచ్చు, పన్నులు ఎగ్గొట్టడానికి మార్గాలు చూపే చార్టర్డ్ ఎకౌంటెంట్లు అవొచ్చు.. ఏదైనా క్వాలిటీయేగా… మొత్తానికి సరుకు తయారయి,అమ్మబడి, లాభాలు ఆర్జించి, పన్నులు కట్టేదాకా ప్రతీ వస్తువునీ  ” డేగ కళ్ళ ” తో చూసేవారన్నమాట. This is the indispensable part and parcel of any Organisation.  ఇన్ని ఉన్నా, ముఖ్యమైన ఓ విషయాన్ని మాత్రం , అంత పెద్దగా పట్టించుకునేవారు కాదు… అదే  Customer Relation..  ఆర్ధిక సంస్కరణల ధర్మమా అని, మొత్తానికి అదీ రంగంలోకి వచ్చింది. ప్రతీవాడూ ఓ Customer Care  నెంబరు ( 11  digits)  ది మొదలెట్టేశారు.సహాయం అవసరమైనప్పుడు అడుగుతారు కానీ,  Actual గా  on the spot  లో ఈ  Customer Relation  ఎలా ఉందో, వాటిని ఎలా  improve  చేయొచ్చో తెలిసికోడానికి   Mystery Shopping   అని ఒకటి మొదలెట్టారు . మీలాటి, నాలాటి వాళ్ళకి  ఏదో కొంత డబ్బులిచ్చి, ఫలానా షాప్ కి వెళ్ళి , మన identity  తెలియనీయకుండా, మామూలు  customer  గా ప్రవర్తించి, అక్కడ ప్రత్యక్షంగా  జరుగుతున్న  Customer Relations  ఎలా ఉన్నాయో రిపోర్ట్ ఇవ్వాలి. ఓ రెండు నెలల్లో మనకి రావాల్సిన డబ్బులు మన ఎకౌంటులోకి జమా అవుతాయి. అంటే మనం ఆ షాప్ లో కొన్నది  ఉచితంగానే వచ్చినట్టేకదా. రిటైరయిన తరవాత ఇదో వ్యాపకం పెట్టుకున్నాను. ఇదివరకు చాలా టపాల్లో వీటిగురించి వివరంగా రాశాను.. ఉద్యోగంలో ఉన్నప్పుడు  Branded Items  కొనే ఆర్ధిక స్థోమత లేకపోయినా,  దీని ధర్మమా అని, నేను వాడే ప్రతీదీ–  నెత్తిమీద టోపీ దగ్గరనుంచి  కాలి షూ దాకా అన్నీ  Branded  వే. ఊరికే వచ్చినవేగా, పైగా చూసేవాళ్ళకీ  ” డాబు ” గా కనిపిస్తాం. ఎంతైనా ఈరోజుల్లో  Packaging  కే ప్రాధాన్యం కానీ, అసలు సరుకు గురించి ఎవడు పట్టించుకుంటాడూ? అందుకే ఈరోజుల్లో పిల్లల  Diapers  నుండి ప్రతీదీ బ్రాండెడ్డే. . ఏదో మొత్తానికి ఓ 375 కి పైగా  assignments  చేశానూ, ఈ మధ్య చేసినవాటికి తప్ప మిగిలినవాటికి డబ్బులు ముట్టాయి. 

ఈమధ్యన , ఏదో వాళ్ళు ఫోన్లు చేస్తే తప్ప వెళ్ళడంలేదు. కానీ ఈ 375 షాపుల ధర్మమా అని వచ్చిందేమిటంటే.ఆ  Mystery Shopping   నరనరాలా పాకిపోయింది.. ఏ  Mall  కి వెళ్ళినా,  చిన్న చిన్న లొసుగులు గమనించి, ఆ మానేజర్ల ప్రాణాలు తీయడం..   కొంతమందనుకుంటారు– ఒక్క రూపాయికి అంతగా దెబ్బాలాడాలా అని. కానీ మనం చూడాల్సింది  Quality of Service.. సాధారణంగా మా పక్కనే ఉండే  Reliance Mart  వాడు బలైపోతూంటాడు.నెలలో కనీసం ఆ మానేజర్ కి, ఏదో విషయంలో  జ్ఞానబోధ చేయకుండాలేను. అదేం కర్మమో నాకళ్ళకే కనిపిస్తాయి లొసుగులన్నీ.చెప్పొచ్చేదేమిటంటే,  Our eyes are tuned to find mistakes.  అప్పుడెప్పుడో కొబ్బరి కాయల దగ్గర ఒక రేటూ, తీరా బిల్లు ఇచ్చేచోట ఇంకో రేటూ ఉంది. నేనా వదిలేదీ... 

అలాగే  ఇవేళ అదేదో  Amul Milk Cream..  కార్టన్ మీద 45 , కౌంటరు దగ్గర 46 ఉన్నాయి. వాడి ప్రాణం తీసి. ఆ రూపాయీ తీసికుని ఓ  lecture  ఇచ్చ్చి వచ్చాను.  నేనేదో ఉధ్ధరించేశానని కాదూ, కానీ ఈరోజుల్లో ఇలాటివి పెద్దగా పట్టించుకోరు, చేతినిండా డబ్బులూ కదా..

అలాగని నేను ఎప్పుడూ తప్పులే వెతుకుతాననీ, మంచనేది కనిపించదనీ అనుకోకండి. ఈమధ్యన   ఓ  Chromcast  కొన్నాను. దానిని  set up  చేయడం తెలియకపోతే,  Google  కుర్రాడొచ్చి చేసిపెట్టివెళ్ళాడు. అదేమీ గొప్పవిషయం కాదు. కానీ ఆ అబ్బాయికి ఆరోజు  weekly off. It was very nice of him. I sent a letter of appreciation to Google mentioning the same.

బయటకెళ్ళినప్పుడు ఇంత చేస్తానా, మనకీ ఇంట్లో  ఓ  inspector  అనబడే ” ప్రాణి ” ఉంటుందిగా. .. ఇంటి ఇల్లాలు.. ఎన్ని చెప్పండి, ఏదో పెళ్ళైన కొత్తలో ఆ కళ్ళని romantic  గా ఏదో  ” మీనాక్షి”  అనుకున్నాం కానీ, కాల క్రమేణా ” డేగాక్షి” అయిపోతుంది. ఇదివరకైతే ఏదో పిల్లలున్నారు కాబట్టి వాళ్ళమీదే అజమాయిషీ… అదృష్టవంతులు పెళ్ళిళ్ళు చేసికుని వాళ్ళ సంసారాల్లో పడ్డారు. ఈ మొగుళ్ళనబడేవాళ్ళు బలైపోతున్నారు . అవేం కళ్ళో మనం  చేసిన పనిలో  ఏదో ఒక లోపం కనిపిస్తూనేఉంటుంది… ఠక్ మని పట్టేస్తుంది. ఏదో సాయం చేద్దామని , టిఫిన్ అవగానే, ఓ గుడ్డా,  Colin  తీసికుని ఫ్రిజ్జీ, కంప్యూటరూ, మిగిలిన గ్లాసు టాప్పులూ , శుభ్రపరిచామని అనుకుంటాం, (అప్పటికీ తను చూస్తూండగానే). లేకపోతే తను తయారవుతుంది   ఈ ” స్వఛ్ఛ గృహ అభియాన్ ” కి. ఇప్పటికే లోటులేకుండా అన్నపూర్ణలా  తిండి పెడుతోఁది, ఇంకా ఇలాటి చిన్నచిన్న పనులు కూడా ఎందుకూ అనే సదుద్దేశ్యంతో , పోనీ ఏదో సహాయం చేద్దామా అనుకుంటే, ఈవిడేమో భోజనానికి ముందు ఓ రౌండు వేస్తుంది. ముందర కంప్యూటర్– ” ఏవండీ ఇవేళ దీనికి డుమ్మా కొట్టేశారేమిటీ  …” తో మొదలు, పైగా ఈ  Computer cleaning  అన్నది మన  most vulnerable area.. దుమ్మెక్కడ కనిపించిందిటా…  key board  లో . ఆ   key  లసందుల్లో ఉన్న బూజు తీయాలంటే, ఓ  Tooth Brush  కావాలి కదా, నాకేమో అసలు పళ్ళేలేవాయె.. ఎలా చేయడం?  ఏమిటో అర్ధం చేసికోదూ…

అయ్యా ఇలా చెప్పుకుంటూ పోతే భర్తలు చేసే ఏ పనిలోనైనా సరే, మన ఇల్లాళ్ళకి  ఏదో ఒక లోపం కనిపిస్తూనే ఉంటుంది.  Can not escape… భరించాలి తప్పదు. పైగా ఏమైనా అంటే.. ” మిమ్మల్నీ, మీ సూకరాలనీ భరించడంలేదూ….? ” అంటూ ఓ   retort…

At the end of the day… we enjoy  all this… is it not…

 

%d bloggers like this: